13 September 2021

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్, గొప్ప భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు MULLA ABDUL QAYYUM KHAN, Great Indian Freedom Fighter

 



 

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ 1853 లో మద్రాసులో జన్మించాడు. బ్రిటిష్ మరియు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలను మేల్కొలిపిన మార్గదర్శకులలో ఆయన ఒకరు.

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దార్-ఉల్-ఉలూమ్‌లో పర్షియన్ మరియు ఉర్దూ నేర్చుకున్న తరువాత, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ హైదరాబాద్ సంస్థానంలో ఉద్యోగిగా సేవలో చేరాడు మరియు త్వరలో ఉన్నత స్థానానికి ఎదిగాడు.

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ 1880 లో ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయను కలిశారు. వారి మధ్య ఏర్పడిన స్నేహం హిందూ -ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచింది.అబ్దుల్ ఖయ్యూమ్ తన బాల్యం నుండే ప్రజా సేవలో ఆసక్తి కలిగి ఉన్నాడు.

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిచ్చాడు మరియు దాని కోసం వివిధ సంస్థలను స్థాపించాడు. అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్,  డా. అఘోరనాథ్‌తో కలిసి "చందా రైల్వే ప్రాజెక్ట్ వ్యతిరేక ఆందోళన" లో చురుకుగా పాల్గొన్నాడు.ఈ కారణంగా, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ నిజాం కోపాన్ని ఎదుర్కొన్నాడు మరియు కొంతకాలం హైదరాబాద్ రాష్ట్రం నుండి బహిష్కరించబడ్డాడు.

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి ముస్లిం నాయకుడిగా చరిత్ర సృష్టించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అద్వర్యం లోని  కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి వ్యతిరేకంగా 'సఫైర్-ఇ-డెక్కన్' అనే వార్తాపత్రికలో వ్యాసాలు రాశారు. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ 1905 లో తన విమర్శకులకు సమాధానంగా ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. నిజాం ఆదేశాలను విస్మరించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరమని ఆయన ముస్లింలకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ పిలుపునిచ్చారు. అతను 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రముఖ పాత్ర పోషించాడు మరియు స్వదేశీ ఉద్యమాన్ని సమర్దిoచాడు.

ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ అన్నివేళల మత సామరస్యాన్ని ప్రోత్సహిoచాడు  మరియు “హిందూ-ముస్లిం ఐక్యత యొక్క స్వరూపం”గా ప్రజల మన్ననలు పొందాడు. సరోజిని నాయుడు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ ని 'గొప్ప ముస్లిం, గొప్ప భారతీయుడు మరియు గొప్ప మానవుడు' అని వర్ణించినది.  గొప్ప దేశభక్తుడు అయిన  ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్ 27 అక్టోబర్, 1906 న తుది శ్వాస విడిచారు.

ఆధారాలు:

·       heritagetimes.in

·       ప్రసిద్ద చరిత్ర కారుడు నసీర్ అహ్మద్ గారి రచనలు

·       ముస్లిమ్స్ అఫ్ ఇండియా పేస్ బుక్ లోని వ్యాసం,

No comments:

Post a Comment