20 May 2026

బాలీవుడ్‌కు ముందు, భారతదేశపు మొట్టమొదటి సినిమా హాల్‌ను కోల్‌కతా నగరం నిర్మించింది Before Bollywood, Kolkata city-built India’s first cinema hall

 

India 


దేశంలోనే మొట్టమొదటి సినిమా హాల్ 100 సంవత్సరాల క్రితం కోల్‌కతాలో ప్రారంభమైంది.భారతదేశపు మొట్టమొదటి సినిమా హాల్ వాస్తవానికి 1907లో కోల్‌కతాలో నిర్మించబడింది. ఆ థియేటర్‌ను చాప్లిన్ సినిమా అని పిలిచేవారు, దీని అసలు పేరు ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్.ఇది కోల్‌కతాలోని 5/1 చౌరింగీ ప్లేస్‌లో ఉండేది

జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ చాప్లిన్ సినిమా థియేటర్‌ను స్థాపించారు. జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ ను భారతదేశంలో సినిమా నిర్మాణ పితామహుడిగా పిలుస్తారు.

వినోద రంగంలోకి ప్రవేశించడానికి ముందు మదన్ ఒక డ్రామా క్లబ్‌లో సహాయకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. 1902లో, జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ కలకత్తా చుట్టుపక్కల ఉన్న బహిరంగ ప్రదేశాలలో బయోస్కోప్ చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. 1907లో జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు.

తరువాత, జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ భారతదేశపు మొట్టమొదటి ప్రధాన సినిమా చైన్ అయిన మదన్ థియేటర్స్‌ను కూడా స్థాపించారు. మదన్ థియేటర్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా 100కు పైగా థియేటర్లను కలిగి ఉoడేది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ ను పునరుద్ధరించి, మినర్వా సినిమాగా పేరు మార్చారు. ఇది ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందింది మరియు కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది. 1980వ దశకంలో, దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ గౌరవార్థం ఈ థియేటర్‌కు చాప్లిన్ సినిమా అని పేరు మార్చారు.

చాప్లిన్ సినిమా థియేటర్ అనేక సంవత్సరాల పాటు మనుగడ కోసం పోరాడింది. చివరకు, 2013లో చాప్లిన్ సినిమా భవనాన్ని కూల్చివేశారు. నేడు, భారతదేశపు మొట్టమొదటి సినిమా హాలు వెలసిన ప్రదేశంలో 'చార్లీ చాప్లిన్ స్క్వేర్' కొలువై ఉంది.

No comments:

Post a Comment