నేతాజీ 125వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో జనవరి 23న భారత బీజేపీ ప్రధాని శ్రీ నరేంద్ర
మోదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం 'హోలోగ్రామ్'ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంలో భారతదేశ స్వాతంత్ర్యం పోరాటాన్ని, భారత దేశ అద్భుతమైన బిన్న వారసత్వాన్ని మరోసారి మనం
గుర్తుచేసుకొందాము. అందులో భారతీయ ముస్లింల కృషిని స్మరించుకోవలసిన సందర్భం.
జనవరి 26, 2022న భారతదేశం తన 73వ
గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, శతాబ్దాల తరబడి భారతదేశ సంప్రదాయo 'లివింగ్-టుగెదర్/అందరు కలసి
జీవించడం ' బిన్నత్వం లో ఏకత్వం మరియు దాని
సమ్మిళిత/ఇంక్లుజీవ్నేస్ పట్ల ప్రతి
భారతీయుడికి ఎల్లప్పుడూ ఆనందం మరియు గర్వం ఉంటుంది.
ముస్లింలపై
అపోహ ఎప్పటినుంచో ఉంది, కానీ నేడు
భారతదేశంలో, ముస్లింలకు
వ్యతిరేకంగా, వారి
సంస్కృతి, భాష, మర్యాదలు, పురుషులు మరియు మహిళలు, స్మారక చిహ్నాలు, సంగీతం మరియు చిహ్నాలను కించపరిచే చర్య
జరుగుతున్నది..
యూనివర్శిటీ
గ్రాంట్ కమీషన్‌ను ఏర్పాటు చేసిన మౌలానా ఆజాద్ 23 ఏళ్ల వయస్సులో కాంగ్రెస్
అధ్యక్షుడిగా అయినాడు మరియు ప్రతి ప్రమాణం ప్రకారం అణు భారతదేశానికి పితామహుడు
అయిన మౌలానా ఆజాద్‌పై కూడా ఎంతగా ఆక్షేపణలు చేశారు. అతను ఏర్పాటు చేసిన యూనివర్శిటీ
గ్రాంట్ కమీషన్ గుర్తింపు క్రింద నేడు భారతదేశంలో వందల కొద్దీ ఇంజినీరింగ్ మరియు
టెక్నాలజీ కళాశాలలు ఉన్నాయి. మౌలానా ఆజాద్ వార్తాపత్రిక “అల్ హిలాల్” (బ్రిటీష్
వారిచే నిషేధించబడింది) మరియు తరువాత “అల్ బాలాగ్” భారత స్వాతంత్ర్య జ్వాలని
ఎప్పుడూ ఆరనివ్వలేదు.
సుగతా బోస్, ఇండియా టుడే లైవ్ 1లో
తన తండ్రి శిశిర్ బోస్,
20 సంవత్సరాల
వైద్య విద్యార్థి గా ఉండినప్పుడు నేతాజీని కోల్‌కతా నుండి జార్ఖండ్‌కు తన కారులో తీసుకువేళ్ళారని తెలియజేశారు.
ఆ తర్వాత నేతాజీ తనకు తానుగా ముహమ్మద్ జియావుద్దీన్ వేషం ధరించారు
పెషావర్‌లో నేతాజీని స్వీకరించిన వ్యక్తి
మియాన్ అక్బర్ షా
మరియు నేతాజీ తన 90 రోజుల జలాంతర్గామి ప్రయాణం తర్వాత
యూరప్ నుండి ఆసియాకు తిరిగి వచ్చినప్పుడు నేతాజీ ఏకైక సహచరుడు అబిద్ హసన్.
ఇంఫాల్‌లో పోరాడిన మహమ్మద్ జమాన్ కియానీ,
నేతాజీ
స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (IMA) యొక్క మొదటి విభాగం కమాండర్.
ఇంఫాల్ సమీపంలోని మరియాన్నెలో త్రివర్ణ
పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి షౌకత్ మాలిక్.
నేతాజీ చివరి ప్రయాణంలో అతని ఏకైక
సహచరుడు హబీబ్-ఉర్-రెహ్మాన్
బ్రిటీషర్లు కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్, మేజర్-జనరల్ షానవాజ్ ఖాన్ మరియు కల్నల్
గుర్బక్ష్ ధిల్లాన్‌లను INAతో వారి అనుబంధo కారణం గా ఎర్రకోట లో విచారణ (1945) జరిపారు.
సింగపూర్‌లో INA మెమోరియల్‌ని ఇత్తిఫాక్, ఐతేమాడ్ మరియు ఖుర్బానీ
Ittifaq, Aitemad and Qurbani (ఏకాభిప్రాయం, విశ్వాసం మరియు త్యాగం) అనే నినాదంతో
నిర్మించిన వ్యక్తి క్రైస్తవ అధికారి జాన్ ట్రేసీ.
ఐఎన్ఎ 'జై
హింద్' వందనం స్వీకరించడంలో అబిద్ హసన్ సఫ్రానీ కీలక
పాత్ర పోషించారు
ఈ సందర్భం లో మేజర్ అబిద్ హసన్ చేసిన నినాదం
మునుపెన్నడూ లేని విధంగా మరింత విస్తృతం కావాలి. జై హింద్!
No comments:
Post a Comment