21 November 2013

కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం




కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం .దినం గడిచిపోయాక మరుసటి రోజును ఎదుర్కొటానికి నిన్నునీవు సన్నద్ధం చేసుకొంటె ,  నువ్వొక జయశీల నాయకుడివి అని గుర్తించుకో. - Abdul Kalam

 

ఈమద్య ఉత్సాహవంతులైన యువతీ యువకులు  ఎక్కువగా నాయకత్వ లక్షణాల గురించి అధ్యయనం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితేనాయకుడు అంటే ఎవరు? నాయకుడంటే వెంటనే తయారై పోతారనుకోవద్దు. దానికి ఎంతో అవగాహన, అనుభవం, నైపుణ్యం అవసరం. వాటితోపాటు అందుకు తగిన వాక్చాతుర్యం, నేర్పు, ఓర్పు అన్నీ ఉండాలి. విజయాలకే కాదు. అపజయాలకూ కూడా  ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నిండుగా వుండాలి  నాయకత్వమంటే నిరంతర అబ్యాసనమే.”
          నాయకుడు అంటే తన సామర్ధ్యంతో ఇతరులలో ప్రేరణ కలిగించి, ఇతరులను ముందుకు నడిపించగలిగిన వారే నాయకులు. ఒక సంస్థను అబివృద్ధి పరచడానికి తగిన కృషి  చేస్తూ, సాటి వారిలో ప్రేరణ కల్గిస్తూ ముందుకు తీసుకు పోయే వ్యక్తే నాయకుడు.  నాయకత్వం అంటే కలలను కనటమే కాదు, కలలు అందరికీ వస్తాయి. కలలను నిజం చేసుకొనే చర్యలను వ్యవస్థీకృతo  చేసుకోవడమే నాయకత్వం. హెర్మన్‌ మాక్స్‌ టిప్రీ మాటల్లో చెప్పాలంటే 'వాస్తవస్థితిని నిర్వచించడమే నాయకుని కర్తవ్యం'. రెండు వేల ఏళ్ళ క్రితం నాటి చైనా నానుడి ఒకటుంది. 'వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా శక్తిపుంజుకోండి'. మనం మొదట మనకే నాయకులం, ఆ తర్వాతే మనవెంట వున్న వారికి నాయకులం.
          ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న కొద్దిలో ఎక్కు వ చేయవలసి రావడం, పై నుంచి వచ్చేఆదేశాల ఒత్తిడిని ఎదుర్కోవడం, నిరంతరం వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తన్ను తాను లేదా సంస్థను  సరిదిద్దుకోవటం(update), లేదా  సమస్యల క్లిష్టత నుంచి బయటపడటం అన్నిటికన్నా ముఖ్యంగా  ఆర్థిక అవాంతరాలు ఎదుర్కొని సంస్థను ముందుకు నడిపించటం మరియు తనపై లేదా సంస్థ పై తగ్గుతున్నవిశ్వాసంను పెంచటం  మొదలగునవి  నాయకత్వానికి ఎదురవుతున్న పెను సవాళ్ళు లేదా అవరోధాలు గా పేర్కొనవచ్చును.   
మంచి నాయకుడి లక్షణాలు  
నిరంతరం సంస్థ ప్రగతి గూరించి ఆలోచిస్తూ, తన ఆలోచనలను సబ్యులకర్థమయ్యేల్లా చెప్పి,వారిని  అదే విధము గా  ఆలోచించేలా చేసి సంస్థను ప్రగతి పధం వైపు నడిపించడమే నాయకుడి ప్రదమ లక్షణం. నాయకుడు మొదట తాను మారి చూపించినతరువాత ఇతరులను అనగా అనుచరులను మారమని కోరాలి.   విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదగుతారు. పురోభివృద్ధికి తోడ్పడుతారు.
క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ముఖ్యమైనవి. సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. నాయకుడు పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి .నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. దూరదృష్టి కూడా ఉండాలి. సమస్యలు గుర్తించడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
ఎప్పటికప్పుడు మీ బలం, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. బలహీనతలను టీమ్‌ సభ్యులపై రుద్దకూడదు. వాటికి కారణాలు పరిశీలించి లోపాల్ని సరిదిద్దుకోవాలి   ఎవరైతే తన శ్రేయస్సు కోసమే కాక ఇతరుల మంచికోసం కూడా ప్రయత్నం చేస్తారో వారే నిజమైన నాయకులు.నాయకుడైనంత మాత్రాన అదేదో గొప్ప పదవిగా ఊహించుకొని ఇతర సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు. అసలు తాము ఆ స్థితికి రావడానికి గల కారణాలు ఎప్పుడూ మరచి పోకూడదు. ఇంకా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు తోడ్పడాలి. ఇతరులమీద అధికారము చేసేవాడు నాయకుడు కాదు. నాయకునికి అధికారము సహజముగా లభిస్తుంది.
నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము, దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి. లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే లక్షణాలు. నాయకుడు చేసే పనులు పదిమందికి ఆదర్శముగా మారతాయి. నాయకుడు క్లిష్టమైన పనులను చేయడానికి దైర్యముగా ముందుకు వెళతాడు. నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తీ నాయకుడే.నాయకుడు  మార్గ దర్శకంగా ఉంటూ ప్రోత్సహించేవాడు.నాయకుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ విజయాన్ని కోరుకోoటాడు..ఏ దేశములో అయితే నాయకత్వ లక్షణాలున్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దిన దిన అభివృద్ధి చెందుతుంది.
నియమబద్దమైన , బాధ్యతతో కూడిన  విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాడు.. తన బలహీనతలను జయిస్తాడు.శారీరక సుఖాలకు బానిసైన వ్యక్తి, బలహీనతలకు చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తి నిజమైన నాయకుడు కాజాలడు నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు ,దురలవాట్లు , అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు..సరియైన నాయకుడు సత్కార్య నిర్వహణలో తన శరీరానికి జరిగే లేక రాబోయే ఆపదలను లక్ష్యపెట్టడు.నాయకుడు కష్టపడి పనిచేయకుండా ఇష్టపడి పనిచేసేవాడు .
          స్వామి వివేకానంద చెప్పినట్లు సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు.చాలామంది మంచి తనానికి ఇవి  రోజులు కావని, నీతికి నిజాయితీకి కాలం చెల్లిందని, నియమాలు త్యజిస్తే మనము ధనవంతులము కాగలమని అవినీతి అక్రమ సంపాదన మోసపూరిత వ్యపారాలద్వారా అస్తులు కూడబెట్టాలని భావించి ఈ సమాజంలో సహజ న్యాయాన్ని మానవత్వ పునాదులను కదిలించ టానికి ప్రయత్నిస్తున్నారు కాని అది తాత్కాలికము. అటువంటివారికి పురోగతి ఉండదు. కాలక్రమం లో వారు చేసిన పనికి ఫలితం చెల్లిస్తారు
          మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును. నాయకుడు అనేవాడు ఎక్కడినుండో రాలేదు మనలో నుండే వచ్చాడు. మానవతా విలువులు కలిగి ఉండి సహాయం చేయడంలో ముందుండాలికార్య సాదకుడిగా, స్ఫూర్తి దాయకంగా ఉంటూ సేవకుడిగా ఉండాలి.తీసుకున్న పనిని బాధ్యతతో పూర్తి చేయాలి.ఎంత ఒత్తిడిలోనైనా పనిచేసి విధంగా ఉండాలి.ఓపికతో ఉత్సాహంగా ఉండాలి. నాయకుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సత్తాకలిగి  వుండాలి.  పుడుతూనే నాయకులు అవ్వరు ఎవ్వరూనూ!! కొద్దొ గొప్పో తెలివితేటలు ఉంటే చాలు, ఆ మనిషిని నాయకుడిగా మలచవచ్చు.
          నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చెయ్యటానికి కావలిసిన పూర్తి సమాచారం, నైపుణ్యం. ఇవి జన్మతః    రావు, మనిషి తనంతటతాను సంపాయించుకోవాలి.వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నపుడే, సామర్ధ్యం పెరుగుతుంది. వృత్తిపర జ్ఞానం, సామర్ధ్యం లేనివాడు నాయకుడు కాలేడు.చక్కగా విశ్లేషించి, తగిన నిర్ణయం తీసుకోగల సామర్ధ్యం. నిర్ణయం తీసుకోవటమే కాదు. తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవటం,(ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగినా సరే) అతి ముఖ్యమైన నాయకత్వ లక్షణం నాయకుడు న్యాయ దృష్టి, నిస్పక్షపాత ధోరణి. వత్తిడిని తట్టుకునే స్థైర్యం కలిగిఉండాలి.
          నాయకుడు సంస్థ  పురోభివృద్ధికి చక్కని ప్రణాళిక వేసి అందర్నీ ఒప్పించి తనతో పాటు ముందుకు తీసుకు పోగలగాలి.  తను వేసిన ప్రణాళిక విజయవంతం అయ్యేటట్లు కృషి చేయాలి. సరియైన సమయం లో సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏ పని చేయగలరో తెలుసుకొని వారికి ఆ పని అప్పజెప్పి పూర్తి చేసేటట్లు చూడాలి.
          నాయకుడు ఎల్లపుడూ ఇతరులలో ఉత్తేజాన్ని కలిగిస్తాడు. మంచిని ప్రదర్శిస్తాడు. సహచరులుల లో ప్రేమను  పెంపొంధింప చేస్తాడు. ఎల్లపుడూ “మనం” అనేదానిని నమ్ముతాడు. ఏం తప్పు జరిగింధో విడమర్చి చెపుతాడు. ఒక పని ఎలా చేయాల్లో ఆతనికి తెలుస్తుంది. ప్రతి వారి చేత మర్యాదా, మన్నవ పొందుతాడు.నలుగురిలో కలసి పోతాడు. అందరికీ ఆదర్శప్రాయం గా ఉంటాడు.   
          సమర్ధ నాయకుడు జాతిని ముంధుకు నడిపించ గలడు. ఉదా: మహాత్మా గాంధీ, సుబాష్ చంద్ర బొసే,

            విశ్వ నాయకుడు,సద్ప్రవర్తనకు ,సౌశీల్యనికి, నాయకత్వానికి మంచి ఉదాహరణ ఐనా  మహా ప్రవక్త మహమ్మద్ (స.ఆ.స.) సలహా ను ఉదహారిస్తూ ఈ వ్యాసం ను ముగించుదాము.
                 “ఇతరుల పట్ల మీ ప్రవర్తన ఉత్తమం గా ఉండాలి”. అల్ మువత్త – వాల్యూమ్ 47, హదీసు 1


          Make your character good for the people.“ ----Prophet Muhammad (PBUH) as narrated Al-Muwatta, Volume 47, Hadith 1
          శిక్షించటం లో పొరపాటుకన్న, క్షమించటం లో పొరపాటు చేయడం నాయకునికి కి  మిన్న” మహమ్మద్ ప్రవక్త (స.ఆ.స.)-అల్ తిర్మిధి, హదీసు 1011.
          The Prophet Muhammad (s) said: ““It is better for a leader to make a mistake in forgiving than to make a mistake in punishing.” -----Al-Tirmidhi, Hadith 1011.







19 November 2013

భారతదేశం లోని విభిన్న రాష్ట్రాల మంత్రి మండలిలు -వాటి లోని ముస్లిం మంత్రుల సంఖ్య – వాస్తవాలు-నైష్పత్తిక ప్రాతినిద్య విధాన ఆవశ్యకత.

 దేశవ్యాప్తంగా
          2001 దేశ జనాభా లెక్కల ప్రకారం దేశాజనాభాలో 13.34% మంది ముస్లింలు. 2009 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికైన    ముస్లిం సభ్యుల సంఖ్య 29. మన్మోహన్ సింగ్ మంత్రివర్గం లోనే ముస్లిం మంత్రుల సంఖ్య 6, వీరిలో 3గురు కాబినెట్ మంత్రులు కాగా, 3గురు సహాయ మంత్రులు.
          మనదేశం లోని మొత్తం 28 రాష్ట్రాల మంత్రిమండలులలో 13 రాష్ట్రాలలో ముస్లిం మంత్రులు లేరు. బి‌జే‌పి పాలిత నాలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ తరుపున ఒక్క ఎం‌ఎల్‌ఏ గాని, మంత్రివర్గం లో ఒక్క మంత్రి గాని లేరు. అన్నీ రాష్ట్రాలలో మొత్తం 609 మండి మంత్రులు ఉండగా అందులో కేవలం 57 మండి మాత్రమే ముస్లింలు అనగా వారి శాతం9.35%మాత్రమే. ముస్లింలు అధికంగా మంత్రులు గా ఉన్న రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అక్కడ 18 మంధి మంత్రులుగా కలరు. జమ్ము-కాశ్మీర్ ను మినహాయిస్తే దేశం మొత్తం మీద ముస్లిం మంత్రుల సంఖ్య 39.

 బి‌జే‌పి పాలిత రాష్ట్రాలలో
          . బి‌జే‌పి పాలిత రాష్ట్రాలలో అనగా గుజరాత్ లో ముస్లింల సంఖ్య 9.06%, ఛత్తీస్ ఘర్ లో 4.97%,గోవా లో 6.84%,మద్యప్రదేశ్ లో 6.37%, కానీ ఈ రాష్ట్రాలలో బి‌జే‌పి తరుపున ఒక్క ఎం‌ఎల్‌ఏ గాని, మంత్రి గాని లేరు.పంజాబ్ లోని ఆకాలీదళ్-బి‌జే‌పి పాలిత రాష్ట్రంలో కూడా ఒక్క ముస్లిం మంత్రి లేదు, కానీ పంజాబ్ లో అకాలీదళ్ తరుపున ఒక ముస్లిం ఎం‌ఎల్‌ఏ కలరు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో
          ఉత్తరాఖండ్ రాష్ట్రం లో 11.92% ముస్లిం జనాభా కలదు. కాంగ్రెస్ తరుపున ఎం‌ఎల్‌ఏ లు కలరు కానీ మంత్రులు లేరు. హిమాచల్ ప్రదేశ్ లో 2% ముస్లిం జనాభా కలదు, కానీ ముస్లిం మంత్రి లేదు. హరియానా రాష్ట్రంలో ముస్లింల జనాభా 5.78%ఉండగా ఒకే ఒక్క ముస్లిం మంత్రి కలదు. ఆంధ్ర ప్రదేశ్ లో 10% ముస్లిం జనాభా కలదు  కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం మంత్రుల సంఖ్య( 1 ) ఒకటి మాత్రమే.  అస్సామ్ రాష్ట్ర జనాభా లో ముస్లిం ల అధికంగా 30.9% కలదు కానీ అస్సామ్ లో 3 ముస్లిం మంత్రులు కలరు.డిల్లీ మంత్రివర్గం లో ముస్లిం మంత్రుల సంఖ్య 1 మాత్రమే.

ప్రతిపక్ష పాలిత  రాష్ట్రాలలో
          ఉత్తర్ ప్రదేశ్ లోని ముస్లిం మంత్రుల సంఖ్య 10, ఆ రాష్ట్ర జనాభా లో ముస్లిం జనాభా 18.55% కలదు. కేరళ జనాభాలో 24.6% ముస్లింలు, కానీ మంత్రి వర్గం లో ముస్లింల సంఖ్య 5, పశ్చిమ బెంగాల్ లో ముస్లింల సంఖ్య 25%, కానీ ముస్లిం మంత్రుల సంఖ్య 5 మాత్రమే.  బిహార్ లో ముస్లిం మంత్రుల సంఖ్య 2 మాత్రమే.

          ఈశాన్య రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎం‌ఎల్‌ఏ గాని, మంత్రి గాని లేరు. ఒక్క మేఘాలయలో మాత్రం ఒక్క ముస్లిం ఎం‌ఎల్‌ఏ కలరు, అతను ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్.

          దేశంలోని ముస్లింల సామాజీక, ఆర్థిక,విద్యా, రాజకీయ పరిస్తితులను పరిశీలించిన ముస్లింల దుస్థితి ఎస్‌సి,ఎస్‌టి,ఓ‌బి‌సి, ల కన్నా దుర్భరంగా ఉన్నదని సచార్ కమిటీ నివేదిక స్పష్టం చేసినది.ఇప్పటికైనా కేంద్రం లో అధికారంలో ఉన్న యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం కళ్ళు తెరచి రాష్ట్ర శాసనసభలు,రాష్ట్ర మంత్రివర్గాలు,కేంద్ర శాసనసభ,కేంద్ర మంత్రివర్గం లో ముస్లింలకు  వారిజనాభాకు తగినట్లు ప్రాతినిద్యం కల్పించవలెను. ఇందులకు గాను అవసరమైన రాజ్యాంగంలో మార్పులు చేసి నైష్పత్తిక ప్రాతినిద్య పద్దతిని అమలులోకి తీసుకొని రావలయును.

-29-11-13 గీటురాయి లో ప్రచురితం     










18 November 2013

కొరాన్ లో మేనేజ్మెంట్ లేదా నిర్వహణ సూత్రాలు.


          ఇస్లాం ను ప్రపంచజనాభా లో    దాదాపు 23%మంది జనాబా, లేదా ప్రపంచవ్యాప్తం గా  160 కోట్ల మంధి  ప్రజలు అనుసరిస్తున్నారు. ఇస్లాం ఒక మతమే కాదు, అది ఒక జీవన విధానం అని చెప్పవచ్చును. అల్లాహ్ చే అవతరింపబడిన అంతిమ గ్రంధం ఐనా దివ్య కొరాన్ లో అన్నీ సమస్యలకు అనగా వ్యక్తిగత,ఆర్థిక,రాజకీయ లేదా వ్యాపార సమస్యలకు  సమాధానాలు పొందవచ్చును.దివ్య కొరాన్ మనవాళికి సంపూర్ణ విజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని  అంధించే గ్రంథం. దివ్య కొరాన్  మానవ జీవితం లోని అన్నింటికీ సమాధానాలు చెప్పే,భోదించే,మార్గదర్శకం చూపే దేవుని చేత అవతరింప బడిన సమగ్ర గ్రంధం అని చెప్పవచ్చును.

          1500 సం. లకు పూర్వమే  ఇస్లాం మేనేజ్మెంట్ సూత్రాలను వివరించినది. మేనేజ్మెంట్ పై వ్రాయబడిన అతి ఉత్తమ గ్రంధం గా  దివ్య కొరాన్ ను పరిగణించవచ్చును. ఆధునికాలం లో ముఖ్యమైన శాస్త్రంగా పరిగణించబడే  మేనేజ్మెంట్,  దివ్య కొరాన్ నుండి గ్రహించబడినది. 16,17 శతాబ్ధాలలో ప్రచారం లోనికి వచ్చిన అనేక ఆధునిక మేనేజ్మెంట్ సూత్రాలను 14 శతాబ్ధాల క్రిందనే దివ్య కొరాన్ ప్రకటించినది.  దివ్య కొరాన్ లోని  దాదాపు 300 ఆయతులు మేనేజ్మెంట్ సూత్రాలను వివరిస్తాయి.
   
          ఇస్లామిక్ మేనేజ్మెంట్ కు ముఖ్య ఆధారాలుగా దివ్య కొరాన్ ను, సున్నత్ అనగా హదీసులను పరిగణించవచ్చును. సంస్థలకు , ప్రజలకు  సరియైన మార్గం చూపే విధానంగా ఇస్లామిక్ మేనేజ్మెంట్ ను పరిగణించవచ్చును. నాయకులు, వివిధ సంస్థల ఆదిపతులు ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలను పాటించటం ద్వారా తమ అనుచరులలో ఏకత్వాన్ని సాదించి, సంస్థ ప్రతిష్టను, దాని గుణాత్మక విలువను పెంచవచ్చును.  
          ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలుగా క్రింది వాటిని వివరించవచ్చును.

1.    నిజాయితీ 2. నైపుణ్యం 3. దేశభక్తి 4. సరియైన స్థానం లో సరిఐన వ్యక్తి  5. క్రమశిక్షణ 6. పని విభజన 7. ఆజ్ఞా ఏకత్వం 8.కేంద్రీకరణ – వికేంద్రీకరణ 9. సంస్థ శ్రేయసుకు ప్రదమ ప్రాధాన్యత 10. సరియైన వేతనం 11. ఆర్థిక వ్యవస్థ 12. అందరికీ సమ  న్యాయం 13. సమిష్టి ప్రయత్నాలు 14. శ్రమ విలువ 15. మినహాయింపు 16. జవాబుదారీ తనం 17. అల్లాహ్ అందు విశ్వసముంచుట –తవక్కుల్ 

ఇస్లామిక్ మేనేజ్మెంట్ లక్షణాలు
          ఇస్లామిక్ మేనేజ్మెంట్ ప్రాధమిక పునాదులుగా దివ్య కొరాన్, హదీసు, లను పేర్కొనవచ్చును. అదే విదంగా ప్రవక్త (స.ఆ.స.) మరియు వారి సహచరులను ఇస్లామిక్ మేనేజ్మెంట్ కు నిజమైన ప్రతినిదులు గా భావించవచ్చు. ఆర్థిక అబివృది ఇస్లామిక్ మేనేజ్మెంట్ యొక్క అంతిమ లక్ష్యం కాదు.పరలోక సంక్షేమానికి మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించుకోవాలి. కార్మికులతో మంచి సంబంధాలను గలిగి , సమూహ భావనను ప్రోత్సహించవలెను. నాయకునికి, అంతిమ దైవం అల్లాహ్ కు జవాబుదారీ తనం వహించవలసి ఉంటుంది. అల్లహ ప్రతినిది గా మాత్రమే నాయకుడిని భావించాలి. ఆస్తి అల్లాహ్ చే ప్రజలకు ఇవ్వబడిన ట్రస్ట్ గా భావించాలి. సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు తీసుకొన బడాలి. పదవిలో ఉన్న వారు దురాశతో , ఆ స్థానాన్ని దుర్వినియోగ పరచరాదు. శాంతి, అబివృద్ధి,ఇతర సౌకర్యాల కల్పనకు ఇస్లామిక్ మేనేజ్మెంట్ ఉపయోగ పడును.  ఇస్లామిక్ మేనేజ్మెంట్ సూత్రాలు వ్యక్తిగత,కుటుంబ,సామాజిక,ఆర్థిక,రాజకీయ సంస్థలకు వర్తించును.మత మరియు నైతిక సూత్రాలకు వ్యతిరేకం గా కపటం,అనుకరణ పనికి రాదు. నిర్వహణ అనేది ఒక విశ్వవ్యాప్త భావన అందులో ఆలోచనకు,ప్రకటనకు స్వేశ్త్చ కలదు. స్పర్ధ లేదా పోటీ తత్వం అనేది  మంచి పనులు చేయుటకు ఉపయోగపడే సాధారణ పద్దతి.

కొరాన్ లో ఆధునిక మేనేజ్మెంట్ లేదా నిర్వహణ సూత్రాలు.
1.పనులను ఇతరుల చేత నిర్వహింప చేయడం గా మేనేజ్మెంట్ ను నిర్వచించవచ్చు.- ఇతరుల ద్వారా పనులను నిర్వహింప చేసే అదికారిగా, మేనేజర్ ను చెప్పవచ్చును. ఏమి చేయాలో తెలిసిన మరియు ఇతరుల ద్వారా ఎలా చేయిచాలో తెలిసిన  అదికారిగా మేనేజర్ ను చెప్పవచ్చును.      
దివ్య కొరాన్ ప్రకారం “వారిలో కొందరికి మరి కొందరిపై అంతస్తులవారిగా ఆదిక్యం ఇచ్చాము. వారు ఒకరునొకరిని సేవించుకోవటానికి”. –(43;32)
ఆధునిక మేనేజ్మెంట్ తత్వాన్ని, గమనాన్ని   ఈ ఆయత్ ద్వారా తెలుసుకోవచ్చును. వ్యక్తి క్షమత లేదా శక్తి  ఆధారం గా అనుకూలమైన క్రమానుగత శ్రేణి ని ,బాద్యతల విభజనను, తెలుసు కోవచ్చును .

2.మేనేజ్మెంట్ యొక్క మరొక ముఖ్య లక్షణం నాయకత్వం   - నాయకుడు లేని సమూహం, (సాధారణం గా జరిగే  సమూహ నిర్ణయానికి లేదా సమూహం చేసి పనికి  వ్యతిరేకం గా)  తన ఇష్ట మొచ్చినట్లుగా ప్రవర్తించును.
ముగ్గురు వ్యక్తులు కలసి ప్రయాణించేటప్పుడు, వారు తమలో ఒకరిని నాయకుని గా ఎన్నుకోవాలి.- అబూ దావూద్  హదీసు సంఖ్య 2608. పై హదీసు ద్వారా నాయకత్వ ప్రాధాన్యతను గమనించవచ్చు.

3.మేనేజ్మెంట్ యొక్క మరొక ముఖ్య సూత్రం సమూహ చర్చలు. – జపాన్ దేశస్తులు సమూహ చర్చలకు (షూరా) గల ప్రాధాన్యతను గుర్తించినప్పుడు, దాని అవశ్యకతను మిగతా ప్రపంచం కూడా గుర్తించినది.
దివ్య కొరాన్ లో ఈ భావనను వివరించడమైనది.
“.......తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకొనే వారికోసం ”.- 42;38
“వారి తప్పులను  మన్నించు,వారిని క్షమించు అని అల్లాహ్ ను ప్రార్దించు. ధర్మానికి సంబందించిన పనిలో వారిని కూడా సంప్రదించు. ఐతే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు పరచటానికి సంకల్పించినపుడు అల్లాహ్ పై భారం వేయి. తననే నమ్ముకొని పని చేసే వారంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం”. – 3;159
ఇస్లాం సామాజిక జీవితం నుంచి ఈ సూత్రాన్ని గ్రహించవచ్చు. ప్రవక్త (స.ఆ.స.) భోదనలను ఆలకించేటప్పుడు.యుద్దాలలో పాల్గొనేటప్పుడు, ప్రవక్త అనుచరులు(సాహబా) ఈ సూత్రాన్ని పాటించే వారు.

4. అదికార వ్యవస్థ పట్ల గౌరవం మరియు విధేయత
ఇతరులనుంచి పనిని పొందుటకు మరియు పని నిర్వహించుటకు గౌరవం మరియు విదేయత అనేవి  ముఖ్య మూల సూత్రాలు. న్యాయ బద్ధమైన,సరియైన  ఆజ్ఞాలను పొంది వాటిని బాద్యతాయుతంగా నెరవేర్చుట పని పొందిన వారికి ఆవశ్యకం.
దివ్య కొరాన్ ప్రకారం “విధేయత చూపండి అల్లాహ్ కు, విధేయత చూపండి ప్రవక్తకు, మిలొ అదికారం అప్పగించబడిన పెద్దలకు” – 4;59

5. అందరికీ సమానవకాశాలు
అందరకు సమానవకాశాలు అనగా  సంస్థలోని అందరూ సబ్యులకు సమానంగా ,తగినంతగా ఎదగాటానికి, అదేవిదంగా ప్రతిఫలం పొందటానికి అవకాశం కల్పించవలయును .
“మానవులారా!మేము మిమ్మల్లి ఒకే పురుషునినుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు మిమ్మల్లి జాతులుగాను, తెగలు గాను చేశాము.వాస్తవానికి మేలో అందరికంటే ఎక్కువభయభక్తులు కలవాడే, అల్లాహ్ దృష్టి లో ఎక్కువ  గౌరవపాత్రుడు, నిశ్చయంగా అల్లాహ్ సర్వ జ్ఞానం కలవాడు.సకల విషయాలు తెలిసిన వాడు.” -49;13
 అధికత్వం ,బాద్యత కలిగిఉండటం అల్లాహ్ దృష్టి లో భయబక్తులకు,గౌరవ పాత్రతకు(తక్వాకు)  చిహ్నం.

6. ప్రేరణ మరియు నిశ్చయం – పని చేయాలనే నిశ్చయం ప్రేరణకు దారి తీస్తుంది. ఒక మేనేజర్ తన క్రింది  ఉద్యోగులతో వ్యవహరించే తీరు అతని నిశ్చయ శైలి, మరియు అతను కల్పించే ప్రేరణపై అధారపడి ఉండును.
దివ్య కొరాన్ లో ఈ బంగారు సూత్రాన్ని పొందుపర్చటం జరిగింది.
“ప్రవక్త! నేవే గనుక కర్కశుడువు,కఠిన హృదయుడవు అయినట్లైతే వారందరూ నీ చుట్టుపక్కలనుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు , వారినిక్షమించు అని అల్లాహ్ ను సంప్రధించు. ధర్మానికి సంభందించిన  పనిలో వారిని కూడా సంప్రదించు”. – 3;159
క్రింది ఉద్యోగులలో ప్రేరణ మరియు పని పట్ల నిబద్ధతను కల్పించుటను  పై ఆయత్ తేటతెల్లం చేయు చున్నది.

7. ఆజ్ఞా ఏకత్వం – తన అధికారులను, కార్మికులను నడపడానికి సంస్థ ఒకే ఆచరణాత్మక వ్యూహం ను కలిగి ఉంటుంది. 
“ఒకవేళ ఆకాశంలో, భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర  దేవుళ్ళు కూడఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల)రెంటింటి వ్యవస్థ చిన్న బిన్నమై ఉండేదిది”. -21;22
పైన వివిరించిన ఆయత్ ఆజ్ఞా ఏకత్వాన్ని, సరియైన మార్గదర్శకాన్ని చూపుతుంది.

8. వ్యక్తి కన్నా సంస్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యానతను ఇచ్చుట – ఒక సంస్థ ప్రయోజనాల కన్నా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహా ప్రయోజనాలు అధికం కాదు. ఇస్లాం అనగా శాంతి, ముస్లిం అనగా తన్ను తాను భగవంతునికి సమర్పించుకొనుట.
“తనకు కావలసినదే, తన సోదరునికి కూడ కావాలనే కోరుకొనేవాడే నిజమైన  నిజాయతిపరుడు అన్న విషయాన్ని నా జీవితం మీద అధికారం ఉన్న వాని సాక్షిగా ప్రమాణం చేయు చున్నాను” అని ప్రవక్త (స.ఆ.స.)అన్నారు. –హదీసు-బుఖారి

9. పనికి తగిన సరియైన వేతనము -  కార్మికులు తమ శ్రమ కు తగిన సరియైన మరియు సంతృప్తి కరమైన వేతనం పొందాలి.
“కార్మికుని చెమట ఆరక ముందే అతని వేతనం చెల్లించాల” అని ప్రవక్త (స.ఆ.స.) అన్నారు.
ఇది కార్మికులను, ఉద్యోగులను సంతృప్తి పరుస్తుంధి.

10. వృధాను అరికట్టుట – ముడి సరుకు,మానవ శక్తి, ఇందనము, యంత్రపరికరాల ఉపయోగం లో వృధాను అరికట్ట లేక పోయిన వ్యయం పెరిగి, లాభాలు తగ్గును. ఆధునిక కాలం లో టొయోటా సంస్థ ఈ సూత్రాన్ని పాటించి అత్యంత లాభాలు సాదించే తయారీ సంస్థ గా రూపొందినది.
దివ్య కొరాన్ లో వృధాను, అనవసర ఖర్చును తగ్గించే ఆదేశాలు ఇవ్వబడినాయి.
“ఆదాము సంతానామా! ప్రతి ఆరాదనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, అల్లాహ్ మితిమీరిన వారిని ప్రేమించడు” – 7-31
“బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి. పేదవారిపట్ల, బాటసారులపట్ల, మీ విధులను నిర్వర్తించండి. వృధా ఖర్చు చేయకండి”. -17-26
“వృధా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు, షైతాను తన ప్రభువునకు కృతగ్నుడు” – 17-27
పై ఆయతులు ముస్లింలను వృధా ఖర్చు చేయవద్దని ఆదేశించును.

11. మోయలేని భారమును  మోయుట
కొరాన్ లోని ఈ క్రింధి ఆయతులు అధిక భారం పై ఆదేశాలు ఇస్తున్నాయి.
“శక్తికి మించిన భారం ఎవరిమీదా మోపకూడదు”. – 2;233
“ఏ ప్రాణి పైన అల్లాహ్ దాని శక్తి సామర్ధ్యాలకుమించిన బరువు బాద్యతలను మోపడు.......ప్రార్ధించండి ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై పెట్టకు.” – 2;286
పైన వివరించ ఆయతులు ఏ వ్యక్తిని లేదా యంత్రాన్ని అధికంగా వినియోగించ వద్దని సూచించుతున్నాయి. అదే విధంగా పైన వివరించిన విషయాలు మానవ జీవితం లోని అన్నీ రంగాలకు, అన్నీ వృతులకు ఒక విధం గా  చెప్పాలంటే జీవన సత్యం(దీన్)  ను వివరిస్తున్నాయి.

12. సదా నాణ్యతా నిర్వహణ – వినియోగదారుని సంతృప్తి ఒక సంస్థ మనుగడకు, పెరుగుదలకు ఆవశ్యకం అన్నది జగమెరిగిన సత్యం.
నాణ్యతా నిర్వహణ (quality management) ప్రస్తావన దివ్య కొరాన్ లో కూడ కలదు.
“తూకాన్ని, కొలతను పూర్తిగా పాటించండి. ప్రజలకు వారి వస్తువుల విషయం లో నష్టం కలిగించకండి”. 7;85
“నా జాతి ప్రజలారా! అల్లాహ్ ను ఆరాదించండి...... కొలుచుటలో, తూచుటలో తక్కువ చేయకండి.......నా జాతి సోదరులారా! కచ్చితంగా ,న్యాయం గా పూర్తిగా కొలవండి, తూచండి, ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి.భూమి పై సంక్షోభవాన్నివ్యాపింప జేస్తూ తిరగకండి” 11;84-85.
ఒక ముస్లిం వ్యాపారి దృస్టిలో వ్యాపారం అనేది కేవలం తన వినియోగదారులను, తన వ్యాపారాన్ని నిలబెట్టే మార్గం మాత్రమే , మిగతాది అల్లాహ్ చూసుకొనును.
“ఇక ఐహిక సంపదనైతే, తాను కోరిన వారికి లెక్కలేకుండా ఇచ్చే అధికారం అల్లాహ్ కె ఉంది” 2-212
“అల్లాహ్ స్వయంగా ఉపాధి ప్రధాత, గొప్ప శక్తి సంపన్నుడు, అత్యంత ద్రుడమైన వాడు” 51-58
ప్రొఫెసర్ యాకుత్ కిర్బాస్ అబిప్రాయం లో ఆధునిక నాణ్యతా నిర్వహణకు (Modern Quality Management)  సంబందించిన అన్నీ విషయాలు దివ్య కొరాన్ మరియు హదీసులలో లబించును.

13.ఇచ్చిన మాటను, వాగ్ధానములను, ఒడంబడికలను నిలబెట్టు కొనుట – వ్యాపారం సక్రమంగా నిర్వహించాలంటే వ్యాపారి తను చేసిన వాగ్దానములను నిలబెట్టుకోవాలి. డాక్టర్ స్టీఫన్ ఆర్ కోవె అబిప్రాయం ప్రకారం వాగ్ధానభంగము వ్యాపారమును అతిత్వరగా నష్ట పరచును.
దివ్య కొరాన్ ముస్లింలకు వాగ్ధానం పై అనేక ఆదేశాలు ఇచ్చినది.
“విశ్వాసులరా!  కట్టుబాట్లను పూర్తిగా పాటించండి” – 5;1.
“అల్లాహ్ సాక్షి గా చేసిన ప్రమాణాలను దృడపరచిన తరువాత భంగపరచకండి”.  16-91
“చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చండి. నీస్సందేహంగా వాగ్ధానం విషయం లో మీరు సమాదానం చెప్ప వలసి ఉంటుది” – 17-34.

14. అవసరం మించి నిల్వ ఉంచుట – ఇస్లాం ప్రకారం ముస్లిం వ్యాపారి అవసరాన్ని మించి అధిక మొత్తాన్ని  నిల్వ ఉంచుట (hoarding) నేరము.  

దివ్యకొరాన్ లోని ఈ క్రింది ఆయతులను పరిశీలించండి.
“మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి? అని వారు అడుగుతారు. “మీ నిత్యవసరాలకు పొగా మిగిలినది “ అని నీవు వారికి చెప్పు.” -2-219
“వెండి, బంగారాలను పోగు చేసి వాటిని దైవ మార్గంలో ఖర్చు పేట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభ వార్తను అంద జేయండి” 9-34

15. చూడకుండా,పరిశీలించకుండా దేనిని నమ్మ వద్దు.
దివ్యా కొరాన్ ఆదేశం ప్రకారం ప్రతి ముస్లిం తాను పొందిన సమాచారం యొక్క నిజ నిజాలను స్వయం గా వెళ్ళి చూసి  నిర్ధారణ చేసుకోకుండా ఒక అబిప్రాయానికి లేదా నిశ్చయానికి రారాదు
“మీకు తెలియని విషయం వెంటపడకండి. నిశ్చయంగా కళ్ళు, చెవులు, మనసు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది”.  17-36

ముగింపు
          అల్లాహ్ చే అవతరింపబడిన అంతిమ గ్రంధం ఐనా దివ్య కొరాన్ లో అన్నీ సమస్యలకు అనగా వ్యక్తిగత,ఆర్థిక,రాజకీయ లేదా వ్యాపార సమస్యలకు  సమాధానాలు పొందవచ్చును. వాటిని మానవ జీవితంలోని సామాజీక,రాజకీయ, ఆర్థిక అంశాలకు అన్వయించవలసి ఉంటుంది. ఇస్లాం ప్రభోదించిన నిర్వహణా సూత్రాలు (management) సర్వ కాలాలకు, సర్వ దేశాలకు మరియు సర్వులకు వర్తించుతాయి. దివ్యా కొరాన్, హదీసులు చెప్పిన నిర్వహణా సూత్రాలను   గత 1600 సం. ల నుండి  అమలు పర్చటం జరుగుతుంది. 
  
        ప్రపంచీకరణ నేపద్యంలో ఒక ఉన్నతాధికారి (CEO)విశ్వ వ్యాప్తం గా ఉన్న తన సంస్థలను జాగ్రతగా, సమర్ధవంతం గా నిర్వ హించ వలసి ఉంటుంది. ఇస్లాం అందుకు అవసరమైన విజయవంతమైన నిర్వహణ సూత్రాలను అందించును. బిన్న మతవిశ్వాసాలు, బిన్న సంస్కృతులు ఉన్న,  ప్రపంచంలోని  అన్నీ ప్రాంతాల లోని అధికారులకు,క్రింది ఉద్యోగులకు  అవసరమైన నిర్వహణా సూత్రాలను ఇస్లాం అంద చేస్తుంది. దివ్య కొరాన్, హదీసులలోని నిర్వహణ సూత్రాలు సదా శిరోధార్యం.

 రిఫరెన్సు   
·       The Toyota Way by Jeffrey K.
·       Built to Last by Jim Collins.
·       The 8th Habit by Dr. Stephan R. Covey
·       Henri Fayal’s 14 Principles of Management by Mohammad Saad -.
·       Management in Islam by Javed Omar.
·       Wikipedia.
·       Modern Quality Management by Saudi Gazette
·       Principles of Islamic Management by M A C S N O T E.
·   The Inspired Manager, 40 Islamic Principles for Successful Management by Shabeer Ahmad and Maaz Gazdar .
·       దివ్యా ఖురాన్ – TIP-షేక్  హమీదుల్లా షరీఫ్

   6-12-13,13-12-13 గీటురాయి లో ప్రచురితం