11 November 2013

మైనారిటీల అబివృద్ధికి నూతన పధకం – మల్టీ -సెక్టరల్ డెవలప్మెంట్ పధకం (Multi –Sectoral Development programme)



కేంద్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీలు అదికంగా ఉన్న (MCD) దేశం లోని 710 బ్లాకులు,66 పట్టణాలలో 5775 కోట్ల రూపాయల నిధితో ఒక నూతన మైనారిటీ సంక్షేమ పధకం,మల్టీ -సెక్టరల్ డెవలప్మెంట్ పధకం (Multi –Sectoral Development programme) ప్రారంబించనుంధి. ఇందుకుగాను మొదటి విడతగా  కేంద్ర ప్రభుత్వం వచ్చే 9 నెలలలో 1250 కోట్ల రూపాయయాలను ఖర్చు పెట్టడానికి, అంగీకరించింది. ఈ నిదులను  ప్రత్యేకించి మైనార్టీటీలకు విద్యా,ఆరోగ్య రంగాలలో  మరియు వృతి శిక్షణ ఇవ్వడనానికి ఖర్చు పెట్టవలసి ఉంటుంధి. .ఈ కార్యక్రమ అమలును పర్యవేక్షించడానికి, నేరుగా కేంద్ర  మైనారిటీ సంక్షేమ శాఖ కు నివేదించడానికి  పట్టభద్రులైన (Graduate) 776 ఫెసిలిటెటర్స్ ను నియమించడం జరుగు తుంధి.
దేశవ్యాప్తంగా మైనారిటీలు అదికంగా ఉన్న 90(MCD)జిల్లాలను,196 జిల్లాలుగా   విస్తరించి, 710 బ్లాకులు, 66 పట్టణాలలో మైనారిటీ సంక్షేమ పధకాలను వేగవంతంగా, విజయవంతం గా అమలుచేయటానికి కేంద్రం అత్యంత ఆసక్తి చూపుతున్నదని మైనారిటీ శాఖ మంత్రి అన్నారు. అయితే వచ్చేఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందడానికి కేంద్రం ఈ పధకాన్ని ప్రారంబించినదని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు ఆరోపించుచున్నాయి.  ఫెసిలిటెటర్లు గా స్థానిక కాంగ్రెస్ వారిని నియమించుతుందని వారు  భావిస్తున్నారు.   కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు అదికారంలో ఉన్న  యూ.పి., బీహార్,వెస్ట్ బెంగాల్ లోని 370 బ్లాకులు,26 పట్టణాలలో, గుజరాత్ లోని కచ్ జిల్లాలోని 4 బ్లాకులలో  ఈ పధకం ప్రారంబించబడుతుంది 
మైనారిటీ నిధుల వినియోగం లో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వాన్ని,అశ్రద్దను ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పి. రహమాన్ ఖాన్ ఆరోపించారు అందువల్ల మైనారిటీ సంక్షేమ పధకాలను కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలు గా  మార్చడం జరుగుతుందని కేంద్ర మంత్రి అన్నారు.  రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ పధకాన్ని ప్రారంబించటానికి తన వాటా క్రింద కేటాయించవలసిన 25% నిదులను కేటాయించటానికి గుజరాత్ ప్రభుత్వం  ఇష్టపడుట లేదని, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత అస్సామ్ ప్రభుత్వం తన రాష్ట్రంలోముస్లింలు అదికంగా ఉన్న (MCD) 118 బ్లాకులలో మైనారిటీ సంక్షేమ నిదులను కేంద్రం నుంచి పొందడంలో ఆసక్తిని చూపుట లేదు అని మంత్రి అన్నారు. 

22-11-2013 గీటురాయి లో ప్రచురితం 
.
.
 



No comments:

Post a Comment