31 July 2025

సూఫీ సంగీతకారులు

 

 

ఆధునిక కాలంలో అత్యుత్తమ సూఫీ  సంగీత గాయకురాలుగా పాకిస్తాన్ కు చెందిన “అబిదా పర్వీన్”   అత్యంత ప్రముఖ్యత పొందినది. “సనమ్ మార్విSanam Marvi” అనే మరో పాకిస్తానీ గాయని ఇటీవల తన సూఫీ సంగీత  గాత్ర ప్రదర్శనలకు గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మ్యూజిక్ కంపనీ “సోల్ స్పీక్స్ Soul Speaks”  యజమాని  అస్రార్ షా Asrar Shah లాహోర్ ఆధారిత “కోక్ స్టూడియో పాకిస్తాన్ Coke Studio Pakistan” లో తన సూఫీ సంగీత ప్రదర్శనలకు ప్రజాదరణ పొందినాడు.

ఆస్కార్ విజేత అయిన ఇండియన్ సంగీతకారుడు A. R. రెహమాన్, సూఫీ సంగీత కళా ప్రక్రియల  నుండి ప్రేరణను పొంది అనేక ఖవ్వాలి సిని గీతాలకు సంగీత కూర్పు చేసినాడు.

భారత దేశం లో హన్స్ రాజ్ హన్స్, కైలాష్ ఖేర్,బంగ్లాదేశ్ లో రునా లైనా అనేక సూఫీ గీతాలను పాడారు.

బంగ్లాదేశ్ గాయకుడు లాలాన్ ఫకీర్ మరియు బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం అనేక సుఫీ పాటల కర్తలు.

పాకిస్తాన్ నుండి వచ్చిన బ్యాండ్ “జునూన్”, ఆధునిక హార్డ్ రాక్ మరియు సాంప్రదాయ జానపద సంగీతాన్ని సూఫీ  కవిత్వంతో కలపడం ద్వారా కొత్త ఉరవడిని సృష్టించింది.

శంకర్-శంభు మరియు నస్త్రత్ ఫతే అలీ ఖాన్, రహత్ ఫతే అలీ ఖాన్ సుప్రసిద్ద సూఫీ సంగీత కారులు.

2005 లో, రబ్బీ షేర్గిల్Rabbi Shergill "బుల్ల కి జానాBulla Ki Jaana" అని పిలవబడే సూఫీ రాక్ పాటను విడుదల చేశాడు. ఇది భారతదేశం మరియు పాకిస్థాన్లలో జనరంజకం అయినది.

మడోన్నాMadonna, తన  1994 రికార్డు “బెడ్ టైం స్టోరీస్Bedtime Stories, లో, "బెడ్ టైం స్టొరీBedtime Story " గా పిలువబడే ఒక పాట పాడింది.ఆ పాట వీడియో అనేక డర్విష్ డ్యాన్స్, అరబిక్ నగీషీ వ్రాత Arabic calligraphy మరియు కొన్ని ఇతర సూఫీ రీతులను చూపుతుంది.  మడోన్నా 1998 లో పాడిన పాట "బిట్టెర్ స్వీట్ Bittersweet " లో అదే పేరుతో ఉన్న  “రూమి” యొక్క కవితలను చదువుతుంది. తన  2001 ద్రౌండ్ వరల్డ్ టూర్ Drowned World Tour లో, మడోన్నా ఒక సూఫీ నృత్యంతో సహా పలు మతాల ఆచారాలను చూపించే పాట "సీక్రెట్ Secret " పాడింది.

గాయకుడు-పాటల రచయిత అయిన లూరీనా మక్కెనిట్Loreena McKennitt's ది మాస్క్ అండ్ మిర్రర్The Mask and Mirror (1994) అనే చిత్రం లో పాడిన  "ది మిస్టిక్స్ డ్రీమ్ The Mystic's Dream " అనే పాటను సూఫీ సంగీతం మరియు కవిత్వం ప్రభావితం చేసింది.

“మీ వితౌట్ యు me without You” అనే బ్యాండ్ వారి ఆల్బమ్ “ఇట్స్ ఆల్ క్రేజీ!ఇట్స్ అల్ ఫాల్స్! ఇట్స్  ఎ డ్రీమ్! ఇట్స్ ఆల్రైట్It's All Crazy! It's All False! It's All a Dream! It's Alright (2009)” లో కొన్ని సూఫీ కథల  ఉపమానాలు Sufi parables ఇచ్చారు.  టోరి అమోస్ అనే ఆమె తన  పాట "క్రూయల్ Cruel " లో సూఫీల గురించి ప్రస్తావించినది.

మెర్కాన్ డేడ్ Mercan Dede ఒక టర్కిష్ స్వరకర్త, మెర్కాన్ డేడ్ సూఫీతత్వం ను తన సంగీతం మరియు ప్రదర్శనలలో  చేర్చుతాడు.

షోరే మోవేనియన్Shohreh Moavenian, అనే ఆమె ఇరానియన్ గాయకురాలు. షోరే అనేక   రూమి యొక్క కవితలను గానం చేసింది. షోరే "మౌలానా  & షోర 1 మరియు 2 Moulana & Shora 1 and 2" " అనే పేరుతో రెండు ఆల్బమ్స్ తయారు చేసింది. ఇందులో షోరే పాప్ మరియు సాంప్రదాయ పర్షియన్ సంగీత రీతులను మేళవించినది.  

సూఫీ మ్యూజిక్ మరియు బాలీవుడ్

1940 ల నాటికి, ఖవాలి హిందీ చిత్రాల్లోకి ప్రవేశించింది. “తేరి  మెహ్ఫిల్ మె  కిస్మత్ (మొఘల్-ఎ-ఆజం, 1960), నా తో  కర్వా కి తలాష్ హైన్ (బార్సాత్ కి రాత్, 1960) చాంది కా బాదాన్ (తాజ్ మహల్, 1963) మొదలైన పాటలు  ఈ తరహా జనరంజకత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి.

ఆస్కార్ విజేత A. R. రెహమాన్, చేసిన ఖవ్వాలి సిని గీతాలలో  జోదా అక్బర్ చలన చిత్రం లోని  “ఖ్వాజా మేరే ఖ్వాజా Khwaja Mere Khwaja” అనే గీతం, “ఫీజా” చిత్రం లోని “పియాహాజీ అలీ Piya Haji Ali in Fiza 2000”అనే గీతం  “ఢిల్లీ 6” అనే చలన చిత్రం లోని  “అర్జియాన్ Arziyan” మరియు రాక్ స్టార్Rockstar చిత్రం  లోని “కున్ ఫయా కున్ Kun Faya Kun” అనే గీతం ప్రసిద్ది చెందాయి.నిజంగా, దైవికకు ఖవ్వాలి ఒక ఆధ్యాత్మిక కనెక్షన్.

 

 

 
 

 

 

 

 

 

28 July 2025

శతాబ్దపు చరిత్ర గలిగిన అలీఘర్‌ ఎడ్యుకేషనల్ బుక్ హౌస్‌ Century old Educational Book House of Aligarh

 

 

అలీఘర్ లోని ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ (EBH), సాహిత్యం మరియు అభ్యాస వ్యాప్తికి ఒక విశిష్ట సంస్థగా నిలుస్తుంది 1925లో స్థాపించబడిన ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH జాతీయంగా మరియు అంతర్జాతీయంగా గ్రంథకర్తలు, పండితులు మరియు సాహిత్య వర్గాలలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. గత వంద సంవత్సరాలుగా, ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH అలీఘర్ యొక్క సాహిత్య మరియు విద్యా రచనలను విస్తృత ప్రేక్షకులకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది, దాని వారసత్వం నేటికీ కొనసాగుతుంది. పుస్తక ప్రచురణ చరిత్రలో ఉర్దూ భాష మరియు సాహిత్య అభివృద్ధి మరియు ప్రోత్సాహానికి ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH సహకారం చాలా ముఖ్యమైనది

అలీఘర్‌లోని బుక్ హౌస్ EBH యొక్క చారిత్రక మూలాలు:

1888 లోనే, సర్ సయ్యద్ తన విద్యా సంస్థల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు సేవ చేయడానికి అలీఘర్‌లో ఒక పుస్తక దుకాణాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థులు మరియు అధ్యాపకుల అవసరాలను తీర్చగల అంకితమైన పుస్తక దుకాణం అవసరాన్ని తీర్చడానికి, మీరట్‌కు చెందిన MAO కళాశాల పూర్వ విద్యార్థి అబ్దుల్ షాహీద్ ఖాన్ 1925లో ఆలీఘర్, ఫుల్లర్ రోడ్ సమీపంలో, తస్వీర్ మహల్ కు దగ్గరగా ఒక చిన్న స్టేషనరీ దుకాణాన్ని ప్రారంభించి, ఆ సంస్థకు ""ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ " అని పేరు పెట్టారు,

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ అలీఘర్ సాహిత్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల విద్యా ఆకాంక్షలకు మద్దతుగా, సరసమైన మరియు అందుబాటులో ఉన్న విద్యా పుస్తకాలు మరియు స్టేషనరీలను అందించడo ప్రారంభించినది.

1929లో ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH ఆలిఘర్  నగరం లోని షంషాద్ మార్కెట్ కు మార్చబడినది.  ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ విద్యా మరియు సాహిత్య సామగ్రిని కోరుకునే విద్యార్థులు మరియు పండితులకు కేంద్ర బిందువుగా మారింది. ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH దుకాణం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సాహిత్య ఔత్సాహికులకు విద్య మరియు సంస్కృతి కేంద్రంగా మారింది

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH ప్రచురించిన  తొలి రచనలు:

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే, ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH పిల్లల మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర, భాషాశాస్త్రం మరియు శాస్త్రాలపై రచనలను ప్రచురించినది.  

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH గుర్తించదగిన ప్రారంభ ప్రచురణలు:

నజారా మీరట్ సంపాదకత్వo లో M. A. హమీద్ అలీగ్ (1935)   రచించిన “కైనత్ అదాబ్”, అహ్సన్ మారెహ్రావి రాసిన “అహ్సన్-ఉల్-ఇంతిఖాబ్”, M. A. షాహిద్ రచించిన “మఖ్‌జాన్ అదాబ్”, అబ్దుల్ జలీల్ కిద్వాయ్ రచించిన సుఖ్నా నౌ”, “హుస్న్-ఇ-ఇంతిఖేల్ కిద్” మీర్జా ఫర్హతుల్లా బేగ్ రచించిన డిల్లి కా ఏక మదర్ అఖిరి ముషైరా”, సయ్యద్ ఇన్షాల్లా ఖాన్ ఇన్షా రచించిన “దస్తాన్ రాణి కేత్కీ ఔర్ కన్వర్ ఉదయ్ భాన్ కి”, ముసరత్ జమానీ రచించిన “బచ్చోన్ కి తర్బియా”, మోల్వి షమ్సాల్ మరియు మౌలానా అబ్దుస్సాల్ మొదలైన వారు రచించిన అల్-అకీడా అల్ హస్నా “Al-Aqeedah Al-Hasna” .

స్వాతంత్ర్యానంతర కాలంలో ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH గుర్తించదగిన ప్రచురణలు

1947లో భారతదేశ విభజన సమయం లో అబ్దుల్ షాహీద్ ఖాన్ అలీఘర్‌లోనే ఉండటానికి ఎంచుకున్నాడు. 1951లో ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH షంషాద్ మార్కెట్ నుండి కాన్ఫరెన్స్ మార్కెట్‌కు విస్తరించినది.  

స్వాతంత్ర్యానంతర కాలంలో, ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH తన ప్రచురణ కార్యకలాపాలను మరింత విస్తరించింది. భారతదేశ రాజకీయ వ్యవస్థ మరియు రాజ్యాంగాన్ని విశ్లేషించిన డాక్టర్ హషీమ్ కిద్వాయ్ రాసిన  ఝమూరియా హింద్“Jhamooriya Hind” ” (1951)తో సహా భారత రాజకీయాలు మరియు పాలనపై ప్రభావవంతమైన శీర్షికలను ప్రచురించింది. డాక్టర్ హషీమ్ కిద్వాయ్ రాసిన ఝమూరియా హింద్ కాకుండా,: ముబాదియత్ ఇల్మ్ మద్నియాత్ (1951), దునియా కే హుకూమటైన్ (1961), ముబాది సియాసియాత్ (1971), తారీఖ్-ఎ-అఫ్కర్ సియాసి (1982), ఉసూల్-ఇ-తమ్మద్దున్, ఉసూల్-8 (1988) మొదలైన గ్రంధాలు  ప్రచురించినది. వీటిని బీహార్ ప్రభుత్వ అభివృద్ధి మంత్రి డాక్టర్ సయ్యద్ మహమూద్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ హరూన్ ఖాన్ షేర్వానీ చాలా ఇష్టపడ్డారు.”

ఉర్దూ విద్య మరియు సాహిత్యానికి ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH మద్దతు ఇవ్వడం:

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH యొక్క లక్ష్యంలో ఒక ముఖ్యమైన అంశం ఉర్దూ భాష మరియు విద్యను ప్రోత్సహించడం. ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH జామియా ఉస్మానియా, హైదరాబాద్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం మరియు జామియా ఉర్దూ, అలీఘర్ వంటి సంస్థలకు పాఠ్యపుస్తకాలను అందించింది. ఉర్దూ సాహిత్యం మరియు భాషాశాస్త్రానికి ప్రాధాన్యతనిచ్చే పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం  ఉపాధ్యాయులతో కలిసి పనిచేసింది. ఈ మద్దతు పాండిత్యం మరియు సంస్కృతికి సంబంధించిన భాషగా ఉర్దూ అభివృద్ధిని నిలబెట్టడానికి మరియు పెంపొందించడానికి సహాయపడింది.

1968లో అబ్దుల్ షాహీద్ ఖాన్ మరణం తరువాత, అబ్దుల్ షాహీద్ ఖాన్ కుమారులు, అసద్ యార్ ఖాన్ (జననం 1941, AMUలో గుర్రపు స్వారీ కెప్టెన్‌గా అనేక సంవత్సరాలు పనిచేసినందున కప్తాన్ సన్యాసిగా ప్రసిద్ధి చెందారు) మరియు అహ్మద్ సయీద్ ఖాన్ (జననం 1948, అందరికీ ఆప్యాయంగా భయ్యా) నాయకత్వంలో, EBH ఉపఖండంలో అత్యంత గౌరవనీయమైన ఉర్దూ ప్రచురణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఖాన్ సోదరులు ముద్రణ నాణ్యతను పెంచారు, ప్రముఖ కవులు, పండితులు మరియు రాజకీయ ఆలోచనాపరుల రచనలను చేర్చడానికి ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH కేటలాగ్‌ను విస్తరించారు.

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH చే ప్రముఖ రచయితల రచనల  ప్రచురణ:

ఇక్బాల్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఖలీఫా అబ్దుల్ హకీమ్ మరియు గులాం సర్వర్ వంటి ప్రముఖ సాహితీవేత్తల రచనలు ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH ద్వారా ప్రచురించబడ్డాయి మరియు ప్రచారం చేయబడి ఉర్దూ సాహిత్య పునరుజ్జీవనానికి గణనీయంగా దోహదపడ్డాయి.

వజీర్ అఘా, అబు లైస్ సిద్ధిఖీ, హసన్ అస్కారీ, మసూద్ హుస్సేన్ ఖాన్, అక్తర్ అన్సారీ, సయ్యద్ అబ్దుల్లా, ఖలీఖ్ అహ్మద్ నిజామీ, ముహమ్మద్ హషీమ్ కిద్వాయ్, వకార్ అజీమ్, మజ్నూన్ గోరఖ్‌పూర్, అతీఖ్ అహ్మద్ సిద్ధిఖీ, ఇబాదత్ బరేలి,రెజా అలీ ఆబిది,  కుర్రతుల్ అయిన్ హైదర్, ఆల్-ఎ-అహ్మద్ సురూర్, ఖుర్షీద్-ఉల్-ఇస్లాం, అబ్దుల్ ఖాదిర్ సర్వరీ, వహీద్ ఖురైషీ, జహీర్ అహ్మద్ సిద్ధిఖీ, ఖదీజా మస్తూర్, జియావుద్దీన్ అల్వీ, అబ్దుల్ ముఘ్ని, ఎ.ఎ. హష్మీ, రషీద్ హసన్ ఖాన్, మసూద్ హసన్ ఖాన్, మసూద్ హసన్ రిజ్వీ, షహర్యార్, మంజార్ అబ్బాస్ నఖ్వీ, మీర్జా ఖలీల్ బేగ్, అబుల్ కలాం ఖాస్మీ, ఇఫ్తికార్ ఆలం ఖాన్, అస్గర్ అబ్బాస్, సుర్రాయ హుస్సేన్, సగీర్ అఫ్రహీం మొదలైనవారి యొక్క రచనలను కూడా ప్రచురించింది.,.

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH సాహిత్య పత్రిక “అల్ఫాజ్”: ఒక సాంస్కృతిక మైలురాయి:

1975లో, అసద్ యార్ ఖాన్ ఉర్దూ సాహిత్యానికి అంకితమైన సాహిత్య పత్రిక “అల్ఫాజ్”ను ప్రారంభించారు. ప్రారంభంలో అబుల్ కలాం ఖాస్మీ సంపాదకత్వం వహించిన అల్ఫాజ్ కవిత్వం, సాహిత్య విమర్శ మరియు సాంస్కృతిక సంభాషణలకు కీలకమైన వేదికగా మారింది.

“అల్ఫాజ్ పత్రిక సంపాదక మండలిలో ఖుర్షీద్-ఉల్-ఇస్లాం, ఖలీల్-ఉర్-రెహ్మాన్ అజ్మీ మరియు నసీమ్ ఖురేషి వంటి ప్రముఖ పండితులు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, “అల్ఫాజ్” ఉర్దూ సాహిత్యాన్ని పెంపొందించడంలో, కొత్త ప్రతిభను పెంపొందించడంలో మరియు ఉర్దూ భాష మరియు ఆలోచన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించినది. .

2016లో, EBH అలీఘర్ జర్నలిజంపై "అలీఘర్ కే ఉర్దూ సహఫత్“Aligarh Ke Urdu Sahafat”" పుస్తకం ను ప్రచురించింది.

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH శతాబ్ద సేవా వేడుకలు:

నేడు, ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH దాని వంద సంవత్సరాల ఉనికిని జరుపుకొని అలీఘర్ యొక్క మేధో మరియు సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా నిలుస్తుంది. ఉర్దూను ప్రోత్సహించడానికి, విద్యకు మద్దతు ఇవ్వడానికి మరియు సాహిత్య నైపుణ్యాన్ని పెంపొందించడానికి EBH చేసిన ప్రయత్నాలు చెరగని ముద్ర వేశాయి.


భవిష్యత్తుకు ఒక వారసత్వం:

ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH ఒక శతాబ్దపు అద్భుతమైన సేవను జరుపుకుంటున్న సందర్భంగా, మొత్తం సమాజం దాని భవిష్యత్ ప్రయత్నాలకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.గత వంద సంవత్సరాలుగా ఎడ్యుకేషనల్ బుక్ హౌస్ EBH ప్రయాణం జ్ఞానం, సంస్కృతి మరియు భాష పట్ల అంకితభావానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.