గత 200
సంవత్సరాలలో భారత ఉపఖండం సృష్టించిన అత్యంత ముఖ్యమైన మరియు ప్రజాదరణ పొందిన విప్లవ
కవుల గురించి అడిగితే, మీరు ఖచ్చితంగా సుబ్రమణ్య భారతి, కాజీ నజ్రుల్ ఇస్లాం, ఫైజ్ అహ్మద్
ఫైజ్, మొహమ్మద్
ఇక్బాల్, రవీంద్రనాథ్
ఠాగూర్ మరియు అనేక మంది ఇతరుల పేర్లను చెబుతారు, కానీ బాబా కాన్షీరామ్ పేరును స్మరించడం
చాలా అసంభవం.
సరోజినీ నాయుడు చేత
బుల్బుల్-ఇ-పహార్ (పర్వతాల నైటింగేల్) Bulbul-i-Pahar (Nightingale of the mountains) అని, జవహర్‌లాల్
నెహ్రూ చేత పహారీ గాంధీ (పర్వతాల గాంధీ) Pahari Gandhi (Gandhi of the mountains) అని పిలువబడిన బాబా కాన్షీ రామ్, సియాపోష్
జర్నైల్ as Siyahposh
Jarnail (General wearing black clothes) (నల్ల
దుస్తులు ధరించిన జనరల్) గా ప్రసిద్ధి చెందారు, 1920 మరియు 1942 మధ్య 11 సార్లు
జైలు శిక్ష అనుభవించారు, బాబా కాన్షీ రామ్ లేదా పహారీ గాంధీ హిమాచల్ ప్రదేశ్ వెలుపలఉన్న భారతీయులకు
అంతగా ఇప్పటికీ తెలియదు.
బాబా కాన్షీ రామ్ జూలై 11, 1882న పండిట్ లఖ్నూ
రామ్ పహ్దా రేవతి దేవికు జన్మించారు. బాబా
కాన్షీరామ్ కు జాతీయవాదులతో మొదటిసారిగా పరిచయం 1905లో
జరిగింది. కాంగ్రాలో ఒక శక్తివంతమైన భూకంపం విధ్వంసం సృష్టించింది. లాలా లజపతి
రాయ్, సర్దార్
అజిత్ సింగ్ మరియు అనేక ఇతర ప్రముఖ జాతీయవాద నాయకులు జరిగిన విధ్వంసాన్ని
పరిశీలించడానికి వచ్చారు. బాబా కాన్షీరామ్ వారితో పాటు కలసి పనిచేసారు మరియు వారి
మద్య ఒక రాజకీయ సైద్ధాంతిక కూటమి ఏర్పడింది.
తరువాతి కొన్ని సంవత్సరాలలో బాబా కాన్షీరామ్ లాలా హర్దయాల్, సూఫీ అంబా ప్రసాద్, మౌల్వి బర్కతుల్లా మరియు లాల్ చంద్ ఫలక్ వంటి గదర్ పార్టీ నాయకులతో కలిసి పనిచేశాడు. 1912లో లార్డ్ హార్డింజ్ బాంబు కేసులో మాస్టర్ అమీర్ చంద్, అవధ్ బిహారీ, బాల్ ముకుంద్ మరియు బసంత్ కుమార్‌లను ఉరితీసిన కేసులో బాబా కాన్షీరామ్ మోస్ట్ వాంటెడ్‌లో ఒకడు. ఆ సమయంలో బాబా కాన్షీరామ్ అజ్ఞాతంలోకి వెళ్లి అరెస్టును తప్పించుకున్నారు.
కాన్షీరామ్ పహారీ భాషా లో కవి గా
పేరు గాంచారు. పర్షియన్ కవి షేక్ సాది యొక్క గులిస్తాన్-ఎ-సాది మరియు
బోస్తాన్-ఎ-సాది కాన్షీరామ్ ను ప్రభావితం చేసాయి. కాన్షీరామ్ ప్రారంభంలో, ప్రకృతి
మరియు మానవ భావోద్వేగాల గురించి రాశాడు, కానీ తరువాత తన కవిత్వం లో వలసవాదుల
నిరంకుశత్వం, జాతీయవాద
భావాలు మరియు పేదలు మరియు నిరాశ్రయుల వేదనలను
ను ప్రస్తావించాడు.
తన పహారీ కవితలతో, కాన్షీరామ్ హిమాచల్
ప్రదేశ్ (అప్పటి పంజాబ్ భాగం)లో జాతీయవాద భావాలను ప్రాచుర్యం చేసినాడు. కాన్షీరామ్
డెహ్రాడున్ నుండి మండి, సిమ్లా, డల్హౌసీ, ధర్మశాల, హమీర్‌పూర్, నోడాన్
మరియు ఇతర ప్రదేశాలకు కాలినడకన నడిచి సామాన్య ప్రజలలో జాతియభావాలు వ్యాప్తి చేసాడు.బాబా కాన్షీరామ్ బహిరంగ సమావేశాలలో పహారీని ఉపయోగించి ప్రజలను ఉత్తేజపరిచి అత్యంత ప్రజాదరణ పొందారు.
కాన్షీరామ్ కవితలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేయడానికి పిలుపునిచ్చాయి. 1920లో, జలియన్‌వాలాబాగ్ ఊచకోత తర్వాత, సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమసమయం లో , బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసినందుకు కాన్షీరామ్‌ను మొదటిసారి అరెస్టు చేశారు. కాన్షీరామ్ మొత్తం 13 సంవత్సరాలకు పైగా ధర్మశాలతో పాటు గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, అటక్, ముల్తాన్, లాహోర్ మరియు ఫిరోజ్‌పూర్‌లలో జైలు శిక్ష అనుభవించాడు, లాలా లజపతి రాయ్‌తో కలసి జైలు శిక్షను అనుభవించారు.
గురుదాస్‌పూర్
జైలులో, కాన్షీరామ్‌ను
చాలా అమానుషంగా హింసించారు, పలితంగా కాన్షీరామ్‌ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. 1931 ఏప్రిల్ 23న, భారతదేశం
స్వేచ్ఛ పొందే వరకు భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌ల బలిదానానికి సంతాపంగా నల్లటి దుస్తులు మాత్రమే
ధరిస్తానని కాన్షీరామ్ ప్రతిజ్ఞ చేశాడు. 1943లో మరణించే
వరకు కాన్షీరామ్ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
1937లో హోషియార్‌పూర్‌లో
జవహర్‌లాల్ నెహ్రూ కాన్షీరామ్ ను పహరి గాంధీగా ప్రశంసించారు. సరోజినీ నాయుడు చేత
బుల్బుల్-ఇ-పహార్ (పర్వతాల నైటింగేల్) Bulbul-i-Pahar (Nightingale of the mountains) అని పిలవబడ్డారు.
నేడు, బాబా కాన్షీ
రామ్ హిమాచల్ ప్రదేశ్ వెలుపల దాదాపుగా తెలియదు.
1984 ఏప్రిల్ 23న ఇందిరా
గాంధీ, బాబా కాన్షీ రామ్ స్మారక స్టాంపు ఆల్బమ్‌ను విడుదల చేసారు.
No comments:
Post a Comment