11 March 2025

భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఖాన్ షకీర్ అలీ ఖాన్(1904-1978) Indian freedom fighter Khan Shakir Ali Khan

 



షేర్-ఎ-భోపాల్ గా ప్రసిద్ధి చెందినఖాన్ ఖాన్ షకీర్ అలీ ఖాన్ (1904 - 1978), స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, కార్యకర్త, ట్రేడ్ యూనియన్ వాది, జర్నలిస్ట్ మరియు మత సామరస్యానికి ప్రతీక.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ చురుకైన ఉర్దూ జర్నలిస్ట్. 1926–1927 మద్య ఢిల్లీలోని రాయసత్ మరియు కలకత్తాలోని హింద్‌లో పనిచేశాడు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ భోపాల్‌లోని సుల్తానియా పదాతిదళంలో నాయక్‌గా, తరువాత భోపాల్ నవాబు పరిపాలనలో రైత్వారి మొహర్రిర్‌గా పనిచేశాడు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ పర్షియన్ భాషలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు.

భోపాల్ రాష్ట్రంలో రాచరికానికి వ్యతిరేకంగా పోరాటంలో ఖాన్ షకీర్ అలీ ఖాన్ ఖాన్ చురుకుగా ఉన్నాడు మరియు అనేక సందర్భాలలో జైలు శిక్ష అనుభవించాడు. 1932లో ఖాన్ షకీర్ అలీ ఖాన్ ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడ్డారు, 1933లో ఖాన్ షకీర్ అలీ ఖాన్ అంజుమన్ ఖుద్దాం-ఎ-వతన్ (ఫాదర్‌ల్యాండ్ సేవకుల లీగ్)ను స్థాపించి, దాని కార్యదర్శిగా పనిచేశారు.

1934 మరియు 1949 మధ్య ఖాన్ షకీర్ అలీ ఖాన్ అనేక విభిన్న ఉర్దూ వార్తాపత్రికలలో పనిచేశారు.

ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి ఖాన్ షకీర్ అలీ ఖాన్ 1938లో ప్రజా మండల్‌ను స్థాపించారు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ ప్రజా మండల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ ప్రజా మండల్ లో 15 మిల్లు మరియు కర్మాగార కార్మికుల యూనియన్లకు చోటు కల్పించారు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ 'మజ్దూర్ సభ ('వర్కర్స్ యూనియన్')'ను స్థాపించారు.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ పేద ప్రజల పట్ల, ముఖ్యంగా కార్మిక వర్గం పట్ల అవిశ్రాంత కృషి చేసినందుకు హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ఆయనను గౌరవిస్తారు మరియు ప్రేమిస్తారు.

షేర్-ఎ-భోపాల్ బిరుదును పొందిన షకీర్ అలీ ఖాన్ సామాన్యుల పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి నిస్వార్థ ప్రయత్నాలకు చేసారు. ముస్లిం-హిందూ అల్లర్లను ప్రేరేపించాలనుకున్న మతతత్వ శక్తులకు షకీర్ అలీ ఖాన్ అడ్డుగా నిలిచారు.. భోపాల్‌లోని చౌక్ ప్రాంతంలో జైన మందిరాన్ని కూల్చివేతను అడ్డుకొన్నారు.

షకీర్ అలీ ఖాన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఒక దశాబ్దం క్రితం షకీర్ అలీ ఖాన్ పేరు మీద భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును ప్రకటించినది.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ (1904-1978) షేర్-ఎ-భోపాల్ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఖాన్ షకీర్ అలీ ఖాన్ ప్రజలకు, అణగారిన వర్గాలకు మరియు పేదలకు తన సేవలను అందించారు.

భోపాల్ నవాబు కాలంలో, ఖాన్ షకీర్ అలీ ఖాన్ భోపాల్‌లోని మిల్లులు మరియు కర్మాగారాలలో వివిధ ట్రేడ్ యూనియన్లను ఏర్పాటు చేశారు. మిల్లులు మరియు కర్మాగారాల కార్మికులను వివిధ సంస్థలు మరియు యూనియన్ల క్రింద సంఘటితపరిచి వారి హక్కుల కోసం పోరాడాడు.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ కార్మికుల వాణి వినిపించడానికి సుబ్-ఇ-వతన్ అనే పత్రికను ప్రారంబించారు. సుబ్-ఇ-వతన్ నాటి భోపాల్ రాజరిక ప్రభుత్వాన్ని విమర్శించినందువలన  ఖాన్ షకీర్ అలీ ఖాన్  కారాగారవాసం కూడా అనుభవించారు,

భోపాల్‌లో కార్మిక ఉద్యమ నాయకుడైన ఖాన్ షకీర్ అలీ ఖాన్, భోపాల్ రాష్ట్రాన్ని భారతదేశంతో అనుసంధానించడానికి పోరాటాలకు నాయకత్వం వహించాడు.ఖాన్ షకీర్ అలీ ఖాన్ రాజరిక రాష్ట్రమైన  భోపాల్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేసే అంశంలో భోపాల్ రాష్ట్ర చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా ఖాన్ ను ప్రబావితం చేసారు. ఒక తాత్కాలిక ఒప్పందం ప్రకారం పూర్వ భోపాల్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పార్ట్ సి రాష్ట్రంగా పరిగణించి, చివరకు మధ్యప్రదేశ్‌లో భాగమైంది.

భోపాల్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చేయడంలో ఖాన్ షకీర్ అలీ ఖాన్ ప్రముఖ పాత్ర పోషించినారు.

1950లో ఖాన్ షకీర్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ నుండి నిష్క్రమించి కిసాన్ మజ్దూర్ మండల్ ('రైతు కార్మికుల సంఘం')లో చేరారు.  ఖాన్ షకీర్ అలీ ఖాన్ KMM అధ్యక్షుడు.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ 1952లో భారత కమ్యూనిస్ట్ పార్టీ భోపాల్ రాష్ట్ర శాఖను స్థాపించి, మద్య ప్రదేశ్ రాష్ట్ర పార్టీ సంస్థ అధ్యక్షుడయ్యారు.

ఖాన్ షకీర్ అలీ ఖాన్ వరుసగా నాలుగు పర్యాయాలు1957, 1962, 1967 మరియు 1972లో భోపాల్ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ మద్య ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కొనసాగినారు.  

ఖాన్ షకీర్ అలీ ఖాన్ భోపాల్ ముస్లిం సమాజంలో కీలక వ్యక్తి. ఖాన్ షకీర్ అలీ ఖాన్ 1968-1969 మధ్య మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. 1970లలో ఖాన్ షకీర్ అలీ ఖాన్ మధ్యప్రదేశ్ కిసాన్ సంఘ్ ఛైర్మన్‌గా మరియు CPI మధ్యప్రదేశ్ రాష్ట్ర మండలి సభ్యుడిగా పనిచేశారు. ఖాన్ షకీర్ అలీ ఖాన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

శాసనసభ్యుడిగా, భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కొద్దిమంది ప్రముఖులలో ఖాన్ షకీర్ అలీ ఖాన్ ఒకరు

 నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా లో షకీర్ అలీ ఖాన్ పత్రాలు, ఛాయాచిత్రాలు, లేఖలు మరియు ఆయన స్వంత రచనలను పొందుపరిచారు.

భోపాల్‌లోని ఖాన్ షకీర్ అలీ ఖాన్ ఆసుపత్రికి ఆయన పేరు పెట్టారు

 

 




 

 

 

No comments:

Post a Comment