ఢిల్లీ విశ్వవిద్యాలయం భారత దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలలో ఒకటి. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని కొంతమంది ఉత్తమ నాయకులను తీర్చిదిద్దిన సంస్థ. .ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రారంభం నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంతో సహా దేశ ప్రధాన రాజకీయ మరియు చారిత్రక సంఘటనలకు దోహదపడింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయం స్థాపన
1912లోనే ఆమోదించబడినప్పటికీ, ఢిల్లీలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన 1922లో అధికారికంగా కేంద్ర శాసనసభ Central Legislative Assembly చట్టం ద్వారా స్థాపించారు. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ చెల్మ్స్‌ఫోర్డ్ మార్చి 1, 1922న విశ్వవిద్యాలయానికి పునాది వేశారు.
ప్రముఖ న్యాయవాది మరియు విద్యావేత్త అయిన హరి సింగ్ గౌర్, ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క మొదటి వైస్-ఛాన్సలర్లలో ఒకరు. ప్రారంభ సమయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కేవలం మూడు కళాశాలలు మరియు 750 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 1933 వరకు, వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్ వైస్రాయ్ నివాసంగా ఉండేది. అయితే, 1933 నుండి ఇది వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని కలిగి ఉంది.
సర్ మారిస్ లిన్‌ఫోర్డ్ గ్వైర్ Sir Maurice Gwyer అనే ఒక బ్రిటిష్ న్యాయమూర్తి 1937లో భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించడానికి వచ్చారు. సర్ మారిస్ లిన్‌ఫోర్డ్ గ్వైర్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్ అయ్యాడు మరియు సంస్థలో గణనీయమైన మార్పులు చేశాడు. DUలో అత్యుత్తమ అధ్యాపకులు-భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్ డి.ఎస్. కొఠారి, రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్ టి.ఆర్. శేషాద్రి, వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పి. మహేశ్వరి మరియు జంతుశాస్త్రంలో ప్రొఫెసర్ ఎం.ఎల్. భాటియా ను నియమించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా సర్ మారిస్ లిన్‌ఫోర్డ్ గ్వైర్ కే దక్కుతుంది.
స్వాతంత్ర్య ఉద్యమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం
పాత్ర
డియు యొక్క పురాతన కళాశాలలలో ఒకటైన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల భారత్ స్వాతంత్య్ర ఈ ఉద్యమంలో
కీలక పాత్ర పోషించింది గదర్ పార్టీ జనరల్ సెక్రటరీ లాలా హర్ దయాల్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల విద్యార్ధి. అదేవిధంగా, పంజాబ్ యూనియన్ పార్టీ యొక్క ప్రధాన
నాయకుడు సర్ ఛోటు రామ్, అమీర్ చంద్, అసఫ్ అలీ, అవధ్ బిహారీ మరియు బ్రిజ్ కృష్ణ
చండివాలా సెయింట్ స్టీఫెన్స్ కళాశాల విద్యార్ధులు.
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం మరియు క్విట్
ఇండియా ఉద్యమం వంటి జాతీయవాద కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది.
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యొక్క మొదటి భారతీయ
ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రుద్ర గాంధీకి ఒక లేఖ రాశారు. ఆఫ్రికాలో వర్ణవివక్షకు
వ్యతిరేకంగా పోరాడటానికి గాంధీ ఉపయోగించిన అహింసా పద్ధతుల ప్రాముఖ్యతను గాంధీకి
రాసిన లేఖలో హైలైట్ చేసి మరియు అవసరమైన
సామాజిక మరియు రాజకీయ మార్పులను తీసుకురావడానికి తన పద్ధతులను భారతదేశానికి వచ్చి
అమలు చేయమని అభ్యర్థించారు.
ఢిల్లీకి తన మొదటి పర్యటనలో గాంధీని రుద్ర సెయింట్ స్టీఫెన్స్‌కు స్వాగతించారు మరియు
కాశ్మీర్ గేట్‌లోని రుద్ర నివాసంలో కూడా బస చేశారు. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత
నేటికీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో వేలాడుతున్న ఛాయాచిత్రంలో బంధించబడింది.
చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్ ఒక ఆంగ్ల పూజారి, మిషనరీ మరియు విద్యావేత్త, అతను భారత స్వాతంత్ర్య దార్శనికతను విశ్వసించాడు. చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్, గాంధీతో సన్నిహిత అనుబంధo కలవాడు. చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్, సెయింట్ స్టీఫెన్స్‌లో ఉపాధ్యాయుడు మరియు సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యార్థుల చైతన్యాన్ని రేకెత్తించడానికి ఎంతో దోహదపడ్డాడు.
భారతీయ వ్యాపారవేత్తలు హిందూ కళాశాలను
స్థాపించారు. 1930లో, హిందూ
కళాశాల విద్యార్థులు భారత జాతీయ కాంగ్రెస్ అధిపతి మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక
వ్యక్తి అయిన మహాత్మా గాంధీని కళాశాల సందర్శించడానికి ఆహ్వానించారు. జనవరి 25, 1930న గాంధీ పర్యటన జరిగింది. అందులో గాంధీ
అహింసాయుత శాసనోల్లంఘన కార్యక్రమానికి హిందూ కళాశాల మద్దతును స్పష్టం చేసింది. హిందూ
కళాశాల విద్యార్థులు గాంధీకి రూ. 500
విరాళం అందించారు,
హిందూ కళాశాల లెక్చరర్ నంద్ కిషోర్ నిగమ్
క్యాంపస్ హాస్టల్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు
చంద్రశేఖర్ ఆజాద్ మరియు అతని స్నేహితులకు కళాశాల హాస్టల్‌లో సమావేశ గది మరియు
ఆశ్రయం కల్పించడం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటానికి తన మద్దతును ప్రదర్శించారు.
ఆజాద్ మరియు ఇతరులతో కలిసి స్వేచ్ఛ కోసం పోరాడటానికి కళాశాలను విడిచిపెట్టిన
తర్వాత, ప్రొఫెసర్ నిగమ్ డిసెంబర్ 4, 1930న జైలు పాలయ్యాడు.
క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో, ముఖ్యంగా హిందూ కళాశాల రాజకీయ చర్చ మరియు చర్యలకు కేంద్రంగా ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం ఫలితంగా అనేక మంది కళాశాల విద్యార్థులు మరియు లెక్చరర్లు జైలు పాలయ్యారు
ఇంద్రప్రస్థ మహిళా కళాశాల (IPCW) అన్నీ బీసెంట్ సహాయంతో స్థాపించబడింది. ఇంద్రప్రస్థ మహిళా కళాశాల (IPCW) పై భారత స్వాతంత్ర్య ఉద్యమం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంది. ఇంద్రప్రస్థ మహిళా కళాశాల (IPCW)లోని ఉత్సాహభరితమైన విద్యార్థులు ప్రిన్సిపాల్ ఆదేశానికి వ్యతిరేకంగా కళాశాలలో చరఖా సంఘాన్ని ప్రారంభించాఎఉ. IPCW అనేక స్త్రీవాద కార్యకలాపాలకు కూడా కేంద్రంగా ఉంది, భారతదేశంలో మొదటి వేవ్ స్త్రీవాద ఉద్యమానికి గొప్పగా దోహదపడింది.
డాక్టర్ అపర్ణ బసు చెప్పినట్టు, “1942 ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా, హిందూ కళాశాల విద్యార్థులు మరియు ఇంద్రప్రస్థ కళాశాల మహిళా
విద్యార్దినిలు స్టీఫెన్స్ కాలేజి వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి, క్రిందటి రోజు జైలు శిక్ష అనుభవిస్తున కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా ఊరేగింపులో తమతో
చేరాలని స్టిఫెన్ కళాశాల విద్యార్ధులను కోరారు. ఐపీ
కళాశాల అధికారులు తమ కళాశాల అమ్మాయిలు ఉరేగింపులో చేరకుండా గేట్లు మూసివేసిన దారిలో అలీపూర్
రోడ్డు గుండా విద్యార్ధులు కవాతు చేసారు.. ఐపీ కళాశాల అమ్మాయిలు ఇష్టపూర్వకంగా స్టీఫెన్
కళాశాల వీద్యార్ధుల సహాయం తో తమ కళాశాల గోడలు దూకి నినాదాలు
చేస్తూ చాందినీ చౌక్ వెంబడి ఊరేగింపు కొనసాగించారు..”
1942లో బ్రిటిష్ ప్రభుత్వం DU కళాశాలల పై ఆర్ధిక, అన్ని రకాల నియంత్రణలను అమలు చేసినప్పటికీ, విద్యార్థులు స్వాతంత్ర్య ప్రయత్నాలను వదులుకోలేదు
మొత్తంమీద, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంలో చాలా చురుకుగా ఉన్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థి
చైతన్యం చాలా ఎక్కువగా ఉంది, DU కేవలం
ఒక విద్యా కేంద్రం కాదు, తమ కోసం మరియు ఇతరుల కోసం
ఆలోచించడానికి బాగా శిక్షణ పొందిన యువ మనస్సుల తరాల సృష్టికర్త.
No comments:
Post a Comment