
1899లో, నలంద జిల్లాలోని దేశ్నా देसना గ్రామానికి చెందిన బషీరుల్ హక్ మరియు అబ్దుల్ హకీం అనే ఇద్దరు యువకులు ఒక గ్రంథాలయానికి పునాది వేశారు. పాట్నాకు సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నా గ్రామంలో గ్రంథాలయం స్థాపించిన ఐదు సంవత్సరాల తరువాత, విద్య, జ్ఞానం మరియు సంభాషణకు అంకితమైన 'అంజుమన్ అల్-ఇస్లాహ్ अंजुमन अल-इस्लाह’ ' అనే సంస్థ స్థాపించబడింది.
ఇస్లామిక్ తత్వశాస్త్రంలో ప్రఖ్యాత పండితుడైన సయ్యద్ సులేమాన్ నద్వి, మరియు ప్రఖ్యాత ఉర్దూ రచయితలైన అబ్దుల్ ఖవీ దేశ్నవి, నజీబ్ అష్రఫ్ నద్వి, మరియు షహాబుద్దీన్ అబ్దుర్ రెహమాన్ దేశ్నా గ్రామంలో నివసించేవారు. డేవిడ్ బోయిక్, "సౌత్ ఆసియా" పత్రికలో, దేశ్నా గ్రంథాలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత గురించి, మరియు దానితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి విస్తృతంగా వివరించారు.
దేశ్నా గ్రంథాలయం యొక్క సేకరణను ప్రశంసిస్తూ, 1938లో అబ్దుల్ హక్ దేశ్నా గ్రంథాలయంలోని కొన్ని పుస్తకాలు అరుదైనవి మరియు అమూల్యమైనవి అన్నారు. దేశ్నా గ్రంథాలయాన్ని సందర్శించిన వారి జాబితాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, షఫీ దావూదీ, షౌకత్ అలీ, సయ్యద్ మహమూద్, మరియు ఆచార్య కృపలానీ వంటి ప్రముఖులు ఉన్నారు
అంజుమన్ 1909లో డెస్నాలో ఒక మదర్సాను స్థాపించింది, మరియు తొమ్మిది సంవత్సరాల తరువాత, డెస్నాలో జమియత్ ఉల్-తుల్బా जमीयत उल-तुलबा’ అనే విద్యార్థి సంఘం కూడా ఏర్పడింది. గ్రంథాలయ సహ-వ్యవస్థాపకుడైన అబ్దుల్ హకీమ్, చాలా సంవత్సరాలు దాని నిర్వాహకుడిగా మరియు లైబ్రేరియన్ గా పనిచేశారు.
డెస్నా గ్రంథాలయం అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఎనిమిది వేల పుస్తకాలు, మరియు 150కి పైగా అరుదైన వ్రాతప్రతులతో కూడిన గ్రంథాల విశిష్టమైన సేకరణను కలిగి ఉంది.
స్వాతంత్ర్యం మరియు దేశ
విభజన తర్వాత, గ్రంథాలయం
పరిస్థితి క్రమంగా క్షీణించింది. చివరకు, 1960లో, అప్పటి బీహార్ గవర్నర్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ చొరవతో, దేస్నా గ్రంథాలయం
యొక్క మొత్తం సేకరణను పాట్నాలోని ఖుదా బక్ష్ ఓరియంటల్ లైబ్రరీకి తరలించారు.
గ్రంథాలయ వ్యవస్థాపకుడు బషీరుల్ హక్కు గ్రంథాలయంతో ఎంత గాఢమైన అనుబంధం ఉండేదంటే, ఆయన పదవీ విరమణ
తర్వాత కూడా, పాట్నాలోని ఖుదా
బక్ష్ లైబ్రరీలో దేస్నా పుస్తకాలు ఉంచిన విభాగంలో రోజంతా కూర్చునేవారు.
No comments:
Post a Comment