9 November 2026

దక్షిణ కొరియా ముస్లిం పండితుడు, ప్రొఫెసర్ మరియు కొరాన్ అనువాదకుడు డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ Dr. Hamid Young Kil Choi, a distinguished South Korean Muslim scholar, professor and translator of Koran

 

వచనం చిత్రం కావచ్చు 

కొరియన్ పాఠకులకు ఇస్లామీయ జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తన జీవితంలోని సంవత్సరాలను అంకితం చేసిన ప్రముఖ దక్షిణ కొరియా ముస్లిం పండితుడు, ప్రొఫెసర్ మరియు అనువాదకుడు డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌.

1949 ఏప్రిల్ 24న దక్షిణ కొరియాలో జన్మించిన డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ అసలు పేరు చోయ్ యంగ్-గిల్ (Choi Young-gil). 1970లో సియోల్‌లోని హంకుక్ విశ్వవిద్యాలయంలో (Hankuk University of Foreign Studies) చదువుతున్నప్పుడు తన ఈజిప్షియన్ ప్రొఫెసర్ ప్రభావంతో1970లో ఇస్లాం మతాన్ని స్వీకరించారు

డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్ (Dr. Hamid Choi Yong-kil) పవిత్ర ఖురాన్ మరియు సహీహ్ అల్-బుఖారీ గ్రంథాలను కొరియన్ భాషలోకి అనువదించిన మొట్టమొదటి దక్షిణ కొరియా ముస్లిం పండితుడు.

డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్ దక్షిణ కొరియాలోని మియాంగ్జీ విశ్వవిద్యాలయంలో (Myongji University) ఇస్లామిక్ మరియు అరబిక్ అధ్యయనాల ప్రొఫెసర్‌గా పనిచేసారు.అక్కడ అరబ్ అధ్యయనాల విభాగాధిపతిగా, హ్యుమానిటీస్ కళాశాల డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు అలాగే కొరియా ముస్లిం ఫెడరేషన్ (KMF) ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు

పవిత్ర ఖురాన్ మరియు సహీహ్ అల్-బుఖారీ యొక్క హదీసులను కొరియన్ భాషలోకి అనువదించినందుకు డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ విస్తృతంగా గుర్తింపు పొందారు. అరబిక్ అర్థం చేసుకోలేని ప్రజలు ఇస్లామీయ బోధనలను వారి సొంత భాషలో అన్వేషించడానికి డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ సహాయపడ్డారు.

డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ హంకుక్ విశ్వవిద్యాలయం నుండి అరబిక్ భాష మరియు సాహిత్యంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం సౌదీ అరేబియాలోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ మదీనాలో ఉన్నత విద్యను అభ్యసించి, 1986లో సుడాన్‌లోని ఓమ్దుర్మాన్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు

డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ కొరియన్  ఖురాన్ అనువాదం మొదట 1988లో వెలువడింది, ఆ తర్వాత 1997లో కింగ్ ఫహద్ కాంప్లెక్స్ ద్వారా ద్విభాషా సంచిక bilingual edition ప్రచురించబడింది. డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ కృషి కొరియన్ మాట్లాడే ముస్లింలకు మరియు ఇస్లాంపై ఆసక్తి ఉన్న పాఠకులకు ఒక ముఖ్యమైన వనరుగా మారింది.

కొరియా ప్రజలకు ఇస్లాం బోధనలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి డాక్టర్ హమీద్ యంగ్ సుమారు ఏడు సంవత్సరాల పాటు శ్రమించి ఖురాన్ అర్థాలను కొరియన్ భాషలోకి అనువదించారు. ఈ అనువాదం సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ కాంప్లెక్స్ (King Fahd Complex) ద్వారా ప్రచురించబడింది.

 

సహీహ్ అల్-బుఖారీ అనువాదం. ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రవచనాల ప్రామాణిక సంకలనమైన 'సహీహ్ అల్-బుఖారీ'ని కూడా కొరియన్ భాషలోకి అనువదించిన మొదటి కొరియన్ పండితుడిగా డాక్టర్ హమీద్ యంగ్ చరిత్ర సృష్టించారు.

ఈ రెండు ప్రధాన గ్రంథాలతో పాటు, డాక్టర్ హమీద్ యంగ్ ఇస్లామిక్ అధ్యయనాలకు సంబంధించి 90కి పైగా పుస్తకాలు మరియు పరిశోధనా వ్యాసాలను రచించి, అనువదించారు.

డాక్టర్ హమీద్ యంగ్ కు లబించిన పురస్కారాలు మరియు గుర్తింపు

కింగ్ ఫైసల్ అంతర్జాతీయ పురస్కారం. ఇస్లాం సేవలో పురస్కారాలు మరియు గుర్తింపు

కింగ్ ఫైసల్ అంతర్జాతీయ పురస్కారం: ఇస్లాం సేవలో ఆయన చేసిన విశేష కృషికి మరియు అనువాద సేవలకు గుర్తింపుగా 2023లో ప్రతిష్టాత్మకమైన కింగ్ ఫైసల్ ప్రైజ్ (King Faisal Prize in Service to Islam) అందుకున్నారు.

అనువాద పురస్కారం. 2008-2009 కాలంలో అనువాద రంగంలో డాక్టర్ హమీద్ యంగ్ చేసిన కృషికి గాను 'కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ట్రాన్స్‌లేషన్' లభించింది.

జ్ఞానం భాషా అవరోధాలను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృదయాలను ఎలా చేరుకోగలదో డాక్టర్ హమీద్ యంగ్ కిల్ చోయ్‌ అంకితభావం మనకు గుర్తు చేస్తుంది.

 

 

 

No comments:

Post a Comment