మొహమ్మద్ యూనస్ (4 మే 1884 - 13 మే 1952) బ్రిటిష్ భారతదేశంలో బీహార్
ప్రావిన్స్ యొక్క మొదటి ప్రీమియర్(ముఖ్యమంత్రి). బీహార్ రాష్ట్రంలో మొదటి
ప్రజాస్వామ్య ఎన్నికల సమయంలో మొహమ్మద్ యూనస్ 1937 లో మూడు నెలల పాటు ప్రిమియర్
గా పనిచేశాడు, అయితే అసెంబ్లీ
సెషన్ ప్రారంభమైనప్పుడు అప్పటికే రాజీనామా చేసినందున మొహమ్మద్ యూనస్ మైనారిటీ
ప్రభుత్వం అసెంబ్లీని ఎదుర్కోలేదు.
మొహమ్మద్ యూనస్ 20 వ శతాబ్దం ప్రారంభంలో బీహార్‌లో
ప్రముఖ రాజకీయవేత్త.. మొహమ్మద్ యూనస్ పాట్నా సమీప గ్రామమైన పెన్హారాలో 1884 లో జన్మించాడు మరియు ఉన్నత
విద్య కోసం 1920 లలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు.
1937 ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించడంతో ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ(MIP) అధిపతి మొహమ్మద్ యూనస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అప్పటి గవర్నర్ కోరారు. మొహమ్మద్ యూనస్ ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది కాలంలో శాసనసభ అనేక ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించింది.
మొహమ్మద్ యూనస్ పదవీ కాలం యొక్క రెండవ రోజు, బీహార్ బంద్ (హర్తల్) మరియు అనేక మంది ఆందోళనకారులు ఫ్రేజర్ రోడ్ పాట్నాలోని అతని ఇంటి ముందు
("దార్-ఉల్-మల్లిక్") అరెస్టు కాబడినారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానాన్ని బారిస్టర్ యూనస్ అంగీకరించడాన్ని యువ నాయకుడు
జయప్రకాశ్ నారాయణ్ తీవ్రంగా విమర్శించారు. ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ ప్రభుత్వానికి సభలో
మెజారిటీ లేదు. జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ (కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ) తరుపున
నిరసనలు వ్యక్తం చేసారు.
ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ ముస్లింలకు రిజర్వ్ చేయబడిన 40 సీట్ల లో నుండి 20 సీట్లు మరియు కాంగ్రెస్ కేవలం 4 ముస్లిం సీట్లు మాత్రమే
పొందింది, ముస్లిం
ఇండిపెండెంట్ పార్టీ, కాంగ్రెస్ తో కలిపి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది.
కానీ బారిస్టర్ యూనస్ యొక్క ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది మరియు ముస్లిం
ఇండిపెండెంట్ పార్టీ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసింది.
చివరికి బీహార్ లోని ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ MIP మైనారిటీ
ప్రభుత్వం పడిపోయింది. మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం (ప్రీమియర్
గా శ్రీ కృష్ణ సింగ్ మరియు డా. AN సిన్హా డిప్యూటీ ప్రీమియర్‌గా)ఏర్పాటు
అయ్యింది. .
మొహమ్మద్ యూనస్-విద్యా మరియు న్యాయ కలాపాలు :
మొహమ్మద్ యూనస్ ఉర్దూ మరియు ఇస్లామిక్ స్టడీస్ అబ్యసించిన తరువాత పాట్నాలోని
కాలేజియేట్ స్కూల్‌లో చదువుకొన్నారు.. పాట్నా కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసిన
తరువాత మిడిల్ టెంపుల్, లండన్ నుండి బార్
ఎట్ లా పొందాడు. లండన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 1906 ఏప్రిల్‌లో భారతదేశానికి
వచ్చాడు మరియు 1906 లో 22
సంవత్సరాల వయస్సులో కలకత్తా హైకోర్టు బార్‌లో అడ్వకేట్‌గా చేరాడు. 1906 లో పాట్నా జిల్లా కోర్టులో
ప్రాక్టీస్ ప్రారంభించాడు మరియు తరువాత పాట్నా హైకోర్టు లో సీనియర్ అడ్వకేట్
అయ్యాడు. కలకత్తా హైకోర్టు, ఫెడరల్
కోర్టు (ఢిల్లీ) మరియు ఇంగ్లాండ్‌లోని ప్రివీ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పనిచేసాడు.
మొహమ్మద్ యూనస్ రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలు:
మొహమ్మద్ యూనస్ 1908 లో లాహోర్‌లో కాంగ్రెస్ ప్రతినిధిగా
హాజరయ్యారు, కానీ
తర్వాత పార్టీని విడిచిపెట్టారు 1909 లో లాహోర్‌లో జరిగిన 24 వ కాంగ్రెస్ సెషన్ యొక్క
సబ్జెక్ట్ కమిటీ సభ్యుడయ్యారు. ముస్లిం లీగ్ యొక్క అఖిల భారత కార్యదర్శిగా కొద్దికాలం
పనిచేశారు.
1916 లో 32
సంవత్సరాల వయస్సులో మొహమ్మద్ యూనస్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ Imperial
Legislative Council సభ్యుడయ్యారు. 1921 లో బీహార్ మరియు ఒరిస్సా శాసన మండలి
సభ్యులయ్యారు. 1921 లో డెమొక్రాటిక్ పార్టీ చీఫ్ విప్ పదవికి ఎన్నికయ్యారు మరియు 1926 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1932 లో బీహార్ మరియు ఒరిస్సా శాసన
మండలి సభ్యుడు. 1917 లో రెండుసార్లు పాట్నా మునిసిపల్ బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు
మరియు 1917 నుండి 1923 వరకు దాని బోర్డులో కొనసాగారు. లార్డ్స్ మింటో & చెమ్స్‌ఫోర్డ్ మరియు మిస్టర్
మాంటెగ్ ముందు కొత్త రాజ్యాంగ పథకాన్ని సమర్పించారు. అతని అనేక ఆలోచనలు 1935 భారత
ప్రభుత్వ చట్టం లో చోటు చేసుకున్నాయి
బీహార్ ముస్లిం అసోసియేషన్ మరియు బీహార్ ల్యాండ్‌హోల్డర్
అసోసియేషన్ తరుఫున సైమన్ కమిషన్ ముందు ప్రధాన ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. 1936లో మౌలానా అబుల్ మొహాసిన్
సజ్జాద్ (ఇమారత్-ఇ-షరియా వ్యవస్థాపకుడు, బీహార్) సహాయంతో ముస్లిం
ఇండిపెండెంట్ పార్టీని స్థాపించి దాని వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు. ముస్లిం ఇండిపెండెంట్
పార్టీ 1937 లో కాంగ్రెస్‌తో సీట్ల భాగస్వామ్య ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ
చేసింది మరియు కాంగ్రెస్ తర్వాత హౌస్‌లో కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా
అవతరించింది.
1937 లో పశ్చిమ పాట్నా (రూరల్) నియోజకవర్గం నుండి ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ టికెట్‌పై బీహార్ శాసన మండలి సభ్యుడయ్యారు, మరియు 1937 లో మొదటి ప్రీమియర్ అయ్యారు: 1 ఏప్రిల్ 1937 న భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం బీహార్ ప్రావిన్స్‌కి మొదటి ప్రీమియర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
విభజన తరువాత మొహమ్మద్
యూనస్ – కార్యకలాపాలు:
కస్టోడియన్ ఆర్డినెన్స్ సవరణల కోసం ఉద్యమంలో
చురుకైన పాత్ర పోషించారు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో 6
సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నారు.
ఆల్ ఇండియా మెయిల్-మిలాప్ అసోసియేషన్
వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇది సామాజిక మరియు రాజకీయ రంగంలో హిందూ-ముస్లిం
ఐక్యత సాధించడానికి ఏర్పడింది.
అన్నీ బీసెంట్ థియోసాఫికల్ సొసైటీ కార్యదర్శి
వ్యవహరించారు. .
జెబి క్రిప్లానీ 1951 లో కిసాన్ మజ్దుర్ ప్రజా
పార్టీని స్థాపించారు. మహ్మద్ యూనస్ పార్టీ ఏర్పాటులో క్రిప్లానీ మరియు మహామాయ
ప్రసాద్‌లకు చురుకుగా సహాయం చేసారు. 1951 లో కాంగ్రెస్ మరియు సోషలిస్ట్ పార్టీ
తర్వాత KMPP భారతదేశంలో 3 వ అతిపెద్ద పార్టీగా
అవతరించింది.
కార్పొరేట్ వ్యవహారాలు
మహ్మద్ యూనస్ సెర్చ్ లైట్ ప్రెస్, పాట్నా వ్యవస్థాపకుడు. (దీనిని ఇప్పుడు హిందూస్థాన్ టైమ్స్, పాట్నా అని పిలుస్తారు)
1924 లో మహ్మద్ యూనస్ పాట్నా టైమ్స్‌ను
వారపత్రికగా ప్రారంభించాడు,
ఇది 1944 సంవత్సరంలో డైలీ న్యూస్ పేపర్‌గా
మారింది. మహ్మద్ యూనస్ న్యూస్ పేపర్‌కు ఎడిటర్ మరియు పబ్లిషర్.
ఓరియంట్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్
వ్యవస్థాపకుడు.
బీహార్ ఫ్లైయింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు.
బీహార్ ప్రావిన్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్
మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. బ్యాంక్ ఆఫ్ బీహార్ డైరెక్టర్‌గా పనిచేశారు.
బీహార్ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్
మరియు మేనేజింగ్ ఏజెంట్. గ్రాండ్ హోటల్, పాట్నా మహ్మద్ యూనస్ చేత ప్రారంభించబడింది.
29 డిసెంబర్ 1944 న గుండెపోటు తర్వాత, అతను తన అనారోగ్యం సమయంలో, ముఖ్యంగా 1945 లో ముస్సోరీలో
సుదీర్ఘకాలం గడిపిన సమయంలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. హిందూ ముస్లిం ఐక్యత పై
పాయం-ఇ-ముహబ్బత్ Payam-e-Muhabbat మరియు కలామే -ఈ-యూనస్ అతని ప్రసిద్ధ కవితా రచనలు
బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ గారు, మహమ్మద్ యూనస్ 60 వ వర్ధంతిన నిర్వహించిన
"మహ్మద్ యూనస్: హయత్ వా ఖిద్మత్" అనే కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మే 4, యూనస్ పుట్టినరోజు "రాజకీయ
సమారోహ్" గా జరుపుకోనున్నట్లు ప్రకటించారు. బీహార్ ప్రభుత్వం 4 మే 2013 న యూనస్
జ్ఞాపకార్థం "రాజకీయ సమరోహ్" ను మొదటిసారి జరిపింది.
బారిస్టర్ మొహమ్మద్ యూనస్-
క్లుప్తంగా కుటుంబ విశేషాలు:
·
మొహమ్మద్ యూనస్ 4 మే 1884 లో పాట్న సమీపం లోని పనేహరా
గ్రామంలో జన్మించారు, మొహమ్మద్
యూనస్ న్యాయవాదుల కుటుంబం లో జన్మించారు. మొహమ్మద్ యూనస్ తండ్రి - మౌల్వీ అలీ హసన్
ముఖ్తార్, న్యాయవాది
మరియు మొహమ్మద్ యూనస్ తాత - మౌల్వీ మొహమ్మద్ అజామ్, బీహార్‌లోని మోంగైర్ (ముంగర్)
జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు.
·
మొహమ్మద్ యూనస్ సోదరుడు -మహమ్మద్ యూసుఫ్, పాట్నా న్యాయవాది
·
మొహమ్మద్ యూనస్ సోదరుడు మొదటి భార్య - బీబీ జీనతునిస్సా, యుపిలోని మీర్జాపూర్‌కు చెందిన
దివంగత మౌల్వీ అబ్దుల్ జబ్బార్ కుమార్తె. 1924 మార్చి 19 న మరణించారు
·
మొహమ్మద్ యూనస్ పెద్ద కుమారుడు - మహమ్మద్ యాసిన్ యూనస్, బారిస్టర్, పాట్నా హైకోర్టులో బీహార్
ప్రభుత్వానికి స్టాండింగ్ కౌన్సిల్ మరియు అతని తండ్రి కి రాజకీయ కార్యదర్శిగా కూడా
పనిచేశారు మరియు 1946 లో చిన్న వయస్సులోనే
మరణించాడు.
·
• చిన్న
కుమారుడు- మొహమ్మద్ యాకుబ్ యూనస్, అడ్వకేట్, పాట్నా హైకోర్టు 1967 లో ఆల్ ఇండియా ముస్లిం
మజ్లిస్-ఇ-ముషావరాత్ వ్యవస్థాపకుడు బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు. అతను చాలా కాలం
పాటు బీహార్‌లోని AMU ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇందిరా గాంధీ
హయాంలో AMU యొక్క మైనారిటీ పాత్రను ప్రశ్నించినప్పుడు అలీఘర్ ఉద్యమ నాయకుడు. 12 ఏప్రిల్ 2004 న గ్రాండ్ హోటల్, ఫ్రేజర్ రోడ్, పాట్నాలో మరణించారు
·
రెండవ భార్య - ఇర్కికి చెందిన దివంగత హబీబుర్ రెహమాన్ పెద్ద కుమార్తె, అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేసారు.
సంతానం లేదు.
·
మొహమ్మద్ యూనస్ లండన్ లో నడుస్తున్నప్పుడు గుండెపోటుతో 13 మే 1952 న మరణించారు. లండన్‌లోని
బ్రూక్‌వుడ్ ముస్లిం స్మశానవాటికలో ఖననం చేయబడినారు.
No comments:
Post a Comment