29 February 2016

ప్రతి ముస్లిం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన 10 మంది మహిళా మణులు


దివ్య ఖురాన్ ప్రకారం స్త్రీ,పురుషులు ఇరువురు సమానులే మరియు ఇరువురు ఒకే జీవి నుండి సృష్టించబడినారు. విద్యార్జన స్త్రీ-పురుషులకు ముఖ్యమైన విధి.(తిర్మిజీ) విద్యను పొందటంలో స్త్రీ-పురుషుల మద్య ఇస్లాం ఎటువంటి విచక్షణ చూపదు. వాస్తవానికి అనేక మంది  ముస్లిం స్త్రీలు ఇస్లాం ప్రారంభ దశలో  విద్య,జ్ఞాన  రంగముల లోని వివిధ విభాగాలలో  మహత్తరమైన సేవలు అంధించినారు. మతశాస్త్రం,సాహిత్యము, విద్య మరియు వైద్య రంగాలలో ముస్లిం స్త్రీలు అసమానమైన ప్రతిభను ప్రదర్శించిరి. మహాప్రవక్త (స) తన కాలంనాటి అన్సార్ మహిళల జ్ఞానశక్తిని, విద్యాపట్ల వారికున్న అబిరుచిని ఎంతొగా కొనియాడినారు.

ముస్లిం చరిత్ర ప్రారంభ దినాలలో స్త్రీలు అనేక రంగాలలో పాల్గొన్నారు, 12వ శతాబ్ధాపు తత్వవేత్త,న్యాయవేత్త ఇబ్న్ రుష్డ్ ప్రకారం ముస్లిం స్త్రీ పురుషులు ఇరువురు సమానులే, ముస్లిం మహిళలు మొదటినుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో తమ సేవలను అంధించేవారు.

అనేక మంది ముస్లిం  మహిళలు విప్లవాత్మక మరియు వీరోచిత నాయకులు గా పనిచేశారు. ఆధునిక యుగములో రాజకీయ రంగములో  స్త్రీ సాదికారికత సాదించిన మహిళలు గా బెనెజీర్ భుట్టో(పాకిస్తాన్), మెగవతి సుకర్నొపుత్రి(ఇండోనేషియా), తన్సు సిల్లర్ (టర్కీ) బేగమ్ ఖలీదా  జియా (బంగ్లాదేశ్)  బేగమ్ హసీనా (బంగ్లాదేశ్) ను పేర్కొన వచ్చును. బంగ్లాదేశ్ మరియు మాలి ప్రస్తుత ప్రధానమంత్రులు గా కొనసాగుతున్న  షేక్ హసీనా వాజీద్, సిసి మరియం కైదమా సిదిబే(Cissé Mariam Kaïdama Sidibé)  ముస్లిం మహిళలు. అదేవిధంగా, కొసావో ప్రస్తుత అధ్యక్షురాలు అతిఫే జహాగా ( Atife Jahjaga) ప్రపంచంలోనే  అతి పిన్న వయస్సు మహిళా అధ్యక్షురాలు, అలాగే ఆమె ఆ దేశం యొక్క మొదటి మహిళా  అధ్యక్షురాలు. 1988 నుండి, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మాలి, పాకిస్తాన్, కొసావో, కిర్గిస్థాన్, సెనెగల్ మరియు టర్కీ, దేశాలలో ముస్లిం మహిళలు విబిన్న కాలాలలో అధ్యక్షురాలు/ప్రధాన మంత్రి గా పనిచేసారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ముస్లిం తెలుసుకోవలసిన (ఏడవ శతాబ్దం నుండి  నేటి  వరకు గల) 10 మంది ప్రధాన ముస్లిం మహిళా మణులు  గురించి పరిచయం చేస్తాను.  ఈ క్రింది 10 మంది అసాధారణ ముస్లిం  మహిళలు తమ నాయకత్వ పటిమతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసారు.

1.నుసైబా బిన్తె కాబ్ అల్ అన్సారియా Nusaybaa Bint ka’b Al- Ansariyah(అరేబియా- 634 C.E.)

I
నుసైబా  ముస్లిం  మహిళల హక్కుల కోసం పాటుపడినారు.  ముఖ్యంగా ఆమె ప్రవక్త ముహమ్మద్(స) అడిగారు "ఎందుకు అల్లాహ్  (దివ్య ఖుర్ఆన్ లో) పురుషులని మాత్రమే  సంబోదిస్తారు??" ఈ ప్రశ్న అడిగిన తరువాత త్వరలో  ప్రవక్త(స) పై ఒక వహి అవతరించినది.  “అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే వారు అయిన స్త్రీ-పురుషుల నిమిత్తం  అల్లాహ్ క్షమాబిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్దపరిచి ఉంచాడు.”-దివ్య ఖురాన్  33:35. అనగా  స్త్రీలు కూడా పురుషుల వలేనే  ప్రతి గుణాన్ని, ప్రాప్తి ని పొందవచ్చు. ఆమె తన కాలం నాటి ఒక అధ్బుతమైన,ముందుచూపు ఉన్న మహిళ గా కొనియాడబడింది.

2.రాబియా బసరి  (717-801):
ఇస్లాం మతానికి చెందిన ప్రముఖ సూఫీ కవయిత్రి, హదీసు విద్యా వేత్త. ఈమె ఒక పేద కుటుంబంలో జన్మించారు. అనాధ  అయిన ఈమె ఆతరువాత బానిస గా అమ్మబడినది. ఈమే మహత్తును గమనించిన యజమాని ఈమెను బానిసత్వం నుండి విడుదల చేసి స్వేచ్చ ప్రసాదించినాడు. ఎడారి లో స్థిర నివాసాన్ని ఏర్పర్చుకొని, వివాహాన్ని త్యజించి, భగవంతుని ఆరాధనలో,సూఫీ తత్వవిచారం లో నిండా మునిగి తేలుతూ తన కాలాన్ని గడిపినారు. ఈమెకు అనేకమంది శిష్యులు కలరు. సూఫీ కవిత్వం లో ఈమె పేరు అజరామరం గా ఉంటుంది

717-801 C.E.)
3.ఫాతిమా అల్-ఫియరి  (మొరాకో-880 C.E.)
,
ఫాతిమా అల్-ఫియరి ప్రపంచంలోని పురాతన పట్టా-ప్రధాన (Degree Awarding) విశ్వవిద్యాలయ స్థాపకురాలు. ఆమెకు వంశపారoపర్యం గా లబించిన ధనంతో ఈమె అల్ క్వరవియ్యన్ మసీదు ను నిర్మించారు. ఈ మసీదు నేడు ఒక విశ్వ విద్యాలయంగా అబివృద్ది చేయ బడింది. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు యునెస్కో వారిచే అతి పురాతన ఉన్నత విద్యా సంస్థగా ఈ విశ్వ విద్యాలయం గుర్తించ బడినది. 

4.రజియా సుల్తాన్  (భారతదేశం, 1205-1240)

తుర్కమాన్ గేట్ ఢిల్లీ సమీపంలోని బుల్బుల్-ఇ-ఖాన్ రజియా సుల్తాన్ సమాధి
రజియా సుల్తాన్ 1236 నుండి 1240 వరకు  ఢిల్లీ సుల్తాన్. భారత దేశ ముస్లిం పాలకుల చరిత్రలో ఆమె మొదటి పరిపాలకురాలు, ఆమె కు సుల్తానా అని పిలవబడటం ఇష్టం ఉండేది కాదు. ఆమె ఒక పురుషుని  వలె దుస్తులు ధరించి మరియు ఒక తలపాగా, ప్యాంటు, కోటు మరియు కత్తి ధరించెది. రజియా సుల్తాన్ మతం యొక్క ఆత్మ దాని భాగాల కంటే మరింత ముఖ్యమైనది అని ఆమె నమ్మేది. ఆమె అనేక ప్రభుత్వ గ్రంథాలయలు,  పాఠశాలలు, విద్వత్ సంస్థలు, పరిశోధనా సంస్థలు, కేంద్రాలను ఏర్పాటు చేసింది.

5.నానా ఆస్మా (నైజీరియా, 1793-1864)

Nana Asma'u (Nigeria, 1793-1864)
నానా ఆస్మా యువరాణి, కవయిత్రి, ఉపాధ్యాయురాలు . ఆమె అరబిక్, ఫుల్ఫుల్దే (Fulfulde), హౌసా మరియు తమచక్(Tamacheq) బాషాలలో  నిష్ణాతురాలు మరియు  అరబిక్, గ్రీక్ మరియు లాటిన్ కావ్యాల లో బాగా ప్రావీణ్యం సంపాదించినది. 1830 లో, ఆమె పేద, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధ్యాయుల బృందంతో పర్యటించి గ్రామీణ పేద మహిళలలో విద్య ను ప్రచారం చేసినది. మహిళా విద్య లో ఆమె ఆఫ్రికన్ మహిళల  గుర్తుగా(symbol) మారింది. నేడు, ఉత్తర నైజీరియాలో అనే ఇస్లామిక్ మహిళా సంఘాలకు , పాఠశాలలకు  మరియు సమావేశ మందిరాలకు  ఆమె గౌరవార్ధం ఆమె పేరు  పెట్టబడినవి.

6.లీలా భక్తియార్ (అమెరికా -1938-ప్రస్తుతం)

లీలా భక్తియార్  యొక్క ఖురాన్ అనువాదం, "ఉత్కృష్టమైన ఖురాన్" (2007), ఒక అమెరికన్ మహిళ చే ఆంగ్లంలోకి దివ్య ఖురాన్ యొక్క మొదటి అనువాదం. ఆమె దివ్య  ఖురాన్ అనువాదం ను అమెరికా లో చాలా మసీదులు మరియు విశ్వవిద్యాలయాలు ఉపయోగిస్తున్నాయి ఆమె అనువాదం ను  మరియు జోర్డాన్ ప్రిన్స్ ఘాజీ బిన్ ముహమ్మద్ ప్రశంశించారు.
 7.షిరిన్ ఇబాడి (ఇరాన్- 1947-ప్రస్తుతం)
2003 లో షిరిన్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి ముస్లిం మహిళ. ఇరాన్ లో న్యాయమూర్తి మరియు ప్రధాన న్యాయమూర్తి స్థానం ను  సాధించిన మొట్టమొదటి మహిళ. న్యాయవాదిగా, షిరిన్ పలు వివాదాస్పద కేసులను స్వీకరిoచారు. ఆమె దృష్టిలో ఇస్లాం  "సమానత్వo మరియు ప్రజాస్వామ్యం ల  యొక్క సామరస్యం” ఇస్లాం ఒక ప్రామాణికమైన వ్యక్తీకరణ. ఇది స్త్రీ ని  బంధించివుంచే మతం కాదు.

8.డాక్టర్ ఆమినా వదూద్ (అమెరికా - 1952-ప్రస్తుతం)


:
2005 లో అమీనా ఒక మిశ్రమ సమాజం(స్త్రీ-పురుష సమూహా) ప్రార్థన కు స్త్రీ ఇమామ్ గా నాయకత్వం వహించినది. అది ఇస్లామిక్ ప్రపంచం లో ఒక దిగ్బ్రాంతిని కలుగ చేసింది. కొoదరు దీనిని ఒక ఒక మేల్కొలుపు మరియు ఇస్లాం మతం యొక్క సమానత్వ మార్గం గా  చూసారు. కొందరు దీనిని విమర్శించారు. అమీనా  ప్రకారం, "ఇస్లాం లో స్త్రీ-పురుషులు ఇరువురు సమాన మనే భావన ఇస్లాం మూల సూత్రం తవహిద్ లో ఉంది. కాబట్టి పూర్తి మానవ గౌరవం సమానత్వం, మహిళలకు ఇవ్వాలని ఇస్లాం మతం చెబుతుంది.

 9.డైసీ ఖాన్ (అమెరికా -1958-ప్రస్తుతం)
Daisy Khan
2005 లో, డైసీ ఖాన్ ఆధ్యాత్మికత మరియు సమానత్వం కోసం ప్రపంచ ముస్లిం మహిళల సంస్థను Women's Islamic Initiative in Spirituality and Equality (WISE), స్థాపించినది.  ఆ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్త  ముస్లిం  మహిళల మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేసింది. ఇంకా 2008 లో  డైసీ ఖాన్  26 దేశాల నుండి ప్రముఖ ముస్లిం మతం మహిళ పండితులు, కార్యకర్తలు, న్యాయవాదులతో  కలసి గ్లోబల్ ముస్లిం మహిళల షూరా కౌన్సిల్ స్థాపించినది. గ్లోబల్ ముస్లిం మహిళల షూరా కౌన్సిల్ యొక్క అభిప్రాయాలు అనేక దేశాల విశ్వవిద్యాలయలకు, న్యాయ విభాగాలకు  తెలియజేసింది. డైసీ ఖాన్  ను ప్రపంచ ముస్లిం కమ్యూనిటీ లోపల ఒక విశ్వసనీయ మానవత్వ మరియు సమాన గొంతుక గా పరిగణించాలి.
10. అనుషే  అన్సారీ (అమెరికా -  1966-ప్రస్తుతం)



 
2006లో అనుషే అన్సారి అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి ముస్లిం మహిళ. తన అంతరిక్ష నౌక నుండి ఆమె ప్రసంగిస్తూ “ప్రపంచవ్యాప్త ముఖ్యంగా పురుషాదిక్యత ఉన్న మద్య ప్రాచ్య దేశాల లోని యువకులు, మహిళలు, యువతులు తమ బంగారు కలలను మర్చిపోవద్దు. వాటిని కొనసాగించండి. అది అసాద్యం అనిపిచవచ్చు, కాని ఆ కలలు తమ హృదయాలలో సుస్థిరంగా ఉంచుకొంటే వాటిని సాకారం చేసుకోవచ్చని నమ్ముతున్నాను” అని అన్నది.
ముగింపు:

ఇస్లాం ప్రకారం స్త్రీ సమాజం లో ఒక అంతర్భాగం. స్త్రీ విద్యాభివృద్ధి ,స్త్రీ సాధికారికత సాదించని సమాజాలు అబివృద్ధిని సాదించలేవు. “స్త్రీ ఉనికి ప్రపంచానికి వెలుగు నిస్తుంది, జీవితమనే సంగీత వాయిద్యం లో స్త్రీ ప్రధాన వాయిద్యం” –మహా కవి ఇక్బాల్. (వుజూద్-ఏ-జన్ సే హై తస్వీ-ఏ-ఖైనాత్ మే రంగ్ / ఇస్సీ కె సాజ్ సే హై జిందగీ క సౌజ్-ఏ-దరున్)-ఇక్బాల్.



జ్ఞాపక శక్తీ ని పెంచే అద్భుతమైన ఏడూ ఆహార పదార్



ఏదైనా ఒక విషయం లో సంపూర్ణత సాదించడానికి ఒక ఆరోగ్యకరమైన మనస్సు మరియు దృష్టి సామర్ధ్యం కలిగి ఉండుట చాలా ముఖ్యం. మనం భౌతికo బాగా చురుకుగా ఉండటానికి మన మానసిక సామార్ద్యం పెంచుకొన వలసి ఉంది. మొత్తం శరీరం ను నియంత్రించే మెదడు యొక్క సరైన సంరక్షణ తీసుకోవాలి.  దానికి మంచి నిద్ర అవసరం అయితే కొన్ని పోషకాలను కూడా  మన  మెదడు కోసం దాని చురుకుతనం మరియు ఏకాగ్రత పెంచడానికి జోడించవచ్చు.
మెదడు జ్ఞాపక శక్తీ ని పెంచే కొన్ని ఆహార పదార్ధాలను పరిశిలించుదాము.
1.    నల్లని చాక్లెట్ (Dark Chocolate) http://doctormurray.com/wp-content/uploads/2013/06/1395483106chocolate_1.jpg

అధిక ఫ్లావర్ గల  కోకో (నల్లని  చాక్లెట్)తినుట వలన  మెదడుకు మెరుగైన రక్త ప్రవాహం అందునని  అధ్యయనాలు వెల్లడించినవి. డార్క్ చాక్లెట్ చిత్తవైకల్యం, మెమొరీ రుగ్మతలను  తగ్గించును. ఇది పలు గంటలు పాటు  మెదడుకు రక్త ప్రవాహం పెంచును.
2. వాల్నట్
http://www.allcropsolutions.com/wp-content/uploads/2014/07/WALNUT.jpg
ఇది మెదడును  పోలి ఉండుటయే కాక  ఏకాగ్రతను పెంచును. దీనిలో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్లు మరియు ఖనిజాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో సహాయకారిగా ఉండును. రోజు గుప్పెడు వాల్నట్స్ తినుట మంచిది.
3.మామిడికాయలు
http://media.mercola.com/assets/images/food-facts/mango-nutrition-facts.jpg
మామిడి భారతదేశం యొక్క జాతీయ పండు. దీనిని పండ్ల లో రాజు అని  అని పిలుస్తారు, మామిడి అన్ని వయసుల వారికి  అభిమాని. ఏకాగ్రత సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలకు బహు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలోని గ్లుటమైన్ యాసిడ్ అనే  రసాయనo  మెదడులోని కణాలను  చురుకుగా ఉంచుతుంది మరియు  జ్ఞాపక  శక్తిని పెంచుతుంది. ఎండా కాలం లో  పండిన మామిడికాయ మరియు మామిడి తాండ్రను  తినటానికి ప్రయత్నించండి.
4. ఆకుపచ్చని   ఆకుకూరలు
http://www.modernreaders.com/wp-content/uploads/2016/01/0117-Greens.jpg
ఇవి విటమిన్ B. యొక్క ఉత్తమ మూలాలు. ఆకు పచ్చదనం సౌబాగ్యనికి చిహ్నం. ఆకు కూరలు సమస్యలను పరిష్కరించటానికి, మెదడు కార్యాచరణ పెంచడానికి, మానసిక  సామర్థ్యాన్ని పెంచడానికి, మూడ్ మెరుగుపరచడానికి సహాయం చేస్తవి. మలబద్దకం ను తగ్గించును. మీ రోజువారీ ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, మరియు ముల్లంగి  చేర్చండి.
5. బెర్రీలు
http://www.hemophiliafed.org/uploads/berries.jpg
ఇవి అంటి-అక్సిడేన్ట్స్ మరియు  విటమిన్ సి తో కూడినవి. స్వల్ప కాల జ్ఞాపక శక్తి కోల్పోవడం అరికట్టును. వయస్సు సంబంధిత జ్ఞాపక శక్తీ  క్షీణత కు కనీసం వారానికి ఒకసారి బ్లూ బెర్రిస్ మరియు స్ట్రా బెర్రిలను తీసుకోవాలి. అల్పాహార తృణ ధాన్యాల (cerels)లోకి వాటిని జోడించవచ్చు.
6. టొమాటోస్
http://assets.inhabitat.com/wp-content/blogs.dir/1/files/2012/06/red-tomato-meteorite.jpg
వీటిని రామ ములగ కాయలు అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. టొమాటోస్ లైకోపీన్ కు గొప్ప మూలం ఇది కొత్త మెదడు కణాల నిర్వహణ మరియు ఉత్పత్తిలో సహాయపడుతుంది. టొమాటోస్ మీ సలాడ్ లో తప్పక ఉండాలి. వాటిని రుచికరమైన సూప్ గా వండుతారు లేదా ఇంట్లో సాస్ వంటి వాటితో  జోడించవచ్చు.
7. ఒమేగా 3 ఫాటీ ఫుడ్స్
http://thescienceofeating.com/wp-content/uploads/2012/02/Book-Omega-3-Sources.jpg
ఒమేగా 3 కొవ్వులు మెదడు లో  60% వరకు ఉన్నవి మరియు ఆరోగ్యకరమైన మెదడు పని తీరులో  కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను  విభిన్న మూలాల నుండి పొందవచ్చు. శాకాహారులు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను  సోయా బీన్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్  మరియు అవిసె నూనె నుండి పొందవచ్చు. ఇతరులు వారి ఆహారంలో కనీసం వారానికి ఒకసారి చేపలు చేర్చవచ్చు. చేప ను ఫ్రై చేయరాదు.  




బెల్లం (గుర్)తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు


బెల్లం లేదా గుర్ శతాబ్దాలుగా భారత సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నది. ఇది చెరుకు రసం లేదా ఖర్జూరం సిరప్ ను వేడి చేయడం ద్వారా తయారుచేస్తారు. శుద్ధి చేసిన చక్కెర ప్రవేశంతో, మన  వంటకాలలో  ఈ అంబర్ రంగు తీపి ని(బెల్లం ను)   సంవత్సరాలుగా తగ్గించారు. అయితే తెల్ల చక్కెర కాకుండా, బెల్లం విలువైన   పోషకాల తో  నిండినది.

బెల్లం లో నల్ల బెల్లం, తాటి బెల్లం, పటిక బెల్లం అనే రకాలు ఉన్నవి. శ్రీరామ నవమి పండుగ రోజున బెల్లం తో చేసిన పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలు సేవిస్తారు. మంగళగిరి పానకాల స్వామికి బెల్లం పానకం నైవేద్యం గా సమర్పిస్తారు. వ్యవసాయదారులు పంట ఇంటికి వచ్చినప్పుడు  కొత్త బియ్యం, బెల్లం తో చేసిన పాయసం చేసుకొంటారు.

రోజువారీ ఆహారంలో బెల్లం వాడకం తో మన ఆరోగ్యానికి ఎన్నో  ఉపయోగాలు ఉన్నాయి:

జీర్ణక్రియకు తోడ్పడును.
బెల్లం ఆహార  జీర్ణక్రియ కు తోడ్పడి  జీర్ణ ఎంజైములను  క్రియాశీలపరుచును. ఇది ప్రేగు కదలికలను క్రమబద్దం చేసి  మలబద్ధకంను  నిరోధిస్తుంది. బెల్లం ముక్క మీద నల్ల మిరియాలు చల్లుకోని విందు తర్వాత ఆరగించిన అది ఉత్తమ ఫలితాలు ఇచ్చును.

రక్తహీనత నిరోధిస్తుంది
బెల్లం రక్తంలోని హెమోగ్లోబిన్ శాతం  పెంచి ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచును తద్వారా  రక్తహీనత ను తగ్గించును. ఇది గర్భిణీ స్త్రీల మీద బాగా పనిచేస్తుంది.

ఎముకల పటుత్వం పెంచును.
బెల్లం లో  అధిక కాల్షియం ఉండుట వలన ఎముకలు దృఢత్వాన్ని పొందును. రుచి కోసం బెల్లం ముక్కలను  సలాడ్లు తో కలిపి తీసుకొన్న శరీర ఆరోగ్యం కాపాడ బడును
.  
వ్యాధినిరోధక శక్తిని పెంచును.
జింక్ మరియు సెలీనియం వంటి అత్యవసర ఖనిజ లవణాలు బెల్లం లో  అధికంగా ఉండటం వలన అంటువ్యాధులకు  వ్యతిరేకంగా వ్యాధినిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. బెల్లం లోని అంటి-అక్సిడేట్స్   వృద్ధాప్య ప్రక్రియ ను మందగింప జేయును. రోజు రెండు టీ-స్పూన్ల బెల్లం ను వెచ్చటి పాలతో కలిపి తీసుకొన్న రోగనిరోధక శక్తి పెరుగును.

ఫ్లూ లక్షణాలు నుంచి ఉపశమనo
బెల్లం ను దగ్గు, జలుబు, మైగ్రేన్ మరియు వాపులను  నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం బెల్లం ను  వెచ్చని నీటితో  లేదా అల్లం టీ తో కలిపి తీసుకోండి.

ఉద్రిక్తతలు సడలించడానికి తోడ్పడును:
నిరాస, నిస్పృహ,మానసిక ఆశాంతి లేదా పీరియడ్స్ కాలం లో  ఇది కండరాల ఉద్రిక్తత ను  సడలిoఛి నరములు   రిలాక్స్ అగుటకు కావలసిన  ఎండార్ఫిన్లు లేదా హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని  ప్రేరేపిస్తుంది

చర్మం ను  కాంతివంతం గా ఉంచును.
బెల్లం చర్మం ను  పోషించును  మరియు మోటిమలు తగ్గించే  అనేక ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉండుట  చర్మం ను ప్రకాశింప జేసి చర్మం ముడుతలు పడకుండా ఉంచును.  ఆరోగ్యకరమైన చర్మం కోసం వారానికి ఒకసారి ముఖం మీద బెల్లం, నువ్వు విత్తనాల  మిశ్రమం పూయవలయును.

 రక్తపోటు ను నియంత్రిస్తుంది
బెల్లం లో ఉండే పొటాషియం మరియు సోడియం కలిగి రక్తపోటు ను వాంఛనీయ స్థాయిలలో ఉంచును. అలాగే, పొటాషియం శరీరంలో నీరు నిలుపుదల సామర్ధ్యం తగ్గించి శరీర బరువు ను తగ్గించును. రోజూ బెల్లం వినియోగించే అలవాటు శరీరo అద్భుతాలు సృష్టిస్తుంది.

Ø గుండె సమస్యలు, బ్లడ్ షుగర్, మధుమేహం మరియు ఊబకాయం ఉన్నవారు బెల్లం వినియోగం లో వైద్యుని సలహా అనుసరించాలి
Ø చక్కెర కు ప్రత్నాయం గా బెల్లం వాడండి కానీ కేవలం పోషక విలువల  కోసం దానిని వాడవద్దు.
Ø సూర్యాస్తమయ సమయం  తరువాత జీవక్రియ(metabolism) రేటు తగ్గును కాబట్టి బెల్లం తో సహా ఏ తీపిని తీసుకోకండి.
Ø   రోజువారీ 2-3 టీ-స్పూన్ ల బెల్లం తీసుకోవడం ద్వారా మంచి లాభాలను పొంద గలరు.