మానవులారా! మేము మిమ్మల్లి ఒకే పురుషునినుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము.తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు మిమ్మల్లి జాతులుగానూ,తెగలుగానూ చేసాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే, అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు. నిశ్చయముగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలూ తేలిసినవాడునూ. 49:13
దివ్య ఖురాన్‌లోని అనేక ఆయతులు మానవుల యొక్క బహుళత్వం
గురించి తెల్పుతున్నాయి.
ప్రవక్త సమయం లో మక్కాలో మరియు మదీనాలో ఇస్లాం
బహుళ సమాజాన్ని అంగీకరించింది. "మీ కోసం మీ దీన్ (ధర్మం /మార్గం) మరియు నాకు
నా దీన్" అనే దివ్య ఖురాన్ భావన బహుళత్వాన్ని అంగీకరించడానికి స్పష్టమైన ఉదాహరణ.
గైర్ లేదా 'ఇతర' అనే పదాన్ని బహిరంగంగా ఉపయోగించడం అనేది
ఇస్లామిక్ సంప్రదాయం కాదు,
ఎందుకంటే మనం పిలిచే ఇతర వ్యక్తులు
వాస్తవానికి కనీసం రెండు రకాలుగా మన సోదరులు: మొదటిది, వారు మన దేశస్థులు మరియు రెండవది, మానవత్వం ఆధారంగా వారు మన సోదరులు.
తన స్వస్థలమైన మక్కా నుండి బలవంతంగా మదీనాకు
వలస వెళ్ళిన ప్రవక్త ముహమ్మద్, కరువు
ఉన్నప్పుడు మక్కా ప్రజలకు ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులను పంపారు.
ఇస్లాం యొక్క రెండవ ఖలీఫా అయిన ఉమర్ కు సంభందించిన
ఒక ఘటనను మనం పరిశిలిoచుదాము. మతo/ధర్మం విషయం లో బలవంతం
చేయలేమని అది ఇస్లాం బోధనలకు విరుద్ధం అని
పేర్కొంటూ కనీసం అతను ఒక వృద్ధ మహిళపై కూడా ఇస్లాంను విధించలేదు
"భారతదేశం వేల సంవత్సరాల పాటు వర్ధిల్లుతున్న బహుళత్వ చరిత్రను కలిగి
ఉంది," "బహుళత పట్ల అంగీకారాన్ని చూపుతుంది."
No comments:
Post a Comment