3 November 2013

విద్యా,ఉపాధి, సంక్షేమ రంగాలలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలు నిజంగా మైనార్టీలకు(ముస్లింలకు ) చేరుతున్నాయా? ఒక పరిశీలన


.
          6సం:ల పూర్వం కేంద్ర ప్రభుత్వం చే ముస్లింల స్థితిగతుల పరిశీలనకు నియమించబడిన సచార్ కమిటీ తన నివేదికలో బారతదేశం లోని ముస్లింలకు  విద్యా, ఉపాధి, ఆరోగ్య సేవలు, పబ్లిక్ వ్యవస్థాపన, ఆర్థిక సేవల అందుబాటు తనం మొదలగు అంశాలపై నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో పై సేవల రంగంలో ముస్లింల పరిస్థితి యెస్.సి /యెస్.టి.ల కన్నా ఆద్వానంగ ఉందని, ముస్లిం కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారని తెలిపింది. ప్రభుత్వం ముస్లింల పరిస్థితులు మార్చటానికి ప్రత్యేకంగ మైనారిటీ వ్యవహారాల శాఖని, అనేక మైనారిటీ సంక్షేమ పదకాలను ప్రారంభించింది. ఈ సంక్షేమ పధకాలు ఏవిధంగా పనిచేస్తు ఉన్నాయి? సచార్ కమిటీ సమర్పించిన నివేదికలోని కీలక అంశాల పరిస్థితి ప్రస్తుతం ఏ విధం గా ఉంది? అన్న దానిపై పరిశీలన చేద్దాము.

          సచార్ కమిటీ మెంబర్-సెక్రెటరీ,  కమిటీ నివేదిక రూపొందించటం లో ప్రముఖ పాత్ర వహించిన మరియు అమెరికా-భారత సంభందాల సంస్థముఖ్య నిపుణుడైన  ప్రొఫెసర్ అబూసలేహ షరీఫ్ అబిప్రాయం ప్రకారం ముస్లింల  పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రొఫెసర్ షరీఫ్ గారి అబిప్రాయం ప్రకారం ముస్లింలు మరియు  ఎస్.సి./ఎస్.టి. లకు విద్యావకాశాలు మెరుగు పరచిన దేశ (GDP) జి‌.డి.పి. వృద్ధి రేటును 12% వరకు  పెంచవచ్చును. ప్రస్తుతం దేశ జి‌.డి.పి. వృద్ధి రేటులో ముస్లింల భాగస్వామ్య  శాతం 11.2% ఉంది. దళితులుమరియు ఆదివాసీల శాతం 16.5% గా  ఉంది. ఇందుకు ప్రధాన కారణం పై వర్గాలు తక్కువ విద్యా శక్తిని కలిగిఉండటం మరియు సంప్రదాయకంగా  చిన్న,చిన్న, వృతులు అవలంబించడం. సంప్రదాయక సేవా  రంగంలోని కార్మిక శక్తిలో  ముస్లింలు మరియు ఎస్.సి./ఎస్.టి ల భాగస్వామ్య  శాతం 18% ఉండగా, ఆధునిక సేవారంగం లోని కార్మిక శక్తిలో వారి భాగస్వామ్య  శాతం 8% మరియు 14% గా ఉంది.

          2004-05 మరియు 2009-10 మద్య కాలంలో ముస్లిం ఓ‌బి‌సి(MUSLIM OBC)లలో  అక్షరాస్యతా శాతం గ్రామీణ ప్రాంతాలలో 5.9% పెరగగా,పట్టణ ప్రాంతాలలో 5.3% పెరిగింది. అదేకాలంలో దళితుల అక్షరాస్యతా శాతం గ్రామీణ ప్రాంతాలలో8.5% మరియు పట్టణ ప్రాంతాలలో 5.1% పెరిగింది. ఆదివాసులలో అక్షరాస్యతా శాతం గ్రామీణ ప్రాంతాలలో 11.3% పెరగగా,పట్టణ ప్రాంతాలలో 8.6% పెరిగింది.  అనగా పూర్వం దళితులు,ఆదివాసులతో సమానంగా ఉన్న ముస్లింలు ఆక్షరాస్యతలో ప్రస్తుతం  వారికన్నా వెనుక బడి ఉన్నారు.

          పట్టణ ప్రాంతాలలో 10 వ తరగతి పూర్తి చేసిన ముస్లిం విద్యార్డుల సంఖ్య 5% పెరగగా, గ్రామీణ ప్రాంతాలలో 7% పెరిగింది. కానీ 10 వ తరగతి పూర్తి చేసిన దళిత(ఎస్‌సి) విద్యార్ధుల సంఖ్య పట్టణ ప్రాంతాలలో 13% పెరగగా, గ్రామీణ ప్రాంతాలలో 11% కు పెరిగింధి. అదేవిధంగా10 వ తరగతి పూర్తి చేసిన ఆదివాసీ(ఎస్‌టి) విద్యార్థుల సంఖ్య పట్టణాలలో  10% ,గ్రామీణ ప్రాంతాలలో 9% కు పెరిగింది.

          ఉన్నత విద్యను అబ్యసిస్తున్నఅనగా 17-29 సం. మద్య వయసు ఉన్న ముస్లిం ఓబీసీ (MUSLIM OBC) విద్యార్ధులసంఖ్య  1.6% పెరగగా, ఇతర ముస్లిం విద్యార్ధుల సంఖ్య  1% కన్నా తక్కువగా  0.8% మాత్రమే ఉంది. దళిత,ఆదివాసీ విద్యార్ధులలో ఈ శాతం ముస్లింలతో సమానంగా ఉంది.  కానీ హిందువులలో ఉన్నత కులవిద్యార్థులలో  9.4%గాను, హిందూ వెనుకబడిన కులవిద్యార్థులలో  (HINDU OBC) లలో 5.3% గా ఉంది.

          ఉపాధి విషయంలో ముస్లింలు, అతి తక్కువ వేతనం పొందే ఉద్యోగాలలో ఉన్నారు. 25%ముస్లిం కుటుంభాలకు  ఉపాధి,  స్వయం ఉపాధి మరియు వ్యవసాయేతర రంగాలనుంచి (కుల వృత్తుల నుంచి) లబించుచున్నది మరియు 23% ముస్లింలు వ్యవసాయ కూలీలు గా ఉపాధి పొందుతున్నారు. 14% మంది దళితులు, 6% ఆదివాసీయులు స్వయం ఉపాధి, మరియు వ్యవసాయేతర రంగాలనుంచి (కుల వృత్తుల నుంచి)  ఉపాది పొందుతున్నారు మరియు  36% దళితులు, ఆదివాసీలు వ్యవసాయ కూలీలు గా ఉపాధి పొందుతున్నారు.

          పట్టణ ప్రాంతాలలో 45% మండి ముస్లింలు , ఇతర అన్నీ వర్గాలకన్నా అదికంగా  స్వయం ఉపాధి పొందుతున్నారు.వీరు  చిన్న చిన్న వ్యాపారాలు, రిపైర్లు చేస్తున్నారు. కానీ స్థిర లేదా ఎక్కువ వేతనం  లబించే ఉద్యోగాలలో వీరి సంఖ్య ఇతర వర్గాల వారి కన్నా అతి తక్కువ గా ఉంది.

          2009 నుంచి  NSSO డాటా పరిశీలించిన పట్టణ ప్రాంతాలలో   88% మంది ముస్లింలు అనగా 15 సం, ఆపై వయసు ఉన్న వారు , ఇతర వర్గాల వారికన్న అధికంగా సాధారణ (informal) ఉద్యోగాలలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలు, ఇతర అన్నీ వర్గాల వారికన్న తక్కువుగా అనగా కేవలం 6% మాత్రమే ఉన్నారు.ఆఖరకు   గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి ని కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పధకం లో కూడా ముస్లింలకు తగినంత ప్రాతినిద్యం లేదు, కేవలం 2.3% ముస్లిం కుటుంభాలవారికి మాత్రమే  ఉపాధి లబించుచున్నది.  
         
          మైనారిటీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పధకాలలో కూడా అయోమయం,గందరగోళం కలధు. ఉదా: మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాలు(MCD) 2 రకాలుగా   కలవు.  ఒక దాంట్లో అనగా 90 జిల్లాలలో 52% మంధి ముస్లింలు, 3.3%  క్రైస్తవులు కలరు. మరొక  దాంట్లో అనగా 66% మండి ముస్లింలు, 11% మంధి క్రైస్తవులు కలరు. ఈ 121 జిల్లాలలో ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం అమలులో ఉంది, ఈ జిల్లాలలో ప్రధాన మంత్రి ప్రకటించిన మైనారిటీల 15 సూత్రాల అబివృద్ధి పధకంలో, మైనారిటీలకు  ఆర్ధిక సేవల విస్తరణ అనగా ఋణ సదుపాయం కల్పించటం  ఒక ప్రధాన సూత్రం . ఆర్‌బి‌ఐ(RBI) నివేదిక ప్రకారం  ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం అమలులోఉన్న 121 జిల్లాలలో 2008సం.లో  ముస్లింలకు వ్యక్తిగత రుణం 50,000 రూపాయలు లబించగా 2011సం. లో అది 1,00,000 రూపాయలకు పెరిగింధి.  కానీ ఇదే జిల్లాలలో హిందువులకు లబించే ఋణ సదుపాయం 2008 లో 2,30,000 రూపాయలు కాగా, 2011లో 2,70, 000 రూపాయలకు పెరిగింధి.

          కేంద్ర ముస్లిం మైనారిటీ శాఖకు 2008-09 లో 500 కోట్ల రూపాయల కేటాయింపులు జరగగా, 2012-13 లో3,313 కోట్ల రూపాయల కేటాయింపు జరిగినధి. కానీ 2011-12 లో ప్రతి ముస్లిం పై వాస్తవంగా 230 రూపాయలు ఖర్చు పెట్టినారు. 2011-12 లో కేంద్ర మైనారిటీ  శాఖ కు జరిగిన కేటాయింపు లలో 20% నిధులు ఖర్చు కాలేదు, మరియు దేశ వ్యాప్తంగ ఉన్న ముస్లింలలో 50% మంధి కూడా ప్రయోజనం పొంధ లేదు. అన్నిరంగాలలో అబివృద్ధి పధకం (ముల్టీ-సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద కేంద్ర మైనారిటీ శాఖ కు 2011-12 లో  2996 కోట్ల రూపాయలు లబించగా కేవలం 44% మాత్రమే ఖర్చు అయినధి. విద్యార్ధుల స్కాలర్ షిప్ ప్రోగ్రాం లో మాత్రం కేటాయింపులకు మించి ఖర్చు అయినధి.

నవంబర్ 16-30 తెలుగు ఇస్లామిక్ వాయిస్  లో ప్రచురితం 


  

No comments:

Post a Comment