28 January 2022

భారతీయ ముస్లింలు ' మతం' పట్ల తక్కువ ఆసక్తి చూపుతున్నారు. - CSDS & KAS సర్వే Indian Muslims have become ‘less religious’ – CSDS & KAS Survey



భారతీయ ముస్లింలు 2021లో తక్కువ మతస్థులుగామారారు. భారతదేశంలో మత సామరస్యo  పట్ల వారు నిరాశావాదులుగా మారారు. భారతీయ ముస్లింలు మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జర్మన్ థింక్-ట్యాంక్ అయిన కొన్రాడ్ అడెనౌర్ స్టిఫ్టుంగ్ (KAS) సహకారంతో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) నిర్వహించిన సర్వే నుండి వచ్చిన మూడు విస్తృత థీమ్‌లు

"ఇండియన్ యూత్: ఆస్పిరేషన్స్ అండ్ విజన్ ఫర్ ది ఫ్యూచర్" పేరుతో 18 రాష్ట్రాల్లోని 18-34 ఏళ్ల మధ్య వయసున్న 6,277 మందిపై జూలై-ఆగస్టు 2021లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. CDS మరియు KAS 2016లో కూడా ఇదే విధమైన సర్వే నిర్వహించి, దానిని 2021లో కనుగొన్న వాటితో పోల్చాయి.

 

1)భారతీయ ముస్లింలు 'తక్కువ మతస్థులు' అయ్యారు:

·       గత సిఎస్‌డిఎస్ సర్వే నిర్వహించిన 2016 సర్వేతో పోల్చితే ముస్లింలలో  ప్రార్థనలు, ఉపవాసాలు, మసీదులను సందర్శించడం, మతపరమైన పుస్తకాలు చదవడం లేదా మతపరమైన విషయాలను చూసే వారి నిష్పత్తి తగ్గిందని సర్వే కనుగొంది.

·       5,681 మంది తో 2016లో నిర్వహించిన CSDS సర్వే శాంపిల్ ముస్లిం యువకులు ఇతర సమూహాల కంటే ఎక్కువ మతతత్వాన్ని కలిగి ఉన్నారని కనుగొన్నారు.

·       2016లో, 97 శాతం మంది ముస్లింలు తాము క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తున్నామని చెప్పారు, అదేవిధంగా హిందువులు (92 శాతం), సిక్కులు (92 శాతం), మరియు క్రైస్తవులు (91 శాతం) ఉన్నారు.

·       అయితే, 2021 సర్వేలో, కేవలం 86 శాతం మంది ముస్లిం యువత మాత్రమే తాము క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తారని చెప్పారు అది  ఐదేళ్ల క్రితం కంటే 11 శాతం కంటే  క్షీణతతో ఉంది.

·       పోల్చి చూస్తే, క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తున్నట్లు నివేదించే యువత వాటా సిక్కులు (96 శాతం) మరియు క్రైస్తవులలో  (93 శాతం) పెరిగింది మరియు హిందువులలో  (88 శాతం) స్వల్పంగా మాత్రమే తగ్గింది

·       అదేవిధంగా, ప్రార్థనా స్థలాలను సందర్శించే ముస్లిం యువకుల నిష్పత్తి గణనీయంగా తగ్గింది.

·       2016లో, 85 శాతం మంది ముస్లిం రేస్పొండేట్స్/ప్రతివాదులు వివిధ సమయాలలో మసీదులను సందర్శించినట్లు నివేదించారు, అయితే 2021లో కేవలం 79 శాతం మంది మాత్రమే అలా చేశారని చెప్పారు

·       ఇటువంటి క్షీణత - ముస్లిములలో 6 శాతంగా ఉండగా ,  హిందువులలో  4 శాతం (92 నుండి 88 శాతానికి), క్రైస్తవులలో  2 శాతం (91 నుండి 89 శాతానికి), మరియు సిక్కులకు 1 శాతం (కు) 97 నుండి 96 శాతం)  గా ఉంది..

·       2021 సర్వేలో, 19 శాతం మంది రేస్పొండేట్స్/ప్రతివాదులు తమ మతపరమైన భాగస్వామ్యం పెరిగినట్లు చెప్పారు, అయితే 17 శాతం మంది క్షీణించినది అని  చెప్పారు, 57 శాతం మంది అలాగే ఉందని చెప్పారు మరియు 7 శాతం మంది ప్రతిస్పందన ఇవ్వలేదు.

·       ఇతర మతాల కంటే ముస్లింలలో ఎక్కువ భాగం వారి మతపరమైన భాగస్వామ్యంపై వారి అవగాహనలో నికర క్షీణతను కనిపించినది.

·       ముస్లిం యువతలో 18 శాతం మంది తమ మతపరమైన భాగస్వామ్యం పెరగడాన్ని గమనించగా, 20 శాతం మంది తమ మతపరమైన భాగస్వామ్యం తగ్గిందని అభిప్రాయపడ్డారు.

·       దాదాపు 25 శాతం మంది క్రైస్తవులు మరియు సిక్కులు తమ మతపరమైన భాగస్వామ్యంలో పెరుగుదలను పేర్కొనగా 13 శాతం మంది తగ్గుదలని నివేదించారు.

·       హిందువులలో, 20 శాతం మంది రేస్పొండేట్స్/ ప్రతివాదులు మతపరమైన భాగస్వామ్యంలో పెరుగుదలను నివేదించగా, 16 శాతం మంది తగ్గుదలని గమనించారు.


2.భారతదేశంలో మత సామరస్యం గురించి నిరాశావాదంPessimism about religious harmony in India:

ఈ నేపథ్యంలో, భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో మత సామరస్యం మెరుగుపడుతుందా లేదా తగ్గుతుందా అని CSDS సర్వే రేస్పొండేట్స్/ ప్రతివాదులను ప్రశ్నించింది.

·       మత సామరస్యం దెబ్బతింటుందని 19 శాతం మంది హిందువులు, 31 శాతం మంది క్రైస్తవులు, 33 శాతం మంది ముస్లింలు, సిక్కులు మత సామరస్యం క్షీణిస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పారు.

·       CSDS నివేదిక ప్రకారం, జాతీయ సగటు 14.23 శాతం కంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అనగా అస్సాం, పశ్చిమ బెంగాల్, యుపి, బీహార్, జార్ఖండ్ మరియు కేరళ నివసించే ముస్లింలలో మత సహజీవనం గురించి "నిరాశ" ఎక్కువగా ఉంది

·       ఈ రాష్ట్రాల్లో సమిష్టిగా, 35 శాతం మంది ముస్లింలు జాతీయ సగటు 14.23 కంటే తక్కువ ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లోని  23 శాతంతో పోలిస్తే క్షీణత ఉందని చెప్పారు

·       ఇతర మతపరమైన మైనారిటీలు, క్రైస్తవులు మరియు సిక్కులు, భారతదేశంలో మత సామరస్యం గురించి "బలమైన నిస్పృహ" వ్యక్తం చేయడంలో ముస్లింల మాదిరిగానే ఉన్నారు.


౩) ముస్లింలు మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారు Muslims faces religious discrimination:

ఇతర మైనారిటీల కంటే ముస్లింలు ఎక్కువ వివక్షను ఎదుర్కొంటున్నారని CSDS నివేదిక వెల్లడించింది.

·       2019 నుండి 2020 వరకు మతపరమైన/మతపరమైన అల్లర్లకు సంబంధించిన కేసులు దాదాపు రెండింతలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటాను నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

·       NCRB 2019లో 438 కేసులను నివేదించింది, 2020లో 857 కేసులు నమోదయ్యాయి. నివేదిక కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని "ద్వేషపూరిత నేరాలు మరియు హత్యలు" మరియు ముస్లింలపై వివక్ష చూపే కొత్త పౌరసత్వ చట్టం CAA గురించి ప్రస్తావించారు.

·       సగటు కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లోని ముస్లింలు హిందూ సమాజంతో ఎక్కువ ఇంటర్ ఆక్షన్/పరస్పర చర్య చేయడం వల్ల మతపరమైన వివక్షను ఎక్కువగా కనుగొన్నారని సర్వే పేర్కొంది.

·       ముస్లింలు కూడా మరొక విషయంలో ఇతర వర్గాల నుండి వేరుగా నిలిచారు: మతం కారణంగా వారి స్నేహితుల నుండి వివక్షకు గురైన వారి అనుభవం. సర్వేలో నమూనా చేయబడిన మైనారిటీలలో, ముస్లింలు తమ స్నేహితుల నుండి చాలా తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

·       44 శాతం మంది ముస్లిం ప్రతివాదులు తమ స్నేహితుల నుండి వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు, 13 శాతం మంది ఇది తరచుగా జరుగుతుందని మరియు 31 శాతం మంది కొన్నిసార్లు ఇది జరిగిందని చెప్పారు.

·       మరో ఇద్దరు మతపరమైన మైనారిటీలు అనగా  క్రైస్తవులు మరియు సిక్కులు-  తమలో మతపరమైన వివక్షను అనుభవిస్తున్న వారి నిష్పత్తి చాలా తక్కువ. కేవలం 18 శాతం క్రైస్తవులు (తరచుగా 4 శాతం, కొన్నిసార్లు 14 శాతం) మరియు 8 శాతం సిక్కులు (తరచూ 3 శాతం, కొన్నిసార్లు 5 శాతం) ఇటువంటి వివక్షను నివేదించారు.

·       వివక్షను ఎదుర్కొనే అంశంపై ముస్లింలు తాము ఒంటరిగా ఉన్నారని నివేదిక పేర్కొంది.

·       సగటున, 70 శాతం మంది ప్రతివాదులు తాము మతం పేరిట ఎప్పుడూ వివక్షను ఎదుర్కోలేదని చెప్పారు, ఇది ముస్లింలలో  49 శాతం మాత్రమే ఉంది..

ముగింపు Conclusion:

సర్వే నివేదిక ముగింపు ఇలా చెబుతోంది: "ద్వేషం, వివక్ష మరియు హింస కారణంగా , కొంతమంది ముస్లిం ప్రతివాదులు తమ మతపరమైన ఆచారాలను బహిర్గతం చేయడంలో "తక్కువ సుఖం" భావించి ఉండవచ్చు. ముస్లిములు తమ మతం గురించి మాట్లాడటం చాలా జాగ్రత్తగా ఉండటమే దీనికి కారణం కావచ్చు. అందువల్ల సర్వే డేటా వాస్తవిక,  వాస్తవాల యొక్క నిజమైన ప్రతిబింబం కాకపోవచ్చు.

భారతదేశంలోని ముస్లింలలో అంతటా నిరాశావాదం ఉందనటంలో   సందేహం లేదు. భారతదేశంలో మత సామరస్యం మెరుగుపడుతుందనే ఆశ వారికి కనిపించడం లేదు. భారతదేశంలో ముస్లింలు వివక్షకు గురవుతున్నారనేది చాలా సరైనది. ఏది ఏమైనప్పటికీ, 2016 కంటే 2021లో భారతీయ ముస్లింలు 'తక్కువ మతస్థులు'గా మారారని మొదటిసారి కనుగొనడం చర్చనీయాంశమైంది.

 

మూలం: ముస్లిం మిర్రర్ లోని చెన్నైకి చెందిన జర్నలిస్ట్ సయ్యద్ అలీ ముజ్తబా  వ్యాసం.

స్వేచ్చానువాదం: సల్మాన్ హైదర్

 

No comments:

Post a Comment