10 December 2020

ముస్లిం మెజారిటీ దేశాలలో అక్షరాస్యత మరియు మానవ అభివృద్ధి సూచిక Literacy and Human Development index in Muslim majority countries


"జ్ఞానం సంపాదించు " అనేది ముస్లింలకు ఇస్లాం యొక్క ఆజ్ఞ, మరియు వారు దీనిని దాదాపు 800 సంవత్సరాలు (6-14శతాబ్దాల మద్య కాలం) పాటు అనుసరించారు. ఒక దేశం యొక్క అభివృద్ధికి విద్య ప్రాథమికమైనది, మరియు పేదరిక నిర్మూలనకు ఉన్నత విద్య ఒక శక్తివంతమైన సాధనం, ఈ ప్రాథమిక వాస్తవం మధ్య యుగాలలోని ఉమ్మా (ఇస్లామిక్ సమాజం) కు బాగా తెలుసు, ఇస్లామిక్ చరిత్రలో విజ్ఞాన శాస్త్ర స్వర్ణ యుగం  దాదాపు 800 సంవత్సరాలు పాటు  ఉంది..

 

ఎడ్వర్డ్ జి. బ్రౌన్ (1862-1926) ప్రకారం  “ముస్లిం బాగ్దాద్ మరియు కార్డోవా లోని  పన్నెండు సంవత్సరాల వయస్సు గల ప్రతి అబ్బాయి మరియు అమ్మాయి అక్షరాస్యులుగా ఉన్నప్పుడు ఐరోపాలోని అధిక శాతం ప్రజలకు రాయటం మరియు చదవటం తెలియదు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దాదాపు 800 సంవత్సరాలుగా అన్ని రకాల శాస్త్ర విజ్ఞానాలలో రాణించిన సమయం అది. డక్ఫెరిన్ మరియు అవా యొక్క మార్క్విస్ ఇలా వ్యాఖ్యానించారు, “ముస్లిములు అభివృద్ధి చేసిన   సైన్స్, ఆర్ట్ మరియు సాహిత్యానికి మధ్య యుగాల యూరప్ చాలా రుణపడి ఉంది.

 

కాని 15 వ శతాబ్దం తరువాత ముస్లింలు జ్ఞానం నుండి తమను తాము దూరం చేసుకున్నారు మరియు ప్రపంచ వ్యవహారాల్లో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.

 

ఇస్లామిక్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో అక్షరాస్యత క్షీణించింది. చరిత్రకారుడు డొనాల్డ్ క్వాటెర్ట్ ప్రకారం, 19 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం అక్షరాస్యత రేట్లు 2 నుండి 3 శాతం మాత్రమే.

 

20 వ శతాబ్దం మధ్యలో కూడా పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఈజిప్ట్, ట్యునీషియా, ఇరాన్, జోర్డాన్, కువైట్, మలేషియా, సిరియా, టర్కీ మరియు అల్బేనియా వంటి కొన్ని దేశాలలో మాత్రమే సగటు అక్షరాస్యత 30 శాతానికి పైగా ఉంది.

పాత సోవియట్ యూనియన్ పరిధిలోని ముస్లిం ప్రాంతాలలో అధిక అక్షరాస్యత ఉంది.

ముస్లిం ప్రపంచంలో అక్షరాస్యత పతనం, జార్జ్ సార్టన్ అసాధారణమైనదిగా  అభివర్ణించారు.

 

గత నాలుగు శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు విద్య మినహా జీవితంలోని ప్రతి అంశంలో గొప్ప ఆసక్తిని కనబరిచారు. కవిత్వం, సంగీతం, పెయింటింగ్, సెరామిక్స్, ఆర్కిటెక్చర్, మెటల్ వర్క్ మొదలైనవి ఇస్లామిక్ ప్రపంచం అంతటా ముఖ్యమైన కార్యకలాపాలుగా మారాయి.

 

కాని ఐరోపా నుండి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక విద్యపై చాలా తక్కువ ఆసక్తి చూపబడింది. 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ వాడకాన్ని అనుమతించటానికి ముస్లింలు నిరాకరించడం చాలా హానికరమైన చర్య, ఇది ఐరోపాకు ఒక మలుపు. ప్రింటింగ్ ప్రెస్ ద్వారా, ఐరోపాలో శాస్త్రీయ మరియు పారిశ్రామిక కార్యకలాపాల అన్ని రంగాలలో శాస్త్రీయ విప్లవం సాధ్యమైంది.

 

చాలా కాలం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆధునిక జ్ఞానం మరియు అధిక అక్షరాస్యత లేకుండా, పాశ్చాత్యుల దోపిడీని అడ్డుకోలేమని అభివృద్ధి సాధించలేమని అర్థం చేసుకోవడం ప్రారంభించారు.

 

ఇస్లామిక్ ప్రపంచంలో ఈ మధ్యకాలంలో విద్య మళ్లీ పుంజుకుంటోంది. ఈ దశలో  ముస్లిం దేశాలు గణనీయమైన చర్యలు తీసుకుంటున్నాయి, చమురు యొక్క ఆర్ధిక బలం కారణంగా పేదరికం మరియు నిరక్షరాస్యత నిర్మూలనకు పూనుకొన్నాయి.,.

 

జాన్ మిల్లెర్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, అజర్‌బైజాన్, తజికిస్తాన్, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అనే ఐదు ముస్లిం దేశాలు ప్రపంచం లో 100 శాతం ఉన్నఅక్షరాస్యత ఉన్న  25 దేశాల జాబితాలో చోటు సంపాదించినవి.

 

25 ముస్లిం మెజారిటీ దేశాలు సగటు అక్షరాస్యతను 90 శాతానికి మించి సాధించాయని ప్రపంచ బ్యాంకు, యున్‌సెకోUNESCO డేటా 2018 లో తేలింది. వీటిలో సౌదీ అరేబియా (95 శాతం), ఇండోనేషియా (94 శాతం), మలేషియా (94 శాతం), ఇరాన్ (90 శాతం), జోర్డాన్ (96 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (94 శాతం), టర్కీ (95 శాతం) ఉన్నాయి.

 

సిరియా (86%), ట్యునీషియా (82%), ఇరాక్ (79%), ఈజిప్ట్ (75%) అల్జీరియా (73), మొరాకో (72%) సహా తొమ్మిది దేశాలు 70% నుండి 89 వరకు ఉన్నాయి.

 

కాని బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు నైజీరియా వంటి పదిహేను దేశాలు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాయి (62% కన్నా తక్కువ).

1980 యొక్క అక్షరాస్యత డేటాతో పోలిస్తే (సగటు 30 శాతం), 2018 డేటా చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రపంచ అక్షరాస్యత రేటు (2017) 82 శాతం (పురుషులు, 87 శాతం; మహిళలు 77 శాతం).

 

అనేక ఇస్లామిక్ దేశాలలో అక్షరాస్యత సాధనలో స్త్రీ-పురుషుల మద్య పెద్ద తేడా లేదు. 21 దేశాలలో  0-7% మాత్రమే.

 

ఇస్లామిక్ ప్రపంచంలో విద్య యొక్క అన్ని విభాగాలలో ఉన్నత విద్యపై  తీవ్రమైన శ్రద్ధ అవసరం. మొరాకో రాజు మొహమ్మద్ VI, ప్రకారం “… ఇస్లాం సమగ్ర అభివృద్ధి మరియు శాస్త్రీయ విజ్ఞానం  (స్త్రీ-పురుష సంబంధం లేకుండా సాధించాలి” (యునెస్కో కాన్ఫరెన్స్, 2000).

 

ముస్లిం ప్రపంచంలో శాస్త్రీయ విజ్ఞానం పై శ్రద్ద చూపబడుతుంది అనేది వాస్తవం.  సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, టర్కీ వంటి అనేక దేశాలలో పరిశోధన/రిసెర్చ్ పై వ్యయం పెరిగింది. పాశ్చాత్య దేశాలలో Tertiary education టెరిటరీ విద్య సాధారణంగా 40 శాతానికి మించి ఉంటుంది, అయితే ఇస్లామిక్ దేశాలలో టర్కీ, సౌదీ అరేబియా మరియు ఇండోనేషియా వంటి కొన్ని దేశాలను మినహాయించి, ఇది 2 నుండి 6 శాతం మధ్య ఉంటుంది.

 

ముస్లిం దేశాలలో పరిశోధన పై  వ్యయం పెంచాల్సిన అవసరం ఉంది. టర్కీ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ వంటి దేశాలు మాత్రమే రిసెర్చ్ కోసం గణనీయంగా నిధులు సేకరించాయి. సైన్స్ బడ్జెట్‌ను జీడీపీ/స్థూల జాతీయోత్పత్తిలో లో 0.8 శాతం నుంచి 2.8కి పెంచాలని ఖతార్ ప్రతిపాదించినట్లు సమాచారం

 

అనేక ముస్లిం దేశాలు ఇప్పటికే ఆధునిక శాస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత విద్యా కేంద్రాలను/విశ్వవిద్యాలయాలు స్థాపించాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2018 (2016-2017 సంవత్సరానికి) ప్రకారం  ప్రపంచంలోని టాప్ 1102 విశ్వవిద్యాలయాల జాబితా లో ముస్లిం దేశాల నుండి 96 విశ్వవిద్యాలయాలు కలవు.  ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్నత విద్య అభివృద్ధి లో ఇది ఖచ్చితంగా సానుకూల సంకేతం. అయితే 18 ముస్లిం దేశాల విశ్వవిద్యాలయాలు మాత్రమే జాబితాలో చోటు చేసుకొన్నవి.  భవిష్యత్ నివేదికలలో ఇతర ముస్లిం దేశాలు తమ పేర్లను కుడా చోటు చేసుకొంటాయని ఆశిద్దాం.

 

ఎంపిక/లిస్టెడ్ 96 విశ్వవిద్యాలయాలలో 22 టర్కీకి చెందినవి, తరువాత ఇరాన్ 18, పాకిస్తాన్ 10, మలేషియా మరియు ఈజిప్ట్ తొమ్మిది, సౌదీ అరేబియా 5, యుఎఇ మరియు ఇండోనేషియా నాలుగు, జోర్డాన్ మరియు మొరాకో 3, ట్యునీషియా 2, అల్జీరియా, బంగ్లాదేశ్, కువైట్, లెబనాన్, నైజీరియా, ఒమన్ మరియు ఖతార్ 1 చొప్పున ఉన్నాయి.

 

 

ఇస్లామిక్ దేశాలలోని మహిళల సాధికారికత ఒక నివేదికలో ప్రతిబింబిస్తుంది మొత్తం సైన్స్ గ్రాడ్యుయేట్ జనాభాలో  సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహిళల శాతంలో యునైటెడ్ స్టేట్స్ పదమూడు ముస్లిం దేశాల కంటే వెనుకబడి ఉంది.

 

మహిళా సైన్స్ గ్రాడ్యుయేట్ల నిష్పత్తి యునైటెడ్ స్టేట్స్ కంటే ఎక్కువగా ఉన్న దేశాలలో బహ్రెయిన్, బ్రూనై దారుస్సలాం, కిర్గిజ్స్తాన్, లెబనాన్, ఖతార్ మరియు టర్కీ ఉన్నాయి.

మిషన్స్లామ్.కామ్ missionislam.com. ప్రకారం, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నిష్పత్తి లో మొరాకో సైన్స్ గ్రాడ్యుయేట్ జనాభా అమెరికాను మించినది.

ట్యునీషియా, మలేషియా, లెబనాన్, జోర్డాన్, బహ్రెయిన్ మరియు లిబియాతో సహా అనేక ఇస్లామిక్ దేశాలలో ఉన్నత విద్యలో పురుషుల నమోదు కంటే స్త్రీల ఎన్రోల్/నమోదు ఎక్కువ.

ఇస్లామిక్ దేశాలలోని 41 విశ్వవిద్యాలయాలలో, మహిళా విద్యార్థులు పురుష విద్యార్థులను మించిపోయారు. పదకొండు విశ్వవిద్యాలయాలలో స్త్రీ-పురుష నిష్పత్తి 65:35 కన్నా ఎక్కువ, సౌదీ అరేబియాలోని ఇమామ్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ ఫైసల్ విశ్వవిద్యాలయం (22,257 మంది విద్యార్థులు) అత్యధిక నిష్పత్తి 81:19, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విశ్వవిద్యాలయం (7,492 మంది విద్యార్థులు) 79 : 21, ఖతార్ విశ్వవిద్యాలయం (13,342 మంది విద్యార్థులు) 73:27, కువైట్ విశ్వవిద్యాలయం (37,752 విద్యార్థులు) నిష్పత్తి 72:28.

 

1901 నుండి 2013 వరకు సైన్స్‌ లో 500 మంది నోబెల్ అవార్డు గ్రహీతలలో ఇద్దరు మాత్రమే ముస్లిం ప్రపంచానికి చెందినవారు, వారు1999 లో కెమిస్ట్రీలో  నోబెల్ బహుమతి గెలుచుకున్న అహ్మద్ జెవైల్ (ఈజిప్ట్) మరియు 2015 లో కెమిస్ట్రీలో టర్కీ నుండి అజీజ్ సాంకర్.

 

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్, యుఎస్ యొక్క నివేదిక ప్రకారం, , మధ్య యుగాలలో, నోబెల్ ప్రైజ్, ఉంది ఉంటె దానితో సహా అన్ని బహుమతులు ముస్లిం శాస్త్రవేత్తలకు (రిపోర్ట్ 2013) చెందేవి.

 

ముస్లిం ప్రపంచం శాస్త్రి విజ్ఞాన అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకుంటుందనడంలో సందేహం లేదు, చమురు ఉత్పత్తి చేసే దేశాలు వాటి  ఆర్థిక బలం కారణంగా పేదరికం మరియు నిరక్షరాస్యత నిర్మూలనలో  పాశ్చాత్య దేశాలతో పోటీ పడాలంటే చాలా చాలా చేయాల్సి ఉంది.

 


  

 


 


 


 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment