హైదరాబాద్, తెలంగాణ
:
ఖగోళ శాస్త్రాన్ని ఒకప్పుడు శాస్త్రాల రాణి అని
పిలిచేవారు. మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ చిన్నతనం నుంచి ఉల్కల పట్ల మక్కువ పెంచుకొన్నాడు.మొహమ్మద్
అబ్దుర్ రెహమాన్ ఖాన్ ప్రముఖ శాస్త్రీయ పత్రిక అయిన ‘నేచర్’లో పది పత్రాలు మరియు
నివేదికలను ప్రచురించాడు. ఖాన్ ఉస్మానియా కళాశాలలో బోధించేవాడు..
1940ల
చివరి నాటికి, ఖాన్ అంతర్జాతీయ శాస్త్రీయ సమాజానికి
సుపరిచితుడు అయ్యాడు. నేచర్ మరియు ఇతర శాస్త్రీయ ప్రచురణలకు గాను ఖాన్ రాయల్
ఆస్ట్రోనామికల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యాడు మరియు న్యూ మెక్సికో
విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటోరిటిక్స్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా
నియమించబడ్డాడు. 1936లో మరియు మళ్ళీ 1948లో యునైటెడ్ స్టేట్స్‌లో సొసైటీ ఫర్
రీసెర్చ్ ఆన్ మెటోరైట్స్ వార్షిక సమావేశాలలో పత్రాలను సమర్పించడానికి ఖాన్‌ను
ఆహ్వానించారు.
ఖాన్‌కు ఉల్కలంటే మక్కువ. 1880ల చివరలో హైదరాబాద్‌లోని
మదర్సా-ఇ-అలియాలో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఖాన్ వాటిపై ఆసక్తి
పెంచుకున్నాడు. 1910లో హాలీస్ కామెట్ రాకతో ఆస్ట్రల్
దృగ్విషయాలపై ఖాన్ ఆసక్తి తిరిగి పుంజుకుంది మరియు సర్ జాన్ హెర్షెల్ రాసిన
ఆస్ట్రానమీ అవుట్‌లైన్స్‌ను ఉర్దూలోకి అనువదించడం ప్రారంభించాడు.
ఖాన్ రాత్రిపూట ఆకాశాలను క్రమపద్ధతిలో
పరిశీలించడం ప్రారంభించాడు. 1940లో, 60 సంవత్సరాల వయస్సులో, ఖాన్ ఆ సంవత్సరం 152 రాత్రులలో మొత్తం 103.25 గంటలు ఆకాశాలను పరిశీలించానని నేచర్‌కు
నివేదించాడు. ఫలితంగా, ఆ ఒక్క సంవత్సరంలోనే, ఖాన్ 1390 ఉల్కల మార్గాలను గమనించి మ్యాప్ చేశాడు.
వ్యక్తిగత పరిశీలనలతో పాటు, ఖాన్ ఇతర అమెచ్యూర్ పరిశీలకుల పరిశీలనలను
కూడా సేకరించేవాడు. అభిరుచి గలవారిని అనుసంధానించి, వారిని డేటా సేకరించేవారుగా మార్చడం, అంటే, శాస్త్రీయ జ్ఞాన విశ్లేషణ లో సామాన్య
పౌరులను చేర్చడం కూడా చేసేవాడు..
ఖాన్ 1934లో ఔరంగాబాద్ జిల్లాలోని ఫుల్మారి
గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పొలంలో పడిపోయిన ఏరోలైట్ aerolite ను సేకరించాడు.మరికొన్ని సమయాల్లో, ఒక ప్రాంతంలో పాత ఉల్కాపాతం గురించి విని స్వయంగా ఖాన్ ఉల్కల కోసం
వెతకడానికి వెళ్ళాడు. ఎవరైనా దాచుకున్న పాత "షూటింగ్ స్టార్ shooting star " ముక్కలను స్థానిక గ్రామస్తులనుండి
సేకరించి వారికి ఆర్థిక బహుమతిని అందించేవాడు.
.ఫుల్మారి
ఆరోలైట్.
స్థానిక ఉల్కలను సేకరించడంతోనే సంతృప్తి చెందని
ఖాన్, అంతర్జాతీయ డీలర్ల నుండి అరుదైన
ఉల్కలను కూడా కొనడం ప్రారంభించాడు. ఖాన్ సేకరణ కాలక్రమేణా ఒక ముఖ్యమైన శాస్త్రీయ
వనరుగా మారింది. "బోసాన్ boson” ఆవిష్కరణగా నేడు గుర్తుంచుకునే ప్రముఖ
భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, ఢాకా
విశ్వవిద్యాలయంలోని బోస్ ప్రయోగశాలలో ఎక్స్-రే విశ్లేషణ కోసం ఖాన్ వ్యక్తిగత సేకరణ
నుండి కొన్ని ఉల్కలను అరువుగా తీసుకున్నాడు.
రాత్రి ఆకాశం వైపు చూస్తూ గంటల తరబడి గడపడం
లేదా ఉల్కలు కొనడానికి ఉదారంగా మొత్తాలను ఖర్చు చేయడం ఖాన్ చేస్తుండే వాడు. శాస్త్రీయ
పర్షియన్ మరియు అరబిక్ భాషలలో విద్యనభ్యసించిన ఖాన్, మత గ్రంథాలలో ఉల్కల నివేదికలను డాక్యుమెంట్ చేయడానికి మరియు
విశ్లేషించడానికి ప్రయత్నించాడు. ఖాన్ చేసిన అత్యంత ఆసక్తికరమైన అధ్యయనాలలో
మక్కాలోని కాబా పవిత్ర నల్ల రాయి యొక్క ఉల్కాపాత మూలాలను స్థాపించే ప్రయత్నాలు
ఉన్నాయి.
No comments:
Post a Comment