న్యూఢిల్లీ
:
లోక్‌సభలో
మహిళలకు ఎప్పుడూ తక్కువ ప్రాతినిధ్యం ఉందనేది తెలిసిన విషయమే, కానీ ముస్లిం మహిళా సభ్యులు చాలా అరుదుగా
ఉన్నారు, స్వాతంత్ర్యం
వచ్చినప్పటి నుండి కేవలం 18 మంది
మాత్రమే దిగువ సభకు ఎన్నికయ్యారు. ఈ 18 మందిలో 13 మంది
రాజకీయ కుటుంబాల నుండి వచ్చారు.
దిగువ సభకు 20 మంది ముస్లిం మహిళలు ఎన్నికైనారు కాని వారిలో
ఇద్దరు - సుభాషిణి అలీ మరియు ఆఫ్రిన్ అలీ - తాము ఇస్లాంను అనుసరించలేదని బహిరంగంగా
ప్రకటించారు.
"1951-52లో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల నుండి ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది
మంది ముస్లిం మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. భారతదేశంలోని 146 కోట్ల జనాభాలో ముస్లిం మహిళలు దాదాపు 7.1 శాతం ఉన్నారని పరిగణనలోకి తీసుకుంటే ఇది
ఆశ్చర్యకరమైన సంఖ్య. 2025 వరకు
ఏర్పడిన 18 లోక్‌సభలలో
5 సార్లు అనగా 5 లోక్ సభలలో ఒక్క ముస్లిం మహిళా సభ్యురాలు కూడా లేరు"
లోక్ సభ లో ఎన్నికైన
ముస్లిం మహిళల సంఖ్య ఏనాడు నాలుగు మార్కును దాటలేదు.
ఐదు దక్షిణాది రాష్ట్రాలు - కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ – నుండి ఒక్క ముస్లిం మహిళా ఎంపీ కూడా లోక్ సభ కు ఎంపిక కాలేదు.
లోక్‌సభకు
ఎన్నికైన 18 మంది
ముస్లిం మహిళల్లో మోఫిదా అహ్మద్ (1957, కాంగ్రెస్); జోహ్రాబెన్
అక్బర్‌భాయ్ చావ్డా (కాంగ్రెస్, 1962-67); మైమూనా సుల్తాన్ (కాంగ్రెస్, 1957-67);
బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా (నేషనల్
కాన్ఫరెన్స్, 1977-79, 1984-89); రషీదా హక్ (కాంగ్రెస్ 1977-79); మోహ్సినా కిద్వాయ్ (కాంగ్రెస్, 1977-89);
అబిదా
అహ్మద్ (కాంగ్రెస్, 1981-89); నూర్ బానో (కాంగ్రెస్, 1996, 1999-2004); రుబాబ్ సయ్దా (సమాజ్‌వాదీ పార్టీ, 2004-09); మరియు మెహబూబా ముఫ్తీ
(పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, 2004-09, 2014-19). తబస్సుమ్ హసన్ (సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీ 2009-14); మౌసమ్ నూర్ (తృణమూల్ కాంగ్రెస్ 2009-19); కైసర్ జహాన్ (బహుజన్ సమాజ్ పార్టీ, 2009-14); మమతాజ్ సంఘమిత (తృణమూల్ కాంగ్రెస్ 2014-19); సజ్దా అహ్మద్ (తృణమూల్ కాంగ్రెస్ 2014-24); రానీ నారా (కాంగ్రెస్, 1998-2004, 2009-14); నుస్రత్
జహాన్ రుహి (తృణమూల్ కాంగ్రెస్, 2019-24); మరియు ఇక్రా హసన్ (సమాజ్‌వాదీ పార్టీ, 2024-ప్రస్తుతం).
మోహ్సినా కిద్వాయ్(కాంగ్రెస్, 1996, 1999-2004) కార్మిక, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, రవాణా మరియు పట్టణాభివృద్ధి వంటి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
కైసర్ జహాన్
(బహుజన్ సమాజ్ పార్టీ, 2009-14), చతుర్ముఖ పోటీలో గెలిచారు.
18 మంది ముస్లిం మహిళలలో ఒక ప్రథమ మహిళ కూడా ఉంది - దేశ ఐదవ అధ్యక్షుడు
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భార్య బేగం అబిదా అహ్మద్ అబిదా అహ్మద్ (కాంగ్రెస్, 1981-89).
అబిదా
అహ్మద్ 1981లో
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుండి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అంగీకరించి
గెలిచి, భారతదేశపు
మొదటి మరియు ఏకైక ప్రథమ మహిళ అయ్యారు.అబిదా అహ్మద్ 1984లో మళ్ళీ గెలిచి, బరేలీ నుండి
వరుసగా రెండుసార్లు విజయం సాధించింది.
బేగం నూర్
బానో(కాంగ్రెస్, 1996, 1999-2004), రాంపూర్, రాజకుటుంబానికి
చెందినది. బేగం
నూర్ బానో, 1996 మరియు 1999 లోక్‌సభ ఎన్నికల్లో నూర్ బానో గెలిచారు, కానీ
2004 మరియు 2009లో ఓడిపోయారు
18 మంది ముస్లిం మహిళల్లో, బెంగాలీ
నటి నుస్రత్ జహాన్ రుహి(తృణమూల్ కాంగ్రెస్, 2019-24) 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి టికెట్‌పై
గెలిచారు.
ప్రస్తుత
లోక్‌సభలో, కేవలం ఒకే ఒక ముస్లిం మహిళా ఎంపి ఉన్నారు, ఆమె
ఎస్పీకి చెందిన ఇక్రా హసన్ చౌదరి(సమాజ్‌వాదీ
పార్టీ, 2024-ప్రస్తుతం)..
No comments:
Post a Comment