23 February 2021

ఆధునిక సైన్స్ నిర్ధారించిన ప్రవక్త (స) 5సున్నత్ లు 5 Sunnahs of the Prophet Backed By Modern Sci

 


 


 

 1,400 సంవత్సరాల క్రితం దివ్య ఖుర్ఆన్ లో వెల్లడైన శాస్త్రీయ ఆవిష్కరణలను ఆధునిక శాస్త్రం (modern science) నిర్ధారించిన విషయం మన అందరకు తెలిసినదే. 20 మరియు 21వ శతాబ్దాల శాస్త్రవేత్తలు దివ్య ఖురాన్ లో వెల్లడించిన జీవన మూలాలు, ఆకాశం, సూర్యుని కక్ష్య, మహాసముద్రాలు, ఇనుము, విస్తరిస్తున్న విశ్వం origins of life, the sky, sun’s orbit, oceans, iron, the expanding universe మరియు మరెన్నో  శాస్త్రీయ వాస్తవాలను తమ పరిశోధనల ద్వారా దృవికరించినారు. ఈ శాస్త్రీయ సాక్ష్యాలు ప్రజాకు ఇస్లాం మీద విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నడిచే  ఖుర్ఆన్ గా అభివర్ణింపబడ్డారు.విశ్వాసులకు  ప్రవక్త ముహమ్మద్ (స)ఒక రోల్ మోడల్ మరియు మనము వారి చర్యలన్నీ అనుసరించాలి మరియు వారి మర్యాదలను అనుకరించాలి.

 ప్రవక్త () యొక్క సున్నత్‌ను మనం ఎందుకు అనుకరించాలి?

దీనికి సమాధానం దివ్య ఖురాన్ లో కలదు.

"వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్త లో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది; అల్లాహ్ పై, అంతిమ దినం పై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లహ్ ను స్మరించే ప్రతి వ్యక్తికి. " [ఖుర్ఆన్ 33:21].

 ఆధునిక యుగంలో మనలో చాలా మంది విజయవంతమైన వ్యాపారవేత్తలను, శాస్త్రవేత్తలను లేదా ప్రముఖులను తమ రోల్ మోడల్స్ గా పేర్కొంటారు, కాని అల్లాహ్ సిఫారసు చేసిన నిజమైన రోల్ మోడల్ మన ప్రియమైన ప్రవక్త () తప్ప మరెవరో కాదు.

 శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిర్దారింపబడిన ప్రవక్త (స)5 సున్నత్ లు.

 1 – చిరునవ్వు-

సున్నా

·       ప్రవక్త () ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వే వ్యక్తిగా అబివర్ణింపబడ్డారు.- ప్రవక్త () కన్నా ఎక్కువ నవ్విన వారిని నేను చూడలేదు”, -తిర్మిజి

 ప్రవక్త () ప్రజలను చిరునవ్వుతో ప్రోత్సహిస్తారు, ఇది దానధర్మం/సదకా charity గా పరిగణించబడుతుంది -(తిర్మిజి).

 సైన్స్

·       టేనస్సీ, నాక్స్ విల్లె మరియు టెక్సాస్ A&M విశ్వవిద్యాలయాల Tennessee, Knoxville and Texas A&M లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో నవ్వడం వల్ల వ్యక్తి సంతోషంగా ఉంటారని కనుగొన్నారు. వ్యక్తి ముఖ కవళికలు అతని భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి, ముఖం మీద చిరునవ్వు ఉంటే, మీరు సంతోషంగా ఉంటారు మరియు ముఖం మీద కోపం ఉంటే, మీకు కోపం వస్తుంది.

·       మరొక అధ్యయనం ప్రకారం, మీరు ప్రజలను చూసి నవ్వినప్పుడు, ప్రజలు మిమ్మల్ని చూసి తిరిగి నవ్వుతారు. కాబట్టి నవ్వడం అనేది సంక్రమకం contagious.

 

2 – కూర్చొని తినడం

 సున్నా

·       ప్రవక్త () నిలబడి ఉన్నప్పుడు నీరు త్రాగడం నిషేధించారు.

·       ఖతదా ప్రకారం : మేము వారిని అడిగాము:మరి తినడం గురించి ఏమిటి? వారు  ఇలా అన్నారు : అది మరింత ఘోరంగా లేదా మరింత అసహ్యకరమైనది.” (ముస్లిం)

సైన్స్

·       సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, నిలబడి తిన్న ప్రజలు తమ భోజనాన్ని అంతగా ఆస్వాదించలేదని కనుగొన్నారు. కూర్చున్నప్పుడు తిన్న వ్యక్తులతో పోలిస్తే వారు తమ  ఆహారం తక్కువ రుచికరమైనదని భావించారు. కూర్చున్నప్పుడు తిన్న వారితో పోలిస్తే నిలబడి తిన్న వ్యక్తులు తక్కువ మొత్తంలో తింటారు. ఎందుకంటే నిలబడి ఉన్న స్థానం శరీరంపై ఎక్కువ శారీరక ఒత్తిడిని సృష్టించి ఇంద్రియ సున్నితత్వం తగ్గడానికి దారితీసింది.

·       నిలబడి ఉన్నప్పుడు తినడం ఆరోగ్యానికి చెడ్డదని తేల్చిన అనేక ఇతర అధ్యయనాలు కూడా ఉన్నాయి


3 - క్రమం తప్పకుండా ఉపవాసం fasting regularly:

సున్నత్: 

ప్రవక్త () తరచుగా సోమ, గురువారాల్లో  ఉపవాసం ఉండేవారు-(తిర్మిజి) మరియు ప్రత్యామ్నాయ రోజులలో alternate days ఉపవాసం చేసే ప్రవక్త దావుద్ (AS.) యొక్క ఉపవాసాలను సిఫారసు చేశారు-(బుఖారీ)

సైన్స్:

·       దీనిని ఇప్పుడు అడపాదడపా ఉపవాసం అని పిలుస్తారు మరియు పాశ్చాత్య దేశాలలో ఆరోగ్యఔత్సాహికులు దీనిని ఆచరిస్తున్నారు, ఇక్కడ 12-24 గంటల వరకు ఆహారం తీసుకోరు, తరువాత సాధారణ ఆహారం మరియు చక్రం పునరావృతమవుతుంది.

 అడపాదడపా ఉపవాసం-బరువు తగ్గడం, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడం మరియు అల్జీమర్స్, పార్కిన్సన్ మరియు స్ట్రోక్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలను తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 4 - మిస్వాక్

సున్నత్ –

ప్రవక్త () ఇలా అన్నారు: "ఇది నా వాసులపై కష్టంగా ఉండకపోతే, ప్రతి ప్రార్థనకు మిస్వాక్ ను ఉపయోగించమని నేను వారిని ఆదేశించేవాడిని ." -తిర్మిజి)

 సైన్స్:

·       నేటి ఆధునిక యుగంలో, దంత పరిశుభ్రతను కాపాడటానికి మనం టూత్ బ్రష్ మరియు టూత్ పేస్టులను ఉపయోగిస్తాము. కాని 1,400 సంవత్సరాల క్రితం ఇస్లాం దంత పరిశుభ్రత కొరకు మిస్వాక్ ఉపయోగించి దంతాలను శుభ్రం చేయమని చెప్పింది.

·       మిస్వాక్ ఉపయోగించడం వల్ల చిగుళ్ల రక్తస్రావం తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది.

·       మిస్వాక్ ఉపయోగించడం వల్ల దంత ఫలకం మరియు చిగురువాపు తగ్గుతాయని కనుగొన్నారు.

·       మిస్వాక్ ఉపయోగించడం దంత క్షయాలను తగ్గిస్తుందని మరో అధ్యయనం కనుగొంది

·       మిస్వాక్ యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం, దీనిని BICT అని పిలుస్తారు, మిస్వాక్ లాలాజలంతో కలిపినప్పుడు, ఈ యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం విడుదల అవుతుంది,

·       ప్రతి ఉదయం మరియు రాత్రి మరియు 5 తప్పనిసరి ప్రార్థనలకు ముందు మిస్వాక్‌ను ఉపయోగించడం ఉత్తమ పద్ధతి.


5 - స్లీపింగ్ పొజిషన్:

 సున్నా

·       ప్రవక్త  () కుడి వైపున తిరిగి నిద్రించే పొజిషన్ లో నిద్రపోయేవారు.-(బుఖారీ) 

·       ప్రవక్త (స)కడుపుపై నిద్రపోకుండా ప్రజలను నిషేధించారు​​(అబూ దావుద్).

సైన్స్:

·       అల్జీమర్స్, పార్కిన్సన్ మరియు ఇతర నాడీ వ్యాధులు వచ్చే అవకాశాలు పక్కకు తిరిగి/సైడ్ పొజిషన్లలో నిద్రించడం వల్ల తగ్గుతాయని ఒక అధ్యయనం కనుగొంది.

 శిశువు కడుపుపై ​​నిద్రపోవడం ఆకస్మిక డెత్ సిండ్రోమ్ (సిడ్స్) కు దారితీస్తుందని పరిశోధనలో తేలినందున కడుపు పై నిద్రపోవడం హానికరం. మరొక అధ్యయనం ప్రకారం, ముందు పడుకోవడం sleeping on the front వల్ల పిల్లలు నిద్రపోయేటప్పుడు పళ్ళు కోరుకుతారు grind their teeth..

 

 

 

No comments:

Post a Comment