దివ్య ఖురాన్ మానవాళికి
పూర్తి మార్గదర్శకత్వం అయితే, ముహమ్మద్ ప్రవక్త (స) యొక్క 40 హదీసులు మన జీవితంలో అల్లాహ్ ఆదేశాలను ఎలా
అమలు చేయాలో చెబుతున్నాయి. జీవితంలోని వివిధ దశల కోసం, మనం
ప్రతిబింబించాల్సిన ఆయతులను దివ్య ఖురాన్ లో అల్లాహ్ వెల్లడించాడు. ఈ ఆయతులు ప్రతి
అవకాశాన్ని మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి జీవితాలను సులభతరం చేశాయి. ప్రవక్త
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క 40 హదీసులను మీకు అందిస్తున్నాము, మీరు జీవితంలో వాటి
పట్ల అవగాహనను పెంచుకొని అమలు చేయవచ్చు.
1. విశ్వాసులలో సలాం వ్యాప్తి చేయండి. (ముస్లిం)
2. విశ్వాసులు మాట్లాడే ముందు సలాం చెప్పాలి. (తిర్మిజి)
3. మొదట సలాం చేసే వారు దేవునికి దగ్గరగా ఉండే వారు. (తిర్మిజి)
4. ఉపవాసం పాపాల నుండి ఒక కవచం. (తిర్మిజి)
5. పరిశుభ్రత అనేది విశ్వాసంలో ఒక భాగం.
(తిర్మిజి)
6. చర్యలు వారి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటాయి. (బుఖారీ)
7. ముస్లిం మరి ఒక ముస్లింకు సోదరుడు. (బుఖారీ)
8. దివ్య ఖురాన్ పఠించేవారికి, అది వినేవారికి
ప్రతిఫలంలో సమాన వాటా ఉంటుంది. (బుఖారీ)
9. మీలో ఉత్తమమైనవారు దివ్య ఖురాన్ నేర్చుకొని ఇతరులకు
బోధించినవాడు. (బుఖారీ)
10. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి, రోగులను
సందర్శించండి మరియు బందీని విడిపించండి. (బుఖారీ)
11. సలాత్ దీన్ యొక్క స్తంభం. (తబ్రాణి)
12. ఒక మనిషి తన సన్నిహితుడి ధర్మాన్ని అనుసరిస్తాడు, కాబట్టి మీరు
ప్రతి ఒక్కరూ సన్నిహితుడిని చాలా
జాగ్రత్తగా ఎంచుకోవాలి. (అబూ దావుద్)
13. మీలో ఎవరైనా తిన్నప్పుడు, అతను తన కుడి
చేతితో తినాలి మరియు అతను త్రాగినప్పుడు తన కుడి చేతితో తాగాలి. (ముస్లిం)
14. దేవుని పేరును ప్రస్తావించండి, మీ కుడి చేతితో
తినండి మరియు మీ పక్కన ఉన్నదాన్ని తినండి. (బుఖారీ)
15. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనిషి
నిలబడి త్రాగటాన్ని నిషేధించారు.
(ముస్లిం)
16. మల్లయోధుడు మంచి బలవంతుడు కాదు; కోపంగా
ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకునేవాడు బలవంతుడు. (బుఖారీ)
2.ఇతరులపై దయ చూపాలని చెప్పే
హదీసులు Hadiths explained to have mercy on others:
17. మీలో ఒకరు నిలబడి ఉన్నప్పుడు కోపంగా ఉంటె, అతను
కూర్చోవాలి. కోపం అతనిని విడిచిపెడితే మంచిది లేకపోతే అతను పడుకోవాలి. (అహ్మద్)
18. ఇతరులపట్ల దయ చూపనివారికి దేవుడు దయ చూపడు. (బుఖారీ).
19. ఒక పేదవాడికి ఇచ్చిన సద్కా కేవలం సద్కా, కానీ బంధువుకు
ఇచ్చినప్పుడు అది సద్కా మరియు అల్లాహ్ తో అనుసంధానికి లంకె కావడంతో అది రెండు ప్రయోజనాలకు
ఉపయోగపడుతుంది. (తిర్మిజి ).
20. ఆదాము కుమారుడా, మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఖర్చు చేస్తే!
నేను (దేవుడు) మీ కోసం ఖర్చు చేస్తాను. (బుఖారీ)
21. మనిషి చనిపోయేటప్పుడు వంద దిర్హామ్లు ఇవ్వడం కంటే, తన జీవితకాలంలో సద్కాగా ఒక దిర్హామ్ ఇవ్వడం మంచిది.
(అబూ దావుద్)
22. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని మూడు చర్యలకు
మినహాయింపులు నమోదు చేయబడవు. అవి : సద్కా, లేదా జ్ఞానం పొందడం మరియు చనిపోయిన తండ్రి
కొరకు మంచి కొడుకు ప్రార్థనలు. (ముస్లిం)
23. ముస్లింలలో ఉత్తమమైన ఇల్లు మంచి ఆదరణ పొందిన
అనాథను కలిగి ఉండటం, మరియు ముస్లింలలో
చెత్త ఇల్లు అనాథను అనాదరించేది. (ఇబ్న్ మజా)
24. ఉత్తమ సద్కా ఏమిటంటే, ఒక ముస్లిం మనిషి
జ్ఞానం (దీన్) నేర్చుకుంటాడు మరియు తరువాత దానిని తన ముస్లిం సోదరులకు బోధిస్తాడు.
(ఇబ్న్-ఎ-మజా)
3.ఉత్తమ సంబంధాలు
చేసుకోవటానికి హదీసులుHadiths on
making best relationships:
25. ప్రభువు యొక్క మంచి ఆనందం తండ్రి యొక్క మంచి
ఆనందం నుండి వస్తుంది, మరియు ప్రభువు
యొక్క అసంతృప్తి తండ్రి అసంతృప్తి నుండి వస్తుంది. (తిర్మిజి)
26. (రక్త) సంబంధాలను కత్తిరించేవాడు స్వర్గంలోకి
ప్రవేశించడు. (ముస్లిం).
27. పట్టు ధరించవద్దు, ఎందుకంటే పట్టును
ఈ జీవితంలో ధరించే వారు పరలోకంలో ధరించరు. (ముస్లిం)
28. ఎవరైతే బంగారం
లేదా వెండి పాత్రల నుండి తింటారో లేదా
త్రాగుతారో , నిజానికి వారు తమ కడుపును నరకపు అగ్నితో నింపుతున్నారు. (ముస్లిం)
29. విగ్రహాలు లేదా
బొమ్మలు ఉన్న ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరు. (బుఖారీ)
30. మీ నిక్కా
(వివాహం) ప్రకటించండి. (తిర్మిజి)
31. నిక్కా (వివాహం)
నా సున్నత్. (ఇబ్న్-ఎ-మజా)
32. నా సున్నత్ నుండి
ఎవరైతే మరలుతారో వారు నావారు కాదు. (బుఖారీ)
33. మీలో ఒకరిని వివాహ
విందుకు ఆహ్వానించినప్పుడు, అతను దానికి వెళ్ళాలి. (బుఖారీ)
34. చట్టబద్ధమైన
విషయాలలో విడాకులను అల్లాహ్ అమితంగా ద్వేషిస్తాడు. (అబూ దావుద్)
35. ఏదైనా స్త్రీ తన
భర్తను కొన్ని బలమైన కారణాలు లేకుండా విడాకులు కోరితే, స్వర్గం వాసన ఆమెకు నిషేధించబడుతుంది.
(తిర్మిధి)
4.జ్ఞానం ను పొందటం పై హదీసులు:Hadiths
on obtaining knowledge:
36. జ్ఞానం వెతుక్కుంటూ బయలుదేరేవాడు తిరిగి
వచ్చేవరకు దేవుని మార్గంలో ఉంటాడు. (తిర్మిజి)
37. దీన్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడం ప్రతి
ముస్లిం పురుషుడు మరియు స్త్రీకి ఫర్జ్/విధి . (ఇబ్న్-ఎ-మజా)
38. మంచికి మార్గం చూపించే ఎవరికైనా ప్రతిపలం అది చేసిన వ్యక్తికి లబించే ప్రతిఫలం తో సమానoగా
ఉంటుంది. (ముస్లిం)
39. భగవంతుడు అత్యంత ద్వేషించే వ్యక్తి గొడవలు, వివాదాలు
ఎక్కువగా చేసేవాడు. (బుఖారీ)
40. తన సోదరుడి కోసం తాను కోరుకున్నది కోరుకునే
వరకు మీలో ఎవరూ విశ్వాసి అని చెప్పలేము.
ఈ 40 హదీసులు మనకు
తరచుగా అర్థం కాని విషయాలను వివరిస్తాయి మనము ఈ హదీసులను కంఠస్థం చేసుకోవచ్చు మరియు వాటి
నుండి చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
మన జీవితంలో నీతివంతమైన
మార్గానికి చేరుకుందాం. అమీన్!
No comments:
Post a Comment