28 January 2022

బీహార్‌లో వెనుకబడిన వర్గాల వారికి బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన సయ్యద్ హసన్. सैयद हसन, जिन्होंने बिहार के पिछड़ों को पढ़ाने के लिए अपना जीवन वक़्फ़ कर दिया।

 

సయ్యద్ భాయ్  గా  పిలువబడే  సయ్యద్ హసన్, 30 సెప్టెంబర్ 1924న బీహార్‌లోని జెహనాబాద్‌లోని కాకోలో జన్మించారు. సయ్యద్ హసన్ 10 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా చేరారు. హసన్ కు తన ప్రారంభ విద్యాభ్యాసం సమయంలోనే మహాత్మా గాంధీని కలిసే అవకాశం వచ్చింది. సయ్యద్ హసన్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ పర్యవేక్షణలో చదువుకున్నారు. జామియా నుంచి చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ప్రారంభించారు.

సయ్యద్ హసన్ 1955లో లింకన్ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్‌పై అమెరికా వెళ్లాడు. తర్వాత వెస్ట్ ఇల్లినాయిస్ యూనివర్శిటీకి వెళ్లి 1962లో అక్కడి నుంచే పీహెచ్‌డీ చేసి డాక్టర్ సయ్యద్ హసన్ అయ్యారు. సయ్యద్ హసన్ “ పీ డెల్టా కప్పా మరియు కప్పా డెల్టా పై” వంటి సంస్థలలో కూడా సభ్యుడు. 1962లో, అతను ఫ్రాస్ట్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.సయ్యద్ హసన్ అమెరికాలో నివసిస్తున్నప్పుడు చాలా మంది భారతీయ విద్యార్థులకు సహాయం చేస్తూనే ఉన్నాడు.

సయ్యద్ హసన్  ఆతరువాత జర్మనీ నుండి జామియా మిలియా ఇస్లామియా ను చూసుకోవడానికి 1965లో భారతదేశానికి వచ్చాడు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి బిహార్ లో వెనుకబడిన పూర్ణియా ప్రాంతంలో సామాజిక సేవలో నిమగ్నమయ్యాడు. ఫిబ్రవరి 1966లో, సయ్యద్ హసన్  తలేమి మిషన్ కార్ప్ అనే సంస్థను సృష్టించాడు మరియు మార్చి 1966లో తలేమి బిరాద్రి అనే విద్యా పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. మరియు దాదాపు రెండు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత సయ్యద్ హసన్  నవంబర్ 14, 1966న 36 మంది విద్యార్థులతో కిషన్‌గంజ్‌లో ప్రాథమిక స్థాయి ఇన్సాన్ పాఠశాలను స్థాపించాడు. ఒక చిన్న భూమి నుండి పాఠశాల ప్రారంభింపబడి   నేడు అది అనేక ఎకరాలలో విస్తరించి ఉంది

జాకీర్ హుస్సేన్ స్ఫూర్తితో తన జీవితమంతా ఈ సంస్థకే అంకితం చేశారు. పిల్లలకు చదువు మాత్రమే కాదు, జీవించే విధానాన్ని కూడా నేర్పించారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లాక సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి విద్యార్ధులకు పూర్తి శిక్షణ ఇచ్చారు. కొన్ని వేల మంది పిల్లలు బడిలో చదువుకోవటానికి కారణమయ్యారు.

 పాఠశాలలో విద్యార్ధులు, ఉపాద్యాయులు వారిని, భాయిజాన్ అని పిలిచేవారు. అలా సయ్యద్ హసన్,  సయ్యద్ భాయ్ అయ్యారు. 1970-1995 మద్య ఈ పాఠశాల అత్యున్నత స్థాయికి చేరుకుంది, ఇక్కడ చదవడానికి బయటి నుండి విద్యార్ధులు  రావడం ప్రారంభించారు.

విద్య మరియు విద్యా రంగంలో సయ్యద్ హసన్ చేసిన కృషి కారణంగా, సయ్యద్ హసన్  కు 1991లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. అతని కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది, అందుకే 2003 సంవత్సరంలో సయ్యద్ హసన్  నోబెల్ శాంతి బహుమతి కి నామినేట్ అయ్యాడు.

 విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సయ్యద్ హసన్ 25 జనవరి 2016న 92 సంవత్సరాల వయస్సులో మరణించారు.

No comments:

Post a Comment