11 April 2017

భారతదేశం లో గోవధ నిషేధం పై మహాత్మా గాంధీ అబిప్రాయాలు

.
ఇటివల భారత దేశం లో మత అసహనం బాగా ప్రబలింది. ఉత్తరప్రదేశ్ లోని దాద్రి లో ముహమ్మద్ అక్లాక్ మరియు ఇటివల రాజస్తాన్ లోని అల్వార్ నేషనల్ హై-వే లో  గో రక్ష దళ సబ్యుల చేతిలో హతం కాబడిన ఫెలు ఖాన్  (Pehlu Khan) దీనికి ఉదాహరణలు. ఈ సందర్భం గా  గో వధ పై భారత దేశ జాతి పిత మహాత్మా గాంధీ అభిప్రాయలు తెలుసుకొందాము.

 “స్వయంగా భావిస్తే తప్ప గోవధ పై నిషేధం విధించామని ఒకరిని నేను ఎలా బలవంత పెట్టగలను? భారత యూనియన్ లో ఒక్క హిందువులు మాత్రమే కాదు ఇక్కడ ముస్లిమ్స్, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు మరియు ఇతర మత సమూహాలు ఉన్నాయి.”

మహాత్మ గాంధీ అంటున్నారు:
రాజేన్ బాబు(భారత దేశ ప్రధమ రాష్ట్రపతి) నాతో అన్నారు “గో వధ పై నిషేధం విధించామని 50వేల పోస్ట్ కార్డులు మరియు  25,000 నుంచి  30,000 ఉత్తరాలు మరియు అనేక వేల టెలిగ్రాములు వారికి వచ్చినాయి అని. నేను వారితో(రాజెన్ బాబుతో) ఈ విషయం లోగడ ప్రస్తావించాను. మళ్ళి ఇప్పుడు ఈ ఉత్తరాల ప్రస్తావన ఎందుకు? వాటి వలన ప్రభావం లేదు”  నా ఇంకో మిత్రుడు కూడా గోవధ  సమర్ధన కు సత్యాగ్రహం మొదలు పెట్టాడు అని  టెలిగ్రాం వచ్చింది.

భారతదేశం లో గో వధ నిషేధించాలని ఎలా చట్టం చేస్తారు? హిందువులు గో వధ పై  నిషేధము విధించామని కోరుకొంటారంటం లో నాకు  సందేహం లేదు. నేను గోవు కు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసాను, కాని నా మతం మిగతా భారతీయుల మతం ఎలా అవుతుంది? ఇది  హిందువులు కాని మిగతా భారతీయులపై బలవంతం ఆగుతుంది.
మనం  మతం విషయంలో ఎటువంటి బలాత్కారానికి ఆస్కారం లేదని మొదటినుంచి అంటున్నాము. ప్రార్ధన లో దివ్య ఖురాన్ ఆయతులు పఠిస్తున్నాము. ఎవ్వరి బలవంతం పై నేను వాటిని వల్లించటం లేదు. “స్వయంగా భావిస్తే తప్ప గోవధ పై నిషేధం విధించామని ఒకరిని నేను ఎలా బలవంత పెట్టగలను? భారత యూనియన్ లో ఒక్క హిందువులు మాత్రమే కాదు ఇక్కడ ముస్లిమ్స్, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు మరియు ఇతర మత సమూహాలు ఉన్నాయి.”

భారతదేశం ప్రస్తుతం హిందువుల భూమి గా మారింది అన్న  హిందువుల భావన తప్పుడు భావన. భారతదేశం ఇక్కడ నివసించే అందరికి  చెందినది. మనము  ఇక్కడ గోవధ నిషేదిస్తూ చట్టం చేస్తే  దానికి రివర్స్ పాకిస్తాన్లో జరుగుతుంది. ఫలితం ఏమి ఉంటుంది? వారు హిందువులు దేవాలయాలు సందర్శించడానికి అనుమతి లేదoటారు కారణం  విగ్రహాలను పూజించటం షరియత్ కు  వ్యతిరేకం అంటారు? నేను ప్రతి రాయి లో దేవుని చూస్తాను  కానీ నా  ఈ నమ్మకాన్ని ఇతరులపై రుద్దలేను? అట్లాని నేను దేవాలయాల సందర్సన ఆపలేదు వాటిని సందర్సిస్తునే ఉన్నాను.  కాబట్టి ఈ టెలిగ్రాములు, ఉత్తరాలు వెంటనే ఆపి వేయండి  వాటి పై డబ్బు వృధా చేయడం  సరైన చర్య  కాదు.

కొoదరు సంపన్న హిందువులు గోవధ ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వారు ఆ పనిని వారు స్వయంగా  చేయుట లేదు. వారు ఆవులను ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలకు పంపి వాటిని వధింప చేసి వాటి మాసంతో చేసిన పాదరక్షలు తిరిగి భారతదేశంనకు పంపుతున్నారు?  నాకు ఒక  సనాతన వైష్ణవ హిందూ మతస్తుడు  తెలుసు. అతను గొడ్డు మాంసం సూప్ తన పిల్లల తిండికి ఉపయోగిస్తున్నాడు. అతను ఔషధంగా గొడ్డు మాంసం వినియోగించడం లో ఏ మాత్రం పాపం లేదని నేను అడిగితే చెప్పాడు.
నిజమైన మతం యొక్క అర్ధం ఏమిటి? గోవధ చట్టం ద్వారా నిషేధించబడాలని కోరుకొంటున్నారా?  గ్రామాల్లో హిందువులు ఎడ్ల-బండ్ల పై ఎడ్లు బరిoచలేనంత భారీ బరువులు తీసుకువస్తారు. అది గోవధ కాదా! ఎడ్లలను హింసించటం కాదా?  అందువలన నేను ఈ విషయం పై రాజ్యాంగ అసెంబ్లీలో ఒత్తిడి చేయకూడదు అని సూచించాను.  
నన్ను అడిగారు:  'ముస్లింలు చేస్తున్న దురాగతాల వలన మనం ఏ ముస్లింలను నమ్మాలి. భారత యూనియన్ లో ముస్లింల పట్ల మన  వైఖరి ఎలా  ఉండాలి? పాకిస్తాన్లో ముస్లిమేతరులు ఏమి చేయాలి? నేను ఇప్పటికే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. పాకిస్థాన్ ముస్లింలకు చెందవచ్చు కానీ భారత యూనియన్ అందరకు  చెందినది.

నా 30 సంవత్సరాల బోధన అసమర్థమైనందుకు విచారం గా  ఉంది.  అహింస పిరికివాని   ఆయుధం అయినoదుకు భాదగా  ఉంది? మనం నిజంగా ధైర్య వంతులయితే ముస్లింలను  ప్రేమించవచ్చు దానివలన తమ భావాలను మార్చుకొని మనకు వ్యతిరేకంగా ముస్లింలు ద్రోహాo చేయరు. వారు ప్రేమ కు బదులు ప్రేమను  పంచుతారు. మనము కోట్ల కొద్ది ముస్లింలను బానిసలుగా ఇండియన్ యూనియన్ లో ఉంచగలమా? ఇతరులను బానిసలను చేసే వ్యక్తి తానూ స్వయంగా బానిస అవుతాడు. కత్తికి కత్తి, లాటి కి లాటి, తన్ను కు తన్ను సమాధానం కాదు?  పాకిస్తాన్ లో కూడా ప్రతిక్రియ అలాగే ఉండవచ్చు. దీనివలన మనం సాధించిన స్వతంత్రం ను త్వరలో కోల్పోతాము.

ఆధారం:
ప్రార్థన ప్రవచనం 25జూలై,1947 – 1.పేజి 277-280- ఫ్రం దికలేక్టేడ్ వర్క్స్ అఫ్ మహాత్మా గాంధీ, వాల్యూం 88, పబ్లిషెడ్ ఆన్-లైన్  బై గాంధీ హెరిటేజ్ పోర్టల్.

గమనిక: గోవధ నిషేధం ప్రశ్న రాజ్యాంగ అసెంబ్లీలో చర్చించారు మరియు గొడ్డు మాంసం వినియోగం పై నిషేధిస్తూ జాతీయ శాసనం వద్దు అని  ఒక ఏకాభిప్రాయం ఉద్భవించింది. దానికి  బదులుగా గోవధ నిషేధం విషయం ఆదేశిక సూత్రాలలో  చేర్చారు




దళిత-ముస్లిం ఐక్యత శంకుస్థాపన చేసిన తొలి ముస్లిం ఉపాద్యాయురాలు ఫాతిమా షేక్

గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాజకీయ చర్చా వేదికలు  మరియు రాజకీయ పార్టీలు భారతదేశం యొక్క అట్టడుగు మరియు అణగద్రొక్కబడిన కమ్యూనిటీ ప్రజలు అయిన దళితులు మరియు  ముస్లింల ఐక్యత గురించి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది - పార్లమెంటరీ రాజకీయాల బయట దళిత-ముస్లిం ఐక్యత సాద్యమవుతుందా? సాద్యమైతే?అది ఎప్పుడుసాధ్యమవుతుంది.

దీనికి సమాధానం మనకు 1850 లో అణగద్రొక్కబడిన వర్గాల విద్య వ్యాప్తి కి కృషి చేసిన ఫాతిమా షేక్, జ్యోతిబా మరియు సవిత్రి బాయి ఫులే దంపతులు చేపట్టిన విద్యా కార్యక్రమాలలో కనిపిస్తుంది.  
 ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి ఫులే

 జ్యోతిబా మరియు సావిత్రి బాయి ఫులే పీడిత కులాలకు చెందిన మహిళలకు బోధన ప్రారంభిoచినప్పుడు  దానికి నిరసన గా   స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. జ్యోతి బా పులే కుటుంబo లక్ష్యంగా దాడులు జరిగాయి మరియు వారికి  వారి కార్యకలాపాలు ఆపివేయడం లేదా ఇంటిని  వదిలివేయడం  ఎంపికగా ఇవ్వబడింది. ఫులే కుటుంభం రెండోవది ఎంచుకున్నారు. 
ఫులే కుటుంబ మరియు సమాజ సభ్యులు వారి ఆశయం కోసం నిలబడలేదు. ఏకాకి అయిన ఫులే దంపతులు తమ జీవితాశయం అయిన పీడిత వర్గానికి చెందిన మహిళలకు విద్యనేర్పడం కోసం ఆశ్రయం కొరకు వెదక సాగరు. ఆ శోధన లో వారికి   పూనే యొక్క గంజ్ పేట్(అప్పటి పూనా గా కూడా పిలుస్తారు)  లో నివసిస్తున్న ఒక ముస్లిం ఉస్మాన్ షేక్, సహకారం లబించినది. ఉస్మాన్ షేక్, ఫులే దంపతులకు  తన ఇంట ఆశ్రయం ఇచ్చినాడు  మరియు తన  ఇంటి ప్రాంగణంలో స్త్రీ-విద్యా పాఠశాల నడుపుటకు అంగీకరించినాడు. 1848 లో ఒక పాఠశాల ఉస్మాన్ షేక్ మరియు అతని సోదరి ఫాతిమా షేక్ ఇంట్లో ప్రారంభించబడింది.
ఆ నాటి పూనా అగ్రవర్ణాల వారు  జ్యోతి బా మరియు సావిత్రి బాయి ఫులే చేపట్టిన  పీడిత వర్గానికి చెందిన మహిళలకు విద్యా ప్రధాన కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నారు మరియు వారి పై అనేక హత్య ప్రయత్నాలు చేసినారు. ఫాతిమా షేక్, ఫులే దంపతుల ప్రతి కార్యక్రమం లో వారికి అండగా ఉండి అడుగడుగున వారికి సహకరించినది.
ఫాతిమా షేక్, సావిత్రి బాయి ఫులే తో కలిసి జ్యోతి బా స్థాపించిన పాఠశాలలో బోధన ప్రారంభించింది. వారికి సగుణ బాయి సహకరించినది. ఫాతిమా షేక్ సోదరుడు, ఉస్మాన్ షేక్  కూడా ఫులే దంపతుల స్త్రీ విద్యా ఉద్యమం తో  ప్రేరణ పొందినాడు. ఆ కాలం నాటి ఆర్కైవ్ ప్రకారం ఉస్మాన్ షేక్, సమాజంలో విద్య వ్యాప్తి కోసం తన సోదరి ఫాతిమా షేక్ ను ప్రోత్సహించినాడు.
జ్యోతి బా ఫులే స్థాపించిన పాఠశాలకు ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి వెళ్ళడం ప్రారంభించినప్పుడు  అగ్రవర్ణాల  వ్యక్తులు వారిని హింసింపజేయడం మరియు తిట్టడం ప్రారంభించారు.  స్త్రీ విద్యకు కృషి చేస్తున్న వారిపై ఆవు పేడ వేయడం మరియు రాళ్లు రువ్వ సాగరు.  ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి వీటికి జంకక తమ కార్యక్రమాలు నిర్భయంగా  కోనసాగించ సాగరు.
ఫాతిమా షేక్ తను చేస్తున్న పనికి ఉబయ వర్గాలు అనగా హిందూ మరియు ముస్లిం వర్గాల నుండి వ్యతిరేకత పొందసాగింది. అయినప్పటికీ ఆమె జంకక ముస్లిం కమ్యూనిటీ సబ్యుల  ఇళ్ళకు ఆ ఇళ్ళ నుండి ఆడపిల్లలను స్కూల్ కు పంపవలసిందిగా వారి తల్లిదండ్రులను  ప్రోత్సహించ సాగింది. అమ్మాయిల ను పంపడానికి అంగీకరించని తల్లితండ్రులకు    ఫాతిమా గంటల కొద్ది కౌన్సిలింగ్ ఇచ్చేది.
19 వ శతాబ్దం మొదటి ముస్లిం మహిళ ఉపాద్యయురాలుగా ఫాతిమా షేక్ ప్రసిద్ది చెందినది దానికి భారతీయ  ముస్లిం కమ్యూనిటీ గర్వపడుతుంది.

ఫాతిమా షేక్ జివీతం-రచనలు గురించి సాహిత్యం అందుబాటులోకి లేనప్పటికీ ఆమె పాత్ర ను ఈ నాటి ప్రభుత్వం గుర్తించినది. 2014 లో ఫాతిమా సంక్షిప్త జీవిత చరిత్ర, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, జాకీర్ హుస్సేన్, అబుల్ కలాం ఆజాద్ తో పాటు బాల భారతి మహారాష్ట్ర రాష్ట్ర స్కూల్ ఉర్దూ పాఠ్యపుస్తకాలలో  చేర్చారు. దీనికి మరాఠా కమ్యూనిటీ నుండి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఆమె 
 మరాఠా ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో స్త్రీ విద్య కోసం ప్రచారం చేసిన ధీర మహిళ.
“దళిత హిస్టరీ మంత్” గా ఏప్రిల్ నెల గుర్తించబడిన   సందర్భంగా, ఇంటర్నెట్ ఆర్కైవ్ 'దళిత చరిత్ర' లో ఫాతిమా షేక్ గురించి వ్రాయబడినది.

ఫాతిమా షేక్ మరియు  సావిత్రి బాయి మధ్య స్నేహం, గౌరవం, దయ మరియు సమాహారం తో కూడినది. సావిత్రి బాయి ఫులే తరచూ తన  ఉత్తరాలలో ఫాతిమా షేక్ ను ఆప్యాయత తో వర్ణించేది. వారి స్నేహం, వారు సమాజం లోని  అట్టడుగు వర్గాల సముద్దరణ కొరకు చేసిన కృషి లో  పునాదిరాయి అయింది.


ముస్లింలు, దళితులు, ఆదివాసీలు మరియు బహుజనుల మధ్య సంబంధాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అది బ్రాహ్మణీయతకు,  అణచివేతకు వ్యతిరేకంగా సాగిన  పోరాటం. సావిత్రి భాయి ఫులే, జ్యోతిరావు ఫులే,  ఫాతిమా షేక్  మరియు దళితులు , ఆదివాసీలు, బహుజన్ సంఘం సబ్యల సంఘీభావం లేదా  "పీడిత జాతి యునిటీ"  కోసం వారు చేసిన కృషికి చిహ్నం గా ఉంది. సమకాలీన సమాజం లో ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ మరియు మతపరమైన అల్పసంఖ్యాకుల పోరాటాలు  బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.

5 March 2017

ప్రపంచం లో అతి వేగం గా విస్తరిస్తున్న మతం ఇస్లాం- ప్యూ సంస్థ వివేదిక లోని ముఖ్య అంశాలు.


జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన అమెరికా కు చెందిన ఫ్యూ(Pew) సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం 2050 నాటికి  ప్రప్రంచం లో  వేగంగా విస్తరిస్తున్న మతం గా ఇస్లాంఅవిర్భవించ బోతున్నది.
Ø 2050 నాటికి క్రైస్తవుల సంఖ్య 290 కోట్లు (తొలి స్థానం)ఉంటుందని, ముస్లింల సంఖ్య 280 కోట్లకు(రెండో స్థానం)చేరుతుందని పేర్కొంది.
Ø మొదటి సారిగా 2050 లో  ప్రపంచ జనాభా లో ఇస్లాం క్రైస్తవం  దాపుకు చేరబోతున్నది. 2070 నాటికి ఇస్లాం క్రైస్తవాన్ని అధిగామించవచ్చు.
Ø ముస్లిం జనాభా లో ప్రతి ముగ్గిరిలో ఒకరు 15 సంత్సర లోపు వారిగా ఉంటారు. ప్రతి ముస్లిం స్త్రీ సగటున 3 పిల్లలను కలిగిఉంటుంది.
Ø  2050 నాటికి ప్రపంచ జనాభా 900కోట్ల కు చేరవచ్చు అప్పట్టికి ప్రపంచ జనాభా లో 1/3వంతు ముస్లింలు ఉంటారు. మరియు  ప్రపంచ జనాభా లో ప్రతి 10 మంది లో ఆరుగురు క్రైస్తవులు + ముస్లిం లు అయి ఉంటారు.
Ø హిందువుల జనాభా కూడా ప్రపంచవ్యాప్తంగా 34 శాతం పెరిగి  140 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచం లో 3వ అతిపెద్ద జనాభా గా హిందువులు ఉంటారు.
Ø 2050 నాటికి భారత దేశంలోని హిందువుల జనాభా 79.5% నుంచి 76.7% కు తగ్గుతుంది,ముస్లిం  జనాభా 18% కు పెరుగుతుంది.
Ø భారత్ హిందూ మెజారిటీ దేశంగానే కొనసాగుతుందని పేర్కొంది..

Ø 2050 నాటికి ప్రపంచ జనాభా లో క్రైస్తవులు 31%, ముస్లింలు 30% ఉంటారు. హిందువులు 14.9% ఉంటారు.
Ø ప్రపంచ వ్యాప్తంగా  నాస్తికుల సంఖ్య 13.2% పెరగనుంది. వీరు బ్రిటన్ లో   అత్యధికం గా ఉంటారు. ఇక బోద్దమత పురోగతి కి అవకాసం లేదు.
Ø ప్రపంచంలో అత్యధిక ముస్లీంలను కలిగిన దేశo గా  2050 నాటికి భారత్ మొదటి స్థానానికి వస్తుందనీ ఆ సంస్థ వెల్లడించింది.
Ø యూరప్ జనాభా లో 10% ముస్లింలు ఉంటారు. ప్రతి పది మందికి ఒకరు ముస్లిం అయి ఉంటారు.
Ø బ్రిటన్ అత్యధిక ముస్లిం జనాభా కలిగిన 3వ దేశం గా మారుతుంది. 2050 నాటికి బ్రిటన్ లో ప్రతి తొమ్మిది మంది లో ఒకరు ముస్లిం గా ఉంటారు.
Ø అమెరికా లో ముస్లిమ్స్ జనాభా పెరిగి  యూదుల కన్న అతి పెద్ద నాన్-క్రిస్టియన్ వర్గంగా రుపొందుతారు.
Ø ప్రపంచ దేశాలలో క్రైస్తవ మెజారిటి కల దేశాల సంఖ్య 151 కు తగ్గుతుంది.
Ø  51 పైగా దేశాల జనాభా లో ముస్లిమ్స్ 50% కి పైగా ఉంటారు.

ముస్లింలు మరియు ఇస్లాంగురించి టాప్10 పుస్తకాలు (Top 10 Books About Muslims And Islam)





ప్రింట్ మీడియా/ఎలెక్ట్రానిక్ మీడియా లో  ముస్లింలు గురించి తప్పుగా రాయడం/చిత్రీకరించడం  కొత్త ఏమీ కాదు.నేడు ప్రపంచంలో, అనేక మందికి ముఖ్యంగా  అమెరికన్లకు ఇస్లాం గురించి తెలియదు. ప్రపంచం లోని అధిక శాతం  మంది ప్రజలు ముస్లింల గురించి తెలుసుకోవాలి అనుకొంటున్నారు. నా ఉద్దేశం లో ముస్లిమ్స్  గురించి చదవడం కన్నా వారిని ప్రతక్షం గా కలవడం ద్వారా మరియు పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి గురించి ఎక్కువ అవగాహన ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు, "ముస్లిం " లేదా "ఇస్లాం "గురించి మార్కెట్ లో అనేక బుక్స్ ఉన్నాయి కానీ అవి ముస్లిమ్స్ గురించిన  నిజాలు వేల్లడించడం లేదు.

నిజానికి ముస్లిమ్స్ గురించి వాస్తవాలు ఉన్నాయన్న బుక్స్ లో కూడా ముస్లిమ్స్ గురించి అనేక ఘోరమైన, అస్పష్టమైన, తప్పుడు చిత్రణలు/అపోహలు  ఉన్నాయి. షరియా అంటే తెలియని వారు లేదా ఇస్లాం మూలా సూత్రాలు గురించి తెలియని వారు వాటి గురించి వ్రాస్తున్నారు. శాంతి మరియు సత్యాన్ని చాటే ఇస్లాం ను అనుసరించే కొన్ని బిలియన్ల విశ్వాసకుల(muslims) గురించి సత్యాన్ని తెలిపే బుక్స్ అతి తక్కువ గా  ఉన్నాయి. నా ద్రుష్టి లో ఇస్లాం గురించి సరిఅయిన  అవగాహన మరియు సత్యాన్ని తెలపడం  లో క్రింది 10 పుస్తకాలు సఫలం అయినాయి.

అమెరికన్లు లేదా ఇతరులు ముస్లింల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే 10 అత్యుతమ ఆంగ్ల బుక్స్ ఇక్కడ ప్రస్తావిస్తాను.ముస్లింలు మరియు ఇస్లాం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే క్రింది పుస్తకాలు చదవవచ్చు.

నా అభిమాన జాబితాఈ క్రింది విధం గా  ఉంది

1.నో గాడ్ బట్ గాడ్ (No God but God) : దిని రచయిత రెజా అస్లాన్. రెజా అస్లాన్రచన పాత పుస్తకం కాని దీని ద్వారా ఇస్లాం యొక్క మూలాలు గురించి తెలుసుకొవచ్చు. ఇస్లాం యొక్క ఆరంభం, లో ముస్లింలు ఎల్లా ఉన్నారు? వారు ఇస్లాం ప్రపంచవ్యాప్తం గా విస్తరించినప్పుడు రాజకీయంగా, సంస్కృతి మరియు విశ్వాసపరంగా  ఎటువంటి మార్పులకు లోను అయ్యారో ఈ పుస్తకం వివరంగా తెలుపుతుంది. ఈ పుస్తకం నా అభిమాన పుస్తకం ఇందులో అస్లాన్ తన భావాలు పండితుడు గా వివరించినాడు కానిఒక ముస్లింగా రాయలేదు.


2. దిగ్రేట్ తెఫ్ట్(The Great Theft): దిని రచయిత ఖలేద్ అబౌ ఎల్ ఫద్ల్ (KHALID Abou El Fadl). ఇతడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు హేతుబద్ధ ఆలోచన నుండి తీవ్రవాదులు గా మారిన విధానపు సాహిత్య వివరణలు,తీవ్రవాదం మరియు కొన్నిసార్లు హింస కు పాల్పడిన విధానం గురించి  విపులం గా తన పుస్తకం లో వివరించినాడు.  నేడు కొన్ని ముస్లిం దేశాలలో చూస్తున్న రాజకీయ తిరుగుబాట్లు  మరియు విప్లవ సిద్దాంతాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన మార్గం.


3. జేనేరేషణ్ ఎం.(Generation M) : దీని రచయిత సెలినా జన్ మొహమేద్: ఈమె తన  పుస్తకం లో ప్రపంచవ్యాప్తం గా ముస్లిం యువత - ఆలోచన, వారి అనుభూతి మరియు వారిని నేడు ప్రపంచంలో ఏకైక శక్తిగా చేస్తున్న విధానం పై ఒక సర్వే ఉంది.వారు మతపరమైన మిల్లినియల్స్ గా రుపోoదుతున్న విధానం మరియు వ్యవస్థాపకత, సాంకేతిక, ఫ్యాషన్, ఆహారము, వినిమయతత్వం, వాతావరణ మార్పు పై వారి ఆలోచనలు చిత్రీకరించారు.


4. ది స్టొరీ ఆఫ్ఖురాన్ (The Story of the Quran)దిని రచయిత ఇంగ్రిడ్ మట్ట్సన్. ఇది ఒక చిన్న పుస్తకం. కానీ అది ఇస్లాం యొక్క పవిత్ర పుస్తకంఖురాన్ యొక్కమత, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాముఖ్యత ను  స్పష్టం చేస్తుంది. ఈ పుస్తకం ఒక ముస్లిం జీవితంలో దివ్య ఖురాన్ వహించే పాత్ర ఏమిటి, దానిని ఎవరు రాసినారు, అతడి పట్ల మన  భావాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు విపులంగా ఒక మతవేత్త మరియు టీచర్ అయిన మట్ట్సన్ సమాధానములు చెప్తారు.


5.ముహమ్మద్ ఎ ప్రోఫెట్ అఫ్ అవర్ టైం(Muhammad: A Prophet for Our Time) : ఈ పుస్తక రచయిత్రి కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్. ఈమెముస్లింలందరు  గౌరవించే వ్యక్తిప్రవక్త (స) జీవితచరిత్రను తన పుస్తకం లో వివరించారు. ఇది అందరు  తప్పక చదవ వలసిన పుస్తకం.కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ఇస్లాం గురించి అనేక పుస్తకాలు రాశారుమరియు అన్ని పఠన యోగ్యం అయినవి.ప్రవక్త(స) గురించి చాలా మంది కి  తెలియదు వారికి ఇది  ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాలం,మత విశ్వాసాలతో పని లేని చాలా అవసరమైన నిష్పాక్షికమైన, చారిత్రక గ్రంధం.


6.1001 ఇన్వెన్షన్స్(1001 Inventions): దీని రచయిత సలీం అల్ హస్సన్ని. ఈ పుస్తకం ముస్లిం నాగరికత యొక్క వికాసాన్ని తెలుపుతుంది. ముస్లింలు ప్రపంచానికి అందించిన అవిష్కరణలను  వివరించే గ్రంధం.  ఇది ఇస్లాం విమర్శకుల దృక్పదాన్ని మార్చుతుంది.  ఇది ఒక నేషనల్ జియోగ్రాఫిక్ ప్రెజెంటేషన్ మరియు కిడ్స్ వెర్షన్ కూడా కలిగి ఉంది. ముస్లిముల రూపొందించబడి నేటికీ ఉపయోగంలో ఉన్నఅమూల్యమైనవివిధ శాస్త్రీయ మరియు సాంకేతిక ఆవిష్కరణలను చూపును.




7.సర్వెంట్స్ అఫ్ అల్లాహ్ (Servants of Allah): దీని రచయిత సిల్విన్ ఎ. దియోఫ్ఫ్. ఇది ఆఫ్రికా ముస్లింలను గురించి తెల్పును. ఇది అమెరికా లో ఆఫ్రికన్ బానిసలతో ఇస్లాం యొక్క రాక మరియు మతపరమైన మనుగడ కోసం వారు చేసిన పోరాటం యొక్క పరిశోధనా అంశాలను అందిస్తుంది.



8.ముస్లిమ్స్ అండ్ ది మేకింగ్ అఫ్ అమెరికా (Muslims and the Making of America):
ఇది అమీర్ హుస్సేన్ చే అమెరికా లోని ముస్లిమ్స్ పై విబిన్న దృక్పదం తో రాయబడిన మరొక పుస్తకం. అమెరికన్ పాపులర్ కల్చర్ లో భాగం గా సంగీతం, రాజకీయాలు, నిర్మాణం మరియు స్పోర్ట్స రంగాలలో అమెరికన్ ముస్లిమ్స్ వహించిన మరుపురాని పాత్రను వివరిస్తుంది.  ఇది ఒక చిన్న పుస్తకం కాని  అత్యంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది.


9.ఐ స్పీక్ ఫర్ మైసెల్ఫ్(I Speak for Myself):ఇది  విశ్వాస ప్రయాణంలో తమ అనుభవాలను గురించి 40 మంది అమెరికన్ ముస్లిం మహిళలు రాసిన ఒక వ్యాసాల సిరీస్.వారి మతం ఒకటే కావచ్చు, వారి వ్యక్తిగత కధనాలు, నేపథ్యాలు బిన్నంగా కలవు. వాటిని ఇస్లాం యొక్క నేపద్యంలో సుందరంగా చిత్రించారు. అమెరికన్ ముస్లిం పురుషుల గురించిన  ఒక భాగస్వామ్య  వ్యాస సేకరణ కూడా ఉంది.


10.ది ఫియర్ అఫ్ ఇస్లాం (The Fear of Islam):


రచయిత టాడ్ హెచ్ గ్రీన్. ఈ పుస్తకం లో ఇతను  పాశ్చాత్యదేశాల్లో ప్రబలంగా ఉన్న ఇస్లామోఫోబియా యొక్క పరిచయం లేదా ముస్లింలoటే ఉన్న అకారణ భయం గురించి వివరించాడు. ఇది ఇస్లామోఫోబియా యొక్క మూలాల నుండి ప్రస్తుత సమస్యలకు వరకు ఉన్న ఒక సమగ్ర రీడర్ లేదా మీడియా సాధారణీకరణలు అర్ధం చేసుకోవటానికి  సాయపడును.