22 September 2021

జస్టిస్ ఫాతిమా బీవీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మొదటి భారతీయ మహిళ Justice Fathima Beevi: The First Indian Woman To Become A Judge of Supreme Court

 జస్టిస్ ఫాతిమా బీవి భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ.  ఫాతిమా బీవి ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తి అయిన మొదటి ముస్లిం మహిళ మరియు ఆసియా లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మొదటి మహిళ.

ఫాతిమా బీవి ఏప్రిల్ 30, 1927 న ఇప్పటి కేరళ రాష్ట్రం లోని పాతనంథిట్ట (Pathanamthitta) లో, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఖడేజా బీబీ మరియు అన్నవీటిల్ మీరా సాహిబ్ దంపతులకు జన్మించారు. ఫాతిమా బీవి ఆరుగురు సోదరీమణులు మరియు ఇద్దరు సోదరులలో పెద్దది. ఫాతిమా బీవి 1943 లో పతనమిట్టలోని కాథోలికేట్ హైస్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేసారు.. ఫాతిమా బీవి తన ఉన్నత విద్య కోసం త్రివేండ్రం వెళ్లింది, ఫాతిమా బీవి తిరువనంతపురం యూనివర్శిటీ కాలేజీ నుండి B.Sc పూర్తి చేసారు. తరువాత తిరువనంతపురంలోని ప్రభుత్వ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రాన్ని అభ్యసించినారు.

మొదట్లో, ఫాతిమా బీవి సైన్స్‌ ని మరింతగా చదవాలనుకుంది, కానీ జస్టిస్ అన్నా చాందీ (భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి మరియు భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి అయిన మొదటి మహిళ) విజయంతో ప్రభావితమైన  ఆమె తండ్రి ఫాతిమా బీవి ని లా అధ్యయనం చేయమని ప్రోత్సహించినారు.. ఫాతిమా బీవీ లా స్కూల్లో తన తరగతిలో ఉన్న ఐదుగురు మహిళా విద్యార్థులలో ఒకరు, 1950 లో ఆమె న్యాయ పట్టా పొందిన తరువాత, ఆమె బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి మహిళగా నిలిచింది మరియు బార్ కౌన్సిల్ బంగారు పతకాన్ని అందుకుంది, ఇది ఆమె చారిత్రక విజయాలలో మొదటిది,

ఫాతిమా బీవీ అడ్వకేట్‌గా నమోదు అయ్యారు మరియు కేరళలోని దిగువ దిగువ కోర్ట్ లలో నవంబర్ 14, 1950 న తన వృత్తిని ప్రారంభించారు. ఎనిమిది సంవత్సరాల తరువాత, ఆమె కేరళ సబార్డినేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో మున్సిఫ్ ఉద్యోగం పొందినది. క్రమంగా ఫాతిమా బీవీ కేరళ యొక్క సబార్డినేట్ జడ్జి (1968-72), చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (1972-4), డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి (1974-80), ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్లో  జ్యుడీషియల్ సభ్యురాలిగా, (1980-83) మరియు 1983 లో కేరళ హైకోర్టు న్యాయమూర్తి గా అయ్యారు.  అక్టోబర్ 6, 1986, కేరళ హైకోర్టు నుండి పదవీ విరమణ చేసిన ఆరు నెలల్లో, ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ అయ్యారు. సుప్రీం కోర్టులో నియమించబడటం ద్వారా ఆమె పురుషుల ఆధిపత్య న్యాయవ్యవస్థలో మహిళలు వృత్తిని కొనసాగించడానికి మార్గం సుగమం చేసింది.

1997 జనవరి25, ఆమెను అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు ఖైదీలు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ గా ఆమె నిర్ణయం గైకొన్నారు.. 2001 లో ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జె. జయలలితను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించారు, ఆమె తీసుకొన్న ఈ నిర్ణయం వివాదస్పదమై ఆమె రాజ్యాంగపరమైన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనందుకు గవర్నర్‌ను రీకాల్ చేయడానికి రాష్ట్రపతిని సిఫార్సు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ ఫాతిమా బీవీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు, తమిళనాడు గవర్నర్‌గా ఆమె పదవీకాలం 2001 లో వివాదాస్పదంగా ముగిసింది. జయలలితను తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమించాలన్న ఫాతిమా బీవీ నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

992 లో సుప్రీంకోర్టు నుండి ఫాతిమా బీవీ పదవీ విరమణ చేసిన తర్వాత బీవీ జాతీయ మానవ హక్కుల కమిషన్ (1993) సభ్యురాలిగా మరియు కేరళ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ (1993) గా పనిచేశారు. ఫాతిమా బీవి 1990 లో డి.లిట్ మరియు మహిళా శిరోమణి అవార్డు పొందారు.. ఫాతిమా బీవికు  భారత జ్యోతి అవార్డు మరియు యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా లభించాయి. తమిళనాడు గవర్నర్‌గా, ఫాతిమా బీవి మద్రాస్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. 

న్యాయవ్యవస్థతో సహా ఏదైనా ప్రజాస్వామ్య సంస్థ యొక్క బలం దాని వైవిధ్యంతో గుర్తించబడుతుంది. ఫాతిమా బీవీ న్యాయవ్యవస్థ లోనికి ప్రవేశించాలనుకునే ప్రతి మహిళకు రోల్ మోడల్‌గా కొనసాగుతుంది మరియు భవిష్యత్తులో ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని ఆశిద్దాం.

34 మంది న్యాయమూర్తులు ఉన్న   భారత సుప్రీంకోర్టులో ప్రస్తుతం నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు - జస్టిస్ ఇందిరా బెనర్జీ, హిమ కోహ్లీ, బివి నాగరత్న మరియు బేలా ఎం త్రివేది - జస్టిస్ బెనర్జీ కాకుండా, మిగతా ముగ్గురు న్యాయమూర్తులు ఆగస్టు 31 న నియమితులయ్యారు, వీరిలో జస్టిస్ నాగరత్న సెప్టెంబర్ 2027 లో మొదటి మహిళా CJI గా అవుతారు

రిఫరెన్స్/ఆధారాలు:

·       ది వీక్, ది బెటర్ ఇండియా, స్క్రోల్

·       ది స్మి టైమ్స్, వికీపీడియా

.

 

 

No comments:

Post a Comment