
భారతదేశం నేడు ఇండోనేషియా తరువాత అతిపెద్ద ముస్లిం సమాజానికి నిలయంగా ఉంది. నేడు భారత దేశం దాదాపు 20 కోట్ల భారతీయ ముస్లిములకు జన్మ స్థలం(mother land).
భారత
ఉపఖండంలో ఇస్లాం వ్యాప్తిపై కొన్ని
సాంప్రదాయ సిద్ధాంతాలు కలవు.
మొదటి సిద్ధాంతాన్ని వలస సిద్ధాంతం అంటారు. దీని ప్రకారం, భారత ఉపఖండంలోని ముస్లింలు అరేబియా, టర్కీ, పర్షియా మొదలగు దేశాల నుండి చరిత్రలోని వివిధ కాలాల్లో ఇక్కడికి వచ్చిన ముస్లింల వారసులు.
రెండవ
సిద్ధాంతం ప్రకారం, ముస్లిం పాలనలో హిందువులు భూమి మంజూరు, ఉన్నత సేవలు
లేదా పాలకుల నుండి ఆర్థిక ప్రయోజనాల కోసం ఇస్లాంను స్వీకరించారు.
అయితే భారతదేశంలో శతాబ్దాల ముస్లిం పాలనలో, అటువంటి మతమార్పిడి సంఘటనలను వేళ్ల కొనపై లెక్కించవచ్చు.
ఇంకొక
సిద్ధాంతం ఒక వర్గం పండితులు, ముఖ్యంగా కుడి-పక్షRight-Wing హిందువులు, భారతదేశంలో ఇస్లాంలోకి మతమార్పిడి బలవంతం వల్ల జరిగిందని
వాదిస్తున్నారు.
ముస్లిం ఆక్రమణదారులు మరియు పాలకులు బలవంతంగా హిందువులను ఇస్లాంలోకి మార్చారని వివరిస్తుంది.
భారతదేశంతో
ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన ఇస్లాం మత మార్పిడి సిద్ధాంతం హోలీమాన్ సిద్ధాంతం, సూఫీసన్యాసులు ఇస్లాంను
ప్రజల్లో ప్రచారం చేసి ఇస్లాం వ్యాప్తికి తోడ్పడినారు..
స్వదేశీ భారతీయులు ఎక్కువగా సమాజంలోని దిగువ శ్రేణి వారు సామాజిక సమానత్వం మరియు సార్వత్రిక సోదరభావం కోసం ఇస్లాంను స్వీకరించారు. సూఫీసన్యాసులు అణగారిన ప్రజల మధ్య నివసించారు మరియు సూఫీల పుణ్యక్షేత్రాలు కులం మరియు మతంతో సంబంధం లేకుండా ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా మారాయి. అందువల్ల, లక్షలాది మంది ప్రజలు ఇస్లాంను స్వీకరించారు. అజ్మీర్‌కు చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ప్రభావంతో దాదాపు 90 లక్షల మంది ఇస్లాంను స్వీకరించారని చెప్పబడింది.
ముస్లిం
పండితులు ప్రతిపాదించిన అత్యంత ప్రజాదరణ పొందిన సిద్ధాంతం 'సామాజిక విముక్తి సిద్ధాంతం.
దాని ప్రకారం, హిందువులు, ముఖ్యంగా
తక్కువ కులాలు మరియు అంటరానివారు, సామాజిక అసమానత మరియు
బ్రాహ్మణ అణచివేతను తొలగించాలనే ఆశతో ఇస్లాంను స్వీకరించారు.
భారతదేశంలో ఇస్లాం మతంలోకి మారడంపై ఈ సిద్ధాంతం అత్యంత సముచితమైనది.
అయితే, పైన పేర్కొన్న అన్ని సిద్ధాంతాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి;
సూఫీ
కార్యకలాపాలు దేశవ్యాప్త దృగ్విషయం, కానీ మతమార్పిడి పరిమితంగానే ఉంది.
రాజకీయ మరియు ఆర్థిక లాభాల ద్వారా బలవంతపు మతమార్పిడి అప్పుడప్పుడు జరిగే సంఘటన మాత్రమే.
భారతదేశంలో
శతాబ్దాలుగా కఠినమైన కుల వ్యవస్థ ప్రబలంగా ఉంది, భారతీయ కుల వ్యవస్థలో దళితులు
మరియు అంటరానివారు పట్ల సామాజిక అసమానత మరియు అమానవీయ ప్రవర్తన పలితంగా వారికి సామాజిక సమానత్వం మరియు సార్వత్రిక నీతితో
మానవాళి పట్ల గౌరవం అనే సందేశంతో ఇస్లాం దైవిక ప్రకాశంగా కనిపించింది.
అందువల్ల, ఇస్లాం లక్షలాది తక్కువ కుల హిందూ-బౌద్ధ-ఆదివాసులను ఆకర్షించింది.
మధ్యయుగ ముస్లిం రాజ్యం, సూఫీ ఖాన్ఖాలు, మసీదులు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు మొదలైన మతపరమైన సంస్థలకు భూమిని మంజూరు చేసింది మరియు వాటిని పోషించింది. ఈ మత సంస్థలు రైతుల మతపరమైన ధోరణిని మార్చాయి మరియు రైతులు ఇస్లామిక్ సంస్థల ప్రభావంలోకి వచ్చి పెద్ద సంఖ్యలో ఇస్లాంను స్వీకరించాయి., రైతులు క్రమంగా ఇస్లాంను నాగలి మతంగా స్వీకరించారు.
చారిత్రాత్మకంగా, కులం మరియు సామాజిక వివక్షత భారత దేశం లో ఇస్లామీకరణకు
ప్రధానంగా కారణమయ్యాయి.
No comments:
Post a Comment