12 December 2020

ఇస్లాంలో కపటం; పవిత్ర ఖురాన్ మరియు హదీసులు దాని గురించి ఏమి చెబుతున్నాయి? Hypocrisy in Islam; What the Holy Quran and Hadiths Say about it?




 

ఇస్లాంలో కపటత్వం అనేది ఒక వ్యక్తిని ఎక్కువగా నాశనం చేసే అనారోగ్యం. కపటత్వం/వంచన (నిఫాక్) అనేది ఇస్లాం లో వ్యక్తి యొక్క బాహ్య ప్రదర్శనగా వర్ణించబడింది, అయితే ఆ వ్యక్తి లోపల కుఫ్ర్ (అవిశ్వాసం) ను దాచిపెడుతున్నాడు.


ఇస్లాం ధర్మం లో  కపటవాదులను మునాఫిక్న్ అని పిలుస్తారు. వారు తమ  చర్యల ద్వారా ముస్లిం సమాజాన్ని బలహీనం చేయడంలో పాలుపంచుకున్నారు మరియు లోపలి నుండి ఇస్లాంకు ముప్పు తెచ్చారు.


కపటత్వానికి వ్యతిరేకంగా పవిత్ర ఖురాన్ హెచ్చరిక:

చాలా చోట్ల, పవిత్ర ఖురాన్ కపటవాదులకు హెచ్చరిస్తుంది మరియు నరకంలో ఇవ్వబడే శిక్ష గురించి తెలియజేస్తుంది.

·       బాగా తెలుసుకోండి, కపటులు నరకం లో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడేవాడు మీకు దొరకడు.-[అల్-నిసా ’4: 145]

 

·       ఓ ప్రవక్తా! ఈ కపటులు నీ వద్దకు వచ్చినప్పుడు, “మీరు నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలే అని మేము సాక్షం ఇస్తున్నాము” అని అంటారు. నీవు నిజంగానే ఆయన ప్రవక్తవు అని అల్లాహ్ కు తెలుసు. కాని ఈ కపటులు వచ్చి అసత్య వాదులని అల్లాహ్ సాక్షమిస్తున్నాడు.- (సూరా అల్-మునాఫిక్, 1)


·       పోరాటం నాడు మీకు కలిగిన నష్టం అల్లాహ్ అనుమతితోనే కలిగింది. ఎందుకంటే తద్వారా మీలో విశ్వాసులేవరో కపటులేవరో అల్లాహ్ చూడదలిచాడు-(సూరా అల్-ఇమ్రాన్, 166)

 

·       -ఆ కపటులతో, “రండి, అల్లాహ్ మార్గం లో యుద్ధం చేయండి. లేదా కనీసం (మీ నగరాన్నయినా) రక్షించుకోండి.” అని అన్నప్పుడు వారు ఇలా అన్నారు. “ఈ రోజు యుద్ధం జరుగుతుందని మాకు తెలిసివున్నట్లయితే మేము తప్పకుండ మీతో పాటు వచ్చివుoడే వారము” ఈ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి చేరువగా ఉన్నారు. వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోటితో అంటారు. వారు తమ హృదయాలలో దాస్తున్న దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. -(సూరా అల్-ఇమ్రాన్, 167)

 

·       ఇంకా కొందరు ఉన్నారు. వారు ఒక మసీదును నిర్మించారు, (సత్య సందేశానికి) నష్టం కలిగించాలనే ఉద్దేశంతో, ఇంకా (దేవుని ఆరాధనా చేయ్యటానికి బదులుగా) అవిశ్వాసాన్ని అనుసరించాలని, విశ్వాసులలో చీలిక తీసుకు రావాలని, ( ఈ భూటకపు ఆరాధనాలయాన్ని) ఇదివరకు అల్లాహ్ కూ అయన ప్రవక్తకూ వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి మాటుగా చేయాలనీ. వారు మాటిమాటికి ప్రమాణాలు చేసి, మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరొకటి కాదు అని తప్పకుండా అంటారు. కాని అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు వారు పూర్తి అసత్యవాదులు. (సూరా అత్-తవ్బా, 107)

 

హదీసుల వెలుగులో ఇస్లాంలో కపటం/వంచన:

·       అల్లాహ్ యొక్క దూత(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారని ఇబ్న్ ఉమర్ నివేదించాడు: ఒక కపటి రెండు గొర్రెల మధ్య లక్ష్యం లేకుండా తిరుగుతున్న గొర్రె లాంటిది.  అది ఒక సమయంలో ఒకదానివద్దకి, మరొక సమయంలో మరొకదాని వద్దకి వెళుతుంది.-(ముస్లిం, పుస్తకం 38, సంఖ్య 6696)

 

·       జాబిర్(ర) ఇలా అన్నారు: అల్లాహ్ దూత  (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చారు  మరియు వారు మదీనా దగ్గర ఉన్నప్పుడు, ఈదురు గాలి వీస్తుంది దానివల్ల పర్వతం నొక్కబడినట్లు అనిపించింది. అప్పుడు అల్లాహ్ దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ గాలి బహుశా కపటి  మరణానికి వీచేలా ఉంది  మరియు వారు మదీనాకు చేరుకున్నప్పుడు కపటవాదుల నుండి ఒక అపఖ్యాతి పాలైన కపటి మరణించాడు.-(ముస్లిం, పుస్తకం 38, సంఖ్య 6694)

 

·       అబూ హురైరా ఇలా అన్నారు : అల్లాహ్ యొక్క దూత, ఇలా అన్నారు, “కపటికి మూడు సంకేతాలు  ఉన్నాయి, అతను ఉపవాసం చేసి ప్రార్థిస్తూ ముస్లిం అని చెప్పుకున్నా: అతను మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెబుతాడు, అతను వాగ్ధానం చేసి దానిని విచ్ఛిన్నం చేస్తాడు మరియు అతనిని  విశ్వసించినప్పుడు అతను ద్రోహం చేస్తాడు." -బుఖారీ 33, ముస్లిం 59.

 

మన జీవితంలో, అలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి మరియు మన చివరి శ్వాస వరకు సరైన మార్గంలో ప్రయాణించమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కోరాలి.

No comments:

Post a Comment