బైజాంటైన్ సామ్రాజ్యంలోని బాల్‌బెక్ (ప్రస్తుత బాల్బెక్ లేదా హెలియోపోలిస్, లెబనాన్ Baalbek or Heliopolis, Lebanon) లో జన్మించిన ఖుస్తా ఇబ్న్ లుకా (కోస్టా బెన్ లూకా, కాన్స్టాబులస్) (820-912) లేదా ఖుస్తా ఇబ్న్ లుకా అల్-బాల్‌బాకి, ఒక సిరియన్ మెల్కైట్ క్రైస్తవుడు. ఇతడు 820 లో జన్మించాడు
మరియు బాగ్దాద్లో పెరిగాడు.
ఖుస్తా ఇబ్న్ లుకా ఒక తత్వవేత్త, వైద్యుడు, గణిత
శాస్త్రవేత్త, అనువాదకుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త. అతను అర్మేనియాలో A.D. 912 లో మరణించాడు. ఖుస్తా
ఇబ్న్ లుకా పురాతన గ్రీకు గ్రంథాలను అరబిక్లోకి అనువదించాడు.
ఖుస్తా ఇబ్న్ లుకా యూక్లిడ్ పై వ్యాఖ్యానాలు మరియు
ఆర్మిలరీ గోళంపై ఒక గ్రంథం రాశాడు. అతను 9 వ శతాబ్దంలో ప్రబలిన
గ్రేకో-అరబిక్ అనువాద ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి. ఖుస్తా ఖగోళ శాస్త్రం, గణితం, మెకానిక్స్ మరియు
సహజ విజ్ఞాన శాస్త్రంపై గ్రీకు రచనలను అరబిక్లోకి అనువదించాడు.
ఖుస్తా ఇబ్న్ లుకా కొన్ని స్వంత రచనలను కూడా చేసాడు. అరవైకి పైగా గ్రంథాలు
రచించాడు. అతను ప్రధానంగా వైద్య విషయాలపై, గణితం మరియు
ఖగోళశాస్త్రంపై రాశాడు. అతని రచనలలో కొంత భాగం మాత్రమే ఇప్పటివరకు సవరించబడింది. ఖుస్తా
యొక్క వైద్య రచనల యొక్క విస్తృతమైన సంచికలు extant editions అతనికి హిప్పోక్రటిక్-గాలెనిక్
హ్యూమరల్ మెడిసిన్ Hippocratic-Galenic humoral
medicine తో పరిచయం ఉందని చెబుతున్నాయి.
ఖుస్తా ఇబ్న్ లుకా ఒరిజినల్ రచనలు, సమకాలీన శాస్త్రం, ఔషధం, ఖగోళ శాస్త్రం
మరియు తత్వశాస్త్రంతో సంభంధం కలిగి
ఉన్నాయి.
ఖుస్తా ఇబ్న్ లుకా ప్రముఖ రచనలు:
·
రిసాలాహ్ ఫీ ఆజా అల్ నిక్రిస్ Risalah fī Auja Al Niqris,
·
రిస్లా ఫ అల్ నబీద్ (అరబిక్) Rislah fī al Nabidh (Arabic),,
·
,కితాబ్ ఫే అల్ ʿ అమల్ బి-అల్-కురా
అల్-నుజామియా Kitāb fī al‐ʿamal bi‐ʾl-kura al‐nujūmiyya,
·
హయాత్ అల్-అఫ్లాక్ (ఖగోళ వస్తువులపై పని) Hayʾat al‐aflāk (work on Celestial
Bodies),,
·
కితాబ్ అల్ - మద్ఖల్ ఇల్ ఇల్మ్ అల్-నుజామ్ Kitāb al‐Madkhal ilā ʿilm al‐nujūm,
·
కితాబ్ అల్-మద్ఖల్ ఇలా అల్-హయా వా హరకట్ అల్-అఫ్లాక్ వా ʾl - కవాకిబ్ Kitāb al‐Madkhal ilā al‐hayʾa wa‐ḥarakāt al‐aflāk wa‐ʾl‐kawākib,,
·
కితాబ్ ఫీ అల్-అమల్ బి–ల్-అసుర్లాబ్ అల్-కురా Kitāb fī al‐ʿamal bi‐ʾl‐asṭurlāb al‐kurī,
·
కితాబ్ ఫీ అల్ ʿ అమల్ బి-ల్- కురా
ధత్ అల్ కుర్సా Kitāb fī al‐ʿamal bi‐ʾl‐kura dhāt al‐kursī,
·
జ్యామితి పరిచయం (ఆంగ్ల అనువాదం) The Introduction to Geometry
(English Translation),
ఖుస్తా ఇబ్న్ లుకా ఒక అద్భుతమైన అనువాదకుడు; అతనికి గ్రీకు, సిరియాక్ మరియు
అరబిక్ బాగా తెలుసు; అతను బహు గ్రంథాలను అనువదించాడు మరియు అనేక అనువాదాలను
సరిదిద్దాడు. ఖుస్తా ఇబ్న్ లుకా ప్రముఖ అనువాదకుడు హునాన్ ఇబ్న్ ఇషాక్ యొక్క సహచరుడు.
ఇతను హౌస్ అఫ్ విస్డం లో అనువాదకుడిగా 840– 912 మద్య చురుకుగా పనిచేసాడు.
ఇస్లాం స్వీకరించమని
ఆ నటి ప్రముఖ ముస్లిం ఖగోళ శాస్త్రవేత్త అబూ ఇసా యాహ్యా ఇబ్న్ అల్-మునాజ్జిమ్,
పంపిన ఆహ్వానం ను ఖుస్తా ఇబ్న్ లుకా తో పాటు తోటి క్రిస్టియన్ అనువాదకుడు హునైన్ ఇబ్న్ ఇషాక్ ఇద్దరూ
నిరాకరించారు.
అనువాదాలుTranslations:
ఈ క్రింది ప్రముఖ గ్రీక్ రచయితల గ్రంధాలు అతను స్వయంగా
అనువదించి సవరించాడు లేదా అతని మార్గదర్శకత్వం లో సవరించబడినన లేదా అనువదిoపబడినవి.
·
డియోఫాంటోస్
యొక్క అనువాదాలు Translations of Diophantos,
·
థియోడోసియస్ అఫ్ బిథినియా యొక్క స్పేరికా గ్రంధ అనువాదo మరియు ఆన్ డేస్ అండ్
నైట్స్, ఆన్ ది
ప్లేసెస్ అఫ్ హబిటేషణ్, Theodosius of Bithynia's Sphaerica, On Days and Nights (Περὶ ἡμερῶν καὶ
νυκτῶν -De diebus et noctibus), On the places of habitation (Περὶ
οἰκήσεων - De habitationibus),
·
ఆటోలైకస్ 'ఆన్ ది మూవింగ్ స్పియర్, ఆన్ రైజింగ్స్
అండ్ సెట్టింగ్స్, Autolycus' On
the moving sphere (Περὶ κινουμένης σφαίρας - De
sphaera quae movetur), On Risings and Settings (Περὶ ἐπιτολῶν καὶ
δύσεων - De ortibus et occasibus),
·
హైప్సికల్స్ ఆన్ అసెన్షన్స్, Hypsicles' On Ascensions (Ἀναφορικός),
·
అరిస్టార్కస్, థియోఫ్రాస్టస్ యొక్క
మెటియోరాAristarchus, Theophrastus’ Meteora,,
·
గాలెన్ క్యాటలోగ్ అఫ్ హీస్ బుక్స్, Galen’s catalogue of his books ,
·
హీరో అఫ్ అలెగ్జాండ్రియా యొక్క ( మెరోన్స్)మెకానిక్స్Hero of Alexandria's (Heron's) Mechanics,
·
జాన్
ఫిలోపోనస్ John Philoponus
·
మొదలగు వారి గ్రంధాలు
పలుకుబడి Influence :
కవి విలియం
బట్లర్ యేట్స్William Butler Yeats యొక్క తాత్విక
గ్రంథమైన ఎ విజన్A Vision లోని ఆలోచనలకు మూలంగా
ఆయనకు (కుస్తా బెన్ లుకాగా) పేరు పెట్టారు.
No comments:
Post a Comment