బీహార్ రాష్ట్రం మరియు భారత దేశాన్ని అభివృద్ధి చేయడంలో వివిధ హోదాల్లో పాత్రలు పోషించిన బీహార్‌కు చెందిన ఆరుగురు ముస్లిం మహిళల సంక్షిప్త సంకలనం
1.సిద్దికా ఖాటూన్:
1922లో, మహాత్మా గాంధీ పిలుపు మేరకు అలీ సోదరుల
తల్లి బి అమ్మ మరియు మొహమ్మద్ అలీ భార్య అమ్జాది బేగం సహాయ నిరాకరణ ఉద్యమం కోసం
నిధులు సేకరించడానికి బీహార్‌కు వచ్చినప్పుడు, వారు ముంగేర్‌కు చెందిన సిద్ధికా
ఖాటూన్‌ను కలిశారు. సిద్ధికా ఖాటూన్ భర్త షా ముహమ్మద్ జుబైర్ అప్పటికే కాంగ్రెస్‌లో
విశిష్ట నాయకుడు మరియు భారతదేశంలోని
బ్రిటిష్ జైళ్లలో గడిపారు. నిధుల సేకరణ కోసం సిద్ధికా ఖాటూన్ బీహార్ అంతటా
పర్యటించారు, ఈ చర్యను గాంధీ స్వయంగా ప్రశంసించారు.
1930లో, తన భర్తతో కలిసి, సిద్ధికా ఖాటూన్ గాంధీ పిలుపునిచ్చిన
శాసనోల్లంఘన ఉద్యమంలో దూసుకెళ్లారు. ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు జుబైర్ జైలు
పాలైన తర్వాత, సిద్ధికా ఖాటూన్ నాయకత్వం వహించింది. సిద్ధికా ఖాటూన్ సమావేశాలను
ఉద్దేశించి ప్రసంగించారు, మహిళలకు నాయకత్వం వహించారు మరియు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించారు. బీహార్‌కు
చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు సిద్ధికా
ఖాటూన్ జీవితం 1930లో షా ముహమ్మద్ జుబైర్ భర్త జైలులో విషప్రయోగం కారణంగా మరణించడంతో
ముగిసింది. షా ముహమ్మద్ జుబైర్ మరణ వార్త విన్న కొన్ని నెలలకే సిద్ధికా ఖాటూన్ మరణించింది
2. నైమా ఖాటూన్ హైదర్:
1913లో జన్మించిన నైమా ఖాటూన్ హైదర్, సయ్యద్ రజా హైదర్‌ను వివాహం
చేసుకున్నారు. నైమా ఖాటూన్ 1937లో 23 సంవత్సరాల చిన్న వయసులోనే బీహార్ లెజిస్లేటివ్
కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మహిళలలో సామాజిక సేవలో నైమా ఖాటూన్ చేసిన కృషి అందరి ప్రశంసలు
అందుకుంది. 1946లో బీహార్‌లో జరిగిన మత ఘర్షణలు నైమా ఖాటూన్ ను తీవ్రంగా కదిలించాయి మరియు
బాధితుల పునరావాసం కోసం నైమా ఖాటూన్ తన సేవలను అందించింది.
1952లో, నైమా ఖాటూన్ తిరిగి ఇంకొక సారి బీహార్
లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నైమా
ఖాటూన్ ను మే 12, 1952న స్పీకర్‌గా ఎన్నుకుంది. స్పీకర్ పదవిని నిర్వహించిన మొదటి మహిళగా నైమా ఖాటూన్ నిలిచింది.
తరువాత, నైమా ఖాటూన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నైమా ఖాటూన్ జూలై 24, 1957న చిన్న వయసులోనే మరణించింది.
3.మహమూదా సామి:
కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ హసన్ ఇమామ్
మరియు మునిబా హసన్ దంపతులకు జన్మించిన మహమూదా సామి యూరప్‌లో విద్యను అభ్యసించారు. 1930లో, మహాత్మా గాంధీ ప్రారంభించిన
శాసనోల్లంఘన ఉద్యమంలో మహమూదా సామి చురుకుగా పాల్గొంది. మహమూదా సామి బీహార్‌లో
పర్యటించారు, బహిరంగ సమావేశాలను ప్రసంగించారు మరియు ఆందోళనలను నిర్వహించారు.
ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు
బ్రిటిష్ ప్రభుత్వం మహమూదా సామి కు జరిమానా విధించింది కానీ, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్త
అయిన మహమూదా సామి ఎటువంటి జరిమానా చెల్లించడానికి నిరాకరించింది. మహమూదా సామి భర్త
బారిస్టర్ అబ్దుల్ సామి 1934లో మరణించిన తర్వాత మహమూదా సామి గుండెపోటుతో మరణించింది.
4. బేగం అజీజా ఫాతిమా ఇమామ్:
డాక్టర్ వలీ అహ్మద్ (పాట్నా మెడికల్
కాలేజీలో ప్రొఫెసర్) మరియు ఖాదీజా అహ్మద్ దంపతులకు జన్మించిన అజీజా ఫాతిమాను ఆమె
అత్త లేడీ అనిస్ ఇమామ్ దత్తత తీసుకుంది. ప్రగతిశీల కుటుంబం నుండి వచ్చిన అజీజా
ఫాతిమా మహిళా హక్కులు మరియు ఇతర సామాజిక సమస్యలపై వ్యాసాలు రాసింది. తరువాత అజీజా
ఫాతిమా సుబాహ్-ఇ-నౌ అనే పత్రికకు సంపాదకురాలిగా పనిచేశారు మరియు 1964లో బీహార్ రాష్ట్ర సామాజిక సలహా బోర్డు
ఛైర్మన్‌గా పనిచేశారు.
తన సాహిత్య సేవలకు గాను, అజీజా ఫాతిమా 1973లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు, అక్కడ అజీజా ఫాతిమా రెండు పర్యాయాలు
పనిచేశారు. అజీజా ఫాతిమా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉమెన్స్ ఫ్రంట్ కన్వీనర్‌గా మరియు
అనేక ఇతర కమిటీలలో పనిచేశారు. అజీజా ఫాతిమా జూలై 22, 1996న తుదిశ్వాస విడిచారు.
5. అహ్మది సత్తార్:
ఫిబ్రవరి 2, 1928న జన్మించిన అహ్మది సత్తార్ అర్రా
మరియు పాట్నాలో చదువుకుని, అలీఘర్‌లోని AMUలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అహ్మది సత్తార్ పాట్నా హైకోర్టులో
న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు మరియు మహిళా హక్కుల ఉద్యమంలో చురుకుగా
పాల్గొన్నారు.
అహ్మది సత్తార్ అఖిల భారత మహిళా మండలి
మరియు భారత్ సేవక్ సమాజ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. 1958 నుండి 1978 వరకు, అహ్మది సత్తార్ 18 సంవత్సరాలు బీహార్ శాసన మండలి
సభ్యురాలిగా పనిచేశారు. బీహార్‌లో మహిళలకు సంబంధించిన సమస్యలపై అత్యంత స్వరం
వినిపించే వారిలో అహ్మది సత్తార్ ఒకరు.
6. రషీద్-ఉన్-నిసా: 1853లో జన్మించిన రషీద్-ఉన్-నిసా ఉర్దూలో
నవల రాసిన మొదటి మహిళ. రషీద్-ఉన్-నిసా 1881లో ఇస్లా-ఉన్-నిసా నవల రాశారు రషీద్-ఉన్-నిసా
రాసిన నవలను కుమారుడు ఇంగ్లాండ్ నుండి బారిస్టర్ సులైమాన్ న్యాయశాస్త్రంలో పట్టా
పొంది ఇండియా వచ్చిన తరువాత ప్రచురించినాడు.
1894లో ఇస్లా-ఉన్-నిసా నవల మొదటిసారి
ప్రచురించబడినప్పుడు దాని రచయితగా రషీద్-ఉన్-నిసా పేరు లేదు. బదులుగా, బారిస్టర్ సులైమాన్ తల్లి, సయ్యద్ వహీదుద్దీన్ ఖాన్ బహదూర్
కుమార్తె మరియు ఇమ్దాద్ ఇమామ్ సోదరి అని ఉంది.. ఉర్దూలో ప్రచురించబడిన మొదటి మహిళ రషీద్-ఉన్-నిసా
కు పుస్తకంలో తన పేరును ప్రస్తావించడానికి కూడా అనుమతి లేదు. ఆప్పట్లో సామాజిక
కట్టుబాట్లు అలా ఉండేవి. రషీద్-ఉన్-నిసా 1906లో బాలికల కోసం ఒక పాఠశాలను కూడా
ప్రారంభించింది.
No comments:
Post a Comment