మీరు డాక్టర్ ఉమ్మ్
ఇ కుల్సూమ్ & డాక్టర్ అమతుర్రకీబ్ (వారిని యాకూబ్ సోదరీమణులు అని కూడా అంటారు) గురించి
విన్నారా? వారు ఎవరు మరియు వారు దేని కోసం ప్రసిద్ధి చెందారో మీకు తెలుసా?
అమ్తుర్రకీబ్ Amturraqeeb మరియు ఉమ్మెకుల్‌సూమ్ సోదరీమణులు మొదటి ముస్లిం మహిళా
భారతీయ వైద్యులుగా పరిగణించబడ్డారు. మొత్తం భారత ఉపఖండంలో కూడా మొదటి ముస్లిం
మహిళా భారతీయ వైద్యులుగా పరిగణింపబడినారు.
1920లో, అమ్తుర్రకీబ్ Amturraqeeb మరియు ఉమ్మెకుల్‌సూమ్ ఆగ్రా మహిళా మెడికల్ స్కూల్
(ప్రస్తుతం సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్ అని పిలవబడే) నుండి మెడిసిన్‌లో డిగ్రీ LMP (లైసెన్స్ పొందిన
మెడికల్ ప్రాక్టీషనర్) పొందారు. తరువాత LMP స్థానంలో LSMF ( (licentiate
of State Medical Faculty) వచ్చింది మరియు తరువాత అది MBBS గా మారింది.
యాకూబ్ సోదరీమణులు
మహమ్మద్ యాకూబ్ కుమార్తెలు.మొహమ్మద్
యాకూబ్ సమాజ అభ్యున్నతి కోసం బాలికలకు విద్య నేర్పించాలని మొదటి నుండి
విశ్వసించాడు. మొహమ్మద్ యాకూబ్ తన కుమార్తెల పెరుగుదల మరియు అభివృద్ధిలో కీలక
పాత్ర పోషించాడు. మొహమ్మద్ యాకూబ్ ప్రోత్సాహం తో కుమార్తెలు (ఉమ్మెకుల్సూమ్ & అమతురకీబ్) ఉన్నత
విద్యను పొందారు. నిరంతరం సామాజిక
ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, యాకూబ్ తన కుమార్తెలకు ఆధునిక విద్యను
అందించారు, వారు వైద్యం అభ్యసించి భారత
ఉపఖండంలోని మొట్టమొదటి ముస్లిం మహిళా వైద్యులు గా రూపొందారు.
డాక్టర్
ఉమ్మెకుల్సూమ్ & డాక్టర్ అమ్తుర్రకీబ్ వరుసగా జూన్ 27, 1898 మరియు ఫిబ్రవరి 22, 1900 న హర్యానాలోని
అంబాలాలో జన్మించారు. వారు తమ పాఠశాల విద్యను ఆగ్రాలోని సెయింట్ జాన్స్ బాలికల
ఉన్నత పాఠశాల నుండి పూర్తి చేసారు. తరువాత, అక్టోబర్ 9, 1920 న ఆగ్రా మహిళా
వైద్య కళాశాల నుండి పట్టభద్రులైన తర్వాత వారు మొత్తం భారత ఉపఖండంలో మొట్టమొదటి
మహిళా ముస్లిం వైద్యులు అయ్యారు. సోదరీమణులు ఇద్దరూ విద్యా, వైద్య, సామాజిక మరియు రాజకీయాలలో
రాణించారు.
డాక్టర్ అమ్తుర్రకీబ్ Dr.Amturraqeeb:
ఎల్‌ఎమ్‌పి డిగ్రీ
పొందిన తరువాత, డాక్టర్ అమతురకీబ్ డాక్టర్ ఇషాక్ సిద్ధికి నాషిత్‌ను వివాహం చేసుకున్నారు
మరియు వారికి ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు కలిగారు. వారు వరుసగా అమ్తుల్
హసీబ్ దౌద్, అఫిఫా మహమూద్, లతీఫా అజీమ్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ హసన్ అష్ఫాక్ సిద్ధిఖీ Amtul Haseeb Daud,
Afifa Mahmood, Latifa Azim and Professor Dr Hasan Ashfaq Siddiqi (అతను కమ్యూనిటీ
మెడిసిన్‌పై పాఠ్యపుస్తకాన్ని ప్రచురించారు). లతీఫా (డాక్టర్ అమతుర్రకీబ్
కుమార్తె) ఉర్దూ మ్యాగజైన్ ఎడిటర్‌గా కొనసాగింది "రహబెర్ ఇ నిస్వాన్".
లతీఫా తన విద్యను అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ నుండి పూర్తి చేసింది
స్వాతంత్య్రానికి
ముందు, డాక్టర్ అమ్తుర్రాకీబ్ బరేలీ మరియు అలీగఢ్‌లో మంచి మెడికల్ ప్రాక్టిస్ కలిగి ఉన్నారు. విభజన సమయంలో ఆమె కరాచీలో
స్థిరపడింది మరియు ఖరదార్ ప్రసూతి ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా
పనిచేసింది. ఆమె అర్ధ శతాబ్దానికి పైగా ప్రజలకు సేవ చేసింది మరియు తరువాత జూలై 7, 1971 న క్వెట్టాలో మరణించింది.
డాక్టర్ ఉమ్మ్ ఇ
కుల్సూమ్:
.
డాక్టర్ ఉమ్మ్ ఇ
కుల్సూమ్ Dr,Ummekulsoom, LMF పూర్తి చేసిన తర్వాత, భారత ఉపఖండంలోని
స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఫ్యాకల్టీ ఎగువ ప్రావిన్సులలో సభ్యుడయ్యారు. ఆమె ఆల్
ఇండియా ముస్లిం లీగ్ మహిళా విభాగంలో పిలిభిత్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగినది
మరియు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు.
ఉమ్మెకుల్‌సూమ్ దాదాపు 18 సంవత్సరాలు పిలిభిత్ బోర్డు సభ్యుడిగా కొనసాగారు.
వైద్య రంగంలో భారతీయ
మహిళలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఉమ్మెకుల్‌సూమ్‌కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
"ఫెలో ఆఫ్ స్టేట్ మెడికల్ ఫ్యాకల్టీ" (FSMF) గౌరవ డిగ్రీని ప్రదానం
చేసింది.1920 లో భారతదేశంలోని ఆగ్రా ఉమెన్ మెడికల్ కాలేజీ డాక్టర్ అమ్తుర్రాకీబ్‌కు
డిగ్రీని ప్రదానం చేసింది
డాక్టర్ ఉమ్మ్ ఇ
కుల్సూమ్ అనేక విద్యాపరమైన పనులలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె రచయిత్రి మరియు ఆమె
తన భర్త డాక్టర్ అబ్దుల్ గఫూర్ ఖఫాస్‌తో కలిసి "రుడాద్ ఇ ఖాఫాస్" అనే
పుస్తకాన్ని రాసింది. పిలిభీత్ నుండి
ప్రచురించబడిన "హరేమ్" అనే పత్రికకు సంపాదకురాలు.
స్వాతంత్య్రానంతరం, డాక్టర్ ఉమ్మెకుల్‌సూమ్
పాకిస్తాన్‌కు వలస వెళ్లారు మరియు డాక్టర్ అబ్దుల్ గఫూర్ బిస్మిల్‌ను వివాహం
చేసుకున్నారు. ఆమె జనవరి 4, 1974 న మరణించింది,
యాకూబ్ సోదరీమణులు
కాకుండా, స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో మరి కొందరు గొప్ప ముస్లిం మహిళలు కలరు.
బేగం ఫిర్దౌస్ మహల్ ముస్లిం బాలికలకు పాఠశాల/మదరసా నిర్మాణానికి నిధులు మరియు రూ .150 నెలవారీ నిధులను
అందించింది. 1898 లో నలభై ఆరు మంది బాలికలు ఈ మదర్సాలో చేరారు.
“బమబోధిని” పత్రిక 1896 సంచికలో ఒక ముస్లిం
యువతి, లతీఫున్నీసా పేరు ప్రస్తావించబడింది, ఆ సంవత్సరం
కలకత్తాలోని క్యాంప్‌బెల్ మెడికల్ స్కూల్ నుండి తుది పరీక్షలో ఉత్తీర్ణులై, 55 మంది విద్యార్థులలో
లతీఫున్నీసా రెండవ స్థానం సాధించింది. అందువల్ల, ఆమె మెడికల్
ఫ్యాకల్టీ (LMF) లైసెన్స్ పొందిన మొదటి ముస్లిం మహిళగా పరిగణించబడుతుంది. కానీ ఆమె డాక్టర్‌గా
ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం లేదు..
No comments:
Post a Comment