15 November 2026

కరీం ఖాన్ మరియు నవాబ్ షమ్సుద్దీన్ ఖాన్ करीम ख़ान और नवाब शम्सुद्दीन ख़ान

 

May be an image of text 

 

1835 మార్చి 22న ఢిల్లీలో జరిగిన బ్రిటిష్ అధికారి విలియం ఫ్రేజర్‌ హత్య, ఒక సంచలనాత్మక సంఘటన.. విలియం ఫ్రేజర్ (William Fraser) ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ప్రముఖ సివిల్ సర్వెంట్ మరియు మొఘల్ కోర్టులో బ్రిటిష్ రెసిడెంట్ (గవర్నర్ జనరల్ ఏజెంట్) గా పనిచేశారు. ఫ్రేజర్ స్థానిక భారతీయ సంస్కృతిని, జీవన విధానాన్ని బాగా అలవర్చుకున్న "వైట్ మొఘల్" (White Mughal) గా ప్రసిద్ధి చెందారు.


కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఫిరోజ్‌పూర్ ఝిర్కా మరియు లోహారు సంస్థాన నవాబైన షంషుద్దీన్ అహ్మద్ ఖాన్ తో ఫ్రేజర్‌కు తీవ్రమైన ఆస్తి వివాదాలు, రాజకీయ విభేదాలు ఉన్నాయి. నవాబ్ షంషుద్దీన్ తండ్రి ఆస్తి పంపకాల విషయంలో షంషుద్దీన్ సవతి సోదరుడికి ఫ్రేజర్ మద్దతు ఇవ్వడంతో నవాబ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

నవాబ్ షంషుద్దీన్ ఆదేశాల మేరకు, అతని నమ్మకస్థుడైన సేవకుడు మరియు గురితప్పని షూటర్ అయిన కరీం ఖాన్ (కరీం ఖాన్ మేవాటి) 22 మార్చి 1835 సాయంత్రం, ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాకు విలియం ఫ్రేజర్ గుర్రంపై తిరిగి వస్తుండగా, కరీం ఖాన్ అతనిపై తుపాకీతో (కార్బైన్) కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఫ్రేజర్ అక్కడికక్కడే మరణించాడు.

ఈ హత్య బ్రిటిష్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. థామస్ మెట్‌కాఫ్, జాన్ లారెన్స్ వంటి బ్రిటిష్ అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆధారాల ఆధారంగా హంతకుడు కరీం ఖాన్‌తో పాటు కుట్రదారుడైన నవాబ్ షంషుద్దీన్‌ను కూడా బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. 1835 అక్టోబరులో వీరిద్దరినీ ఢిల్లీలో బహిరంగంగా ఉరితీశారు.

ఈ ఘటన 1857 తిరుగుబాటుకు సుమారు 22 సంవత్సరాల ముందు జరిగింది.

 

 

No comments:

Post a Comment