11 November 2013

కేంద్ర ప్రభుత్వ మరియు పోలీసు దళంలో తగ్గుతున్న ముస్లిం ఉద్యోగుల సంఖ్య


  
        సచార్ కమిటీ నివేదికలోని సిఫార్సులు ముస్లింల పాలిట ఆశాజ్యోతులుగా,ముస్లింల సమగ్ర అబివృద్ధికి మైలు రాళ్ళు గా పరిగణించటం జరిగింది. కమిటీ నివేదికను సమర్పించి 7 సం: గడచిపోయినాయి కానీ వివిద కేంద్ర ప్రభుత్వ శాఖలలో ముస్లిం ఉద్యోగుల సంఖ్య క్రమంగా ఇంకా తగ్గుతూ వస్తున్నది మరియు అన్నీ శాఖలలోనూ ముస్లిం ఉద్యోగులు గతం కన్నా ఇంకా తక్కువ గా ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఇది చాలా శోచనీయమైన ఆంశము.

          కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నినోంగ్ ఎరింగ్ లోక్ సభ లో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ వివిధ మంత్రిత్వ శాఖలలోనూ, విద్యాసంస్థలలోనూ ముస్లింల ప్రాతినిద్యం వారి జనసంఖ్యకు తగినట్లుగాలేదని తెలిపారు. 2009-10 లో వివిధ మంత్రిత్వ శాఖలలోనూ, ప్రభుత్వ బ్యాంకులలోనూ, రైల్వేలలోనూ,పారా సైనిక దళాలలోనూ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థ లలోనూ ముస్లిం ఉద్యోగుల సంఖ్య  7.28% గా ఉండగా,అది  2010-11లో 10.18% గా ఉంది. కానీ  2011-12 లో అది 6.24% తగ్గిపోయినది. కొన్ని మాసాల క్రిందట కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పి. రహమాన్ ఖాన్ మాట్లాడుతూ సచార్ కమిటీ చేసిన 72 సిఫారసులలో కేంద్రం 66 సిఫారసులను అమలు పరచినదని పేర్కొన్నారు. సచార్ కమిటీ సిఫార్సుల అమలు నిభద్ధతను పై గణాంకాలు తెల్పుతున్నాయి.

సచార్ కమిటీ తన నివేదికను 2006 లో సమర్పించినపుడు అది పోలీసు దళం లోనూ ఇతర రంగాలలో ముస్లింల దమనీయ స్థితిని తెల్పింది. ముస్లింలు అదికంగా ఉన్న ప్రాంతాలలోని పోలీసు స్టేషన్లలో ఉన్నతాధికారులుగా ముస్లింలను నియమించమని తద్వారా ముస్లింల మనోబలాన్ని పెంచమని సూచించింది. ప్రభుత్వం కూడా అనేక వేదికల పైన పోలీసులలోనూ, ఇతర రంగాలలోనూ ముస్లింలకు తగినంత ప్రాతినిద్యం కల్పించుతామని వాగ్ధానం చేసింది.  “ప్రధాన మంత్రి 15 సూత్రాల ముస్లిం అబివృద్ధి పధకం” లో భాగంగా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు దళాల ఎంపికలో ముస్లింలకు తగు ప్రాతినిద్యం కల్పించమని, మరియు ఎంపిక కమిటీలో అల్పసంఖ్యాక వర్గం వారిని నియమించమని స్పష్టంచేసింది.
           
         
          2007 లో దేశం మొత్తం లోని పోలీసు దళం సబ్యుల సంఖ్య  13.4 లక్షలు కాగా అందులో  ముస్లింల సంఖ్య 1.01 లక్షలు అనగా వీరి శాతం7.55%మాత్రమే. 2012 నాటికి దేశవ్యాప్తంగా పోలీసు దళం లోని సభ్యుల సంఖ్య 24% పెరగగా, ముస్లింల సంఖ్య 1% తగ్గి 6.5% మాత్రమే ఉంది. గత 5 సం: లలో దేశవ్యాప్తం గా 3.26 లక్షల పోలీసుల నియామకం జరగగా అందులో 2.18% అనగా కేవలం 7312 మంది  ముస్లింలు మాత్రమే పోలీసులుగా ఎంపిక అయినారు.

            NCRB (National Crime Records Bureau) జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం జూలై2012, నాటికి డిల్లీ పోలీసుల సంఖ్య 75,117 కాగా అందులో ముస్లిం పోలీసు అధికారుల సంఖ్య కేవలం 2% మాత్రమే అనగా 1521 అధికారులు మాత్రమే. మహారాష్ట్ర పోలీసులలో ముస్లింల సంఖ్య కేవలం 1%మాత్రమే. యూ.పి., లో ముస్లిం పోలీసుల సంఖ్య 4.8% మాత్రమే.బీహార్ లో అది 4.5% గా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం పోలీసుల సంఖ్య 10% ఉండగా, కర్ణాటకలో అది కేవలం 6.4% మాత్రమే. రాజస్తాన్ లో అత్యంత తక్కువ అనగా  అది1.2% గానే ఉంది.జమ్ము-కాశ్మీర్ లో మాత్రం ముస్లిం పోలీసుల సంఖ్య అత్యంత అధికం గా అనగా 60% ఉండగా, అఖిల భారత స్థాయిలో ముస్లిం పోలీసు అదికారుల సంఖ్య కేవలం 6% మాత్రమే ఉంది.

22-11-13 గీటురాయి లో ప్రచురితం 





No comments:

Post a Comment