24 December 2020

ది మిస్టరీ ఆఫ్ హేయ్ ఇబ్న్ యక్జాన్ The Mystery of Hayy Ibn Yaqzan



12 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం స్పెయిన్‌లో ఇబ్న్ తుఫైల్  లేదా అబూ బకర్ ఇబ్న్ అబ్దుల్-మాలిక్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ తుఫైల్ అల్-ఖైసీ అనే ప్రతిభావంతుడైన తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, కవి మరియు వైద్యుడు జన్మించాడు. ఇతను పశ్చిమంలో అబూబేసర్ Abubacer అని పిలువబడ్డాడు.

 

ఇబ్న్ తుఫైల్ అల్-అండాలస్ యొక్క అల్మోహాద్ పాలకుడు అబూ యాకుబ్ యూసుఫ్ (1135-1184) కు సలహాదారుగా మరియు రాజ వైద్యుడిగా పదవులను నిర్వహించాడు. ఇతను  రచించిన “స్టోరీ ఆఫ్ హేయ్ ఇబ్న్ యక్జాన్” అనే తాత్విక ఉపమానం philosophical allegory-Story of Hayy ibn Yaqzan చాలా ప్రసిద్ది చెందినది, దీని అసలు మాన్యుస్క్రిప్ట్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది..

 

ఇబ్న్ తుఫైల్ తన శీర్షికను ఇబ్న్ సినా రచన నుండి తీసుకున్నాడు. 1708 లో ఆంగ్లంలో ప్రచురించబడిన ఇబ్న్ తుఫైల్ కథ యొక్క అనువాదం, డేనియల్ డెఫో యొక్క పుస్తకం లైఫ్ అండ్ స్ట్రేంజ్ అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్సన్ క్రూసో కు ప్రేరణ అయిఉండవచ్చు.

 

 

హేయ్ ఇబ్న్ యక్జాన్ అంటే అలైవ్, మేల్కొలుపు కుమారుడు Alive, son of Awake”, కాబట్టి ఇది మేల్కొలుపు కుమారుడు అలైవ్ యొక్క కథ”, ఇది హేయ్ అనే పాత్ర నిద్రపోతున్న  బాల్యం నుండి జ్ఞానానికి వెళుతున్నట్లు వివరిస్తుంది, అనగా అతను ప్రపంచాన్ని మరియు అతని పరిసరాలను పూర్తిగా ఆలోచించగలడు.

 

డేనియల్ డెఫో యొక్క 18 వ శతాబ్దపు రాబిన్సన్ క్రూసో పాత్ర  ఇబ్న్ తుఫైల్ యొక్క 12వ శతాబ్దం హేయ్ ఇబ్న్ యక్జాన్ తో చాలా పోలి ఉంటుంది.

 

కద హేయ్‌ చిన్నతనం తో మొదలవుతుంది. అతను ఒక యువరాణి కుమారుడు, అతని పుట్టుక రహస్యం. అతను భూమధ్యరేఖ ద్వీపం ఒడ్డున పార వేయబడ్డాడు, అక్కడ అతను ఒక డో/జింక పాలు త్రాగి పెరుగుతాడు. అతడు  తన జీవితంలో 50 సంవత్సరాలు ఇతర మానవులతో సంబంధం లేకుండా గడుపుతాడు. అతని ఒంటరితనం ఏడు సంవత్సరాల, ఏడు దశలలో ఉంటుంది. ప్రతి ఏడు సంవత్సరాల దశలో అతనికి అతనే  గురువు మరియు అతడు తన గురించి మరియు తన పరిసరాల గురించి తెలుసుకుంటాడు.

 

ది స్టోరీ ఆఫ్ హేయ్ ఇబ్న్ యాక్జాన్ యొక్క ఆంగ్ల అనువాదo 1708 లో జరిగింది. పదకొండు సంవత్సరాల తరువాత, డెఫో యొక్క ప్రసిద్ధ పుస్తకం ప్రచురించబడింది. జువాన్ ఫెర్నాండెజ్ ద్వీపాలలో ఒకదానిలో నాలుగు ఏళ్ళకు పైగా ఏకాంతంలో గడిపిన స్కాటిష్ నావికుడు అలెగ్జాండర్ సెల్కిర్క్ యొక్క జీవితానుభవాలు ప్రేరణగా  డెఫో రచన సాగిందని డేఫో సమకాలికులు  చాలామంది చెప్పారు. కానీ రాబిన్సన్ క్రూసో మరియు హేయ్ ఇబ్న్ యక్జాన్ పాత్రల మధ్య సారూప్యతలు సరిపోతాయి, డెఫోకు ఇబ్న్ తుఫైల్ రచన తెలుసు. ద్వీపం నౌకాయానం నుండి ఒంటరితనం మరియు మనుగడ కోసం పోరాటం వరకు, రాబిన్సన్ క్రూసో పాత్రకు  హేయ్ పాత్రకు చాలా సారూప్యతలను కలిగి ఉన్నది.

 

  

No comments:

Post a Comment