సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ Suleiman the Magnificent
ఇస్లామిక్ సామ్రాజ్యం యొక్క ఖలీఫా మరియు ఒట్టోమన్ సుల్తాన్ అయిన సులేమాన్ ది మాగ్నిఫిసెంట్. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని ట్రాబ్జోన్ Trabzon(నేడు టర్కీలో భాగం) లో నవంబర్ 6, 1494 జన్మించాడు. అతని తండ్రి, సెలిమ్I/SelimI ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సుల్తాన్.
సుల్తాన్ సులేమాన్ ఒట్టోమన్
సామ్రాజ్యాన్ని విస్తరించడం మరియు వియన్నా ముట్టడి కి పేరుగాంచినాడు.
ఒట్టోమన్ సామ్రాజ్యం
యొక్క రాజధాని నగరమైన ఇస్తాంబుల్‌లోని అందమైన టోప్‌కాపి ప్యాలెస్‌లో సులేమాన్
పెరిగాడు. అతను ఆనాటి అగ్ర ఇస్లామిక్ పండితుల ద్వారా బోధింపబడినాడు. చరిత్ర, విజ్ఞానం, సైనిక వ్యూహం, సాహిత్యం సహా పలు
విషయాలను అధ్యయనం చేశాడు.
సులేమాన్ యుక్తవయసులో కాఫా/Kaffa గవర్నర్‌గా నియమించబడ్డాడు. గవర్నర్‌గా, రాజకీయాలు, చట్టం ఎలా
పనిచేస్తాయో తెలుసుకున్నారు. అతను సామ్రాజ్యంలోని వివిధ సంస్కృతులు మరియు ప్రదేశాల
గురించి కూడా అధ్యయనo చేసాడు.
1520లో, సులేమాన్ తండ్రి సెలిమ్I/SelimI మరణించారు మరియు సులేమాన్ 26 సంవత్సరాల
వయస్సులో ఒట్టోమన్ సామ్రాజ్యానికి కొత్త సుల్తాన్ అయ్యాడు.
సింహాసనాన్ని స్వీకరించిన
తరువాత, సులేమాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సైనిక
కార్యక్రమాలను ప్రారంభించాడు. ఐరోపా నుండి భారతదేశం వరకు విస్తరించిన ఐక్య
సామ్రాజ్యం గురించి కలలు కన్నాడు.
సులేమాన్ తన 46 సంవత్సరాల
పాలనలో అనేక సైనిక కార్యక్రమాలను నిర్వహించారు. అతను హంగరీ మరియు రొమేనియాలోని
కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుని మధ్య ఐరోపాలోకి వెళ్ళాడు. అతను ఒక శక్తివంతమైన
నావికాదళాన్ని కూడా నిర్మించాడు మరియు మధ్యధరా సముద్రంపై నియంత్రణ సాధించాడు.
మధ్యప్రాచ్యంలో, అతను ఇస్లామిక్ ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని ఏకం చేస్తూ
సఫావిడ్స్ Safavids, ను ఓడించాడు. అతను ఉత్తర ఆఫ్రికాలోని అనేక
భూములు మరియు నగరాలను కూడా జయించాడు.
వియన్నా ముట్టడి:
సులేమాన్ హంగరీలోకి
ప్రవేశించడంతో, అతను ఐరోపాలోని చాలా రాజ్యాలలో భయాన్ని కలిగించాడు. ఆనాటి యూరప్
యొక్క ప్రధాన రాజ్యాలలో ఒకటి ఆస్ట్రియా యొక్క హాబ్స్బర్గ్ సామ్రాజ్యం. వారు పవిత్ర
రోమన్ సామ్రాజ్య నాయకులు. వారి రాజధాని నగరం వియన్నా.
1529లో, సులేమాన్ మరియు
అతని సైన్యం వియన్నా చేరుకున్నారు. సులేమాన్ సైన్యం వియన్నాపై రెండు వారాలు
ముట్టడి చేసింది. వాతావరణం అనుకూలించలేదు. వియన్నాముట్టడి అతని సైన్యాన్ని
దెబ్బతీసింది. అతని సైనికులు చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు మరియు చెడు వాతావరణం
కారణంగా అతను తన ముట్టడి పరికరాలను వదిలివేయవలసి వచ్చింది. శీతాకాలపు మంచు త్వరగా
వచ్చినందువలన సులేమాన్ వెనక్కి తిరగాల్సి వచ్చింది, యూరోపియన్ల
చేతిలో సులేమాన్ సైన్యం మొదటిసారి పెద్ద
ఓటమిని చవిచూసింది.
విజయాలు:
ఒట్టోమన్ సుల్తాన్‌గా సులేమాన్
సాధించిన విజయాలు అతని సైనిక విస్తరణకు పరిమితం కాలేదు. అతను అద్భుతమైన నాయకుడు
మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడానికి కృషి చేశాడు.
అతను చట్టాన్ని సంస్కరించాడు మరియు ఒకే చట్టపరమైన కోడ్ను a single legal code సృష్టించాడు.
అతను పన్ను వ్యవస్థను
పునర్నిర్మించాడు, పాఠశాలలను నిర్మించాడు మరియు కళలకు ప్రోత్సాహం ఇచ్చాడు.
ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సంస్కృతిలో సులీమాన్ పాలన కాలం స్వర్ణయుగం అంటారు.
మరణం:
తన జైత్రయాత్ర లో భాగంగా సెప్టెంబర్
7, 1566న హంగేరి
రాజ్యంలోని స్జిగేత్వర్Szigetvar లో సులేమాన్
అనారోగ్యానికి గురై మరణించాడు.
సులేమాన్ ది
మాగ్నిఫిసెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
· పరగలి ఇబ్రహీం Pargali Ibrahim అనే బానిస
సులేమాన్ బాల్య స్నేహితుడు. తరువాత అతను సులేమాన్ యొక్క సన్నిహిత సలహాదారు మరియు
ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క గ్రాండ్ విజియర్ అయ్యాడు.
· సులేమాన్ సుల్తాన్ తన తల్లి ద్వారా చెంఘిజ్ ఖాన్ యొక్క వారసుడు అయి ఉండవచ్చు. యూరోపియన్లు అతనికి "మాగ్నిఫిసెంట్" అని మారుపేరు పెట్టారు, కాని అతని సొంత ప్రజలు అతన్ని "కనుని Kanuni " అని పిలిచారు, అంటే "న్యాయప్రదాత lawgiver.".
· అతను తన్ను తానూ ఒట్టోమన్
కాలిఫేట్ యొక్క రెండవ ఖలీఫా భావించాడు ఖలీఫా గా అతను బయటి శక్తులచే ఆక్రమించబడిన ఏ
ముస్లిం దేశానికైనా సైనిక రక్షణ కల్పించాడు.
· అతను స్వయంగా రచయిత
మరియు కవి.
No comments:
Post a Comment