టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన కేంద్ర
ప్రభుత్వసంస్థ (NSSO) సర్వే ప్రకారం భారత దేశం
లోని విబిన్న మత వర్గాలలో అత్యంత కనీస
జీవన ప్రమాణ స్థాయి కలిగి,
ఒక ముస్లిం సరాసరి ఒక రోజు ఖర్చు పెట్టె మొత్తం 32.66 రూపాయలు కాగా హిందువులు
37.50రూపాయులు, క్రైస్తవులు 51.43,
సిక్కులు 55.30 రూపాయలు గా ఉంది. ముస్లింల నెలసరి సగటు ఖర్చు 980 రూపాయలు, హిందువులు, క్రైస్తవుల నెలసరి సగటు ఖర్చు 1125
మరియు 1543 రూపాయలు గా ఉంది. NSSO సర్వే ప్రకార మొత్తం
భారతదేశం లో సరాసరి సగటు నెలసరి ఖర్చు 901 రూపాయలు గా గాను,
గ్రామీణ ప్రాంతాలలో ఖర్చు 1773 రూపాయలు గా గాను. మొత్తం మీద సరాసరి సగటు నెల ఖర్చు
1128 గా ఉంది. పట్టణ ప్రాంతాలలో, ముస్లింల సరాసరి నెలసరి
సగటు ఖర్చు 1272 రూపాయలు మరియు హిందువులు 1797
రూపాయలు గా ఉంది. క్రైస్తవులు 2053, సిక్కులు 2180 రూపాయులు
సరాసరి నెలసరి సగటు ఖర్చు గా కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో హిందూ, ముస్లింల సరాసరి నెలసరి సగటు ఖర్చు 888 మరియు 833 రూపాయలు గా ఉంది.
క్రైస్తవులు 1296, సిక్కులు 1498రూపాయులు సరాసరి నెలసరి సగటు
ఖర్చు గా కలిగి ఉన్నారు.
సరికొత్త సర్వే ప్రకారం ముస్లింలలో
నిరుద్యోగిత శాతం గ్రామీణ ప్రాంతాలలో 2004-05 లో 2.3% ఉండగా 2009-10 లో 1.9% కు
తగ్గింది. పట్టణ ప్రాంతాలలో 4.1% నుంచి 3.2% కు
తగ్గింది. కానీ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆదిక శాతం ముస్లింలు, ఇతర మతస్తులతో పోలిస్తే సంఘటిత రంగం లో లేరు. గత 5 సం. లలో హిందువుల
నిరుద్యోగిత శాతం గ్రామాలలో 1.5%, పట్టణాలలో 4.4% నుంచి 3.4%
కు. తగ్గింది.
సర్వే
ప్రకారం ముస్లింలలో ఆదిక శాతం స్వయం ఉపాధి లోనూ,
మరియు గ్రామీణ ప్రాంతాలలో కార్మికులు (లేబర్) గాను ఉన్నారు. భారత దేశం లోని పట్టణ, నగర
ప్రాంతాలలో స్థిర ఆదాయం లేక వేతనం పొందే వారిలో ముస్లింలు అట్టడుగున ఉన్నారు.
ముస్లిం కుటుంబాలు 30.4% స్థిర ఉద్యోగాలలో (Regular wage/salaried)ఉండగా, సిక్కులు 35.7%,హిందువులు41%, క్రిస్టియన్లు 43% ఉన్నారు. అయితే పట్టణాలలో స్వయం ఉపాధి పొందే ముస్లిం
కుటుంభాల సంఖ్య 46% మిగతా వారికన్న అత్యధికంగా ఉంది.
గ్రామాలలో
41% మంది ముస్లింలు గ్రామీణ కార్మికులుగా (రూరల్ లేబర్) 46.5% మంది స్వయం ఉపాధి రంగం లో ఉన్నారు. సర్వే ప్రకారం ముస్లింలు మినహాయించి
మిగతా అన్నీ వర్గాలు వ్యవసాయ రంగం లో
స్వయం ఉపాధి కల్పించు కొన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా 48% మండి సిక్కులు
స్వయం ఉపాధి ని కల్పించుకొనగ అంధులో 36% వ్యవసాయం లో స్వయం ఉపాధిని
కల్పించుకొన్నారు. హిందువులు 33%, క్రైస్తవులు 30% వ్యవసాయం
లో స్వయం ఉపాధిని కల్పించుకొన్నారు
అహ్మదాబాద్ IIMలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ మరియు భారత దేశం లో ముస్లింల స్థిగతులను
పరిశీలింకిన సచార్ కమిటీ లో సభ్యుడైన రాకేశ్ బసంత్ అబిప్రాయంలో ముస్లింలు స్వయం ఉపాధి
పై అధికంగా అధారపడటానికి ప్రధాన కారణం విద్యా రంగంలో వారి వెనుకబాటుతనం మరియు
స్వయం ఉపాధి పై మక్కువగా చెప్పవచ్చును. విద్యావకాశాలు అతి తక్కువుగా ఉండటం, వారు నివసించే ప్రాంతాలలో సరియైన స్కూళ్ళు లేకపోవటం కూడా ఒక కారణం గా
చెప్పవచ్చును. మంచి స్కూళ్లను స్థాపించిన వారిలో విద్యాశక్తి పెరుగును.
భారత దేశం లోని పట్టణ, నగర ప్రాంతాలలో నెలసరి స్థిర
ఆదాయం లేక వేతనం(Regular wage/salaried) పొందే వారిలో ముస్లింలు 30.4% మాత్రమే ఉన్నారు,ఇది
ఇతర మత వర్గాల వారికన్న చాలా తక్కువ. న్యూ డిల్లీలోని CRDD సంస్థ ప్రొఫెసర్ అబు సాలెహ షరీఫ్
అబిప్రాయం లో స్థిర ఆధాయం లేక వేతనం పొందటంలో ముస్లింల పట్ల చూపుతున్న వివక్షత
దీనికి కారణం గా చెప్పవచ్చును. ఉద్యోగ మార్కెట్ లోని ఒదుదుడుకులు, తగిన అర్హతలు లేకపోవటం, వ్యవస్థలో ముస్లింల పట్ల గల
వివక్షత దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును. ఆఖరుకు గ్రామీణ ఉపాధి పధకం లో కూడా
ముస్లింలకు తగినంత ఉపాధి లభించుట లేదు.
గ్రామీణ ఉపాధి పధకం లో ఉపాధి పొందిన ముస్లిం కుటుంభాల సంఖ్య 2.4% కన్నా అధికంగా లేదు.
ముస్లింలలో
వైట్ కాలర్ ఉద్యోగాలు అతితక్కువుగా లబించటానికి ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా
కలవు. మొదటిది కులము. ముస్లింలలో ఆదికశాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారు ఉదా:
నేత,కసాయి,కంసాలి, కమ్మరం
మొదలగునవి. వారిలో మొదటినుంచి విద్యాశక్తి చాలా తక్కువ దానికి తోడు వారి పరిసరాలు మరియు మంచి స్కూళ్ళు లేకపోవడంగా
చెప్పవచ్చు.
రెండవదిగా మతాన్ని పేర్కొనవచ్చును.
ప్రవక్త మహమ్మద్ (స.అ.స.) స్వయంగా వృత్తిరీత్యా ఒక వ్యాపారి. దానితో ముస్లింలు
సహజం గా వ్యాపారంపట్ల ఆసక్తి చూపుతారు. దావూది బోహ్రా మత పెద్ద తన అనుచరులైన బోహ్రాలను ఉద్యోగాలు బదులు వ్యాపారాలు చేయమని
ప్రోత్సహించేవారు. ఉద్దేశపూర్వకంగా
ఉద్యోగాలు నిరాకరించేవారు.
కాల్ సెంటర్ ఉద్యోగాలలో మాత్రం ముస్లిం
ఉద్యోగుల సంఖ్య తగినంతగా ఉంది అని చెప్పవచ్చును. ముస్లింల పట్ల వివక్షత ఉన్న మాట
వాస్తవం కానీ అదే వైట్ కాలర్ ఉద్యోగాలలో
వారి వెనుకబాటుకు ప్రధాన కారణం కాదు అని చెప్పవచ్చును.
No comments:
Post a Comment