18 November 2013

“జీవన నైపుణ్యాల(లైఫ్ స్కిల్స్) సాధన తో విజేత గా నిలిచే యువత”

“దేవునిచే సృస్టించబడిన మానవులండరు సమానులే,  ముస్లిం ఐనా కాక పోయినా అందరూ   సమాన గౌరవానికి ఆర్హులే! మనమందరం ఇతరులతో కలసి   శాంతిగా జీవించాలి”. –మహమ్మద్ ప్రవక్త.

అనంత కరుణామయుడు, అపార కృపాశాలిఐన అల్లాహ్ పేరుతో  


            నేటికీ 1500 సం. ల పూర్వమే ప్రవక్త మహమ్మద్ (స.ఆ.స.) నోట అల్లాహ్ చే   కొరాన్ గ్రంధము అవతరించబడినది.ముస్లింల అతి పవిత్ర గ్రంధం కొరాన్. అల్లాహ్ చేత అవతరించబడిన గ్రంధం కొరాన్. కొరాన్ మానవాళి అందరికీ, అన్నీ విషయాలను వివరించే సమగ్ర,అంతిమ గ్రంధము. ఈ గ్రంధం లో అల్లాహ్ చే సూచించబడి, మానవుడు ఆచరించవలసిన  జీవన నియమాలను  వివరిస్తుంది. మానవుడు తోటి మానవునితో ఏవిధంగా ప్రవర్తించాలో వివరిస్తుంది. కొరాన్ లో  మంచి జీవన నైపుణ్యాన్ని సాదించటానికి ఉపయోగ పడే అనేక ఆయత్ లు కలవు.

"See how we have made some of them to excel others." (17:21)
“చూడండి మేము కొంతమందిని ఇతరులకన్నా మిన్న గా తయారు చేసినాము”
"And those who restrain (their) anger and pardon men. And Allah loves the doers of good (to others)" (3:133).
“కోపాన్ని దిగమింగేవారు,ఇతరుల  తప్పులను క్షమించేవారు-ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం”.

          కొరాన్ ను అబ్యసించుట వలన మంచి అలవాట్లు,సాంప్రదాయాలు,మంచి జీవన సరళి,సానుభూతి,కరుణా, సహనశీలత వంటి  జీవన నైపుణ్యాలు అలవాటుఅవుతాయి. ఉదహారణకు సంభాషణలో  ఒక వ్యక్తి మిన్నగా మనలను సంబోదించిన మనం అంతకన్నా మిన్నగా అతనిని సంబోధించవలసి ఉండటం ఇస్లామిక్ సంప్రదాయం. వ్యర్ధ ప్రేలాపన,వివాదాలు   మరియు దుష్ఠ ప్రవర్తన నుంచి దూరంగా ఉండమని   ఇస్లాం చెబుతుంది. మంచికి దగ్గిరగా చెడు కు దూరంగా ఉండమని చెపుతుంది. మంచి నడతను ప్రోత్సహించి, బిగ్గరగా పలుకుటను నిషేదించినది. ఇస్లాం ఎల్లప్పుడూ మద్యే మార్గాన్ని ప్రోత్సహించును. అదేవిధంగా హదీత్,ఫీకా,గ్రంధాలలోకూడ మంచి  జీవన నైపుణ్యాల  ప్రస్తావన కలదు. ఈ గ్రంధాలను చదువుట మూలానా యువకులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంచుకొని, జీవితం లోని అన్నీ రంగాలలో రాణిస్తారు.

          ప్రస్తుత ప్రపంచం లో సంస్థలు వ్యక్తి నైపుణ్యాన్నిబట్టి ఉద్యోగాన్ని ఇస్తున్నాయి.  ప్రపంచీకరణ నేపథ్యంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు కలిగిన సంస్థలు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. అత్యున్నత స్థాయిలో శ్రేష్టమైన కనీస నైపుణ్యాలు (Basic Skills) నేటి యువతకు ఎంతైనా అవసరం ఉంది. ఈ లక్షణాలు ఉన్నవారికే నేడు విజయాలు లభిస్తున్నాయి. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, చొరవ, సహనం గల యువతకు అద్భుత అవకాశం నేటి ప్రపంచం  కల్పిస్తోంది.

          ప్రతి యువకుని లో ఏదో ఒక కళ అంతర్లీనంగా ఉంటుంది, పరిస్థితుల ప్రభావం వల్లన అతని లోని నైపుణ్యం అణగ దొక్కబడుతుంది కాబట్టి యువకులు, కేవలం విద్యేకాకుండా నిజ జీవితంలో రాణించటానికి అవసర మయ్యే జీవన నైపుణ్యాలను(లైఫ్ స్కిల్స్)ను  నేర్చుకోవాలి. ఆత్మగౌరంస్థిరత్వంతాలూకు నైపుణ్యాలను అభివృద్ధి పరచడం జీవన నైపుణ్యాల సాధన లో ఒక భాగం.

          జీవన నైపుణ్యాలు అనగా వ్యక్తిలోని కొన్ని వ్యక్తిత్వపు లక్షణాలు,భాషలో పటిమ, వ్యక్తిత్వపు అలవాట్లు, స్నేహశీలత్వం, ఆశావాదం అని క్లుప్తంగా చెప్పవచ్చు. ప్రతి వ్యక్తిలోను ఈ లక్షణాలు ఏదో కొంత మేరకు ఉంటాయి.

          జీవన నైపుణ్యాలను సాఫ్ట్ స్కిల్స్ (soft skills) మరియు హార్డ్ స్కిల్స్ (Hard skills) అని రెండు రకాలుగా విభజించ వచ్చు. ఈ రెండు అలవార్చు కొన్న వ్యక్తి తన జీవితం లో తన  కోరుకొన్నవన్నీ పొందగలుగుతాడు.

          సాఫ్ట్ స్కిల్స్(soft skills) అనగా 1) పఠనా నైపుణ్యం 2) సులభంగా విషయాన్ని గ్రహించి, దాన్ని తర్కబద్ధంగా అవగాహన చేసుకోగల శక్తి 3) సమయపాలన 4) కఠోర పరిశ్రమ చేయగలిగిన తత్వం 5) ఓటమినుంచి పాఠాన్ని గ్రహించి పునరుత్తేజం పొందగలిగే శక్తి 6) నలుగురిని మెప్పించగలిగిన వాక్‌చాతుర్యం 7) మంచి దస్తూరి 8) నాయకత్వ లక్షణాలు 9) పాజిటివ్ దృక్పథం 10) నిజాయితీ 11) సామాజిక అవగాహన12) తన గురించిన అవహాహన !3)విమర్శనాత్మక ఆలోచనలు 14)భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం 15)సరియైన నిర్ణయాలు తీసుకోవడం 16)సహానుభూతి 17)సృజనాత్మక ఆలోచనలు 18) వ్యక్తిగత సంభందాలు 19)సమస్యలు ఎదుర్కోవడం 20) ఒత్తిడిని అధిగమించడం మొదలగునవి అని చెప్పవచ్చును.

హార్డ్ స్కిల్స్ (Hard Skills) అనగా టెక్నికల్ స్కిల్స్ అని చెప్పవచ్చును. ఉదా; టైప్ రైటింగ్, కంప్యూటర్ లెర్నింగ్,డి.టి.పి. మొదలైనవిగా చెప్పవచ్చును.  – వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా   లైఫ్ స్కిల్స్‌గా పేర్కొనవచ్చు.

సాఫ్ట్ స్కిల్స్ ,హార్డ్ స్కిల్స్ రెండు చెత్త పట్టాలేసుకొని తిరుగ గలిగిననాడు ప్రతి వ్యక్తి తన జీవితంలో కోరుకొన్నవన్నీ పొందగలుగుతాడు.  ప్రాథమిక దశ నుంచి ఈ నైపుణ్యాల శిక్షణ అకడమిక్ కరికులమ్‌లో భాగంగా సాగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తో మొదలుకుని, వివిధ లైఫ్ స్కిల్స్ కరికులమ్‌లో భాగంగాఉండాలి . నిజమైన వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య. ఈ సత్యాన్ని గ్రహించినపుడే మన పిల్లలకు మనం అందమైన భవిష్యత్తును అందించిన వారమవుతాం.

నేడు యువకులందరూ ఎంతో కొంత హార్డ్ స్కిల్స్ ను కలిగి ఉన్నారు. కానీ సాఫ్ట్ స్కిల్స్ సాధనలో వెనుకబడి ఉన్నారు. అనేక సంస్థలు సాఫ్ట్ స్కిల్స్ లో నైపుణ్యం సాదించినవారిని ఉద్యోగ నియమకాలలో ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి యువకులారా! హార్డ్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ఉన్నవారు వాటిని సానబెట్టండి. పదను తీర్చి ఉపయోగంలో మెళుకవలు నేర్చి కెరియర్ లో మరింత ముందుకు వెళ్ళండి. సాఫ్ట్ స్కిల్స్ కోసం ముందు పరిశీలనా దృష్ఠి అలవర్చుకోండి. ప్రయత్నిస్తే సాదించలేని సాఫ్ట్ స్కిల్స్ అంటూ ఏమి లేవు. యువకులకు  లైఫ్ స్కిల్స్ ఎంతో అవసరము . నిజ జీవితంలో వాటిని ఉపయోగిస్తే సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ ఉండదు. 
         
జీవన నైపుణ్యాలను (లైఫ్ స్కిల్స్ )ను  ఎందుకు పెంపోదించుకోవాలి?
Ø  విషయాలను తెలుసుకోవడానికి
Ø  అవగాహన తో జీవించడానికి
Ø  సమర్ధతతో పనిచేయటానికి
Ø  కలసి జీవించడానికి
          
           యువకులు తమ దైనంధీన జీవితం లో ఎదురయ్యే మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి జీవన నైపుణ్యాలు తోడ్పాటునిస్తాయి. యువత విద్య తో పాటు ఎన్నో జీవన నైపుణ్యాలను (లైఫ్ స్కిల్స్) నేర్చుకోవాలి. జీవన నైపుణ్యాలను (లైఫ్ స్కిల్స్) నేర్చుకొపోతే  భవిష్యత్తులో సమస్యలొస్తాయి. మారుతున్న కాలంతొ బాటు వస్తున్న మార్పులని గమనించి,జీవనానికి కావలసిన కనీసపు నైపుణ్యాలను సాదించాలి. వివిధ పరిస్థితులను ఎదుర్కొనే అవగాహన యువకులకు  కల్పించడం అవసరం. తప్పొప్పులను గుర్తించే నైపుణ్యం కల్పించడం కూడా ఎంతో అవసరం.  సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడమే జీవన నైపుణ్యాల ( లైఫ్ స్కిల్స్) లక్ష్యం. కాబట్టి జీవితంలో రాణించాలంటే వ్యక్తి జీవన నైపుణ్యాలను(life skills) సముపార్జించుకోవాలి. వీటికి విద్యార్థి దశనుంచే పునాది పడాలి.

          ఎన్నోరకాల జీవన నైపుణ్యాలను (లైఫ్ స్కిల్స్‌)  ఉదాహరణకు యువజనోత్సవాల ద్వారా పది మందితో కలిసి పనిచేయటం,  టీమ్‌ స్పిరిట్‌ ,నాయకత్వంవంటి  లక్షణాలు మరియు ఇతరులోని గొప్పతనాన్ని అభినం దించటం ద్వారా  సోషల్‌ స్కిల్స్‌ను , పోటీలలో ఓడినా స్పోర్ట్స్ మన్  స్పిరిట్‌ వంటివి పొంద వచ్చును.  క్రీడల్లో ఒక జట్టు విజయం సాధించడం, మరొకటి అపజయం పొందడం సహజంగా జరిగేదే. అపజయం పొందినపుడు కుంగిపోకుండా ఓటమినుంచి పాఠాన్ని స్వీకరించి తిరిగి ప్రయత్నం చేసినపుడే విజయం సాధ్యమవుతుంది. దీనినే క్రీడాస్ఫూర్తి అనంటారు. జీవితంలో ఇది ఎంతైనా అవసరం. ఇది లోపించడం వల్లే, నేటి యువత ప్రతి ఓటమికి ఆత్మహత్యలే పరిష్కారం అనే మార్గంలోఆలోచిస్తోంది.

          పఠనాశక్తి అనేది నేడు పూర్తిగా అడుగంటిపోతోంది. పుస్తకాలు చదవడంవల్ల ఏకాగ్రత, గ్రహణశక్తి పెరుగుతాయి. భాషా నైపుణ్యం అలవడుతుంది.  లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. ప్రతి ఒక్కరు నీతి, నిజాయితీ, పట్టుదలతో ముందుకెళ్లాలీ.  వాటిని ధైర్యంగా ప్రదర్శించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలీ . ప్రపంచంలోని మేధావులందరూ వీటిని ఉపయోగించే ఉన్నతస్థాయికి ఎదిగిన విషయం గుర్తుంచుకోవాలీ . వారిని స్ఫూర్తిగా తీసుకుని ఒడిదొడుకులు అధిగమించి, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న పోటీని అధిగమించి గోల్ సాధించాలి. ఎవరికి వారు తమలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి భావి జీవితానికి బాటలు వేసుకోవాలి. యవ్వనంలో బాగా కష్టపడి చదివితే జీవితాంతం సుఖ పడవచ్చు అన్నది గుర్తుంచుకోవాలి . లైఫ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకుండా మంచి మార్కులు వచ్చిన నిజజీవితంలో రాణించలేరన్నది వాస్తవము.

            ప్రఖ్యాత లైఫ్ స్కిల్స్ ట్రైనర్ (life skills trainer) జిల్లియన్‌ యువత ఎన్నడూ నిరాశా, నిస్పృహలకు గురికారాదనీ, జీవితంలో ఎన్ని ఆటుపోట్లెదురైనా, ఎన్ని కష్టాలు సంభవించినా ధైర్యం కోల్పోరాదనీ, నేడు మనది కాకున్నా, రేపు మనదేనన్న ఆశాదృక్ఫథంతో వుండాలని పేర్కొంటుంది. మనలోని చెడుగుణాల్ని త్యజించి, త్యాగాన్ని, దయను అలవర్చుకోవాలంటుంది . “పరిస్థితులు నీ జీవితాన్ని మారిస్తే తప్పు లేదు కానీ, నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే తప్పు అని పేర్కొంటుంది జిల్లియన్‌.

కొరాన్ లోని ఈ క్రింది ఆయత్ తో ఈ వ్యాసాన్ని ముగించుదాము. “My Lord! Increase me in knowledge" [20:114]  “ ప్రభూ! జ్ణానాన్నినాలో విస్తరింప చేయి”. అమీన్. 



           



No comments:

Post a Comment