11 November 2013

మైనార్టీ నిధులను ఖర్చు పెట్టని రాష్ట్రాలు


         
          12వ ప్రణాళికలో భాగంగా మైనారిటీ సంక్షేమ పధకాలు మరియు ప్రధాన మంత్రి 15 సూత్రాల అబివృద్ధి పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధులలో 41% నిధులు ఇంతవరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదని ఈ మద్య వివిద రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడైనది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన అస్సామ్, డిల్లీ ,ఉత్తరాఖండ్, మైనారిటీ సంక్షేమ నిదుల వినియోగ సూచికలో బాగా వెనుక బడి ఉన్నాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన బీహార్, యూ.పి.. కూడా నిధుల వినియోగం విషయంలో వెనుకబడిఉన్నాయి. బీహార్లో ముస్లిం జనాభా 20 జిల్లాలలో  అధికంగా(MCD) కలదు. యూ.పి., లో ముస్లిం జనాభా అదికంగా(MCD) 45 జిల్లాలలో  కలదు.  కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకన్నా మిన్నగా మైనారిటీ  నిధుల వినియోగ సూచికలో వరుసగా 9,13 స్థానాలు ఆక్రమించినాయి. దీనిపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంధోళన వెళ్లబుచ్చారు.
          వచ్చేఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ తన అధికారులను, నిధుల వినియోగం పై పర్యవేక్షణ జరపమని, నిధులను రాష్ట్రాలకు త్వరగా విడుదల చేయ మని కోరింది. నిధుల వినియోగం పై రాష్ట్రాలు అవలంభిస్తున్న అలసత్వం,అశ్రద్ధల పట్ల కేంద్ర అధికారగణం అంధోళన వ్యక్తం చేసింది. 2013-14 సం: లో మొదటి దఫా విడుదల చేసిన 638 కోట్ల రూపాయలు, 2వ దఫా విడుదలచేసిన 773 కోట్ల రూపాయలకు సంబంధించిన నిదుల వినియోగ సర్టిఫికట్ ను (Funds Utilization certificate) ఇంత వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు  కేంద్రానికి సమర్పించలేదు..
          25% అంతకు మించి మైనారిటీ జనాభా ఉన్న 90 జిల్లాలు, 338 పట్టణాలు, 1228 బ్లాకులకు సంబందించి వివిధ రాష్ట్రాలకు కేంద్రం నిధులు అంద చేస్తుంధి. మైనారిటిల  సామాజిక, ఆర్థిక అబివృద్ధిలో బాగంగా అక్షరాస్యత,త్రాగునీరు,విద్యుత్ మరియు గృహనిర్మాణ రంగాలలో అబివృద్ధి చేయటానికి కేంద్రం 90 జిల్లాలనుంచి 196 జిల్లాలకు సంక్షేమ పధకాలను విస్తరించినది.
         సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో ముస్లింల వెనుకబాటుతనం గురించి వివరించిన సచార్ కమిటీ నివేదిక సమర్పించిన 8 సం: ల తరువాతకూడా ముస్లింల పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇటీవల ముస్లింల పరిస్థితులపై సమర్పించిన నూతన నివేదికలో UPA ప్రభుత్వం ముస్లింలకు సంక్షేమ పదకాలను వర్తింపచేయడంలో వైఫల్యం  చెందినదని తెల్పింది. ఆ నివేది ప్రకారం ముస్లిం మైనార్టీలకు కేటాయించిన నిధులు, ఇతరులకు అనగా మెజారిటీ వర్గాలకు లేదా ముస్లిమేతర మైనారిటీ వర్గాలకు అనగా సిక్కు, జైన్,పార్సి లకు  అందినట్లు తెల్పింది.   
          “2012సాంఘిక అబివృద్ధి నివేదిక -ముస్లింల వెనుకబాటు: రూపొందించిన  ఉన్నత విద్యావేత్తలైన  జోయ హుస్సైన్, ముషిరుల్ హాసన్, తన్వీర్ ఫజల్, జావేద్ ఆలం ఖాన్, అబు సాలెహ షరీఫ్ ల అబిప్రాయం ప్రకారం మైనారిటీ ముస్లింల విద్యాశక్తి ని పెంచటానికి కేటాయించిన  నిదులు  ఎక్కువ మంది విద్యార్థులు చదువుకొనే సాదారణ విద్యకు (General Education) కాకుండా  కేవలం 4% విద్యార్ధులు చదువుకొనే మతవిద్యను భోదించే మదరసాల ఆధునీకరణకు వాడడం జరిగింది. అదేవిదంగా  ఉన్నత హిందూ కులస్తులతో సమానమైన ముస్లిమేతర మైనారిటీ వర్గాలకు అనగా సిక్కు, జైన్,పార్సి లకు  బ్యాంకుల ద్వారా ఆదిక రుణసధుపాయం కల్పించటం జరిగినది. కేవలం ఒక్క  డిల్లీ లోనే మైనారిటీ లకు కేటాయించిన రుణాలలో 54% రుణాలు మైనారిటీ  లలో 4% మాత్రమే కల   జైనులకు  కేటాయించడం జరిగినది. 


No comments:

Post a Comment