మహారాష్ట్రలో ఈద్-ఉల్-అధా వేడుకలలో యువత చేపట్టిన ఒక ఉద్యమం, రక్తదానాన్ని ఒక శాశ్వత కార్యక్రమం గా మార్చింది. తద్వారా, త్యాగానికి రూపమైన ఖుర్బానీకి కొత్త అర్థాన్ని ఇచ్చింది.
దానం చేసిన ఒక్క యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి, ముస్లిం సత్యశోధక్ మండల్ గత 16 సంవత్సరాలుగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈద్-ఉల్-అధా సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది.
సమాజం కోసం త్యాగం చేయడానికి, మానవత్వానికి సేవ చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఈ రక్తదాన కార్యక్రమం ఖుర్బానీ స్ఫూర్తిని విస్తృతం చేస్తుందని ముస్లిం సత్యశోధక్ మండల్ సంస్థ చెబుతోంది.రక్తదాన శిబిరాలకు ముస్లింలే కాకుండా అన్ని మతాల ప్రజలు హాజరవుతున్నారు.
ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు షమ్సుద్దీన్ తంబోలి మాట్లాడుతూ, రక్తదాన ఆలోచన 2011లో రూపుదిద్దుకుందని తెలిపారు."బక్రీ ఈద్ సందర్భంగా రక్తదానం చేయాలనే భావన 2011లో ఖరారైంది, ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబా అధవ్, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ వంటి సంఘ సంస్కర్తలు, ఇంకా పలువురు ప్రముఖులు అండగా నిలిచారు," అని తంబోలి అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ తన కార్యకలాపాలను కొనసాగించిందని తంబోలి పేర్కొన్నారు."మహమ్మారి కాలంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదానంతో పాటు, ప్లాస్మా దాన శిబిరాలను కూడా నిర్వహించినది.. రాష్ట్రంలో వరదలు, తుఫానులు సంభవించినప్పుడల్లా సహాయక చర్యలు చేపట్టాము. దృష్టి లోపం ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పలు మానవతా కార్యక్రమాలను చేపట్టాము," అని తంబోలి తెలిపారు.
ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదాన్ ఉద్యమ కార్యక్రమం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి మరియు అనేక సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, ముస్లిం సత్యశోధక్ మండల్ అవయవ దానం, శరీర దానం మరియు కంటి దానాన్ని ప్రోత్సహక కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నది.."
షమ్సుద్దీన్ తంబోలి ఇంకా ఇలా అన్నారు, "ఖుర్బానీ అంటే త్యాగం మరియు అంకితభావం. ఒక వ్యక్తి నిజంగా త్యాగం
చేయాలనుకుంటే, రక్తదానం ద్వారా మరొక మానవ ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్ప కార్యం మరొకటి
ఉండదు."
మహారాష్ట్ర మాజీ డీజీపీ, అశోక్ ధివారే రక్తదాన కార్యక్రమాన్ని బహిరంగంగా ప్రశంసించారు.ప్రతి
సంవత్సరం తాను రక్తదానం కార్యక్రమాలలో
ఉత్సాహంగా పాల్గొంటానని ధివారే తెలిపారు.
రక్తదాన కార్యక్రమం ఇస్లామిక్ విలువలను సమకాలీన
మానవతా అవసరాలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తోందని ముస్లిం సత్యశోధక్ మండల్
కార్యనిర్వాహక సభ్యురాలు డాక్టర్ సమీనా పఠాన్ అన్నారు.
మతపరమైన పండుగలు సమాజ అవసరాలకు అనుగుణంగా మారాలని
చెబుతూ, రచయిత ప్రదీప్ అవటే కూడా రక్తదాన కార్యక్రమం ను ప్రశంసించారు.
బక్రీద్ పండుగ సమయంలో రక్తదానం చేయడం నిజంగా ఒక
మానవతా చర్య," అని ముస్లిం సత్యశోధక్ మండల్ యొక్క ఒక నిర్వాహకుడు పేర్కొన్నారు.
పూణేలో ఒక స్థానిక చొరవగా ప్రారంభమైన రక్తదాన కార్యక్రమం
ఇప్పుడు సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది.
త్యాగం అనే పవిత్ర స్ఫూర్తిని విజ్ఞానం, కరుణ, ప్రజా సేవతో మేళవించడం ద్వారా, మతపరమైన విలువలను సమాజ శ్రేయస్సు
కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో రక్తదాన ప్రచార కార్యక్రమం నిరూపించింది.
No comments:
Post a Comment