29 December 2020

నవాబ్ సయ్యద్ హమీద్ అలీ ఖాన్ బహదూర్ Nawab Sayyid Hamid Ali Khan Bahadur


నవాబ్ సయ్యద్ హమీద్ అలీ ఖాన్ బహదూర్ (31 ఆగస్టు 1875–20 జూన్ 1930) 1889 నుండి 1930 వరకు రాంపూర్ రాజ్యానికి చెందిన నవాబ్ .అతని పాలన 41 సంవత్సరాలు కొనసాగింది, 1930 లో 54 సంవత్సరాల వయసులో మరణించినాడు.నవాబ్ సయ్యద్ హమీద్ అలీ ఖాన్ బహదూర్ తండ్రి నవాబ్ ముష్తాక్ అలీ ఖాన్. తల్లి నవాబ్ కుర్షిద్ జహాన్ బేగం సాహిబా.

అతని వయస్సు  రాంపూర్ రాజ్య సింహాసనాన్ని అధిరోహించినప్పుడు కేవలం పదమూడు మాత్రమే. అతను 1896 వరకు రీజెన్సీ కింద పాలించాడు.

అతని పాలనలో, సర్ హమీద్ సైన్యం మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్ మరియు జర్మన్ తూర్పు ఆఫ్రికాలో విశిష్ట సేవలను చూసిన  ఫలితంగా అతని వందనం 13-తుపాకుల నుండి 15 కి పెంచబడింది

ఉన్నత విద్య సమర్ధకుడు అయిన  సర్ నవాబ్ హమీద్ ఉపఖండంలోని లక్నో మెడికల్ కాలేజీ మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంతో సహా అనేక కళాశాలలకు ఉదారంగా విరాళం ఇచ్చారు మరియు  తన రాజ్యంలోని అనేక విద్యా సంస్థలను  విస్తరించారు. లక్నోలోని షియా కాలేజీ పునాదిలో  ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

41 సంవత్సరాల పాలన తరువాత 1930 లో 54 సంవత్సరాల వయసులో మరణిoచారు. సర్ హమీద్‌ను ఇరాక్‌లోని కార్బాలా వద్ద ఖననం చేశారు. అతని తరువాత అతని కుమారుడు సర్ రాజా అలీ ఖాన్ బహదూర్ నవాబ్ గా ఉన్నారు.

నవాబ్ సయ్యద్ హమీద్ అలీ ఖాన్ బహదూర్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనేక బిరుదులూ, గౌరవాలను పొందారు.

నవాబ్ హమ్ద్ అలీ ఖాన్ పొందిన గౌరవాలు

*డిల్లి దర్బార్ బంగారు పతకం -1903

నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (జిసిఐఇ) - 1908

డిల్లి  దర్బార్ బంగారు పతకం -1911

నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ విక్టోరియన్ ఆర్డర్ (GCVO) - 1911

 

 

No comments:

Post a Comment