3 January 2022

మౌలానా ఇమ్దాద్ సబ్రీ ~ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అత్యంత నమ్మకమైన సహచరుడు मौलाना इमदाद साबरी ~ नेताजी सुभाष चंद्रा बोस के सबसे वफ़ादार साथी

 


1914 అక్టోబరు 16న ఇమ్దాద్ ఉర్ రషీద్ జన్మించారు..ఇమ్దాద్ ఉర్ రషీద్ గొప్ప విప్లవకారుడు  అతను భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలు కు వెళ్ళాడు. ఇమ్దాద్ ఉర్ రషీద్ తరువాత మౌలానా ఇమ్దాద్ సబ్రీ పేరుతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.

ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌తో ఇమ్దాద్ ఉర్ రషీద్ కు రాజకీయ వైరం కలదు. 1936లో ఇమ్దాద్ ఉర్ రషీద్ జామా మసీదు కమిటీకి వ్యతిరేకంగా ఫ్రంట్ తెరిచినప్పుడు మరియు మసీదు మెట్లపై శాంతియుత నిరసనలు చేసినప్పుడు  శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇమ్దాద్ సబ్రీని సెక్షన్ 107 కింద 9 జూలై 1937న అరెస్టు చేశారు. రూ.లక్ష పూచీకత్తుపై బయటకు వచ్చారు

1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతోంది. అప్పుడు ఇమ్దాద్ శబ్రీకి 16 ఏళ్ల వయస్సు. పాత ఢిల్లీ కొత్వాలి ముందు కాంగ్రెస్ ఊరేగింపు జరుగుతోంది. కాంగ్రెస్ రజాకార్లు పోలీసులతో ఘర్షణ పడ్డారు, పోలీసులు లాఠీ చార్జ్  ప్రారంభించారు, ఇమ్దాద్ సబ్రీ పోలీసుల దౌర్జన్యానికి బలి అయ్యాడు, పోలీసులు అతని తలపై కర్రతో కొట్టారు, ఇమ్దాద్ సబ్రీ సృహ  తప్పారు. సృహ వచ్చిన  ఇమ్దాద్ సబ్రీ ని కొంతమంది బాటసారులు క్షేమంగా అతని ఇంటికి తీసుకెళ్లారు.

ఇమ్దాద్ సబ్రీ అలీమ్ మరియు ఫాజిల్ అయ్యాడు, సబ్రి తండ్రి సబ్రిని ఈజిప్ట్‌ లోని జామియా అజార్‌కు పంపాలనుకున్నాడు, అయితే ఈలోగా అతను 28 జనవరి 1936న మరణించాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యత అంతా ఇమ్దాద్ సబ్రీపై పడింది. కానీ సబ్రీ నిరంతరం సామాజిక మరియు రాజకీయ కార్యక్రమాలలో  నిమగ్నమై ఉన్నారు.

1937లో ఇమ్దాద్ సబ్రీ కాంగ్రెస్‌లో చేరి ఢిల్లీ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శి అయ్యారు.22 జూలై 1938, హర్తల్ నిర్వహించిన కారణంగా సబ్రీ అరెస్టు చేయబడ్డాడు.

ఇమ్దాద్ సబ్రీ సుభాస్ చంద్రబోస్ యొక్క అత్యంత నమ్మకమైన సహచరులలో ఒకరు మరియు 1938-39లో హరిపుర సెషన్‌లో నేతాజీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ నుంచి విడిపోయి నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేసినప్పుడు మౌలానా నూరుద్దీన్ బీహారీతో పాటు సబ్రీ నేతాజీని కలవడానికి రహస్యంగా వెళ్లారు. ఫార్వర్డ్ బ్లాక్ ర్యాలీని నిర్వహించినందుకు సబ్రీ 5 ఆగస్టు 1939న మరోసారి అరెస్టు చేయబడ్డాడు, బెయిల్ నిరాకరించబడి  ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది.

ఏప్రిల్ 1940లో, ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో విప్లవ కరపత్రాలను పంపిణీ చేసినందుకు ఇమ్దాద్ సబ్రీ తిరిగి అరెస్ట్ చేయబడినాడు.

క్విట్ ఇండియా ఉద్యమంలో, ఇమ్దాద్ సబ్రీ 1942 ఆగస్టు 15న డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద అరెస్టు చేయబడ్డారు మరియు 15 నెలల జైలు శిక్ష తర్వాత 30 నవంబర్ 1943న ఢిల్లీ జైలు నుండి విడుదలయ్యారు. కానీ అతనిపై చాలా ఆంక్షలు విధించారు.సబ్రి ఎలాంటి రాజకీయ ఊరేగింపులో పాల్గొనరాదని నోటీసు ఇచ్చారు. అలాగే సబ్రి పది మంది కంటే ఎక్కువ మంది వ్యక్తుల సమూహంలో చేరలేరు, సబ్రీ ని  ఒక ప్రైవేట్ ప్రాంతంలో గృహనిర్బంధంలో ఉంచారు. దీనివల్ల సబ్రి వ్యాపారంలో చాలా నష్టపోయారు. ఫిబ్రవరి 1945లో, నిర్బంధాన్ని ఉల్లంఘించినందుకు ఇమ్దాద్ సబ్రీని అరెస్టు చేశారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆగష్టు 1945 చివరలో మౌలానా ఇమ్దాద్ సబ్రీని మరోసారి అరెస్టు చేశారు. సుభాష్ చంద్రబోస్ జపాన్ సహచరులకు సహాయం చేశాడని మరియు అతని ఇంటి వద్ద వారికి ఆతిథ్యం ఇచ్చాడని అతని పై ఆరోపించబడినది.. ఈ అరెస్టును లాహోర్ హైకోర్టులో సవాలు చేసిబడి సబ్రీని  విడుదల చేయవలసి వచ్చింది. కేసు కొనసాగింది మరియు 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు నిర్బంధం కొనసాగింది.

సబ్రీ ఢిల్లీ జైలులో ఖైదు చేయబడిన సమయంలో, ఐదుగురు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు కూడా జైలులో ఉన్నారు, వీరికి మరణశిక్ష విధించబడింది, వీరి పేర్లు కనాల్ సింగ్, సుజిత్ రాయ్, సర్దార్ కర్తార్ సింగ్, శ్రీ భగవత్ గౌతమ్ ఉపాధ్యాయ మరియు రామ్ దులారే.. వారి తరుపున వాదించడానికి న్యాయవాదిని కూడా ప్రభుత్వం అనుమతించలేదు. ఇమ్దాద్ సబ్రీ వారిని జైలులో కలిశాడు. ప్రభుత్వం పై వచ్చిన తీవ్ర వత్తిడి పలితగా ఈ వ్యక్తుల ఉరిని వాయిదా వేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ ఐదుగురు ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇమ్దాద్ సబ్రిని మొదటిగా కలిశారు.

నిర్బంధ సమయంలో కూడా మౌలానా ఇమ్దాద్ సబ్రీ మౌనంగా ఉండలేదు, సబ్రీ డిసెంబర్ 1946లో "సుభాష్ బాబు కే సాథీ" అనే పుస్తకాన్ని వ్రాసాడు, దానిని  గొప్ప విప్లవకారుడు లాలా హనుమంత్ సహాయ్ మరియు 1915లో ఉరితీయబడిన అతని అమరవీర సహచరులు  అవధ్ బిహారీ, మాస్టర్ అమీర్ చంద్, బాల్ ముకుంద్ మరియు బసంత్ కుమార్. బిశ్వాస్ కు అంకితం ఇవ్వబడినది.

 “తారీఖ్-ఏ-ఆజాద్ హింద్ ఫౌజ్, ముఖ్దామా ఆజాద్ హింద్ ఫౌజ్, ఆల్బమ్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ బాబు కీ తక్రీన్, సుభాష్ బాబు జపాన్ కిస్ తరః  గయే तारीख़ ए आज़ाद हिंद फ़ौज, मुक़दमा आज़ाद हिंद फ़ौज, आज़ाद हिंद फ़ौज का अल्बम, सुभाष बाबू की तक़रीरें, सुभाष बाबू जापान किस तरह गए వంటి పుస్తకాలను రచించడం ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్‌ల చరిత్రను వివరించడానికి ప్రయత్నించారు. విమాన ప్రయాణంలో నేతాజీ మరణించిన సంఘటనను ఇమ్దాద్ సబ్రీ ఎన్నడూ విశ్వసించలేదు, హస్రత్ మోహానీతో సంభాషణలలో ఇది తరచుగా ప్రస్తావించబడింది.

మౌలానా ఇమ్దాద్ సబ్రీ 1988 అక్టోబర్ 174 ఏళ్ల వయసులో ఢిల్లీలో మరణించారు.

గమనిక: మౌలానా ఇమ్దాద్ శబ్రీ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి, అతను అనేక సాహసాలు చేసాడు, పుస్తకాలు రాశాడు, రాజకీయాల్లో పాల్గొన్నాడు, అనేక తెహ్రీక్‌లలో పాల్గొన్నాడు, అతని వ్యక్తిత్వాన్ని ఒక్క వ్యాసంలో క్లుప్తీకరించడం అసాధ్యం. ఇక్కడ వారి స్వాతంత్ర్య పోరాటాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.



 

No comments:

Post a Comment