22 September 2021

సయీదా బానో: మొదటి భారతీయ మహిళా రేడియో న్యూస్ రీడర్ Saeeda Bano : First Indian Woman Radio Newsreader

 


 

సయీదా బానో భారతదేశపు ఆల్ ఇండియా రేడియో (AIR) న్యూఢిల్లీకి  మొదటి మహిళ రేడియో న్యూస్ రీడర్‌గా నియమితులయ్యారు

1920లో జన్మించిన సయీదా బానో ఇండియన్  న్యూస్ బ్రాడ్ కాస్టర్ మరియు 1947 లో ఆల్ ఇండియా రేడియోలో చేరి ఉర్దూలో వార్తలను చదివిన మొదటి భారత మహిళా ప్రొఫెషనల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్.  సయీదా బానో 1994 లో డాగర్ సే హాట్ కర్ (ఆఫ్ ది బీటెన్ ట్రాక్) అనే జ్ఞాపకాన్ని కూడా ప్రచురించింది.

 

సయీదా బానో తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్ లోని లక్నో మరియు మధ్యప్రదేశ్‌లోని  భోపాల్ లో  గడిపారు.. 17 ఏళ్ళ వయసులో సయీదా బానో అబ్బాస్ రజా అనే న్యాయమూర్తిని వివాహం చేసుకుంది, కానీ 1947 లో అతని నుండి విడిపోయి, తన పిల్లలతో కలిసి ఢిల్లీ AIR లో  న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేసింది. సయీదా బానో గాయని మరియు నటి బేగం అక్తర్ యొక్క స్నేహితురాలు. భర్త నుండి విడిపోయిన తర్వాత, సయీదా బానో న్యాయవాది నూరుద్దీన్ అహ్మద్‌తో సుదీర్ఘ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.  నూరుద్దీన్ అహ్మద్‌ తరువాత భారతదేశ రాజధాని ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు.

భర్త నుండి విడిపోయిన తరువాత, బానో ఉర్దూలో వార్తలు చదవడానికి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు  మరియు ఉద్యోగం పొందారు. . అంతకు ముందు, సయీదా బానో మహిళలు మరియు పిల్లల కోసం ప్రదర్శనలను ప్రసారం చేసే లక్నోలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్‌లో పనిచేసింది. బానో  దరఖాస్తును ప్రముఖ దౌత్యవేత్త మరియు రాజకీయ నాయకురాలు విజయ లక్ష్మి పండిట్‌ సిఫారసు చేసారు. భారతదేశంలో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌గా వార్తలు చదివిన మొదటి మహిళ బానో. బానో ఒంటరి మహిళగా,  ప్రొఫెషనల్‌గా న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌గా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు.. 1947 ఆగస్టు 13 న బానో తన పనిని ప్రారంభించింది.

 1994 లో, బానో ఉర్దూలో డాగర్ సే హత్ కర్ Dagar Se Hat Kar, అనే జ్ఞాపకాన్ని ప్రచురించారు తరువాత దాని ఇంగ్లిష్ అనువాదం “ఆఫ్ ది బీటెన్ ట్రాక్” అని బానో మనవరాలు షహానా రజా చేసారు. తన స్నేహితురాలు, రచయిత మరియు సంగీత విద్వాంసురాలు షీలా ధార్ ప్రోత్సాహంతో తన జ్ఞాపకాలను రాసినట్లు బానో పేర్కొన్నారు. ఈ పుస్తకం ఢిల్లీ ఉర్దూ అకాడమీ నుండి అవార్డు గెలుచుకుంది.

 

No comments:

Post a Comment