
గత దశాబ్దన్నర కాలంలో సేకరించిన, స్వాతంత్ర్యానికి పూర్వం మరియు అనంతర కాలాలకు చెందిన 1,000కు పైగా అరుదైన, పురాతన వస్తువులను అబ్దుల్ వదూద్ ఖాన్ (61) అలియాస్ రాజా సార్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.
కటక్:
అబ్దుల్ వదూద్ ఖాన్ (61) అలియాస్ రాజా
సార్‌కు బోధన ఒక వృత్తి కాగా, అరుదైన మరియు పురాతన వస్తువులను సేకరించడం ఒక అభిరుచి.రాజా
సార్ గత, 14 ఏళ్లుగా ఎంతో
శ్రమతో సేకరించిన అరుదైన కళాఖండాలతో తన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చినారు., రాజా సార్ తన
ఇంట్లో ఏర్పాటు చేసిన ‘అమా సంగ్రహాలయం’ (మన మ్యూజియం), పురాతన వస్తువుల
ప్రేమికులకు, విద్యార్థులకు
మరియు జిజ్ఞాసువులకు ఒక ఆకర్షణ కేంద్రంగా మారింది.
కటక్ జిల్లాలోని కుసుమండల్
గోపినాథ్‌పూర్ గ్రామానికి చెందిన రాజా సర్, 1985లో నైగువాన్ దౌద్‌పూర్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ
ఉపాధ్యాయుడిగా తన బోధనా వృత్తిని ప్రారంభించారు.తరువాత, భారత్ స్కౌట్స్ & గైడ్స్ మరియు
రెడ్ క్రాస్ ప్రదర్శనలలో పాల్గొనడం వల్ల అరుదైన వస్తువులను సేకరించడం మరియు
భద్రపరచడంపై రాజా సర్ కు ఆసక్తి
పెరిగింది. 2012 లో స్కౌట్స్
మాస్టర్‌గా ఎన్నికైన తర్వాత, రాజా సర్ మరింత అంకితభావంతో తన సేకరణ మరియు భద్రపరిచే
కార్యకలాపాలను విస్తరించారు.
రాజా సర్ గత 14 సంవత్సరాలుగా, స్వాతంత్ర్యానికి
పూర్వం మరియు తరువాతి కాలానికి చెందిన 1,000కు పైగా అరుదైన మరియు పురాతన వస్తువులను సేకరించారు. ‘అమా
సంగ్రహాలయం’ (మన మ్యూజియం)లో 100కు పైగా పాత ఒడియా వార్తాపత్రికలు, భారతదేశం మరియు
విదేశాల నుండి సేకరించిన ఫౌంటెన్ పెన్నులు, సిరాబుడ్లు, నిబ్ పెన్నులు, సాంప్రదాయ రాత పరికరాలు మరియు వందలాది పాత పుస్తకాలు
ఉన్నాయి.
1950లు,
1960ల నాటి గ్రామోఫోన్లు,
పాత టెలిఫోన్లు, రేడియోలు, టేప్ రికార్డర్లు, రికార్డ్
ప్లేయర్లు, కెమెరాలు, ప్రొజెక్టర్లు, టార్చ్ లైట్లు, రైల్వే సిగ్నల్
దీపం, పెట్రోమాక్స్
లైట్లు, లాంతర్లు, దీపాలు మరియు
సాంప్రదాయ పొయ్యిలు ఇక్కడి ఆకర్షణలలో కొన్ని.
పాత జేబు గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్ గడియారాలు, గోడ గడియారాలు, బ్రిటిష్ కాలం
నాటి పోస్ట్‌కార్డులు, కవర్లు, పోస్టేజ్
స్టాంపులు, ఫస్ట్ డే కవర్లు, అగ్గిపెట్టెలు, పాత గాజు సీసాలు
మరియు లైటర్లు కూడా రాజా సర్ సేకరణలో భాగంగా ఉన్నాయి.
‘అమా సంగ్రహాలయం’ (మన
మ్యూజియం)లో రాజ్యాల కాలం నుండి బ్రిటిష్ యుగం వరకు ఉన్న రాగి, వెండి నాణేలు, భారతదేశంలోని
వివిధ కాలాలకు చెందిన నాణేలు, నోట్లు, మరియు 150కి పైగా విదేశాలకు చెందిన నోట్లు, నాణేలు కూడా
ప్రదర్శించబడ్డాయి.
ఈ మ్యూజియంలో సాంప్రదాయ
గృహ, వ్యవసాయ
పనిముట్లు, చెక్క కళాఖండాలు, తాళాలు, తూనిక యంత్రాలు, బొగ్గు ఇస్త్రీ
పెట్టెలు, పాత్రలు, రాతి, సిరామిక్
వస్తువులు, నాగళ్ళు, ఎద్దుల గంటలు
మరియు వివిధ సంగీత వాయిద్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇవి పూర్వకాలంలోని గ్రామీణ
జీవితాన్ని కళ్ళకు కనువిందు చేస్తాయి.
" తను ఖరీదు చేసిన ఏనుగు దంతాలతో చేసిన ఒక చిన్న పెట్టెలో సౌదీ
అరేబియా లో తయారు అయి భూతద్దం సహాయంతో మాత్రమే చదవగల 1.5 అంగుళాల వెడల్పు, అర అంగుళం ఎత్తు కలిగి
ఉన్న సూక్ష్మ పవిత్ర ఖురాన్ తన స్నేహితుని వద్ద నుండి సేకరించడం
జరిగింది అని రాజా సర్ చెప్పారు.
2023లో పదవీ విరమణ చేసిన తర్వాత, కూడా రాజా సర్ అతిథి
ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. అరుదైన, పురాతనమైన, అంతరించిపోతున్న వస్తువులను సేకరించడం పట్ల ఆయనకున్న ఆసక్తి
ఏమాత్రం తగ్గలేదు.
రాజా సర్ తన ఇంట్లోని
ప్రదర్శన గదులలో గాజు ముందుభాగం ఉన్న క్యాబినెట్‌లు, అరలు, ర్యాక్‌లలో ఆ పురాతన వస్తువులను చక్కగా అమర్చి
భద్రపరుస్తున్నారు. ఈ పనిలో ఆయన కుమారుడు, కోడలు, స్నేహితులు కూడా సహాయం చేస్తారు.
భారత్ స్కౌట్స్ అండ్
గైడ్స్ జంబోరీలో నిర్వహించిన ప్రదర్శనలలో రాజా సర్ సేకరణ అద్భుతమైన విజయాన్ని కూడా
సాధించింది.
2015 మరియు 2026 మధ్యకాలంలో, రాజా సర్ కటక్ జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రథమ స్థానాన్ని
గెలుచుకున్నారు. అంతేకాకుండా, ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో
రాజా సర్ నాలుగుసార్లు ప్రథమ బహుమతిని సాధించారు.



No comments:
Post a Comment