హునాయిన్ ఇబ్న్ ఇషాక్
అబ్బాసిడ్ పరిపాలన కాలంలో
809లో అల్-హిరాలో అధిక అక్షరాస్యత,
బహుభాషావాదం మరియు అరబ్, సిరియాక్ బాషలలో నిష్ణాతులు అయిన ఒక అరబ్ కుటుంబంలో
జన్మించాడు.హునాయిన్ ఇబ్న్ ఇషాక్ అల్-ఇబాది(అరబిక్: أبو زيد حنين بن العبادي)
9శతాబ్దపు ప్రభావవంతుడైన అనువాదకుడు, పండితుడు,
వైద్యుడు మరియు కంటి వైద్యంలో నిపుణుడు మరియు
శాస్త్రవేత్త.
హునాయిన్ ఇబ్న్ ఇషాక్ చిన్నతనంలోనే సిరియాక్ మరియు అరబిక్ భాషలను
నేర్చుకున్నాడు. తండ్రి ఫార్మసిస్ట్ అయినందువలన హునాన్ మెడిసిన్ అధ్యయనం కోసం
బాగ్దాద్ వెళ్ళాడు. తరువాత లాటిన్ భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి విదేశాలకు
వెళ్లాడు. బాగ్దాద్కు తిరిగి వచ్చినప్పుడు,
హునెన్
హోమర్ మరియు గాలెన్ రచనలను పఠించడం ద్వారా కొత్తగా సంపాదించిన నైపుణ్యాలను
ప్రదర్శించాడు.
హునాయిన్ ఇబ్న్ ఇషాక్ అబ్బాసిడ్ రాజ వంశస్తుల కాలం లో తత్వశాస్త్రం మరియు శాస్త్రీయ గ్రీకు మరియు పెర్షియన్ గ్రంథాలను అనువదించడానికి అబూ ఉత్మాన్ అల్-డిమాష్కి,
ఇబ్న్ మాసే అల్-నవ్బఖ్తి మరియు థబిట్ ఇబ్న్ ఖుర్రా
Abū ‘Uthmān al-Dimashqi, Ibn Mūsā al-Nawbakhti, and Thābit ibn Qurra మొదలగు అనువాదకుల బృందంతో కలిసి పనిచేశాడు.
హునాయిన్ ఇబ్న్ ఇషాక్
గ్రీకు వైద్య మరియు శాస్త్రీయ గ్రంథాల యొక్క అత్యంత ప్రసిద్ది చెందిన అనువాదకుడు.
అతను గ్రీకు భాషను అభ్యసించాడు మరియు అరబ్బులలో “అనువాదకుల
షేక్” గా ప్రసిద్ది చెందాడు. అతను అరబ్ అనువాదాలకు తండ్రి
father of Arab translations. అతను అరబిక్, సిరియాక్,
గ్రీక్ మరియు పెర్షియన్ మొదలగు నాలుగు భాషలను నేర్చుకున్నాడు.
పురాతన గ్రీకు గ్రంధాల
అద్యయనం హునాన్ కు గ్రీకు గ్రంథాలను సిరియాక్ మరియు అరబిక్ భాషలోకి అనువదించడానికి
వీలు కల్పించింది. అబ్బాసిద్ ఖలిఫా అల్-మామున్, హునాన్ యొక్క అనువాద ప్రతిభను గమనించి, అతన్ని
తొమ్మిదవ శతాబ్దపు గొప్ప గ్రీకు-అరబిక్ / సిరియాక్ అనువాద ఉద్యమానికి కేంద్రమైన బాగ్దాద్లోని హౌస్ ఆఫ్ విజ్డమ్ లేదా బైట్ అల్ హిక్మా లో ప్రధాన
అనువాదకుడిగా నియమించాడు. అరిస్టాటిల్ మరియు ఇతర
ప్రముఖ రచయితల మాన్యుస్క్రిప్ట్‌ల కోసం బైజాంటియమ్‌కు ప్రయాణించే అవకాశాన్ని కూడా
ఖలీఫా హునాన్‌కు ఇచ్చాడు.
హౌస్ ఆఫ్ విజ్డమ్ అనేది పురాతన
గ్రీకు రచనలు అనువదించబడి మరియు పండితులకు అందుబాటులో ఉంచబడిన ఒక సంస్థ. హునాయిన్ ఇబ్న్ ఇషాక్ అనువాదాలకు దిద్దుబాట్లు అవసరం లేదు;
హునాన్ యొక్క పద్ధతిని తరువాత అనువాదకులు అనుసరించారు.
అబ్బాసిడ్ యుగంలో గ్రీక్
సైన్స్ అధ్యయన పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ సమయంలో, తత్వశాస్త్రం, గణితం, సహజ విజ్ఞానం మరియు వైద్యానికి సంబంధించి అనువదించని
ప్రాచీన గ్రీకు సాహిత్యం చాలా ఉంది. ఈ విలువైన సమాచారం గ్రీకు భాష తెలిసిన చాలా
తక్కువ పండితులకు మాత్రమే అందుబాటులో ఉంది. సామాన్యుల కోసం ఆ గ్రంధాలను అనువదించవలసిన అవసరం చాలా ఉంది..
ఇటువంటి సమయం
లోనే హునాయిన్ ఇబ్న్ ఇషాక్ ప్రధాన
అనువాదకుడు అయ్యాడు మరియు ఇస్లామిక్ వైద్యానికి పునాదులు వేశాడు. హునాయిన్
ఇబ్న్ ఇషాక్ తన జీవితకాలంలో అనేక అనువాదాలు మరియు ఒరిజినల్ రచనలు చేసాడు. ఇబ్న్ ఇషాక్
ప్లేటో యొక్క టిమేయస్, అరిస్టాటిల్
యొక్క మెటాఫిజిక్స్ మరియు పాత నిబంధన Plato's Timaeus, Aristotle's Metaphysics, and
the Old Testamentతో సహా 116 గ్రంధాలను సిరియాక్ మరియు అరబిక్లోకి అనువదించాడు.
ఇబ్న్ ఇసాక్ సొంతంగా 36 పుస్తకాలను రచించినాడు.
వాటిలో 21గ్రంధాలూ వైద్య రంగానికి
సంభంధించినవి. అతని కుమారుడు
ఇషాక్, మరియు అతని
మేనల్లుడు హుబాయిష్, అతనితో అనువాదపు
పనిలో కలిసి పనిచేసారు. హునాన్ ఇబ్న్ ఇషాక్ తన అనువాదాలు, అనువాద పద్ధతికి
మరియు వైద్యానికి చేసిన కృషికి ప్రసిద్ది చెందారు.
హునాన్ తత్వశాస్త్రం, మతం మరియు ఔషధం, అనువాదం,
ఆప్తాల్మాలజీ,
ఫిలాసఫీ,
మతం,
అరబిక్ వ్యాకరణం మొదలగు రంగాలలో ప్రసిద్ది చెందినాడు.ఇతని ప్రసిద్ద రచన “బుక్ ఆఫ్ ది టెన్ ట్రీటైసెస్ ఆఫ్ ది ఐ Book of the Ten Treatises of the Eye”.
ఆఫ్తమాలజి Ophthalmology
హునైన్ ఇబ్న్ ఇషాక్ నేత్ర వైద్య రంగాన్ని సుసంపన్నం
చేశారు. మానవ కన్ను అధ్యయనంలో అతని కృషిని అతని వినూత్న పుస్తకం "బుక్ ఆఫ్ ది
టెన్ ట్రీటైజెస్ ఆఫ్ ది ఐ Book of the Ten
Treatises of the Eye" ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. ఈ పాఠ్య పుస్తకం ఆఫ్తమాలజి
క్షేత్రo లో మొట్టమొదటి క్రమబద్ధమైన చికిత్స వివరించినది మరియు ఆ సమయం నాటి వైద్య పాఠశాలల్లో ఎక్కువగా
ఉపయోగించబడింది. ఈ పుస్తకం లో హునైన్ కన్ను మరియు దాని శరీర నిర్మాణ శాస్త్రాన్ని దాని
వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్సలు వివరంగా
వివరిస్తాడు.
హునైన్ ఇబ్న్ ఇసాక్ కంటి లోని తిత్తులు మరియు కణితుల cysts and tumors స్వభావం మరియు అవి
కలిగించే వాపు గురించి చర్చిస్తాడు. శస్త్రచికిత్స ద్వారా వివిధ కార్నియల్
అల్సర్లకు ఎలా చికిత్స చేయాలో మరియు కంటిశుక్లం చికిత్స గురించి చర్చిస్తారు. హునైన్
ఇబ్న్ ఇసాక్ రచించిన "ఆప్తాల్మాలజీపై
పది చికిత్సలు" అతని శాస్త్ర చికిత్స నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది
హునాన్ ఇబ్న్ ఇషాక్ అనేక వైద్య రచనలను చేసాడు, అతని
వైద్య రచనలలో కొన్ని Fi Awja al-Ma'idah ఫీ అవ్జా అల్-మైదా (కడుపు
వ్యాధులపై) మరియు అల్-మసైల్ ఫైల్-టిబ్ లిల్-ముతాఅల్లిమిన్ al-Masail fi’l-Tibb li’l-Muta’allimin (విద్యార్థుల కోసం మెడిసిన్ పై ప్రశ్నలు).
హౌస్ ఆఫ్ విజ్డమ్లో, హునాన్ ఇబ్న్ ఇషాక్ మంచి
అనువాదకులలో ఒకరు. ఇషాక్ "అనువాదకుల షేక్" అని పిలువబడ్డాడు మరియు అతను
గ్రీక్, పర్షియన్, అరబిక్ మరియు సిరియాక్
భాషలను నేర్చుకొన్నాడు. అతను తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణితం, మెడిసిన్, మేజిక్ మొదలగు విషయాలలో
కూడా రచనలను అనువదించగలిగాడు..
హునాన్
యొక్క కొన్ని ముఖ్యమైన అనువాదాలు "డి మెటీరియా మెడికా" యొక్క అనువాదం
మరియు "క్వశ్చన్స్ ఆన్ మెడిసిన్". "మెడిసిన్ పై ప్రశ్నలు" ఇవి
వైద్య విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి, హునాన్ అనేక ఔషధ
గ్రంథాలను మరియు సారాంశాలను అనువదించాడు, ప్రధానంగా
గాలెన్. "ఆన్ సెక్ట్స్" మరియు "ఆన్ అనాటమీ ఆఫ్ ది వీన్స్ అండ్
ఆర్టరీస్ "On Sects" and "On Anatomy of the
Veins and Arteries"
" తో సహా లెక్కలేనన్ని గాలెన్ రచనలను అనువదించాడు.
హునాన్
యొక్క అనువాదాలు మెడిసిన్ అభివృద్ధి లో సహాయ పడ్డాయి మరియు తన పుస్తకం అల్-అషర్ మకాలత్ ఫియల్-ఐన్ (ది
టెన్ ట్రీటైజెస్ ఆన్ ది ఐ) ద్వారా నేత్రశాస్త్రం యొక్క విజ్ఞానాన్ని సిద్ధాంతం
మరియు అభ్యాసం theory and practice
ద్వారా విస్తరించడానికి సహాయం చేశాడు.
హునాన్
వ్యవసాయం, రాళ్ళు మరియు మతం పై రచనలను అనువదించారు. అతను ప్లేటో మరియు
అరిస్టాటిల్ రచనలు మరియు ప్రాచీన గ్రీకుల రచనల పై వ్యాఖ్యానాలను అనువదించాడు.
గ్రీకు విజ్ఞానం హునాన్
ఇబ్న్ ఇషాక్ మరియు బాగ్దాద్‌లోని హౌస్ ఆఫ్ విజ్డమ్‌లో పనిచేసిన ఇతర అనువాదకులందరి సహాయం
తో ఆధునిక ప్రపంచం లో వెలుగు లోనికి వచ్చింది. అనువాదకుడిగా హునాయిన్ ఇబ్న్ ఇషాక్ కీర్తి దశ దిశలు వ్యాపించినది. హునాన్
873 AD మరణించినాడు,
No comments:
Post a Comment