31 December 2020

మస్లామా అల్-మజృతి 950-1007 Maslama al-Majriti 950-1007



మస్లామా అల్-మజృతి Maslama al-Majriti గా పిలువబడే అబూ అల్-ఖాసిమ్ మస్లామా ఇబ్న్ అహ్మద్ అల్-మజృతి (అరబిక్: أبو القاسم مسلمة بن أحمد (లాటిన్లో మేతిలెం Methilem అంటారు ) యొక్క జననం 950 సంవత్సరం లో మాడ్రిడ్, అల్-అండాలస్, ఇప్పుటి  స్పెయిన్ లో జరిగింది. అతను కార్డోవాలో  చదువుకున్నాడు మరియు మరణించే వరకు అక్కడ పనిచేశాడు. మస్లామా అల్-మజృతి ఇస్లామిక్ స్పెయిన్లో అల్-హకంII పరిపాలనా కాలం  లో ప్రముఖ  అరబ్ ముస్లిం ఖగోళ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, పండితుడు, ఆర్థికవేత్త.

మస్లామా అల్-మజ్రే తన కాలం నాటి అండలూసియన్ ఖగోళ శాస్త్ర అగ్రగామి. మస్లామా గణిత ఖగోళ శాస్త్ర నిపుణుడు వాణిజ్య అంకగణితం (ముస్మాలాట్muʿāmalāt)) జ్యోతిష్కం ఇంద్రజాలం మరియు రసవాదంపై రచనలు చేసాడు

మస్లామా అల్-మజృతి పూర్తి పేరు అబూ-అల్-ఖాసిమ్ మస్లామా ఇబ్న్ అమాద్ అల్-ఫరాస్ అల్-అసిబ్ అల్-మజారే అల్-ఖుర్యుబా అల్-అండలూసా.

టోలెమి రచించిన  ప్లానిస్ఫేరియంPtolemy's Planisphaerium అనువాదంలో మస్లామా అల్-మజృతి పాల్గొన్నాడు మరియు  అల్మాజెస్ట్ యొక్క అనువాదాలను మెరుగుపరిచాడు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మి యొక్క ఖగోళ పట్టికలను ప్రవేశపెట్టాడు మరియు వాటిని మెరుగుపరిచాడు. పెర్షియన్ తేదీలను హిజ్రీ సంవత్సరాలోకి  మార్చడానికి పట్టికలను రూపొందించడం ద్వారా చరిత్రకారులకు సహాయం చేశాడు మరియు సర్వేయింగ్ మరియు త్రిభుజం యొక్క పద్ధతులు Techniques of surveying and triangulation పరిచయం చేశాడు.

పాదరసం ఆక్సైడ్ mercury oxide  వాడకం మరియు ప్రయోగాలను రికార్డ్ చేసిన తొలి రసవాదులలో alchemists మస్లామా అల్-మజృతి ఒకరు.మస్లామా అల్-మజృతి అల్-అండాలస్లో ఉత్తమ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. అతను ఇబ్న్ అల్-సఫర్‌తో కలిసి పనిచేయడం ద్వారా కొత్త సర్వేయింగ్ పద్ధతులను ప్రవేశపెట్టాడు. అతను పన్ను మరియు అల్-అండాలస్ యొక్క ఆర్ధికవ్యవస్థపై ఒక పుస్తకం రాశాడు. అతను అల్-అండాలస్కు వచ్చినప్పుడు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది బ్రెథ్రెన్ ఆఫ్ ప్యూరిటీEncyclopedia of the Brethren of Purity  యొక్క భాగాలను సవరించాడు మరియు మార్పులు చేశాడు.

మస్లామా అల్-మజృతి అండలూసియన్ సైన్స్ మరియు శాస్త్రీయ బోధనలో నిపుణుడు అతను ఖగోళ శాస్త్రం మరియు గణిత పాఠశాలను నిర్మించాడు అందులో అంకగణితం మరియు జ్యామితి విభాగాలు ఉన్నాయి. మస్లామా అల్-మజృతి శాస్త్రీయ సమాచార పరస్పర మార్పిడి యొక్క భవిష్యత్ ప్రక్రియ నెట్‌వర్క్‌ ల ఆగమనాన్ని కూడా ఊహించాడు మస్లామా అల్-మజృతి అల్-అండాలస్‌లో వ్యవస్థీకృత శాస్త్రీయ పరిశోధనలకు నాంది పలికాడు. అతని విద్యార్థులలో ఇబ్న్ అల్-సఫర్, అబూ అల్-సాల్ట్ మరియు తుర్తుషి Ibn al-SaffarAbu al-Salt and at-Turtushi.ఉన్నారు. మస్లామా అల్-మజృతి మరియు అతని శిష్యులు అల్-అండాలస్ అంతటా ఖచ్చితమైన శాస్త్రాల exact sciences అభివృద్ధి మరియు విస్తరణను బాగా ప్రభావితం చేశారు

మస్లామా అల్-మజృతి మొదటిసారిగా అల్-అండాలస్ రెండు విభిన్న గణిత సంప్రదాయాలను కలిపారు, అవి ఫర్దిడ్ farāʾī   యొక్క సంప్రదాయం (మతపరంగా వారసత్వ విభజన) మరియు రెండోవది-ఖగోళ శాస్త్రాన్ని కలిగి ఉన్న గణితశాస్త్ర ఆధారిత తాత్విక శాస్త్రాల సంప్రదాయం.

మస్లామా అల్-మజృతి యొక్క రెండు రచనలు "సేజ్ స్టెప్ / ది ర్యాంక్ ఆఫ్ ది వైజ్" (రుత్‌బాత్ అల్-హకీమ్1009) మరియు పికాట్రిక్స్ "Sage's Step/The Rank of the Wise" (Rutbat al-hakim,1009) and the Picatrix 1252 లాటిన్లోకి అనువదించబడ్డాయి. అవి అరబిక్ లో బహుశా పదకొండవ శతాబ్దం మధ్యలో రాయబడి ఉండవచ్చు.

మస్లామా అల్-మజృతి యొక్క రుట్బాట్ Rutbat రసవాద సూత్రాలు మరియు విలువైన లోహాల శుద్దీకరణకు సూచనలను కలిగి ఉంది మరియు అతను ద్రవ్యరాశి పరిరక్షణ సూత్రాన్ని గమనించిన మొట్టమొదటి వ్యక్తి. దీనిని అతడు పాదరసం ఆక్సైడ్ పై తన ప్రయోగంలో గమనించాడు.

ఖగోళ శాస్త్ర రంగంలో మస్లామా అల్-మజృతి తన సొంత ఖగోళ పరిశీలనలు చేసిన మొదటి అండలూసియన్. మస్లామా అల్-మజృతి 979 సంవత్సరంలో రెగ్యులస్ అనే నక్షత్రాన్ని గమనించాడు మరియు దాని గ్రహణ రేఖాంశం ecliptical longitude 135 ° 40 'అని కనుగొన్నాడు.

జ్యోతిషశాస్త్రం, టాలిస్మానిక్ మ్యాజిక్ talismanic magic మరియు భవిష్య వాణి తో సంబంధం కల పికాట్రిక్స్ అధునాతన ఎసోటెరిసిజం advanced esotericism అనవచ్చు. వాటికి మస్లామా అల్-మజృతి రుత్‌బాట్‌ను పునాది వచనంగా సూచిస్తారు.

ఒక ప్రొఫెషనల్ జ్యోతిష్కుడిగా, మస్లామా అల్-మజృతి 1006/1007 లో జరిగిన సాటర్న్ మరియు బృహస్పతి కలయిక conjunction of Saturn and Jupiter పై పరిశోధన చేసాడు మరియు అతను రాజవంశం మార్పు, నాశనము, వధ మరియు కరువు గురించి ముందే చెప్పాడు.

మస్లామా అల్-మజృతి కి మాడ్రిడ్‌కు చెందిన ఫాతిమా అనే కుమార్తె ఉందని, ఆమె ఖగోళ శాస్త్రవేత్త కూడా అని అనేక ఆధునిక వర్గాలు చెబుతున్నాయి. 1920 లలో ప్రచురించబడిన ఎన్సిక్లోపీడియా యూనివర్సల్ ఇలుస్ట్రాడా యూరోపియో-అమెరికానాలో ఆమె గురించి ఒక చిన్న జీవిత చరిత్ర ఉంది.

మస్లామా అల్-మజృతి 1007 లో  (వయసు 57)కార్డోబా, కార్డోబా యొక్క కాలిఫేట్ (ఇప్పుడు కార్డోబా, అండలూసియా, స్పెయిన్) మరణించారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

No comments:

Post a Comment