దేశవ్యాప్తంగా
2001 దేశ జనాభా లెక్కల ప్రకారం దేశాజనాభాలో 13.34% మంది ముస్లింలు.
2009 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికైన
ముస్లిం సభ్యుల సంఖ్య 29. మన్మోహన్ సింగ్ మంత్రివర్గం లోనే ముస్లిం మంత్రుల
సంఖ్య 6, వీరిలో 3గురు కాబినెట్ మంత్రులు కాగా, 3గురు సహాయ
మంత్రులు.
మనదేశం లోని మొత్తం 28 రాష్ట్రాల మంత్రిమండలులలో 13
రాష్ట్రాలలో ముస్లిం మంత్రులు లేరు. బిజేపి పాలిత నాలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ
తరుపున ఒక్క ఎంఎల్‌ఏ గాని, మంత్రివర్గం లో ఒక్క మంత్రి
గాని లేరు. అన్నీ రాష్ట్రాలలో మొత్తం 609 మండి మంత్రులు ఉండగా అందులో కేవలం 57
మండి మాత్రమే ముస్లింలు అనగా వారి శాతం9.35%మాత్రమే. ముస్లింలు అధికంగా మంత్రులు
గా ఉన్న రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అక్కడ 18 మంధి మంత్రులుగా కలరు. జమ్ము-కాశ్మీర్
ను మినహాయిస్తే దేశం మొత్తం మీద ముస్లిం మంత్రుల సంఖ్య 39.
బిజేపి పాలిత రాష్ట్రాలలో
. బిజేపి పాలిత రాష్ట్రాలలో అనగా గుజరాత్ లో ముస్లింల సంఖ్య
9.06%, ఛత్తీస్ ఘర్ లో 4.97%,గోవా లో 6.84%,మద్యప్రదేశ్ లో 6.37%, కానీ ఈ రాష్ట్రాలలో బిజేపి
తరుపున ఒక్క ఎంఎల్‌ఏ గాని, మంత్రి గాని లేరు.పంజాబ్ లోని
ఆకాలీదళ్-బిజేపి పాలిత రాష్ట్రంలో కూడా ఒక్క ముస్లిం మంత్రి లేదు, కానీ పంజాబ్ లో అకాలీదళ్ తరుపున ఒక ముస్లిం ఎంఎల్‌ఏ కలరు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో
ఉత్తరాఖండ్ రాష్ట్రం లో 11.92% ముస్లిం జనాభా కలదు. కాంగ్రెస్
తరుపున ఎంఎల్‌ఏ లు కలరు కానీ మంత్రులు లేరు. హిమాచల్ ప్రదేశ్ లో 2% ముస్లిం జనాభా
కలదు, కానీ ముస్లిం మంత్రి లేదు. హరియానా రాష్ట్రంలో ముస్లింల జనాభా 5.78%ఉండగా
ఒకే ఒక్క ముస్లిం మంత్రి కలదు. ఆంధ్ర ప్రదేశ్ లో 10% ముస్లిం జనాభా కలదు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం మంత్రుల సంఖ్య(
1 ) ఒకటి మాత్రమే. అస్సామ్ రాష్ట్ర జనాభా
లో ముస్లిం ల అధికంగా 30.9% కలదు కానీ అస్సామ్ లో 3 ముస్లిం మంత్రులు కలరు.డిల్లీ
మంత్రివర్గం లో ముస్లిం మంత్రుల సంఖ్య 1 మాత్రమే.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో
ఉత్తర్ ప్రదేశ్ లోని ముస్లిం మంత్రుల సంఖ్య 10, ఆ రాష్ట్ర జనాభా లో ముస్లిం జనాభా 18.55% కలదు. కేరళ జనాభాలో 24.6%
ముస్లింలు, కానీ మంత్రి వర్గం లో ముస్లింల సంఖ్య 5, పశ్చిమ బెంగాల్ లో ముస్లింల సంఖ్య 25%, కానీ
ముస్లిం మంత్రుల సంఖ్య 5 మాత్రమే. బిహార్
లో ముస్లిం మంత్రుల సంఖ్య 2 మాత్రమే.
ఈశాన్య రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎంఎల్‌ఏ గాని, మంత్రి గాని లేరు. ఒక్క మేఘాలయలో మాత్రం ఒక్క ముస్లిం ఎంఎల్‌ఏ కలరు, అతను ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్.
దేశంలోని ముస్లింల సామాజీక, ఆర్థిక,విద్యా, రాజకీయ పరిస్తితులను పరిశీలించిన ముస్లింల
దుస్థితి ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి, ల కన్నా దుర్భరంగా ఉన్నదని సచార్ కమిటీ నివేదిక స్పష్టం
చేసినది.ఇప్పటికైనా కేంద్రం లో అధికారంలో ఉన్న యూపిఏ-2 ప్రభుత్వం కళ్ళు తెరచి
రాష్ట్ర శాసనసభలు,రాష్ట్ర మంత్రివర్గాలు,కేంద్ర శాసనసభ,కేంద్ర మంత్రివర్గం లో
ముస్లింలకు వారిజనాభాకు తగినట్లు
ప్రాతినిద్యం కల్పించవలెను. ఇందులకు గాను అవసరమైన రాజ్యాంగంలో మార్పులు చేసి
నైష్పత్తిక ప్రాతినిద్య పద్దతిని అమలులోకి తీసుకొని రావలయును.
-29-11-13 గీటురాయి లో ప్రచురితం
-29-11-13 గీటురాయి లో ప్రచురితం
.
No comments:
Post a Comment