31 December 2020

మస్లామా అల్-మజృతి 950-1007 Maslama al-Majriti 950-1007



మస్లామా అల్-మజృతి Maslama al-Majriti గా పిలువబడే అబూ అల్-ఖాసిమ్ మస్లామా ఇబ్న్ అహ్మద్ అల్-మజృతి (అరబిక్: أبو القاسم مسلمة بن أحمد (లాటిన్లో మేతిలెం Methilem అంటారు ) యొక్క జననం 950 సంవత్సరం లో మాడ్రిడ్, అల్-అండాలస్, ఇప్పుటి  స్పెయిన్ లో జరిగింది. అతను కార్డోవాలో  చదువుకున్నాడు మరియు మరణించే వరకు అక్కడ పనిచేశాడు. మస్లామా అల్-మజృతి ఇస్లామిక్ స్పెయిన్లో అల్-హకంII పరిపాలనా కాలం  లో ప్రముఖ  అరబ్ ముస్లిం ఖగోళ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, పండితుడు, ఆర్థికవేత్త.

మస్లామా అల్-మజ్రే తన కాలం నాటి అండలూసియన్ ఖగోళ శాస్త్ర అగ్రగామి. మస్లామా గణిత ఖగోళ శాస్త్ర నిపుణుడు వాణిజ్య అంకగణితం (ముస్మాలాట్muʿāmalāt)) జ్యోతిష్కం ఇంద్రజాలం మరియు రసవాదంపై రచనలు చేసాడు

మస్లామా అల్-మజృతి పూర్తి పేరు అబూ-అల్-ఖాసిమ్ మస్లామా ఇబ్న్ అమాద్ అల్-ఫరాస్ అల్-అసిబ్ అల్-మజారే అల్-ఖుర్యుబా అల్-అండలూసా.

టోలెమి రచించిన  ప్లానిస్ఫేరియంPtolemy's Planisphaerium అనువాదంలో మస్లామా అల్-మజృతి పాల్గొన్నాడు మరియు  అల్మాజెస్ట్ యొక్క అనువాదాలను మెరుగుపరిచాడు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మి యొక్క ఖగోళ పట్టికలను ప్రవేశపెట్టాడు మరియు వాటిని మెరుగుపరిచాడు. పెర్షియన్ తేదీలను హిజ్రీ సంవత్సరాలోకి  మార్చడానికి పట్టికలను రూపొందించడం ద్వారా చరిత్రకారులకు సహాయం చేశాడు మరియు సర్వేయింగ్ మరియు త్రిభుజం యొక్క పద్ధతులు Techniques of surveying and triangulation పరిచయం చేశాడు.

పాదరసం ఆక్సైడ్ mercury oxide  వాడకం మరియు ప్రయోగాలను రికార్డ్ చేసిన తొలి రసవాదులలో alchemists మస్లామా అల్-మజృతి ఒకరు.మస్లామా అల్-మజృతి అల్-అండాలస్లో ఉత్తమ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. అతను ఇబ్న్ అల్-సఫర్‌తో కలిసి పనిచేయడం ద్వారా కొత్త సర్వేయింగ్ పద్ధతులను ప్రవేశపెట్టాడు. అతను పన్ను మరియు అల్-అండాలస్ యొక్క ఆర్ధికవ్యవస్థపై ఒక పుస్తకం రాశాడు. అతను అల్-అండాలస్కు వచ్చినప్పుడు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది బ్రెథ్రెన్ ఆఫ్ ప్యూరిటీEncyclopedia of the Brethren of Purity  యొక్క భాగాలను సవరించాడు మరియు మార్పులు చేశాడు.

మస్లామా అల్-మజృతి అండలూసియన్ సైన్స్ మరియు శాస్త్రీయ బోధనలో నిపుణుడు అతను ఖగోళ శాస్త్రం మరియు గణిత పాఠశాలను నిర్మించాడు అందులో అంకగణితం మరియు జ్యామితి విభాగాలు ఉన్నాయి. మస్లామా అల్-మజృతి శాస్త్రీయ సమాచార పరస్పర మార్పిడి యొక్క భవిష్యత్ ప్రక్రియ నెట్‌వర్క్‌ ల ఆగమనాన్ని కూడా ఊహించాడు మస్లామా అల్-మజృతి అల్-అండాలస్‌లో వ్యవస్థీకృత శాస్త్రీయ పరిశోధనలకు నాంది పలికాడు. అతని విద్యార్థులలో ఇబ్న్ అల్-సఫర్, అబూ అల్-సాల్ట్ మరియు తుర్తుషి Ibn al-SaffarAbu al-Salt and at-Turtushi.ఉన్నారు. మస్లామా అల్-మజృతి మరియు అతని శిష్యులు అల్-అండాలస్ అంతటా ఖచ్చితమైన శాస్త్రాల exact sciences అభివృద్ధి మరియు విస్తరణను బాగా ప్రభావితం చేశారు

మస్లామా అల్-మజృతి మొదటిసారిగా అల్-అండాలస్ రెండు విభిన్న గణిత సంప్రదాయాలను కలిపారు, అవి ఫర్దిడ్ farāʾī   యొక్క సంప్రదాయం (మతపరంగా వారసత్వ విభజన) మరియు రెండోవది-ఖగోళ శాస్త్రాన్ని కలిగి ఉన్న గణితశాస్త్ర ఆధారిత తాత్విక శాస్త్రాల సంప్రదాయం.

మస్లామా అల్-మజృతి యొక్క రెండు రచనలు "సేజ్ స్టెప్ / ది ర్యాంక్ ఆఫ్ ది వైజ్" (రుత్‌బాత్ అల్-హకీమ్1009) మరియు పికాట్రిక్స్ "Sage's Step/The Rank of the Wise" (Rutbat al-hakim,1009) and the Picatrix 1252 లాటిన్లోకి అనువదించబడ్డాయి. అవి అరబిక్ లో బహుశా పదకొండవ శతాబ్దం మధ్యలో రాయబడి ఉండవచ్చు.

మస్లామా అల్-మజృతి యొక్క రుట్బాట్ Rutbat రసవాద సూత్రాలు మరియు విలువైన లోహాల శుద్దీకరణకు సూచనలను కలిగి ఉంది మరియు అతను ద్రవ్యరాశి పరిరక్షణ సూత్రాన్ని గమనించిన మొట్టమొదటి వ్యక్తి. దీనిని అతడు పాదరసం ఆక్సైడ్ పై తన ప్రయోగంలో గమనించాడు.

ఖగోళ శాస్త్ర రంగంలో మస్లామా అల్-మజృతి తన సొంత ఖగోళ పరిశీలనలు చేసిన మొదటి అండలూసియన్. మస్లామా అల్-మజృతి 979 సంవత్సరంలో రెగ్యులస్ అనే నక్షత్రాన్ని గమనించాడు మరియు దాని గ్రహణ రేఖాంశం ecliptical longitude 135 ° 40 'అని కనుగొన్నాడు.

జ్యోతిషశాస్త్రం, టాలిస్మానిక్ మ్యాజిక్ talismanic magic మరియు భవిష్య వాణి తో సంబంధం కల పికాట్రిక్స్ అధునాతన ఎసోటెరిసిజం advanced esotericism అనవచ్చు. వాటికి మస్లామా అల్-మజృతి రుత్‌బాట్‌ను పునాది వచనంగా సూచిస్తారు.

ఒక ప్రొఫెషనల్ జ్యోతిష్కుడిగా, మస్లామా అల్-మజృతి 1006/1007 లో జరిగిన సాటర్న్ మరియు బృహస్పతి కలయిక conjunction of Saturn and Jupiter పై పరిశోధన చేసాడు మరియు అతను రాజవంశం మార్పు, నాశనము, వధ మరియు కరువు గురించి ముందే చెప్పాడు.

మస్లామా అల్-మజృతి కి మాడ్రిడ్‌కు చెందిన ఫాతిమా అనే కుమార్తె ఉందని, ఆమె ఖగోళ శాస్త్రవేత్త కూడా అని అనేక ఆధునిక వర్గాలు చెబుతున్నాయి. 1920 లలో ప్రచురించబడిన ఎన్సిక్లోపీడియా యూనివర్సల్ ఇలుస్ట్రాడా యూరోపియో-అమెరికానాలో ఆమె గురించి ఒక చిన్న జీవిత చరిత్ర ఉంది.

మస్లామా అల్-మజృతి 1007 లో  (వయసు 57)కార్డోబా, కార్డోబా యొక్క కాలిఫేట్ (ఇప్పుడు కార్డోబా, అండలూసియా, స్పెయిన్) మరణించారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

ప్రార్థనల /సలాహ్ Salah కోసం ప్రణాళిక-రూపొందించండి How to Develop a Constant Routine for Prayers/Salah?

 




ఇస్లాంలో ప్రార్థన/సలాహ్ Salah చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ప్రార్ధన/ సలాహ్ Salah  అనేది  ఇస్లాం మూలస్తంభాలలో ఒకటి. ఈ వ్యాసం లో బిజీ షెడ్యూల్‌ జీవిత లో ప్రజలు  ఏ విధంగా మంచి ప్రార్థన దినచర్యను సృష్టించవచ్చు మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చో తెలియ జేస్తున్నాము.

 

 1. ప్రార్థనల/ సలాహ్ Salah ప్రయోజనాలను గుర్తుంచుకోండి:

మానవుడిగా, మనకు ప్రయోజనం కలిగించే పనులను చేస్తాము. సరైన ప్రార్థన దినచర్యను అభివృద్ధి చేసుకోవటానికి, ఈ జీవితంలో మరియు ఇకమీదట మీకు లభించే అన్ని ప్రయోజనాలను గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోజనకరమైన అంశాలను గుర్తుంచుకోవడం సలాహ్ Salah వైపు వెళ్ళడానికి మరియు ప్రయోజనాలను ఎక్కువగా పొందటానికి మనల్ని ప్రేరేపిస్తుంది.

 



2. ప్రార్థనలకు సమయం కేటాయించండి:

మీరు మీ బిజీ షెడ్యూల్‌లో అల్లాహ్‌తో మీ కోరికలు గురించి వేడుకోవటానికి    మీ ప్రార్థనలకు సమయం ఇవ్వాలి. ప్రార్థనలు మీకు స్వీయ-అవగాహన మరియు స్వీయ-కరుణను సృష్టించడానికి దోహదపడతాయి.


3. ప్రార్థనను నిబద్ధతగా చేసుకోండి”

మీ వర్క్-షెడ్యూల్లో ప్రార్థన కోసం సమయాన్ని గుర్తించండి. ఈ మార్కింగ్ ఒక రోజు యొక్క అన్ని ప్రార్థనల గురించి మీకు గుర్తు చేస్తుంది.

పవిత్ర ఖురాన్ ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను ఇలా నొక్కి చెబుతుంది:

·       నమాజును స్థాపించు, ప్రొద్దు వాలినప్పటినుంచి రాత్రి చీకటి పడేవరకు.  ప్రాత:కాలం లో ఖురాన్ పారాయణంపట్ల ప్రత్యేక శ్రద్ద వహించు. -17 బని ఇజ్రాయెల్ 78 ఆయతు


4. ప్రార్థన స్థలాలను ఎంచుకోండి:

ఇంట్లో ప్రార్థనల కోసం ఒక ప్రత్యేక స్థలాన్నికేటాయించండి. అది ప్రతిసారీ ప్రార్థన కోసం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మరియు గుర్తుచేస్తుంది. ప్రయాణించేటప్పుడు, మీరు ఎక్కడ ఉన్నా సలాహ్ చేయటానికి మీకు ఒక ప్రేయర్ మ్యాట్ ను తీసుకు వెళ్ళండి.


5. ప్రార్థనలకు మిమ్మల్లి మీరే జవాబుదారీగా చేసుకోండి:

మన ప్రార్థనలకు మనము జవాబుదారీగా ఉన్నామని గ్రంధం లో స్పష్టంగా ఉంది మరియు ప్రతి ప్రార్థన యొక్క సమాధానం మనo సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు ఇవ్వాలి. ప్రార్థనల కోసం స్థిరమైన దినచర్యను స్థాపించడానికి, మనస్సులో మిమ్మల్లి మీరే జవాబుదారీగా చేసుకోవాలి.


7. ప్రార్థనలు ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం లేదు:

అల్లాహ్ అందరి అందు  దయగలవాడు మరియు మనకన్నా మనల్ని బాగా తెలుసినవాడు.. కాబట్టి మనం ఉత్తమ ప్రయత్నం చేసి, ప్రార్థన కోసం వెళ్ళాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దగ్గరికి రావడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఇస్లాంలో ప్రార్థనలు   మన ప్రభువుకు దగ్గర చేస్తాయి  మరియు సృష్టికర్తతో మన నిత్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.


30 December 2020

ఇస్లామిక్ స్వర్ణయుగం మరియు దాని ప్రధాన విజయాలు The Golden Age Of Islam And Its Major Achievements


 

8వ నుండి 14వ శతాబ్దాల వరకు ఇస్లామిక్ స్వర్ణ యుగం సాధించిన ముఖ్యమైన విజయాలు తెలుసుకొందాము..

 

ఇస్లామిక్ స్వర్ణయుగం గురించి మాట్లాడేటప్పుడు, కొన్ని ప్రశ్నలు గుర్తుకు వస్తాయి, అవి-

ఇస్లాం స్వర్ణయుగం ఏమిటి?

స్వర్ణ యుగంలోని  పండితులు/శాస్త్రవేత్తలు  ఏ విజయాలు సాధించారు?

ఇస్లాం స్వర్ణ యుగం యొక్క ప్రసిద్ధ వ్యక్తులు ఏవరు ?

ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుదాం

 

ఇస్లామిక్  స్వర్ణయుగం ఏమిటి?

8 వ మరియు 14 వ శతాబ్దాల మధ్య కాలంను ఇస్లామిక్  స్వర్ణయుగం అందురు. ఇస్లాం స్వర్ణయుగం పురోగతి యుగం. సాంస్కృతిక, శాస్త్రీయ మరియు ఆర్ధిక పురోగతి ఉచ్చ శిఖరం అందుకొన్న యుగం. ఈ యుగం ప్రపంచానికి అద్భుతమైన ఆలోచనలను ఇచ్చింది, సాంస్కృతిక, ఆర్ధిక, విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఈ యుగం లో సాధించిన ప్రగతి తదుపరి అభివృద్ధికి పునాది రాళ్ళుగా మారాయి.

అది బాగ్దాద్‌లోని హౌస్ అఫ్ విజ్డంకి పునాది వేసిన అబ్బాసిద్ ఖలీఫ్ ఖలీఫా హరూన్-ఉర్-రషీద్కాలం. హౌస్ అఫ్ విజ్డం ను బాగ్దాద్ గ్రాండ్ లైబ్రరీ అని కూడా అంటారు. ఇది ఆ సమయంలో బాగ్దాద్‌ లోని మేధో కేంద్రం.

1258లో హౌస్ అఫ్ విజ్డం లేదా వివేకం యొక్క ఇల్లు మరియు కష్టపడి సంపాదించిన దానిలోని గ్రంధాలు మంగోల్ దండయాత్ర, బాగ్దాద్ ముట్టడి సమయంలో నాశనం చేయబడ్డాయి.

స్వర్ణ యుగంలో శాస్త్రవేత్తలు/పండితులు ఏ విజయాలు సాధించారు?

 

అనువాదాలు: ఇది ఇస్లాం స్వర్ణయుగం యొక్క ప్రధాన విజయాలలో ఒకటి. ఈ సమయంలో గ్రీక్ శాస్త్రీయ మరియు తాత్విక గ్రంథాలు అరబిక్లోకి అనువదించబడ్డాయి. అనువాద పని 2 శతాబ్దాలు పైగా జరిగింది. . అరిస్టాటిల్ రచనల  అనువాదంతో అనువాద పని ప్రారంభమైంది. ఇతర ప్రముఖల రచనలు కుడా అనువాదం జరిగింది,

ఉదా:అరిస్టాటిల్,ఆర్యభట,బ్రహ్మగుప్తుడు,చార్వాక,హిప్పోక్రేట్స్,యూక్లిడ్, గాలెన్

ప్లాటినస్, సుశ్రుత, పైథాగరస్,ప్లేటో

 

ఇస్లామిక్ స్వర్ణ యుగంలో ముస్లింలు ఎంతో ప్రగతి సహకరించారు మరియు అనేక ఆధునిక ఆవిష్కరణలలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది

 

మెడిసిన్, అగ్రికల్చర్, ఫైనాన్స్ మొదలగు అన్ని రంగాలలో ముస్లిమ్స్ అద్భుత ప్రగతి సాధించారు. ఔషధ శాస్త్రానికి సంబంధించిన ప్రధాన రచనలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డాయి, ఇది భవిష్యత్ పురోగతి పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

 

ఆనాటి కొంత మంది ప్రముఖులైన తత్వవేత్తలు/శాస్త్రవేత్తలు:

 

·       అల్-ఖ్వారిజ్మి: బీజగణితం అభివృద్ధికి మరియు గణిత శాస్త్రానికి ప్రధానమైన సహకారం అందించాడు. అల్గోరిథం అనే పదం అల్-ఖ్వారిజ్మి నుండి వచ్చింది. అతను ఇస్లాం యొక్క మొదటి భౌగోళిక శాస్త్రవేత్తగా కూడా ప్రసిద్ది చెందాడు. గణిత రంగంలో అనేక విజయాలు సాధించాడు. .

·       అరిస్టాటిల్ యొక్క తత్వాన్ని అరబ్బులకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి అబూ యూసుఫ్ యాకుబ్ ఇబ్న్ ఇషాక్ అల్-కిండి మరియు అతను ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు కూడా.

·       అల్-జాహిత్ Al-Jahith  తన పుస్తకం బుక్ ఆఫ్ యానిమల్స్కు ప్రసిద్ది చెందాడు.

·       ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త physicistగా  ఇబ్న్ అల్-హేతం గొప్ప పేరు సాధించాడు. అతను ఆప్టిక్స్ పై చాలా ప్రయోగాలు చేసాడు.

·       అబూ మాషర్ Abu Maʿshar (జననం 786– మరణo 886) - అతను అరిస్టాటిల్ రచనలను అనువదించాడు.

·       అవెరోరోస్ (జననం 1126–మరణo 1198) - అతను ముస్లిం తత్వవేత్త /logician, అతను అరిస్టాటిల్ పై విశ్లేషణకు ప్రసిద్ది చెందాడు

·       అవిసెన్నా (జననం 980– మరణo 1037) - పెర్షియన్ ఆలోచనాపరుడు మరియు వైద్యుడు “ది కానన్ ఆఫ్ మెడిసిన్” గ్రంధం తో ప్రసిద్ది చెందారు.

·       అల్-గజాలి (జననం 1058– మరణo 1111) - ది ఇన్కోహరెన్స్ ఆఫ్ ది ఫిలాసఫర్స్ The Incoherence of the Philosophers గ్రంధ కర్త, పెర్షియన్ పండితుడు

·       ముహమ్మద్ అల్ ఇద్రిసి (జననం 1099– మరణo 1169) - సిసిలీకి చెందిన రోజర్II కింద పనిచేసిన మరియు ప్రపంచ పటం రూపొందించిన  అరబ్ భూగోళ శాస్త్రవేత్త.

·       ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మి (మరణo 850) - హౌస్ ఆఫ్ విజ్డమ్ యొక్క పెర్షియన్ పాలిమత్

·       అల్-కిండి (873 మరణo) - ప్రాధమిక అరబ్ ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించబడ్డాడు, అతను అరిస్టాటిల్ మరియు ప్లేటో తత్వశాస్త్రంలో నిపుణుడు.

·       మస్లామా అల్-మజృతి Maslama al-Majriti (జననం 950– 1007 మరణo) - గ్రీకు రచనలను అర్థంచేసుకున్న అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త.

·       హునైన్ ఇబ్న్ ఇషాక్ Hunayn ibn Ishaq (జననం 809– మరణo 873) - అరబ్ పరిశోధకుడు, ప్రసిద్ధ అనువాదకుడు, అరబ్ అనువాద పితామహుడు  మరియు హౌస్ ఆఫ్ విజ్డమ్‌కు చీఫ్ గా బాధ్యత వహించాడు. 116 కన్నా ఎక్కువ గ్రంధాలను అనువదించినాడు.

·       బాను మూసా సోదరులు -పెర్షియన్ నిర్మాణాల యొక్క ముఖ్యమైన డిజైనర్లు మరియు గణిత శాస్త్రవేత్తలు.

·       సహల్ ఇబ్న్ హరున్ Sahl ibn Harun (మరణo 830) - హేతువాది rationalist మరియు పాలిమత్.

·       అల్-జజ్జ్ ఇబ్న్ యూసుఫ్ ఇబ్న్ మాసార్ Al-Ḥajjaj ibn Yusuf ibn Maṭar (జననం 786– మరణo 833) - గణిత శాస్త్రజ్ఞుడు మరియు యూక్లిడ్ రచనల వ్యాఖ్యానానికి పేరుగాంచిన వ్యాఖ్యాత.

·       థాబిట్ ఇబ్న్ ఖుర్రా Thābit ibn Qurra (జననం 826– మరణo 901) టోలెమిక్ ఫ్రేమ్‌వర్క్‌ ను మార్చిన గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త  మరియు వ్యాఖ్యాత. స్టాటిక్స్ పితామహుడి father of statics గా పరిగణించబడినాడు.

·       యూసుఫ్ అల్-ఖురి Yusuf Al-Khuri (మరణo 912) - బాను మూసా సోదరుల చే వ్యాఖ్యాతగా నియమించబడిన క్రైస్తవ గణిత శాస్త్రవేత్త మరియు అంతరిక్ష నిపుణుడు.

·       కుస్తా ఇబ్న్ లుకా Qusta Ibn Luqa (జననం 820– మరణo 912) - గ్రీకు రచనలను అరబిక్‌లోకి వివరించిన గణిత శాస్త్రవేత్త మరియు వైద్యుడు.

·       అబూ బిషర్ మట్టా ఇబ్న్ యూనస్ Abu Bishr Matta ibn Yunus (జననం 870– మరణo 940) – వైద్యుడు, పరిశోధకుడు మరియు వ్యాఖ్యాత.

·       యాహ్యా ఇబ్న్ అల్-బాట్రిక్ Yahya Ibn al-Batriq (జననం 796– మరణo 806) - విశ్వ శాస్త్రవేత్త cosmologist మరియు వ్యాఖ్యాత.

·       యాహ్యా ఇబ్న్ ఆది Yahya ibn Adi (జననం 893– మరణo 974) - సిరియాక్ జాకబ్ క్రైస్తవ ఆలోచనాపరుడు, పండితుడు మరియు వ్యాఖ్యాత.

·       సింధ్ ఇబ్న్ అలీ (మరణo 864) - జిజ్ అల్-సింధింద్ Zij al-Sindhind యొక్క వ్యాఖ్యానాన్ని మరియు పునరుద్ధరించిన విశ్వ శాస్త్రవేత్త cosmologist.

·       అల్-జహిజ్ Al-Jahiz (జననం 781– మరణo 861) - కితాబ్ అల్-హయావన్ Kitab al-Hayawan మరియు వివిధ నైరూప్య రచనలకు రచయిత మరియు పండితుడు.

·       ఇస్మాయిల్ అల్-జజారి Ismail al-Jazari (జననం 1136– మరణo 1206) - అత్యంత ప్రాచుర్యం పొందిన భౌతిక శాస్త్రవేత్త మరియు డిజైనర్. 1206 లో The Book of Knowledge of Ingenious Mechanical Devices రచయిత.

·       అబూ యూసుఫ్ యాకుబ్ ఇబ్న్-ఇస్సాక్ అ-అబ్బే అల్-కిండి Abu Yusuf Yaqub ibn ʼIsḥaq aṣ-Ṣabbāḥ al-Kindi (800– మరణo 870) - గణిత శాస్త్రవేత్త, మరియు అరబిక్ తత్వవేత్త.

·       జబీర్ ఇబ్న్ హయాన్ Jabir Ibn Hayyan’: ప్రాగ్మాటిక్ మెటలర్జీ లో ప్రముఖుడు.

·       ఒమర్ ఖయ్యామ్ (జననం 1048– మరణo 1131) - పెర్షియన్ కళాకారుడు, గణిత శాస్త్రవేత్త మరియు విశ్వ శాస్త్రవేత్త cosmologist.

 

అబ్బాసిడ్ కాలిఫేట్ సమయంలో బాగ్దాద్‌లో నివసిస్తున్న పరిశోధకులు/శాస్త్రవేత్తలు  గ్రీకు రసాయన శాస్త్రానికి, ఆలోచనా విధానం, అంతరిక్ష శాస్త్రం, ఔషధం మరియు అనేక విభిన్న శాస్త్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఉన్న సమాచారానికి తమ సహకారాన్ని జోడించారు. ఈ పరిశోధకులు తమ రంగాలలో కొత్త అనుభవాలను అందించారు మరియు చివరికి వాటిని  బహిర్గతం చేసి  ఐరోపాకు పంపారు.

 

ఇస్లామిక్  స్వర్ణ యుగంలో ముస్లింలు సాధించిన గొప్ప విజయాలను ప్రపంచం మరచిపోలేము.