3 January 2025

ఇస్లాం ప్రజలను ఉత్తమ మార్గంలో పనిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. Islam permits people to choose work in best way

 


ఇస్లాంలో, ప్రతి వ్యక్తి తాను చేయాలనుకున్న పనిని ఎంచుకునే హక్కు ఉంది అయితే, పని ఎంపిక వ్యక్తి యొక్క సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండాలి.. 'షరియత్' ప్రకారం ప్రజలు తమ ప్రతిభ, నైపుణ్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క స్థాయి ఆధారంగా తమ పనిని ఎంచుకోవాలి.

ప్రతి ఒక్కరూ పనిలో తన సామర్థ్యానికి తగినట్లుగా పని చేయాలి ఇస్లాం ఇతర ఉత్పాదకత లేని కార్యకలాపాలు చేయడంలో పనిలేకుండా లేదా నాణ్యమైన సమయాన్ని దుర్వినియోగం చేయడం విశ్వాస లోపంగా పరిగణిస్తుంది. శారీరకంగా మరియు మానసికంగా ప్రతి సామర్థ్యం ఉన్న వ్యక్తికి జీవనోపాధిని కోరుకునే ఆదేశం ఉంది. ఇస్లాం పనిని భగవంతుని స్తుతించే మార్గంగా పరిగణిస్తుంది.

ఇస్లాంలో, సంపద అనేది మనిషి కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనంగా పరిగణించబడుతుంది షరియా చట్టం మంచి సంపదను ఉత్పాదక మరియు ప్రయోజనకరమైన పని నుండి సంపాదించాలని  నిర్వచిస్తుంది. ఇస్లాం చట్టవిరుద్ధమైన వివిధ రకాల వృత్తులను నిర్దేశిస్తుంది.

అన్ని వనరులను దేవుడు ఇచ్చాడు మరియు అందువల్ల మనిషి మరియు సమాజం వాటిని పూర్తిగా ఉపయోగించాలి. సంపద ద్వారానే మనిషి తృప్తిని సాధించాలి. ఇస్లాం సంపదను మనిషికి సంతృప్తిని కలిగించే మంచి విషయంగా సూచిస్తుంది

పని మరియు శ్రమ ఇస్లాం మతంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి, పని మరియు శ్రమ జీవనోపాధిని పొందే సాధనంగా మాత్రమే కాకుండా విశ్వాసం మరియు ఆరాధనలో ముఖ్యమైన అంశంగా కూడా పరిగణించబడుతుంది. ఇస్లాం కార్మికుల గౌరవాన్ని, శ్రమ విలువను మరియు యజమానులు మరియు ఉద్యోగుల నైతిక ప్రవర్తనను నొక్కి చెబుతుంది

ఇస్లాంలో, పనిలో  నిష్కపటంగా మరియు నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండడం  ఆరాధన (ఇబాదా)గా పరిగణించబడుతుంది. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలు చట్టబద్ధమైన (హలాల్) జీవనోపాధిని సంపాదించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి.

దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: "మరియు వారితో అను: : ఆచరించి చూపండి.. దేవుడు, దైవ ప్రవక్త, విశ్వాసులు మీ ఆచరణాలను గమనిస్తూ ఉన్నారు." (దివ్య ఖురాన్, 9:105). పై ఆయత్ పని పట్ల  జవాబుదారీతనాన్ని మరియు శ్రద్ధకు ప్రాధాన్యతనిస్తుంది.

పని యొక్క స్వభావంతో సంబంధం లేకుండా అన్ని రకాల చట్టబద్ధమైన కార్మికుల గౌరవాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "ఎవరూ తన చేతులతో సంపాదించిన దాని కంటే మెరుగైన ఆహారం తినరు." (సహీహ్ బుఖారీ). ఇది స్వావలంబన యొక్క విలువను మరియు నిజాయితీతో కూడిన ప్రయత్నం ద్వారా జీవనోపాధిని పొందే గౌరవాన్ని నొక్కి చెబుతుంది.

ఇస్లాం యజమాని-ఉద్యోగి సంబంధానికి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది, న్యాయం, న్యాయబద్ధత మరియు పరస్పర గౌరవాన్ని నొక్కి చెబుతుంది.

వెంటనే వేతనాలు చెల్లించాలని ఇస్లాం యజమానులకు సూచించినది.. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "కార్మికుడి చెమట ఆరిపోకముందే అతని జీతం ఇవ్వండి." (ఇబ్న్ మాజా). మరోవైపు ఉద్యోగులు తమ విధులను శ్రద్ధగా, నిజాయితీగా నిర్వర్తించాలని అన్నారు..

 

పని ప్రదేశాలలో దోపిడీని ఇస్లాం ఖచ్చితంగా నిషేధిస్తుంది. కార్మికులకు తక్కువ జీతాలు ఇవ్వడం లేదా అన్యాయమైన షరతులు విధించడం పట్ల యజమానులను హెచ్చరిస్తు౦ది.. అదేవిధంగా, ఉద్యోగులు తమ విధులను నిర్లక్ష్యం చేయకుండా లేదా పనిలో నిజాయితీగా  ఉండాలని అంటుంది..

ఇస్లాం శ్రమను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇది సమతుల్యతను కూడా సమర్థిస్తుంది. ప్రాపంచిక పనిపై అధిక దృష్టిని నిరుత్సాహపరుస్తుంది. ముస్లింలు పని, ఆరాధన మరియు కుటుంబ బాధ్యతల మధ్య సామరస్య సమతుల్యతను కొనసాగించాలని ఇస్లాం అంటుంది.  

ఇస్లాం బోధనలు శ్రమ సంబంధాలలో శ్రద్ధ, సరసత మరియు పరస్పర గౌరవం యొక్క సంస్కృతిని పెంపొందించాయి. ఈ సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా, వ్యక్తులు తమ మతపరమైన విధులను నిర్వహిస్తూ  న్యాయమైన మరియు సంపన్నమైన సమాజానికి దోహదం చేయవచ్చు.

 

2 January 2025

బేగా బేగం మొఘల్ పాలనలో మొదటి మహిళా బిల్డర్ మరియు ఢిల్లీ లో హుమాయున్ సమాధి నిర్మాత Bega Begum She was the first woman builder in Mughal rule and gave Delhi Humayun’s Tomb

 

మొఘల్ చక్రవర్తి హుమాయూన్ మొదటి భార్య హాజీ బేగం లేదా బేగా బేగం  అని పిలుస్తారు. బేగా బేగం  ఖొరాసన్ నుండి వచ్చిన పర్షియన్ వనిత  మరియు హుమాయున్ మామ కుమార్తె. హుమాయున్ పాలనలో మక్కాకు హజ్‌కి వెళ్లినందున బేగా బేగం  ను హాజీ బేగం అని కూడా పిలుస్తారు..

చౌసా యుద్ధం లో హుమాయున్ పై షేర్ ఖాన్  విజయం సాదించెను చౌసా యుద్ధ సమయం  లో మొఘల్ అంతఃపుర మహిళలు  ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది మరియు హాజీ బేగం  చిన్న కుమార్తె అకికా బేగం మునిగిపోయింది.. బేగా బేగంకు ఇక పిల్లలు లేరు. హుమాయున్ మరణం తరువాత బేగా బేగం తన సవతి కొడుకు అక్బర్ ప్రోత్సాహం తో ఢిల్లీలో హుమాయూన్ సమాధిని నిర్మించినది

హుమాయున్ భార్యలందరిలో బేగా బేగం స్వాతంత్ర్యంతో జీవించింది. బేగా బేగం హజ్‌కు వెళ్లి, సమాధి నిర్మించే అరబ్ కళాకారులతో కలిసి తిరిగి వచ్చింది. అక్బర్ పాలనలో గుల్బదన్ బేగం మరియు హమీదా బాను బేగం మక్కా వెళ్ళడానికి చాలా ముందు ఇది జరిగింది.

బేగా బేగం ఆగ్రాలోని అంతఃపురంలో చేరకుండా ఢిల్లీలోనే ఉండి భవన నిర్మాణ పనులను పర్యవేక్షి౦చినది. .

సమకాలీన చరిత్రకారుడు బదౌని అక్బర్ మరియు బేగా బేగం చాలా సన్నిహితంగా ఉండేవారని మరియు బేగా బేగంను 'అక్బర్‌కు రెండవ తల్లి' అని వర్ణించాడు.

బేగా బేగం తరచుగా అక్బర్‌ని కలవడానికి ఆగ్రాకు వెళుతూ ఉంటుంది మరియు బేగా బేగం తన భత్యాన్ని దానధర్మాలు చేస్తూ గడిపింది. జెస్యూట్ ఆంటోయిన్ డి మోన్సెరేట్ ప్రకారం ' బేగా బేగం తన అంతిమ కాలం లో మొత్తం ప్రార్థనకు మరియు దానధర్మాలకు తనను తాను అంకితం చేసుకుంది మరియు  తన భిక్షతో ఐదు వందల మంది పేదలను పోషించింది.

బేగా బేగం బిల్డర్‌గా మారిన మొఘల్ మహిళల్లో మొదటిది. మొఘల్ మహిళల్లో చాలామంది సమాధులు, మసీదులు, మదర్సాలు, సెమినరీలు, బజార్లు మరియు ఉద్యానవనాలు నిర్మించారు.  బేగా బేగం నిర్మించిన . హుమాయున్ సమాధి భారతదేశానికి పర్షియన్ శైలిలో ఒక గోపురంతో కూడిన సమాధిని పరిచయం చేసింది. హుమాయున్ సమాధి పర్షియన్ శైలిలో ల్యాండ్‌స్కేప్ చేయబడిన చార్-బాగ్ ఉద్యానవనం మధ్యలో ఉన్న గోపుర సమాధిని కలిగి ఉంది. .

సూఫీ సన్యాసి షేక్ నిజాముద్దీన్ ఔలియా యొక్క దర్గా (సమాధి) సమీపంలో నిర్మించబడిన హుమాయున్ సమాధి సముదాయం మొఘల్ రాజవంశంలోని చాలా మంది సభ్యులకు స్మశాన వాటికగా మారింది. బేగా బేగం తన భర్త హుమాయున్ సమాధి సమీపంలో ఖననం చేయబడింది మరియు సమీపంలోనే  మొఘల్ యువరాజులలో ఒకరైన దారా షుకో యొక్క సమాధి కూడా ఉంది.

1 January 2025

భారతదేశము లో మంచి భవిష్యత్తు కోసం కాలానుగుణ౦గా పరివర్తన చెందుతున్న మదరసాలు From Tradition to Transformation, How Madrasas are Shaping India’s Future

 

 

కేరళలోని తిరువళ్లూరు జిల్లా మారుమూల గ్రామం నుండి వచ్చిన షాహిద్ తన ప్రారంభ విద్య సాంప్రదాయ మదరసా లో అబ్యసించాడు.  షాహిద్ తన మదర్సా విద్యను పూర్తి చేయడమే కాకుండా, 2017లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 693 ర్యాంక్ సాధించాడు. ఈ రోజు, షహీద్ నేషనల్ మీడియా సెంటర్‌లో మీడియా అండ్ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్‌గా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కమ్యూనికేషన్ హెడ్‌గా పనిచేస్తున్నాడు.

షాహిద్ తన UPSC ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. షాహిద్ మదర్సా నేపథ్యం UPSC ఇంటర్వ్యూ ప్యానెల్ లో ఉత్సుకతను రేకెత్తించింది, ఇంటర్వ్యూ ప్యానెల్ షాహిద్ యొక్క ప్రత్యేకమైన విద్యా అనుభవాలపై తన ప్రశ్నలను కేంద్రీకరించింది.

మదర్సా, నిజమైన అర్థంలో, నేర్చుకునే ప్రదేశం అని షాహిద్ వివరించారు – మదరసా లో మతపరమైన అధ్యయనాలతో పాటు గణితం, ఇంజనీరింగ్ మరియు తత్వశాస్త్రం వంటి సబ్జెక్టులు బోధించబడతాయి. "మదరసాలు ఒకప్పుడు విభిన్న విజ్ఞాన కేంద్రాలు, కానీ కాలక్రమేణా, వలసవాద ప్రభావాలు వాటి స్థితిని తగ్గించాయి" అని షాహిద్ వివరించారు.

షాహిద్ విజయగాథ అసాధారణమైనది కాదు. భారతదేశంలోని  మదర్సాలు ఆధునిక విద్యను కూడా సంతరించుకోని పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. మార్పును మదర్సా ప్రతిబింబిస్తుంది.

చారిత్రాత్మకంగా, భారతదేశంలోని మదర్సాలు మతపరమైన విద్యకు కేంద్రాలుగా ఉన్నాయి, మదర్సాలు మేధోపరమైన విద్య అభివృద్దిలో కూడా కీలక పాత్ర పోషించింది. మదరసా ఖగోళ శాస్త్రం, గణితం మరియు వైద్యం వంటి అంశాలలో కోర్సులను అందించింది. అయితే, కాలక్రమేణా, ఈ సంస్థలు ప్రధాన స్రవంతి విద్యా వ్యవస్థల నుండి ఒంటరిగా మారాయి, వారి పాఠ్యాంశాలు ప్రధానంగా ఇస్లామిక్ బోధనలపై దృష్టి సారించాయి.

నవంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక మైలురాయి తీర్పు ఉత్తర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్, 2004ను సమర్థించింది. మదర్సా విద్యను నియంత్రించే రాష్ట్ర హక్కును ఉన్నత న్యాయస్థానం ధృవీకరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పు, మదర్సాలకు కొత్త శకాన్ని సూచిస్తుంది - ఇది విస్తృత విద్యా చట్రంతో ఏకీకరణ అవసరాన్ని గుర్తిస్తూనే ప్రాథమిక విద్యకు మదరసా సహకారాన్ని గుర్తిస్తుంది.

మదరసా అనే పదం — ‘పాఠశాలఅనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. మదర్సాలకు భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది, ముస్లిం పాలనలో, మదర్సాలు మేధో కేంద్రాలుగా మారాయి, ఇక్కడ పండితులు మతపరమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా సైన్స్, తత్వశాస్త్రం మరియు పాలనకు గణనీయమైన కృషి చేశారు. బ్రిటీష్ వలస పాలనలో మదరసాల గొప్ప చరిత్రకు భంగం కలిగింది.

అయితే, ఇటీవలి సంవత్సరాలలో, అనేక మదర్సాలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి, ముఖ్యంగా కేరళ మరియు అస్సాం వంటి రాష్ట్రాల్లో సమీకృత మదర్సాల భావన ఊపందుకుంది. ఈ సంస్థలు ఇస్లామిక్ అధ్యయనాలు మరియు సైన్స్, గణితం మరియు భాష వంటి ఆధునిక సబ్జెక్టులు రెండింటినీ కలిగి ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించడం ద్వారా మతపరమైన మరియు లౌకిక విద్య మధ్య అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

2023లో, అస్సాం ఆఫ్ క్యాంపస్ ఆఫ్ దారుల్ హుదా ఇస్లామిక్ యూనివర్శిటీ (కేరళకు చెందిన ఇంటిగ్రేటెడ్ మదర్సా) నుండి 29 మంది విద్యార్థులలో 27 మంది అస్సాం బోర్డ్ పరీక్షలో ప్రతిష్టాత్మకమైన డా. బనికాంత కాకతి అవార్డును గెలుచుకున్నారు. ఇది మదరసాల యొక్క సమగ్ర విద్యా నమూనాల విజయాన్ని హైలైట్ చేస్తుంది.

UAEలోని ఫుజైరా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ఫ్యాకల్టీలో లెక్చరర్ అయిన సదియా సలీమ్ మహిళల కోసం కేరళకు చెందిన ఇంటిగ్రేటెడ్ మదర్సా విద్యార్ధి. సమీకృత మదర్సా వ్యవస్థ తన సృజనాత్మక మరియు మేధో సామర్థ్యాలను రెండింటినీ అభివృద్ధి చేయడంలో సహాయపడిందని, అదే సమయంలో ఇతర విశ్వాసాల పట్ల గౌరవాన్ని పెంపొందించిందని సదియా సలీమ్ నమ్ముతుంది.

సమీకృత మదర్సా వ్యవస్థ లో ఇస్లామిక్ అధ్యయనాలతో పాటు హిందూ మతం, క్రైస్తవం, మార్క్సిజం మరియు ఇతర తత్వశాస్త్రాలను అభ్యసించాను. ఇది అన్ని మతాలు మరియు భావజాలాలను గౌరవించాలని నాకు నేర్పింది, ఇది నేటి ప్రపంచంలో కీలకమని నేను భావిస్తున్నాను, ” అని సదియా సలీమ్ అన్నారు.

సమీకృత మదర్సా వ్యవస్థ అకడమిక్ ఎక్సలెన్స్ మరియు వ్యక్తిగత ఎదుగుదల రెండింటినీ ఎలా పెంపొందించగలదో, సమాజానికి అర్థవంతమైన సహకారం అందించేలా విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తుందో చెప్పడానికి సదియా ప్రయాణం ఒక ప్రధాన ఉదాహరణ

మదర్సాల భవిష్యత్తుThe Future of Madrasas

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పండితుడు మరియు అరబిక్ విభాగాధిపతి అయిన డాక్టర్ మహమ్మద్ ఖాసిం ఒక దశాబ్దానికి పైగా మదర్సా వ్యవస్థను సంస్కరించే పనిలో ఉన్నారు. బీహార్‌లోని మదర్సాలో పెరిగిన డాక్టర్ మహమ్మద్ ఖాసిం మదర్సా వ్యవస్థ యొక్క సవాళ్లు మరియు సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు.

"మదరసా విద్య ఇస్లామిక్ విషయాలపై దృష్టి కేంద్రీకరించింది, కానీ అది భాషలు మరియు శాస్త్రాల జ్ఞానాన్ని కూడా అందించింది. లౌకిక విషయాలకు తక్కువ సమయం ఇచ్చినప్పటికీ, విద్యార్థుల మేధో పరిధులను విస్తరించడానికి అవి చాలా అవసరం, ”అని డాక్టర్ మహమ్మద్ ఖాసిం వివరించారు.

మదర్సా పాఠ్యాంశాల్లో సాధారణ శాస్త్రాలను ఏకీకృతం చేయాలని డాక్టర్ ఖాసిం వాదించారు, ఇది సాంప్రదాయ మరియు ఆధునిక విద్య మధ్య అంతరాన్ని తగ్గించగలదని సూచించారు.

మదరసాలు ప్రపంచానికి దాని తలుపులు తెరవాలి, తద్వారా అక్కడ ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూడగలరు. మతపరమైన మరియు లౌకిక విద్యల మధ్య విభజనను తగ్గించడానికి సైన్స్ వంటి సబ్జెక్టులను చేర్చడం చాలా ముఖ్యమైనది, ”అని డాక్టర్ మహమ్మద్ ఖాసిం నొక్కి చెప్పారు.

డాక్టర్ మహమ్మద్ ఖాసిం ప్రాథమిక మదర్సా విద్య తర్వాత ఆప్టిట్యూడ్ పరీక్షలు మరియు అకడమిక్ కౌన్సెలింగ్‌ను కూడా ప్రతిపాదిస్తాడు, ఇది విద్యార్థులు వారి అభిరుచులు మరియు ఆప్టిట్యూడ్‌ల ఆధారంగా వారి విద్యా మార్గాలను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక పిల్లవాడు మతపరమైన విద్య వైపు మొగ్గు చూపితే, వారు కొనసాగించాలి. కానీ వారి అభిరుచులు లౌకిక విద్యలో ఉంటే, ఆ మార్గాన్ని అనుసరించేలా వారిని ప్రోత్సహించాలి, ”అని డాక్టర్ ఖాసిం చెప్పారు.

డాక్టర్ మహమ్మద్ ఖాసిం ప్రకారం  మదర్సాలు అందించే నైతిక పునాది అమూల్యమైనది, అయితే సమకాలీన ప్రపంచంలోని సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ఆధునిక విద్యాసంబంధమైన ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా దానికి అనుబంధంగా ఉండాలి అంటారు..

సమకాలీన భారతదేశంలో మదర్సాల అభివృద్ధి చెందుతున్న పాత్ర, విద్యా వ్యవస్థలు సమాజం యొక్క మారుతున్న అవసరాలకు ఎలా అనుగుణంగా ఉంటాయి అనేదానికి ఒక శక్తివంతమైన ఉదాహరణను అందిస్తుంది.

సాంప్రదాయ మత కేంద్రాల నుండి ఆధునిక, సమీకృత సంస్థల వరకు, మదర్సాలు విద్యకు మరింత సమగ్రమైన మరియు సమతుల్య విధానానికి మార్గం సుగమం చేస్తున్నాయి. వేగంగా మారుతున్న ప్రపంచానికి దోహదపడేలా విద్యార్థులను సిద్ధం చేయడం, మనస్సు మరియు ఆత్మ రెండింటినీ పెంపొందించే సామర్థ్యంలోనే  మదర్సాల భవిష్యత్తు ఉంది.

1.29 మిలియన్ల వైద్యులలో కేవలం లక్షకు పైగా ముస్లిం MBBSలు ఉన్నారు Just Over a Lakh MBBS Muslims Among 1.29 Million Doctors

 


న్యూఢిల్లీ:

భారతదేశంలోని ముస్లింలు - గ్రౌండ్ రియాలిటీ వెర్సెస్ ఫేక్ నేరేటివ్స్ - అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ Muslims in India  Ground Reality Verses Fake Narratives  Achievements & Accomplishments అనే కొత్త పుస్తకంలో పొందుపరచబడిన వివరాల ప్రకారం


·       దేశవ్యాప్తంగా మొత్తం ఉన్న 12,99,254 మంది వైద్యులలో ముస్లిం MBBS వైద్యుల సంఖ్య కేవలం 1,04,062గా ఉంది.

·       దేశవ్యాప్తంగా 3,242 మంది ముస్లింలు ఆయుర్వేద మెడిసిన్ ప్రాక్టీషనర్లు  .

·       దేశవ్యాప్తంగా ఉన్న యునాని మెడిసిన్ ప్రాక్టీషనర్లు  మొత్తం 28,778 మంది వారిలో ముస్లింలు 28,061 మంది ఉన్నారు.

·       దేశవ్యాప్తంగా మొత్తం హోమియోపతి ప్రాక్టీషనర్లు 2,23,531 మంది ఉండగా వారిలో ముస్లిం హోమియోపతి ప్రాక్టీషనర్లు 70,027 మంది ఉన్నారు.


·       నేషనల్ మెడికల్ కమిషన్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) యొక్క సీనియర్ సభ్యులు మరియు టాప్ మేనేజ్‌మెంట్‌లో ముస్లింలు ఎవరూ లేరు.

·       దేశం లోని అన్ని రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షులు మరియు రిజిస్ట్రార్లలో ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు.

·       నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మొత్తం 34 మంది అధికారులు ఉన్నారు వారిలో ఒకరు ముస్లిము..


·       హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్‌లో 1960 మరియు 1989 మధ్య మొత్తం 12,157 మంది వైద్యులు ఉన్నారు వారిలో 2,277 మంది ముస్లింలు కలరు.

·       1960 మరియు 2022 మధ్య ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మొత్తం93,324 మంది వైద్యులు ఉండగా వారిలో  6,675 మంది ముస్లిములు.

·       మణిపూర్, మిజోరాం మరియు నాగాలాండ్‌లో ముస్లిం వైద్యులు లేరు

 

మూలం::క్లారియన్ ఇండియా, డిసెంబర్ 31, 2024