భారత స్వాతంత్ర్య ఉద్యమం లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) గొప్ప ప్రధాన పాత్ర నిర్వహించినది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం AMUదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను తయారు చేసింది. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో AMU సహకారం గురించి తెలుసుకోవడం, మరింత ముఖ్యం. స్వాతంత్ర్య ఉద్యమంలో AMU యొక్క సహకారం యొక్క అధ్యయనం హిందూ-ముస్లిం ఐక్యతను బలోపేతం చేస్తుంది.
1875లో స్థాపించబడిన మొహమ్మదో ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్ (MAO కాలేజ్), అలీఘర్ (తరువాత 1920లో AMUగా మారింది), AMUస్థాపించడంలో ఉదారవాద ముస్లింలు సర్ సయ్యద్‌కు సాధ్యమైన సహాయం చేసారు.
కాబూల్‌లో ఏర్పడిన ప్రవాస భారత తాత్కాలిక ప్రభుత్వం అద్యక్షుడిగా AMU పూర్వ విద్యార్ధి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, ప్రధానమంత్రిగా మౌలానా బర్కతుల్లా భోపాలీ మరియు మౌలానా ఉబైదుల్లా సింధీ విదేశాంగ శాఖ మంత్రి గా ఎన్నికైనారు. వీరందరూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) విద్యార్ధులే.
1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం కోసం డిమాండ్‌ను లేవనెత్తిన మొట్టమొదటి వ్యక్తి మౌలానా హస్రత్ మోహాని కూడాAMU పూర్వ విద్యార్ధి. ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, డాక్టర్ సయ్యద్ మెహమూద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ వీరందరూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) విద్యార్ధులే.
AMUఅనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను తయారు చేసింది, వారిలో ప్రముఖులు అలీ సోదరులు (మౌలానా షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ). SM టోంకీ, సైఫుద్దీన్ కిచ్లేవ్ (లెనిన్ శాంతి బహుమతి గ్రహీత), అబ్దుల్ మజీద్ ఖ్వాజా,ఖాజీ అదీల్ అబ్బాసీ, సైత్ యాకూబ్ హసన్, అలీ సర్దార్ జాఫ్రీ, షఫీక్-ఉర్-రెహ్మాన్ కిద్వాయ్, రఫీ అహ్మద్ కిద్వాయ్,, రాజా గులాం హుస్సేన్, షోయిబ్ ఖురెషి, షేక్ మహమ్మద్ అబ్దుల్లా, డా. దత్తు(ఆఫ్రికన్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు) అబ్దుల్ మతీన్ చౌదరి(ఇండియన్ సివిల్ లిబర్టీ యునియన్ స్థాపకుడు), మజరుల్ హక్, సయ్యద్ అలీ జహీర్, సయ్యద్ హుస్సేన్, సయ్యద్ మీర్ ఖాసిం, సయ్యద్ రవూఫ్ పాషా, తస్సౌక్ అహ్మద్ ఖాన్ షేర్వానీ, యాసీన్ నూరి Z అహ్మద్, మరియు జాఫర్ అలీ ఖాన్. హకీమ్ అజ్మల్ ఖాన్ AMU పూర్వ విద్యార్థి కాదు కానీ ట్రస్టీ సభ్యుడిగా దానితో సంబంధం కలిగి ఉన్నాడు).
AMU మాజీ వైస్ ఛాన్సలర్ బద్రుద్దీన్ ఫైజ్ త్యాబ్జీ భార్య సురయ్య తయ్యాబ్జీ భారత జెండాను తయారు చేసిన బృందంలోని సభ్యులలో ఒకరు.
AMU యొక్క మొదటి గ్రాడ్యుయేట్ బాబు ఈశ్వరి ప్రసాద్ హిందువు. నేటికీ AMU నివాస హాళ్లలో ఒకటైన సులేమాన్ హాల్‌లో సర్ సయ్యద్ సన్నిహిత మిత్రుడు రాజా జై కిషన్ దాస్ పేరు మీద హాస్టల్ ఉంది.
AMU దేశానికి సినిమాలు, క్రీడలు, సాహిత్యం, జర్నలిజం, చట్టం, సంస్కృతి మరియు రాజకీయ రంగాలలో విశిష్ట వ్యక్తులను అందించింది.
AMU గ్రాడ్యుయేట్ల అనేక మూడవ ప్రపంచ దేశాలలో ఉద్యగం చేస్తూ వాటి అభివృద్దికి సహాయం చేస్తున్నారు.. అభివృద్ధి చెందిన
ప్రపంచంలో కూడా AMU గ్రాడ్యుయేట్లు
ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
No comments:
Post a Comment