రంజాన్ 2025:
గ్రీన్‌ల్యాండ్‌లో రంజాన్2025 ఉపవాస సమయాలు అతి
పొడవైనవి మరియు న్యూజిలాండ్‌లో అతి తక్కువ.
గ్రీన్‌ల్యాండ్‌లో రంజాన్:
గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే
అతిపెద్ద ద్వీపం. గ్రీన్‌ల్యాండ్ లో 1,000 కంటే తక్కువ మంది ముస్లిం నివాసితులు ఉన్నారు. గ్రీన్‌ల్యాండ్
లో 2025 రంజాన్ అత్యంత
పొడవైన ఉపవాస సమయo, దాదాపు 16 గంటలు. ఐస్లాండ్
లో కూడా ఇదే పరిస్థితి ఉంది, ఇక్కడ ఉపవాస సమయాలు గ్రీన్లాండ్ కు సమానంగా ఉంటాయి.
అతి తక్కువ ఉపవాస సమయాలు
ప్రపంచంలోని దక్షిణాది దేశాలైన చిలీ
లేదా న్యూజిలాండ్ లో నివసిస్తున్న ముస్లింలు దాదాపు 13 గంటలు ఉపవాసం
ఉంటారు.
అత్యంత ఎక్కువ మరియు తక్కువ ఉపవాస
సమయం ఉన్న దేశాలు
అత్యంత ఎక్కువ మరియు తక్కువ రంజాన్ ఉపవాస సమయం ఉన్న దేశాల
జాబితా క్రిందిది.
• నూక్, గ్రీన్‌ల్యాండ్: 16 గంటలు
• రేక్జావిక్, ఐస్‌లాండ్: 16 గంటలు
• హెల్సింకి, ఫిన్లాండ్: 15 గంటలు
• ఓస్లో, నార్వే: 15 గంటలు
• స్టాక్‌హోమ్, స్వీడన్: 15 గంటలు
• గ్లాస్గో, స్కాట్లాండ్: 15 గంటలు
• బెర్లిన్, జర్మనీ: 14 గంటలు
• డబ్లిన్, ఐర్లాండ్: 14 గంటలు
• మాస్కో, రష్యా: 14 గంటలు
• ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్: 14 గంటలు
• వార్సా, పోలాండ్: 14 గంటలు
• అస్తానా, కజాఖ్స్తాన్: 14 గంటలు
• బ్రస్సెల్స్, బెల్జియం: 14 గంటలు
• లండన్, యునైటెడ్ కింగ్‌డమ్: 14 గంటలు
• జ్యూరిచ్, స్విట్జర్లాండ్: 14 గంటలు
• బుకారెస్ట్, రొమేనియా: 14 గంటలు
• సారాజేవో, బోస్నియా మరియు హెర్జెగోవినా: 14 గంటలు
• సోఫియా, బల్గేరియా: 14 గంటలు
• రోమ్, ఇటలీ: 14 గంటలు
• మాడ్రిడ్, స్పెయిన్: 14 గంటలు
• పారిస్, ఫ్రాన్స్: 14 గంటలు
• అంకారా, టర్కీ: 14 గంటలు
• న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్: 14 గంటలు
• ఒట్టావా, కెనడా: 14 గంటలు
• బీజింగ్, చైనా: 14 గంటలు
• ఏథెన్స్, గ్రీస్: 13 గంటలు
• లిస్బన్, పోర్చుగల్: 13 గంటలు
• టోక్యో, జపాన్: 13 గంటలు
• వాషింగ్టన్, డిసి, యుఎస్: 13 గంటలు
• లాస్ ఏంజిల్స్, యుఎస్: 13 గంటలు
• ట్యూనిస్, ట్యునీషియా: 13 గంటలు
• అల్జీర్స్, అల్జీరియా: 13 గంటలు
• టెహ్రాన్, ఇరాన్: 13 గంటలు
• కాబూల్, ఆఫ్ఘనిస్తాన్: 13 గంటలు
• న్యూఢిల్లీ, భారతదేశం: 13 గంటలు
• ఢాకా, బంగ్లాదేశ్: 13 గంటలు
• రబాత్, మొరాకో: 13 గంటలు
• డమాస్కస్, సిరియా: 13 గంటలు
• ఇస్లామాబాద్, పాకిస్తాన్: 13 గంటలు
• బాగ్దాద్, ఇరాక్: 13 గంటలు
• బీరుట్, లెబనాన్: 13 గంటలు
• అమ్మాన్, జోర్డాన్: 13 గంటలు
• గాజా నగరం, పాలస్తీనా: 13 గంటలు
• కైరో, ఈజిప్ట్: 13 గంటలు
• దోహా, ఖతార్: 13 గంటలు
• దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 13 గంటలు
• ఖార్టూమ్, సూడాన్: 13 గంటలు
• రియాద్, సౌదీ అరేబియా: 13 గంటలు
• అబుజా, నైజీరియా: 13 గంటలు
• అడెన్, యెమెన్: 13 గంటలు
• డాకర్, సెనెగల్: 13 గంటలు
• అడిస్ అబాబా, ఇథియోపియా: 13 గంటలు
• బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా: 13 గంటలు
• కొలంబో, శ్రీలంక: 13 గంటలు
• కౌలాలంపూర్, మలేషియా: 13 గంటలు
• మొగాడిషు, సోమాలియా: 13 గంటలు
• సియుడాడ్ డెల్ ఎస్టే, పరాగ్వే: 13 గంటలు
• నైరోబి, కెన్యా: 13 గంటలు
• హరారే, జింబాబ్వే: 13 గంటలు
• జకార్తా, ఇండోనేషియా: 13 గంటలు
• లువాండా, అంగోలా: 13 గంటలు
• బ్యాంకాక్, థాయిలాండ్: 13 గంటలు
• బ్రెసిలియా, బ్రెజిల్: 13 గంటలు
• జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా: 13 గంటలు
• మోంటెవీడియో, ఉరుగ్వే: 13 గంటలు
• కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా: 13 గంటలు
• ప్యూర్టో మోంట్, చిలీ: 13 గంటలు
• క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్: 13 గంటలు
రంజాన్ 2025 యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది రెండు గ్రహణాలను చూస్తుంది - ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం మరియు మరొకటి పాక్షిక సూర్యగ్రహణం.
2030 సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం రెండుసార్లు వస్తుంది. - మొదట జనవరిలో మరియు మళ్ళీ డిసెంబర్‌లో.
No comments:
Post a Comment