అరబ్ భూగోళ
శాస్త్రవేత్తలు మరియు పండితులు మధ్యయుగ కాలం నుండి భౌగోళిక శాస్త్ర పరిణామం మరియు
అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ప్రాచీన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్తల రచనలు అరబిక్లోకి
అనువదించబడ్డాయి. శాస్త్రీయ అభ్యాసం క్షీణించడంతో యూరప్ "చీకటి యుగం"
లోకి ప్రవేశించినప్పటికీ, అరబ్బులు భౌగోళిక శాస్త్రాన్ని పునరుద్ధరించారు.
మద్య యుగాలలో ముస్లిములు స్పెయిన్ మరియు పోర్చుగల్ వంటి ప్రాంతాలను
జయించడం కూడా భౌగోళిక అభ్యాసంలో ఆసక్తి
పెరగడానికి ప్రేరణనిచ్చింది. భారతదేశం మరియు ఐరోపా మధ్య సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై
అరబ్ గుత్తాధిపత్యం పెద్ద భూభాగంలో విస్తరించిన ప్రదేశాల మధ్య ప్రయాణించాల్సిన
అవసరం కల్పించినది, ఈ ప్రయాణాల కారణంగా, ఉష్ణమండల ప్రాంతాలలో
భౌగోళిక వాతావరణం గురించి అరబ్బులు గణనీయమైన జ్ఞానాన్ని పొందారు
.భౌగోళిక జ్ఞానం విస్తరించడంతో, అరబ్బులు శాస్త్రీయ
అభ్యాసాన్ని ప్రారంభించారు. బాగ్దాద్ (క్రీ.శ. 726 లో స్థాపించబడింది)
ఒక ప్రధాన అభ్యాస కేంద్రంగా మారి ఖగోళ శాస్త్రం మరియు భూగోళశాస్త్రం యొక్క ప్రధాన శాస్త్రీయ రచనలు అరబిక్లోకి
అనువదించబడ్డాయి. ఉదాహరణకు, మామున్ అబ్బాసి (786 A.D.) పాలనలో, అల్మాజెస్ట్ (టోలెమీ రాసినది) అరబిక్‌లోనికి సోరాటోలార్జ్ Soratolarz (భూమి యొక్క ఆకారం)
అనే పేరుతో అనువదించబడింది. అరబ్ వ్యాపారులు మరియు అన్వేషకులు చేసిన పరిశీలనల
రికార్డుల నుండి పొందిన జ్ఞానo ఆధారం గా కొత్త గ్రంథాలు వ్రాయబడ్డాయి. టోలెమీ పుస్తకాలలో
మరొకటి, టెట్రాబిబ్లాన్ Tetrabiblon కూడా అల్-మకలత్
అల్-అర్బియా al-Makalat al-arbąa అనే పేరుతో అరబిక్
భాషలోకి అనువదించబడింది. అరబిక్‌లోకి అనువదించబడిన ఇతర గ్రీకు గ్రంథాలలో ప్లేటో ఎడిట్
చేసిన “టిమెల్ Timael (Arabic Asarol-o-lomeeye), (అరబిక్ అసరోల్-ఓ-లోమీయే)”, డెకాఎలో Decaelo ఎడిట్ చేసిన “Arabic: Asarol-ol-Alam) (అరబిక్ : అస్మా-ఓల్-ఆలం ) మరియు అరిస్టాటిల్
గ్రంధం మెటాఫిజిక్స్ (ఆరబిక్: మబడ్డో-టాబీ(Arabic: Mabaddo-tabeeye) ఉన్నాయి.
అరబ్‌లు భూమి
పరిమాణం, జ్యామితి మరియు ప్యూరిలిటీపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు; మహాసముద్రాలు, ముఖ్యంగా ఆటుపోట్ల
కారణాలు; భౌగోళిక ప్రక్రియలు; ప్రాంతీయ వాతావరణ విభాగాలు; వృక్షజాలం మరియు
జంతుజాలం పంపిణీ ముఖ్యంగా మ్యాప్స్
యొక్క వివిధ సాధనాల సృష్టి మరియు ఉపయోగం పై ద్రుష్టి పెట్టారు.
మ్యాపింగ్ నైపుణ్యాల
సముపార్జనతో “మాప్ప మండి” వంటి ప్రపంచ పటాలు -ప్ప్లేటర్, మారినో, సనుటో, బోర్గైన్, ఈస్ట్ వరల్డ్, ఫ్రా మౌరా మరియు
ఇమేజ్ డి ముండే వంటివి అభివృద్ధి చెందాయి.
ఇద్రిసి (క్రీ.శ. 1100-1156)
నిర్మించిన వెండి ప్రణాళిక గోళo silver plan sphere, ప్రపంచాన్ని మరియు 70% ప్రపంచ భూభాగాల పటాన్ని
చూపుతుంది.
అరబ్బులు చేపట్టిన
అన్వేషణాత్మక ప్రయాణాలు భౌగోళిక అభ్యాసంలో పునరుజ్జీవనానికి దారితీశాయి.
ఇబ్న్-హకుల్ భూమధ్యరేఖకు
దక్షిణాన చేసిన విహారయాత్ర కారణంగా
(క్రీ.శ. 943 నుండి 973 మధ్య), టొర్రిడ్ జోన్
torrid zone (అరిస్టాటిల్ భావన ) నివాసయోగ్యతకు సంబంధించి తప్పుడు భావన
వదిలివేయబడింది.
అల్-మసూది మొజాంబిక్
వరకు ఆఫ్రికా తూర్పు తీరంలో ప్రయాణిస్తున్నప్పుడు, రుతుపవనాల గాలుల దృగ్విషయాన్ని నివేదించారు.
అల్-మక్సీది అనే
మరొక పండితుడు (ఏడి 985 లో) ఏ ప్రదేశంలోనైనా వాతావరణం దాని అక్షాంశం పై మాత్రమే కాకుండా, తూర్పు లేదా పడమర
వైపు భూభాగం యొక్క స్థానం పై కూడా ఉంటుందని ధృవీకరించాడు. భూమి యొక్క అదిక భూభాగం
భూమధ్యరేఖకు ఉత్తరాన ఉందని అతను నిరూపించాడు.
ముఖద్దసి అనే ప్రముఖ
అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త బౌగోళిక ఫీల్డ్ వర్క్ లో మార్గదర్శకుడు మరియు భౌగోళిక
వాస్తవాన్ని పరిశీలన ద్వారా మాత్రమే వ్యక్తిగతంగా అనుభవించగలరని విశ్వసించారు.
ముఖద్దసి పుస్తకం అహ్సనోల్ తఘసీమ్ Ahsanol Taghaseem (ప్రపంచంలోని
ప్రధాన విభాగాలు) అనే పేరుతో ఇస్లామిక్ ప్రపంచంలోని అనేక క్షేత్ర పర్యటనల ఆధారంగా
రూపొందించబడింది. ముఖద్దసి వివిధ పరిశీలనల ఆధారంగా ఇస్లామిక్ భూభాగాలను
భౌతిక మరియు మానవ లక్షణాలకు సంబంధించిన సంబంధిత మ్యాప్‌లతో 14 ప్రాంతాలుగా
విభజించాడు.
అల్-ఇద్రిసి (సుమారు
1099-1180 AD) టోలెమీ ద్వారా ప్రతిపాదించబడిన అనేక గ్రీకు ఆలోచనలను సరిదిద్డాడు.భౌగోళిక శాస్త్రం పై తన గ్రంధం లో (క్రీ.శ. 1154) లో, హిందూ మహాసముద్రం
మూసిన సముద్రం అనే గ్రీకు ఆలోచనను ఆయన
సరిచేశారు. అతను డానుబే మరియు నైజర్‌తో సహా అనేక నదుల స్థానాలను కూడా సవరించాడు.
భూమధ్యరేఖకు 20 డిగ్రీల దక్షిణాన
అరబ్ ట్రేడింగ్ పోస్ట్ ఉనికిని నివేదించిన గొప్ప అరబ్ అన్వేషకుడు ఇబ్న్ బటుటా చేత టొర్రిడ్ జోన్
యొక్క నివాసయోగ్యత కూడా ధృవీకరించబడింది. అతను పద్నాలుగవ శతాబ్దంలో విస్తృతంగా
పర్యటించాడు మరియు భవిషత్తు తరాల కోసం తన
ప్రయాణాల గురించి వివరంగా రాశాడు.
భౌగోళిక రంగంలో ముద్ర
వేసిన మరొక ముస్లిం పండితుడు ఇబ్న్-ఖల్దున్
(క్రీ.శ. 1342-1405). ముఖద్దిమా పుస్తక
పరిచయంలో,
అతను
మనిషి పురోగతి(అనగా, చరిత్ర): పై రెండు రకాల
ప్రభావాలను గుర్తించాడు ఒకటి, భౌతిక
(సహజ) వాతావరణం, మరియు రెండు,
సంస్కృతి
మరియు నమ్మకం నుండి పొందిన సామాజిక వాతావరణం. రెండు రకాల ప్రభావాల మధ్య ఈ
వ్యత్యాసం అతని కాలంలో గుర్తించదగిన మేధో విజయం.
కిమ్బ్లే (1938)
ఇబ్న్-ఖల్దున్
"భౌగోళిక విచారణ యొక్క నిజమైన పరిధి మరియు స్వభావాన్ని కనుగొన్నాడు" అని
వ్యాఖ్యానించాడు. ఇబ్న్-ఖల్దున్ రెండు విభిన్న శాఖలు-
మానవ
భౌగోళికం మరియు భౌతిక భౌగోళికం అభివృద్ధి చెందటానికి ఒక పూర్వగామిగా
పరిగణించవచ్చు.
ఇబ్న్-ఖల్దున్ రాజ్యం
యొక్క జీవిత చక్రం life cycle of
states యొక్క ప్రారంభ భావనలలో ఒకదాన్ని అందించిన ఘనత కూడా పొందారు.
అతని ప్రకారం, ఎడారి వాతావరణంలో సామాజిక సంస్థ
పరిణామంలో తెగ మరియు నగరం రెండు విభిన్న దశలు. సంచార జాతులు సామాజిక సంస్థ యొక్క
ఆదిమ దశకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, నగరవాసులు
సామాజిక జీవిత అభివృద్ధిలో చివరి దశకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పట్టణ సమాజం యొక్క
నిశ్చల జీవనశైలి సామాజిక సంస్థలో అంతిమ క్షీణతకు దారితీస్తుంది. మనిషి-పర్యావరణ
సంబంధాలను అధ్యయనం చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన తొలి పండితులలో అతను కూడా
ఒకరు.
ఆ విధంగా,
భూగోళశాస్త్ర
చరిత్రలో అరబ్బులు ముఖ్య పాత్ర పోషించారు. భూగోళశాస్త్రంలో యూరోప్ గ్రీక్
వారసత్వాన్ని మరచిపోయినప్పటికీ, అరబ్బులు
భౌగోళికంలోని ప్రధాన గ్రీక్ రచనలను అనువదించి, తమకు ఉన్న
జ్ఞానాన్ని జోడించి. భూగోళశాస్త్ర అభివృద్దికి తోడ్పడ్డారు. అరేబియాతో ఈ అనువాదాలు
మరియు పరిచయాల సహాయంతో, యూరోపియన్లు పదిహేనవ
శతాబ్దంలో భూగోళశాస్త్రాన్ని సజీవ విజ్ఞానంగా పునరుద్ధరించారు.