21 November 2013

కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం




కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం .దినం గడిచిపోయాక మరుసటి రోజును ఎదుర్కొటానికి నిన్నునీవు సన్నద్ధం చేసుకొంటె ,  నువ్వొక జయశీల నాయకుడివి అని గుర్తించుకో. - Abdul Kalam

 

ఈమద్య ఉత్సాహవంతులైన యువతీ యువకులు  ఎక్కువగా నాయకత్వ లక్షణాల గురించి అధ్యయనం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితేనాయకుడు అంటే ఎవరు? నాయకుడంటే వెంటనే తయారై పోతారనుకోవద్దు. దానికి ఎంతో అవగాహన, అనుభవం, నైపుణ్యం అవసరం. వాటితోపాటు అందుకు తగిన వాక్చాతుర్యం, నేర్పు, ఓర్పు అన్నీ ఉండాలి. విజయాలకే కాదు. అపజయాలకూ కూడా  ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నిండుగా వుండాలి  నాయకత్వమంటే నిరంతర అబ్యాసనమే.”
          నాయకుడు అంటే తన సామర్ధ్యంతో ఇతరులలో ప్రేరణ కలిగించి, ఇతరులను ముందుకు నడిపించగలిగిన వారే నాయకులు. ఒక సంస్థను అబివృద్ధి పరచడానికి తగిన కృషి  చేస్తూ, సాటి వారిలో ప్రేరణ కల్గిస్తూ ముందుకు తీసుకు పోయే వ్యక్తే నాయకుడు.  నాయకత్వం అంటే కలలను కనటమే కాదు, కలలు అందరికీ వస్తాయి. కలలను నిజం చేసుకొనే చర్యలను వ్యవస్థీకృతo  చేసుకోవడమే నాయకత్వం. హెర్మన్‌ మాక్స్‌ టిప్రీ మాటల్లో చెప్పాలంటే 'వాస్తవస్థితిని నిర్వచించడమే నాయకుని కర్తవ్యం'. రెండు వేల ఏళ్ళ క్రితం నాటి చైనా నానుడి ఒకటుంది. 'వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా శక్తిపుంజుకోండి'. మనం మొదట మనకే నాయకులం, ఆ తర్వాతే మనవెంట వున్న వారికి నాయకులం.
          ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న కొద్దిలో ఎక్కు వ చేయవలసి రావడం, పై నుంచి వచ్చేఆదేశాల ఒత్తిడిని ఎదుర్కోవడం, నిరంతరం వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తన్ను తాను లేదా సంస్థను  సరిదిద్దుకోవటం(update), లేదా  సమస్యల క్లిష్టత నుంచి బయటపడటం అన్నిటికన్నా ముఖ్యంగా  ఆర్థిక అవాంతరాలు ఎదుర్కొని సంస్థను ముందుకు నడిపించటం మరియు తనపై లేదా సంస్థ పై తగ్గుతున్నవిశ్వాసంను పెంచటం  మొదలగునవి  నాయకత్వానికి ఎదురవుతున్న పెను సవాళ్ళు లేదా అవరోధాలు గా పేర్కొనవచ్చును.   
మంచి నాయకుడి లక్షణాలు  
నిరంతరం సంస్థ ప్రగతి గూరించి ఆలోచిస్తూ, తన ఆలోచనలను సబ్యులకర్థమయ్యేల్లా చెప్పి,వారిని  అదే విధము గా  ఆలోచించేలా చేసి సంస్థను ప్రగతి పధం వైపు నడిపించడమే నాయకుడి ప్రదమ లక్షణం. నాయకుడు మొదట తాను మారి చూపించినతరువాత ఇతరులను అనగా అనుచరులను మారమని కోరాలి.   విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదగుతారు. పురోభివృద్ధికి తోడ్పడుతారు.
క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ముఖ్యమైనవి. సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. నాయకుడు పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి .నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. దూరదృష్టి కూడా ఉండాలి. సమస్యలు గుర్తించడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
ఎప్పటికప్పుడు మీ బలం, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. బలహీనతలను టీమ్‌ సభ్యులపై రుద్దకూడదు. వాటికి కారణాలు పరిశీలించి లోపాల్ని సరిదిద్దుకోవాలి   ఎవరైతే తన శ్రేయస్సు కోసమే కాక ఇతరుల మంచికోసం కూడా ప్రయత్నం చేస్తారో వారే నిజమైన నాయకులు.నాయకుడైనంత మాత్రాన అదేదో గొప్ప పదవిగా ఊహించుకొని ఇతర సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు. అసలు తాము ఆ స్థితికి రావడానికి గల కారణాలు ఎప్పుడూ మరచి పోకూడదు. ఇంకా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు తోడ్పడాలి. ఇతరులమీద అధికారము చేసేవాడు నాయకుడు కాదు. నాయకునికి అధికారము సహజముగా లభిస్తుంది.
నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము, దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి. లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే లక్షణాలు. నాయకుడు చేసే పనులు పదిమందికి ఆదర్శముగా మారతాయి. నాయకుడు క్లిష్టమైన పనులను చేయడానికి దైర్యముగా ముందుకు వెళతాడు. నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తీ నాయకుడే.నాయకుడు  మార్గ దర్శకంగా ఉంటూ ప్రోత్సహించేవాడు.నాయకుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ విజయాన్ని కోరుకోoటాడు..ఏ దేశములో అయితే నాయకత్వ లక్షణాలున్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దిన దిన అభివృద్ధి చెందుతుంది.
నియమబద్దమైన , బాధ్యతతో కూడిన  విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాడు.. తన బలహీనతలను జయిస్తాడు.శారీరక సుఖాలకు బానిసైన వ్యక్తి, బలహీనతలకు చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తి నిజమైన నాయకుడు కాజాలడు నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు ,దురలవాట్లు , అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు..సరియైన నాయకుడు సత్కార్య నిర్వహణలో తన శరీరానికి జరిగే లేక రాబోయే ఆపదలను లక్ష్యపెట్టడు.నాయకుడు కష్టపడి పనిచేయకుండా ఇష్టపడి పనిచేసేవాడు .
          స్వామి వివేకానంద చెప్పినట్లు సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు.చాలామంది మంచి తనానికి ఇవి  రోజులు కావని, నీతికి నిజాయితీకి కాలం చెల్లిందని, నియమాలు త్యజిస్తే మనము ధనవంతులము కాగలమని అవినీతి అక్రమ సంపాదన మోసపూరిత వ్యపారాలద్వారా అస్తులు కూడబెట్టాలని భావించి ఈ సమాజంలో సహజ న్యాయాన్ని మానవత్వ పునాదులను కదిలించ టానికి ప్రయత్నిస్తున్నారు కాని అది తాత్కాలికము. అటువంటివారికి పురోగతి ఉండదు. కాలక్రమం లో వారు చేసిన పనికి ఫలితం చెల్లిస్తారు
          మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును. నాయకుడు అనేవాడు ఎక్కడినుండో రాలేదు మనలో నుండే వచ్చాడు. మానవతా విలువులు కలిగి ఉండి సహాయం చేయడంలో ముందుండాలికార్య సాదకుడిగా, స్ఫూర్తి దాయకంగా ఉంటూ సేవకుడిగా ఉండాలి.తీసుకున్న పనిని బాధ్యతతో పూర్తి చేయాలి.ఎంత ఒత్తిడిలోనైనా పనిచేసి విధంగా ఉండాలి.ఓపికతో ఉత్సాహంగా ఉండాలి. నాయకుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సత్తాకలిగి  వుండాలి.  పుడుతూనే నాయకులు అవ్వరు ఎవ్వరూనూ!! కొద్దొ గొప్పో తెలివితేటలు ఉంటే చాలు, ఆ మనిషిని నాయకుడిగా మలచవచ్చు.
          నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చెయ్యటానికి కావలిసిన పూర్తి సమాచారం, నైపుణ్యం. ఇవి జన్మతః    రావు, మనిషి తనంతటతాను సంపాయించుకోవాలి.వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నపుడే, సామర్ధ్యం పెరుగుతుంది. వృత్తిపర జ్ఞానం, సామర్ధ్యం లేనివాడు నాయకుడు కాలేడు.చక్కగా విశ్లేషించి, తగిన నిర్ణయం తీసుకోగల సామర్ధ్యం. నిర్ణయం తీసుకోవటమే కాదు. తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవటం,(ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగినా సరే) అతి ముఖ్యమైన నాయకత్వ లక్షణం నాయకుడు న్యాయ దృష్టి, నిస్పక్షపాత ధోరణి. వత్తిడిని తట్టుకునే స్థైర్యం కలిగిఉండాలి.
          నాయకుడు సంస్థ  పురోభివృద్ధికి చక్కని ప్రణాళిక వేసి అందర్నీ ఒప్పించి తనతో పాటు ముందుకు తీసుకు పోగలగాలి.  తను వేసిన ప్రణాళిక విజయవంతం అయ్యేటట్లు కృషి చేయాలి. సరియైన సమయం లో సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏ పని చేయగలరో తెలుసుకొని వారికి ఆ పని అప్పజెప్పి పూర్తి చేసేటట్లు చూడాలి.
          నాయకుడు ఎల్లపుడూ ఇతరులలో ఉత్తేజాన్ని కలిగిస్తాడు. మంచిని ప్రదర్శిస్తాడు. సహచరులుల లో ప్రేమను  పెంపొంధింప చేస్తాడు. ఎల్లపుడూ “మనం” అనేదానిని నమ్ముతాడు. ఏం తప్పు జరిగింధో విడమర్చి చెపుతాడు. ఒక పని ఎలా చేయాల్లో ఆతనికి తెలుస్తుంది. ప్రతి వారి చేత మర్యాదా, మన్నవ పొందుతాడు.నలుగురిలో కలసి పోతాడు. అందరికీ ఆదర్శప్రాయం గా ఉంటాడు.   
          సమర్ధ నాయకుడు జాతిని ముంధుకు నడిపించ గలడు. ఉదా: మహాత్మా గాంధీ, సుబాష్ చంద్ర బొసే,

            విశ్వ నాయకుడు,సద్ప్రవర్తనకు ,సౌశీల్యనికి, నాయకత్వానికి మంచి ఉదాహరణ ఐనా  మహా ప్రవక్త మహమ్మద్ (స.ఆ.స.) సలహా ను ఉదహారిస్తూ ఈ వ్యాసం ను ముగించుదాము.
                 “ఇతరుల పట్ల మీ ప్రవర్తన ఉత్తమం గా ఉండాలి”. అల్ మువత్త – వాల్యూమ్ 47, హదీసు 1


          Make your character good for the people.“ ----Prophet Muhammad (PBUH) as narrated Al-Muwatta, Volume 47, Hadith 1
          శిక్షించటం లో పొరపాటుకన్న, క్షమించటం లో పొరపాటు చేయడం నాయకునికి కి  మిన్న” మహమ్మద్ ప్రవక్త (స.ఆ.స.)-అల్ తిర్మిధి, హదీసు 1011.
          The Prophet Muhammad (s) said: ““It is better for a leader to make a mistake in forgiving than to make a mistake in punishing.” -----Al-Tirmidhi, Hadith 1011.







No comments:

Post a Comment